తేనె మనసులు (1965 సినిమా)
తేనెమనసులు బాబూ మూవీస్ వారు 1965లో అందరూ కొత్తవారితో దర్శకులు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో నిర్మించిన చిత్రం.
తేనె మనసులు (1965 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | ఆదుర్తి సుబ్బారావు |
నిర్మాణం | సి. సుందరం |
కథ | ముళ్ళపూడి వెంకటరమణ |
చిత్రానువాదం | ఆదుర్తి సుబ్బారావు |
తారాగణం | కృష్ణ (బసవరాజు), సంధ్యారాణి, సుకన్య (భానుమతి), పద్మనాభం, కె.వి.చలం, పుష్పకుమారి, రాధాకుమారి, చలపతిరావు |
సంగీతం | కె.వి.మహదేవన్ |
సంభాషణలు | ఆచార్య ఆత్రేయ, కె. విశ్వనాధ్ |
నిర్మాణ సంస్థ | బాబూ మూవీస్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
సంక్షిప్త చిత్రకథసవరించు
చిట్టిబాబు (రామ్మోయన్) కు సీత (సంధ్యారాణి) తో పెళ్ళిచూపులయ్యాయి. పెళ్ళి నిర్ణయమయింది. అతను అమెరికా వెళ్ళాలంటే డబ్బు కావాలి. కాబట్టి ఎక్కువ కట్నం అడుగుతాడు. తప్పనిసరి పరిస్థితుల్లో సీత తండ్రి దొంగతనం చేసి డబ్బు సమకూరుస్తాడు.
చిట్టిబాబు వివాహానంతరం అమెరికా వెళ్ళొస్తాడు. చిట్టిబాబు స్నేహితుడు బసవరాజు (కృష్ణ) డ్రిల్లు మాస్టారుగా పనిచేస్తుంటాడు. అతను, భానుమతి (సుకన్య) పరస్పరం ప్రేమించుకుంటారు. విదేశాల నుంచి వచ్చిన చిట్టిబాబు వద్ద సెక్రటరీగా పనిచేస్తుంది భానుమతి. పల్లెటూరి టైపులో వుండే భార్యను కాదని, భనుమతిని ప్రేమిస్తాడు చిట్టిబాబు. అతనికి జ్ఞానోదయం కలగాలని అతన్ని ప్రేమిస్తున్నట్టు నటించి ఒకనాటి రాత్రివేళ తనలాగా సీతను అలంకరించి చిట్టిబాబు వద్దకు పంపిస్తుంది భానుమతి. ఈ నాటకం తెలియని బసవరాజు భానుమతిని అనుమానించి చిట్టిబాబుతో గొడవ పడతాడు. భానుమతితో బసవరాజు పెళ్ళి జరుగుతుంది.
నటవర్గంసవరించు
- ఘట్టమనేని కృష్ణ (బసవరాజు)
- సంధ్యారాణి
- సుకన్య (భానుమతి)
- పద్మనాభం
- కే.వి. చలం
- పుష్పకుమారి
- రాధాకుమారి
- రావి కొండలరావు
- చలపతిరావు
- జి.ఎస్.ఆర్. మూర్తి (నరసరాజు)
- కోనేశ్వరరావు (శ్రీనివాసరావు)
- రామ్మోహన్
- వాణీబాల
- వేంకటేశ్వరావు
- కుమారి నాగిని
- కుమారి మల్లీశ్వరి
- కుమారి పద్మ
నిర్మాణంసవరించు
అభివృద్ధిసవరించు
ముళ్ళపూడి వెంకటరమణ రచనలో ఆదుర్తి సుబ్బారావు నిర్మాత, దర్శకునిగా తీసిన మూగ మనసులు ఘన విజయం సాధించడంతో మరో సినిమా తీద్దామని, దానికి కథ రాయమని రమణకి ఆదుర్తి పురమాయించారు. దాంతో కథను సీనిక్ ఆర్డరుతో, కొద్ది అతిముఖ్యమైన సంభాషణలతో కథ రాసి, తేనె మనసులు అన్న పేరుపెట్టి ఆదుర్తికి ఇచ్చారు రమణ. అయితే సంభాషణలు రాయకుండానే రమణకీ, ఆదుర్తికీ వివాదం వచ్చి, ఆదుర్తితో ముందు అనుకున్న మరికొన్ని సినిమాలతో పాటుగా ఈ సినిమానూ వదిలేశారు రమణ. దాంతో సినిమా సంభాషణలు సహాయ దర్శకునిగా పనిచేస్తున్న కె.విశ్వనాథ్ తో కొంతవరకూ, ఆచార్య ఆత్రేయ తో మరికొంత రాయించుకుని స్క్రిప్ట్ పని పూర్తిచేశారు.[2]
నటీనటుల ఎంపికసవరించు
సినిమాలో ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. కథ చదివాకా ఆదుర్తి ఇలాంటి సినిమాలో ఎవరిని పెట్టి తీసినా మంచి విజయమే అందుకుంటుంది కనుక పెద్ద పెద్ద వాళ్ళకు పారితోషికాలు ఇచ్చుకుని తీసేకన్నా అందరూ కొత్తవాళ్ళనే పెట్టుకుని తీద్దామని నిర్ణయించుకున్నారు. నెలరోజుల్లో చిట్టిబాబు పాత్రకు రామ్మోహన్, సీత పాత్రకు సంధ్యారాణి, బసవరాజు పాత్రకు కృష్ణ, భానుమతి పాత్రకు సుకన్య లను ఎంపికచేశారు దర్శకుడు.[2]
చిత్రీకరణసవరించు
ఆరుద్ర తీసిన మూగ మనసులు సినిమా సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ జరిగే సమయానికి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తిచేసుకున్నాకా, అప్పుడే కొత్తగా వచ్చిన కలర్లో తీస్తే మరింత ఆకర్షణీయంగా ఉంటుందని నమ్మి బ్లాక్ అండ్ వైట్లో తీసినదంతా పక్కనపెట్టేశారు. మళ్ళీ మొదటినుంచీ కలర్లో షూటింగ్ చేయడం ప్రారంభించి, చివరకు కలర్ చిత్రంగానే పూర్తిచేశారు.[2]
విడుదలసవరించు
స్పందనసవరించు
సినిమా విడుదలయ్యాకా మంచి విజయం సాధించింది.[2]
ప్రాచుర్యంసవరించు
సినిమాలో నటించిన కొత్త హీరో హీరోయిన్లందరూ చలనచిత్రాల్లో రాణించారు.[2]
పాటలుసవరించు
పాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
ఎవరో ఎవరో నీవాడు | |||
దివినుండి భువికి దిగివచ్చే, దిగివచ్చే పారిజాతమే నీవై, నీవై | ఆత్రేయ | కె.వి.మహదేవన్ | ఘంటసాల పి.సుశీల |
దేవుడు నేనై పుట్టాలి | |||
ఎమమ్మా నిన్నేనమ్మా | |||
నీ ఎదుట నేను వారెదుట నీవు మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు | ఆత్రేయ | కె.వి.మహదేవన్ | పి.సుశీల |
మాస్టారు డ్రిల్లు మాస్టారు ఒక ఉద్యోగం ఇస్తాము చేస్తారా | ఆత్రేయ | కె.వి.మహదేవన్ | పి.సుశీల, పద్మనాభం |
అనాదిగా జరుగుతున్న అన్యాయం ఇదిలే అదేమిటో ఆడదంటె మగవాడికి అలుసులే | ఆత్రేయ | కె.వి.మహదేవన్ | పి.సుశీల |
మూలాలుసవరించు
- ↑ మద్రాసు ఫిలిం డైరీ. 1966-97లో విడుదలైన చిత్రలు (కళా ప్రింటర్స్ ed.). గోటేటి బుక్స్. p. 89.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 బి.వి.ఎస్.రామారావు (అక్టోబరు 2014). కొసరుకొమ్మచ్చి (3 ed.). హైదరాబాద్: వరప్రసాద్ రెడ్డి.
- మంచి ఫలితాన్నిచ్చిన "తేనెమనసులు", నాటి 101 చిత్రాలు, ఎస్.వి.రామారావు, కిన్నెర పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006, పేజీలు 211-12.
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.