నాటి 101 చిత్రాలు
నాటి 101 చిత్రాలు ఒక మంచి విశ్లేషాత్మక సినిమా పుస్తకం. దీనిని ఎస్.వి.రామారావు రచించాడు. ఈ పుస్తకానికి 2006 సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ సినిమా పుస్తకాలకు ఇచ్చే నంది అవార్డు లభించింది.
నాటి 101 చిత్రాలు | |
కృతికర్త: | ఎస్. వి. రామారావు |
---|---|
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
విభాగం (కళా ప్రక్రియ): | సినీ సాహిత్యం |
ప్రచురణ: | కిన్నెర పబ్లికేషన్స్, హైదరాబాద్ |
విడుదల: | 2006 |
ఇందులో వివరించిన చిత్రాలన్నీ చాలా ఉత్తమమైనవి. వీటిలో కొన్నింటిని రచయిత 2001 - 2002 మధ్యకాలంలో 75 వారాలపాటు ప్రముఖ సినీ వారపత్రిక 'సితార' లో ప్రొఫైల్ శీర్షిక పేరుతో ప్రచురించారు. ఈ పుస్తకాన్ని రచయిత తన తల్లి శ్రీమతి కామేశ్వరమ్మ, అత్తగారైన శ్రీమతి మాణిక్యేశ్వరి గారికి అంకితమిచ్చారు.
ఈ పుస్తకాన్ని కిన్నెర పబ్లికేషన్స్, హైదరాబాదు వారు ప్రచురించారు.
సినిమాల జాబితా
మార్చు- తొలి టాకీ "భక్త ప్రహ్లాద" అయినా తొలి బాక్సాఫీస్ హిట్ ఆనాటి లవకుశ (1934)
- శ్రీకృష్ణలీలలు (1935)
- ద్రౌపది వస్త్రాపహరణమా? మానసంరక్షణమా? (1936)
- నాటి సంచలన చిత్రం గృహలక్ష్మి (1937)
- నాటి సినిమా : మాలపిల్ల (1938)
- మళ్ళీపెళ్ళి (1939)
- మల్లీశ్వరికి బీజం వేసిన వందేమాతరం (1939)
- పవర్ ఫుల్ టైటిల్ దేవత (1941)
- చరిత్ర సృష్టించిన జెమినీ బాలనాగమ్మ (1942)
- సారథీ వారి విలక్షణ చిత్రం పత్ని (1942)
- నాటి మేటి చిత్రం భక్త పోతన (1943)
- విదేశీ నాగరికతపై విమర్శనాస్త్రం తాసీల్దార్ (1944)
- ఎన్నో ప్రత్యేకతలున్న స్వర్గసీమ (1945)
- సారథీ చిత్రం గృహ ప్రవేశం (1946)
- నాగయ్యను ధన్యుణ్ణి చేసిన త్యాగయ్య (1946)
- ఉన్నత విలువల ఉదాత్త చిత్రం యోగి వేమన (1947)
- తొలి బాక్సాఫీస్ హిట్ బాలరాజు (1948)
- బలమైన కథాకథనాల ద్రోహి (1948)
- అపూర్వ కథాకథనాల గుణసుందరి కథ (1949)
- హీరోబిజానికి నాంది పలికిన కీలు గుఱ్ఱం (1949)
- విజయవంతమైన విషాద చిత్రం లైలా మజ్ను (1949)
- నాటి రాజకీయ చిత్రం మన దేశం (1949)
- హృదయాన్ని కదిలించే కథతో బీదల పాట్లు (1950)
- నవరస భరితం ఏ.వి.యం.వారి జీవితం (1950)
- తొలి మల్టీస్టారర్ చిత్రం పల్లెటూరి పిల్ల (1950)
- కుటుంబ కథా చిత్రాలకు కొత్తవరవడి సంసారం (1950)
- విజయ సంకేతం షావుకారు (1950)
- సౌందర్యలహరి స్వప్నసుందరి (1950)
- మనసున మల్లెలు జల్లిన మనోజ్ఞ చిత్రం మల్లీశ్వరి (1951)
- పాతదైనా నిత్యనూతనం పాతాళభైరవి (1951)
- పల్లె వాతావరణం నిండిన చిత్రం పల్లెటూరు (1952)
- సమస్యలు హాస్యంలో రంగరించిన పెళ్ళిచేసిచూడు (1952)
- కమనీయ ప్రేమకథా చిత్రం ప్రేమ (1952)
- బరువైన కథ బ్రతుకు తెరువు (1953)
- భానుమతి బహుముఖ ప్రజ్ఞకు ప్రతీక చండీరాణి (1953)
- ప్రేమ కథా చిత్రాల్లో చిరస్మరణీయం దేవదాసు (1953)
- ఆత్రేయ సహజసృష్టి గుమస్తా (1953)
- ఉదాత్త కథాచిత్రం కన్నతల్లి (1953)
- కుటుంబ మధురిమలు తెలిపే నా ఇల్లు (1953)
- నవ్వుల్లో ముంచెత్తిన పక్కింటి అమ్మాయి (1953)
- విలక్షణ కథాంశంతో కూడిన చిత్రం పరదేశి (1953)
- డాక్టర్ రాజారావు అపూర్వసృష్టి పుట్టిల్లు (1953)
- సంగీతభరిత చిత్రం అమర సందేశం (1954)
- ఒకే సంవత్సరం (1954) రెండు విభిన్న చిత్రాలు అందించిన నిర్మాత, దర్శకుడు భరణీ రామకృష్ణ చక్రపాణి (1954)
- విప్రనారాయణ (1954)
- పాతిక లక్షల తొలి తెలుగు చిత్రం చంద్రహారం (1954)
- జనరంజక చిత్రం జనతావారి పరివర్తన (1954)
- అవార్డు చిత్రం తోడు దొంగలు (1954)
- రజత కమలం పొందిన తొలి తెలుగు చిత్రం పెద్దమనుషులు (1954)
- పి.పుల్లయ్య అర్థాంగి (1955)
- సంగీతభరితం అనార్కలి చరితం (1955)
- ఎస్.వి.రంగారావు నట జీవితంలో కలికితురాయి బంగారు పాప (1955)
- అన్నపూర్ణా వారి తొలి హిట్ చిత్రం దొంగరాముడు (1955)
- ఎన్.ఏ.టి.సంస్థను నిలబెట్టిన జయసింహ (1955)
- వినోదాన్నిచ్చిన కన్యాశుల్కం (1955)
- వినోదాన్నందించిన మిస్సమ్మ (1955)
- గ్రామీన జీవితమే రోజులు మారాయి (1955)
- సాధనావారి సెంటిమెంట్ చిత్రం సంతానం (1955)
- హిట్ మూవీ భలేరాముడు (1956)
- ఉదాత్త ప్రేమకథాచిత్రం చిరంజీవులు (1956)
- ఇలవేలుపు ప్రత్యేకత (1956)
- కమనీయ చిత్రం తెనాలి రామకృష్ణ (1956)
- ఆలోచనలు రేకెత్తించే ఏది నిజం (1956)
- సామాజిక చిత్రం ఎమ్.ఎల్.ఏ. (1957)
- సినీ చరిత్రలో మాయాబజార్ చరిత్ర (1957)
- రక్తిని, భక్తిని పండించిన పాండురంగ మహాత్మ్యం (1957)
- నవరసభరితం సువర్ణ సుందరి చరితం (1957)
- ఉత్తమ కుటుంబ కథాచిత్రం తోడికోడళ్ళు (1957)
- రాజేశ్వరరావు మార్క్ సంగీత ప్రధాన చిత్రం చెంచులక్ష్మి (1958)
- మహామహుల సమ్మేళనం భూకైలాస్ (1958)
- వివాహ బంధాన్ని హాస్యంతో రంగరించిన పెళ్ళినాటి ప్రమాణాలు (1958)
- గిలిగింతలు పెట్టే అప్పుచేసి పప్పుకూడు (1959)
- నవరసాల సమ్మేళనం ఇల్లరికం (1959)
- నవరస భరితం జయభేరి (1959)
- అన్నపూర్ణావారి హిట్ చిత్రం మాంగల్యబలం (1959)
- మనం గర్వించదగ్గ చిత్రం మహాకవి కాళిదాసు (1960)
- గ్రీకు ధోరణిలో రాజమకుటం (1960)
- రికార్డు టైమ్ లో నిర్మించిన శాంతినివాసం (1960)
- ప్రత్యగాత్మ తొలిచిత్రం భార్య భర్తలు (1961)
- కమనీయం సీతారామ కళ్యాణం (1961)
- శ్రీశ్రీని చిరస్మరణీయుని చేసిన వెలుగునీడలు (1961)
- హీరోపరంగా తొలి ద్విపాత్రాభినయ చిత్రం ఇద్దరు మిత్రులు (1961)
- అక్కినేని అభిమానించిన బాటసారి (1961)
- ఆహ్లాద చిత్రం జగపతివారి ఆరాధన (1962)
- నవరసాలతో నిండిన గులేబకావళి కథ (1962)
- హేమాహేమీల సమ్మేళనం గుండమ్మ కథ (1962)
- చారిత్రక చిత్రాలలో మణిపూస మహామంత్రి తిమ్మరుసు (1962)
- సిస్టర్ సెంటిమెంటుతో రక్తసంబంధం (1962)
- విశాఖ అందాలతో కులగోత్రాలు (1962)
- రవీంద్రా ఆర్ట్స్ తొలిచిత్రం లక్షాధికారి (1963)
- అగ్రనటుల అభినయ పోరాటమే శ్రీకృష్ణార్జున యుద్ధం (1963)
- తెలుగు సినిమా స్థాయిని పెంచిన నర్తనశాల (1963)
- ఘంటసాలను ధన్యుణ్ణి చేసిన చిత్రం లవకుశ (1963)
- తెలుగు ప్రేక్షకుల భావస్రవంతిలో చిరంజీవిగా నిలచిన మూగమనసులు (1964)
- శిల్పకళకు ప్రాణం పోసిన చిత్రం అమరశిల్పి జక్కన్న (1964)
- బంగారు నందినందుకొన్న తొలిచిత్రం డాక్టర్ చక్రవర్తి (1964)
- ఏయన్నార్, బి.యన్.ల ఏకైక చిత్రం పూజాఫలం (1964)
- సురేష్ రామానాయుడికి తొలి చిత్రమే హిట్ - అదే రాముడు-భీముడు (1964)
- మంచి ఫలితాన్నిచ్చిన తేనె మనసులు (1965)
- మహామహుల సమ్మేళనం పాండవ వనవాసం (1965)
- రసవత్తర జానపదం మంగమ్మ శపధం (1965)
|
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- నాటి 101 చిత్రాలు (1931 - 65 మధ్య వచ్చిన నూటొక్క చిత్రాల చరిత్ర), రచన: ఎస్.వి.రామారావు, కిన్నెర పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.