తోడికోడళ్ళు (1957 సినిమా)
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
తోడికోడళ్ళు అన్నపూర్ణా పిక్చర్స్ పతాకంపై, దుక్కిపాటి మదుసూధనరావు నిర్మాతగా, ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, ఎస్వీ రంగారావు, కన్నాంబ, సూర్యకాంతం, రేలంగి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన 1957 నాటి తెలుగు చలన చిత్రం.
తోడికోడళ్ళు (1957 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఆదుర్తి సుబ్బారావు, వీరమచనేని మధుసూధన రావు(సహాయకుడు) |
---|---|
నిర్మాణం | దుక్కిపాటి మధుసూదనరావు |
రచన | శరత్ బాబు |
చిత్రానువాదం | ఆదుర్తి సుబ్బారావు, ఆత్రేయ, దుక్కిపాటి మధుసూధనరావు |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు , సావిత్రి, ఎస్.వి.రంగారావు, కన్నాంబ, సూర్యకాంతం, రేలంగి వెంకట్రామయ్య, జగ్గయ్య, చదలవాడ కుటుంబరావు, రాజసులోచన, మాస్టరు శరత్ బాబు, అల్లు రామలింగయ్య |
సంగీతం | మాస్టర్ వేణు |
నేపథ్య గానం | ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.సుశీల, జిక్కీ, కె.రాణి, మాధవపెద్ది సత్యం |
నృత్యాలు | ఇ.వి.సరోజ, ఎ.కె.చోప్రా |
గీతరచన | కొసరాజు, శ్రీశ్రీ, ఆత్రేయ, తాపీ ధర్మారావు |
సంభాషణలు | ఆత్రేయ |
ఛాయాగ్రహణం | పి.సెల్వరాజ్ |
కళ | ఎస్.కృష్ణారావు |
కూర్పు | ఆదుర్తి సుబ్బారావు, ఎ.వెంకటరత్నం(సహాయకుడు), టి.కృష్ణ(సహాయకుడు) |
రికార్డింగ్ | కె.విశ్వనాథ్ |
నిర్మాణ సంస్థ | అన్నపూర్ణ పిక్చర్స్ |
విడుదల తేదీ | జనవరి 7, 1957 |
నిడివి | 180 నిమిషాలు |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
సమష్టి కుటుంబంలో అన్నదమ్ముల మధ్యా, తోడి కోడళ్ళ మధ్యా ఉత్పన్నమయ్యే సంఘర్షణలు ఈ సినిమా ఇతివృత్తం. ప్రసిద్ధ బెంగాలీ నవలాకారుడు శరత్ చంద్ర ఛటర్జీ నవల నిష్కృతి ఆధారంగా స్వీకరించి ఈ సినిమా కథ రాశారు. అయితే నవలలోని పాత్రలు, కథాకథనాలను తెలుగు సినిమాలో మార్పులు చేసుకున్నారు. సినిమాలోని కథ, పాటలు, సన్నివేశాలు ప్రేక్షకులను అలరించడంతో మంచి విజయాన్ని సాధించింది. కారులో షికారుకెళ్ళే, ఆడుతు పాడుతూ పనిచేస్తుంటే వంటి పాటలు తెలుగు ప్రేక్షకుల మదిలో తరాలుగా విశేష ఆదరణ పొందాయి.
నిర్మాణం
మార్చుఅభివృద్ధి
మార్చుప్రముఖ బెంగాలీ నవలాకారుడు శరత్ రాసిన నిష్కృతి నవల తెలుగులో కూడా విశేష పాఠకాదరణ పొందింది. ఆ నవలను ఆధారంగా చేసుకుని తోడికోడళ్ళు సినిమా తీశారు. నవలా ఇతివృత్తాన్ని సినిమాకు స్వీకరించేలా మార్పులుచేర్పులు చేస్తూ దుక్కిపాటి మధుసూదనరావు, ఆదుర్తి సుబ్బారావులు చిత్రానువాదం రచన చేశారు.
కథాసారాంశం
మార్చుఎస్.వి.రంగారావు, రేలంగి, అక్కినేని నాగేశ్వరరావు ముగ్గురు అన్నదమ్ములుగా నటించారు. కన్నాంబ, సూర్యకాంతం, సావిత్రి ఆ క్రమంలో 'తోడికోడళ్ళు'గా నటించారు. పెద్దన్న కుటుంబరావు ఒక మతిమరపు లాయర్. ఆయన భార్య (కన్నాంబ) సంప్రదాయ గృహిణి. రెండవవాడు రమణయ్య భార్య అనసూయ (సూర్యకాంతం) గయ్యాళి. మూడవవాడు సత్యం (అక్కినేని) అప్పుడే చదువు పూర్తిచేసుకొన్నాడు గాని స్థిరపడలేదు. సత్యం భార్య సుశీల (సావిత్రి) ఇంట్లో అందరు పిల్లలనూ అదుపులో ఉంచి ఆలనఅ పాలనా చూసే గడుసు. అనసూయ తమ్ముడు వైకుంఠం (జగ్గయ్య) ఇంటిలో చేరి, తన అక్కతో కలసి ఇంట్లో పొరపొచ్చాలు పెడతాడు. క్రమంగా సంసారం ముక్కలవుతుంది. సత్యం, సుశీల వేరే కాపురం పెట్టి, ఆడుతూ పాడుతూ పనిచేసి, బీడు భూమిని సాగుచేస్తారు.
తరువాత ఎవరి గుణం ఎలాంటిదో తెలిసి వస్తుంది. మళ్ళీ కుటుంబం ఏకమౌతుంది.
సినిమాలోని పాత్రలు
మార్చునటుడి పేరు | పాత్ర పేరు, వివరం |
---|---|
అక్కినేని నాగేశ్వరరావు | సత్యం |
సావిత్రి | సుశీల, సత్యం భార్య |
ఎస్.వి.రంగారావు | కుటుంబరావు, సంపన్న జమీందారు, సత్యం అన్నగారు (పెదనాన్న కొడుకు) |
కన్నాంబ | కమల, కుటుంబరావు భార్య |
సుర్యకాంతం | అనసూయ, రమణయ్య భార్య |
రేలంగి వెంకట్రామయ్య | రమణయ్య, కుటుంబరావు స్వంత తమ్ముడు, సత్యానికి అన్నగారు |
జగ్గయ్య | వైకుంఠం, కుటుంబరావు మిల్లు మేనేజరు, అవినీతిపరుడు |
చదలవాడ కుటుంబరావు | తిరపతయ్య |
రాజసులోచన | నవనీతం |
అల్లు రామలింగయ్య | అయోమయం |
మాస్టర్ కుండు | పార్వతి |
మాస్టర్ శరత్ బాబు | |
రూడ్ | సత్యం పెంపుడు కుక్క (అల్సేషియన్ జాతి కుక్క)[1] |
పాటలు
మార్చుసంఖ్య | పాట | నేపథ్యగానం | గీత రచయిత | తారాగణం | ఆడియో |
---|---|---|---|---|---|
1. | గాలిపటం గాలిపటం రంగురంగుల | ఘంటశాల, సుశీల, క. రాణి | కొసరాజు రాఘవయ్య | ||
2. | కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదాన బుగ్గమీద గులాబిరంగు ఎలా వచ్చెనో చెప్పగలవా నిన్నుమించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చి చేరెను తెలుసుకో |
ఘంటశాల | ఆత్రేయ | అక్కినేని నాగేశ్వరరావు | |
3. | శ్రీరస్తు శుభమస్తు | పి.సుశీల బృందం | |||
4. | ముల్లోకములనేలు చల్లని నా తల్లి పాలించు మమ్ము | పి.సుశీల బృందం | |||
5. | అతిలోభులమేమడగమయా | పి.సుశీల, క.రాణి కోరస్ | ఆత్రేయ | ||
6. | ఎంతెంత దూరం కోశెడు దూరం నీకు మాకు చాలా చాలా దూరం | పి.సుశీల, క.రాణి, కోరస్P | ఆత్రేయ | ||
7. | కలకాలం ఈ కలత నిలచేది కాదు కనుమూసి కాసేపు నిదురించు బాబు | పి.సుశీల | తాపి ధర్మారావు | సావిత్రి | |
8. | ఆడుతు పాడుతు పనిచేస్తుంటె అలుపు సొలుపేమున్నది | ఘంటశాల, సుశీల | కొసరాజు రాఘవయ్య చౌదరి | అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి | |
9. | నలుగురు కలిసి పొరుపులు మరచి చేస్తే ఉమ్మడి వ్యవసాయం | ఘంటశాల | శ్రీ శ్రీ | అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి | |
10. | టౌను పక్కకెల్లద్దురో డింగరీ | ఘంటశాల, జిక్కి | కొసరాజు రాఘవయ్య చౌదరి | ఏ.కె.చోప్రా, ఇ.వి.సరోజ | |
11. | పెళ్లియాడిన భర్త (పద్యం) | మాధవపెద్ది సత్యం | కొసరాజు రాఘవయ్య చౌదరి | రేలంగి వెంకటరామయ్య | |
12. | నీకు సోకు సూడకుండ నవనీతమ్మ నిమిషమైన | మాధవపెద్ది సత్యం, జిక్కి | కొసరాజు రాఘవయ్య చౌదరి | రేలంగి వెంకటరామయ్య, రాజసులోచన | |
13. | (భలే మావయ్య) పొద్దైనా పొడవకముందే | జిక్కి | శ్రీ శ్రీ |
మూలాలు
మార్చు- ↑ స్వర్ణయుగంలో అన్నపూర్ణ, పుట 13