అమల అక్కినేని

(అమల నుండి దారిమార్పు చెందింది)

అమల అక్కినేని, తెలుగు సినిమా నటి, జంతు సంక్షేమ కార్యకర్త. మొదటి పేరు అమల ముఖర్జీ , తల్లి ఐర్లాండ్ దేశస్థురాలు. తండ్రి బెంగాళీ.[1] ఆమె పశ్చిమ బెంగాల్‌లో జన్మించింది, ఆమె తండ్రి ఇండియన్ నేవీలో అధికారి.అమల భారతదేశంలోని హైదరాబాద్‌లోని బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్,[2]  భారతదేశంలోని జంతువుల సంక్షేమం మరియు జంతు హక్కుల పరిరక్షణ కోసం పనిచేసే ప్రభుత్వేతర సంస్థ (NGO) సహ వ్యవస్థాపకురాలు .

అక్కినేని అమల
Amala Akkineni - TeachAIDS Interview (12617061074) (cropped).png
జననంఅమల ముఖర్జీ
సెప్టెంబర్ 24, 1968
పశ్చిమ బెంగాల్ భారత దేశము
వృత్తిజంతు సంక్షేమ కార్యకర్త, బ్లూక్రాస్ హైదరాబాద్ కన్వీనర్.
ప్రసిద్ధితెలుగు సినిమా నటి
భార్య / భర్తఅక్కినేని నాగార్జున
పిల్లలుఅక్కినేని అఖిల్

నటనా వృత్తిసవరించు

అమల తొలిసారిగా రాజేందర్ దర్శకత్వం వహించిన మైథిలి ఎనై కథలి అనే తమిళ చిత్రం లో నటించినది . ఇది భారీ విజయం సాధించింది. 1987 లో విడుదలైన నిశ్శబ్ద చిత్రం పుష్పక విమానం లో కమల్ హాసన్‌తో కలిసి అమల ప్రధాన పాత్ర పోషించింది . ఆమె 1991 మలయాళ చిత్రం ఉలడక్కమ్‌లో తన పాత్రకు ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకుంది. చెన్నైలో ప్రముఖ నాట్యకారిణి రుక్మిణీదేవి అరండేల్ వద్ద శాస్త్రీయ నృత్య శిక్షణ పొందుతున్న అమల తమిళ దర్శకుడు భారతీరాజా దృష్టిలో పడి ఆయన దర్శకత్వం వహించిన వైశాలి అనే తమిళ చిత్రం ద్వారా కథానాయికగా సినీరంగంలోనికి ప్రవేశించింది. తెలుగులో ఈమె మొదటి చిత్రం డి.రామానాయుడు నిర్మించిన చినబాబు చిత్రం ఇందులో కథానాయకుడు నాగార్జున. నాగార్జునతో ఆ చిత్ర నిర్మాణ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి వారిరువురూ 11 జూన్ 1992న వివాహబంధం ద్వారా ఒక్కటయ్యేలా చేసింది. వీరిరువురికీ 1994లో అక్కినేని అఖిల్ అనే కుమారుడు కలిగాడు 1992లో నాగార్జునను పెళ్లి చేసుకున్న తర్వాత నటనకు స్వస్తి చెప్పింది, అయితే 2012లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే తెలుగు సినిమాతో తిరిగి వచ్చింది.

అమల నటించిన తెలుగు చిత్రాలుసవరించు

అవార్డులు, గౌరవాలుసవరించు

సినిమా అవార్డులుసవరించు

సంవత్సరం అవార్డు అవార్డు వర్గం & పని
1989 సినిమా ఎక్స్‌ప్రెస్ అవార్డులు ఇల్లం, అగ్ని నట్చాతిరం
1991 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు - మలయాళం – ఉల్లడక్కం
2012 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు – తెలుగు – లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్
2012 సినీమా అవార్డులు అత్యుత్తమ నటి – లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్

సాంఘిక సంక్షేమ పురస్కారాలుసవరించు

అక్కినేని వంశ వృక్షంసవరించు

మూలాలుసవరించు

  1. Animal-loving Amala - Times of India సెప్టెంబర్ 1, 2001
  2. "Who we are". Blue Cross of Hyderabad (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-02-16.
  3. Namasthe Telangana (13 November 2022). "గ్రాండ్‌ రీఎంట్రీ.. పండుగ చేసుకుంటున్న పాతతరం అభిమానులు". Archived from the original on 13 November 2022. Retrieved 13 November 2022.