తోటలో పిల్ల కోటలో రాణి

తోటలో పిల్ల కోటలో రాణి, తెలుగు చలన చిత్రం 1964 నవంబర్ 13 న విడుదల.జి.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో, కాంతారావు, రాజశ్రీ ,నటించగా, సంగీతం ఎస్.పి.కోదండపాణి సమకూర్చారు.

తోటలో పిల్ల కోటలో రాణి
(1964 తెలుగు సినిమా)
దర్శకత్వం జి.విశ్వనాథం
తారాగణం కాంతారావు,
రాజశ్రీ
సంగీతం ఎస్.పి.కోదండపాణి
నిర్మాణ సంస్థ గౌరి ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

సంక్షిప్తకథ

మార్చు

మణిపుర దేశాన్ని పాలించే కామపాలునికి జీవితాంతం యౌవనదశలో ఉండిపోవాలని కోరిక కలుగుతుంది. నవద్వీపంలో కామందకుడి రక్షణలో ఉన్న యౌవనఫలం ఆరగిస్తే ముసలితనం రాదని తెలుసుకుంటాడు. యౌవనఫలాన్ని తెచ్చినవారికి అర్థరాజ్యం ఇస్తానని ప్రకటిస్తాడు. మణిపుర సేనాని దుర్జయుడు యౌవనఫలం కోసం వెళ్ళి అక్కడ చంచల మోహంలో చిక్కుకుంటాడు. తరువాత మహారాజు తమ్ముడు విజయుడు అపురూపమైన వస్తువుల సహాయంతో నవద్వీపం నుంచి యౌవనఫలాన్ని తీసుకువస్తాడు. దుర్జయుణ్ణి విడిపిస్తాడు. మహారాజు యౌవనఫలాన్ని రాణి రాగవతికి ఇస్తాడు. రాగవతి భర్తను మోసం చేసి ఆ ఫలాన్ని తన రహస్య ప్రియునికి ఇస్తుంది. అది సహించలేక రాణిని, ఆమె ప్రియుణ్ణి వధించి మహారాజు అడవులకు వెళ్ళిపోతాడు. విజయుడు రాజ్యపాలన కొనసాగిస్తాడు. దుర్జయుడు ఇది సహించలేక మహారాజును అవమానపరచిన స్త్రీజాతిపై పగ తీర్చుకోవలసిందిగా విజయునికి బోధిస్తాడు. రోజుకొక స్త్రీని పెళ్ళిచేసుకుంటూ స్త్రీజాతిని నాశనం చేయడానికి కంకణం కట్టుకుంటాడు విజయుడు. తోటమాలి కూతురు గౌరి దుర్జయునికి ఎదురు తిరిగి కోటలోకి మహారాణిగా వెళుతుంది. స్త్రీలలో పతివ్రతలున్నారని, తన సౌశీల్యం ఋజువు చేసుకోవడానికి గడువు కావాలని రాజును కోరుతుంది. రాజు అందుకు అంగీకరించి ఏకశిలాభవనంలో బంధించి ఆరు నెలలు గడువు ఇస్తాడు. ఇచ్చిన గడువులోగా తన సౌశీల్యాన్ని ఋజువు చేసుకోవడానికి ప్రయత్నిస్తుండగా గౌరికి భస్మం లభిస్తుంది. ఆ విభూతిని భర్తపై చల్లాలనుకున్న గౌరి తిరిగి మనసు మార్చుకుని విసిరివేస్తే ఆ మంత్రభస్మం నాగకన్య శిరస్సుపై పడుతుంది. నాగకన్య గౌరికి ఒక మాయాఉంగరాన్ని బహూకరిస్తుంది. గౌరిని, రాజ్యాన్ని వశపరుచుకునేందుకు, విజయుని చంపించేందుకు దుర్జయుడు అనేక విధాల ప్రయత్నించి విఫలుడౌతాడు. నాగకన్య సహాయంతో గౌరి మోహిని వేషంలో విజయుని కలుసుకుని అతని అనురాగాన్ని పొందుతుంది. విజయుడు తను చేసిన పాపాలకు పశ్చాత్తాపపడతాడు. మణిబంధం మహిమతో దుర్జయుడు విజయుణ్ణి బంధిస్తాడు. మణిబంధాన్ని తిరిగి వశపరచుకోవడానికి చంచల, గౌరి, నాగకన్య ఎత్తుకుపైఎత్తు వేస్తారు. ఆ తర్వాత అనేక మంత్రాలు, తంత్రాలు, యుద్ధాలు పతాకసన్నివేశంలో జరుగుతాయి[1].

పాటలు

మార్చు
  1. ఎగిరేటి చిన్నదానా సౌఖ్యమా తళుకు కులుకు నీ - పి.బి. శ్రీనివాస్, రచన: వీటూరి వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి
  2. కనులే కలసేవేళా పలికే కమ్మని జోల - ఎస్.జానకి, పి.బి. శ్రీనివాస్ , రచన: వీటూరి
  3. కొండజాతి కోడెనాగు బుట్టలవుందమ్మ చెయ్యివేస్తే - ఎస్.జానకి, లత, రచన: వీటూరి
  4. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అపచారం - మాధవపెద్ది, కె.జమునారాణి, రచన: వీటూరి
  5. కుహు కుహు కుహు అని కూసేను వయసు , కె.జమునా రాణి, రచన: వీటూరి
  6. అద్దిరభల్లా అడీరభల్లా ఆపవే నీ జోరు, ఎస్.జానకీ, కె.జమునా రాణి, రచన: వీటూరి
  7. వింటివి నా విషాదకథ పేరిమితో,(పద్యం) ఎస్.జానకి , రచన: వీటూరి
  8. పాలవంటి పడుచుదనం పాడుతున్నది పాట , ఎస్.జానకి, రచన: వీటూరి

మూలాలు

మార్చు
  1. రామ్‌చంద్ (22 November 1964). "చిత్రసమీక్ష - తోటలో పిల్ల కోటలో రాణి". ఆంధ్రప్రభ దినపత్రిక. Archived from the original on 24 జూలై 2020. Retrieved 24 July 2020. {{cite news}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)

. 2. ఘంటసాల గళామ్మృతం , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ నుండి.

బయటిలింకులు

మార్చు