దాదా హయాత్‌ 1983లో తొలిసారిగా అహింస శీర్షికతో రాసిన కథ ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురితం అయ్యింది. ఈ కథను ఆ ఏటి ఉత్తమ భారతీయ కథల్లో ఒకటిగా 'జ్ఞానపీఠ్‌' వారు ఎంపికచేసి, హిందీలోకి తర్జుమా చేసి 1983 నాటి జాతీయ కథా సంకలనంలో చోటు కల్పించారు. వీరు వ్రాసిన సుమారు 20 కథలు ఆంగ్లంలోకి అనువాదమయ్యాయి. తెలుగు కథకు విశ్వవ్యాప్తంగా ఖ్యాతి రావాలన్న బలమైన ఆకాంక్షకు తగిన కృషి చేస్తున్నారు

బాల్యము - విద్య

మార్చు

దాదా హయాత్‌ నెల్లూరు జిల్లా వెంకటగిరిలో 1960 అక్టోబర్‌ 10న జన్మించారు. వీరి తల్లితండ్రులు యన్‌. ఛోటీ రసూల్‌ బీ, ఎన్‌. బాబ్‌జాన్‌. స్వగ్రామం కడప జిల్లా ప్రొద్దుటూరు. చదువు: బిఏ., బి.ఎల్‌. వృత్తి: న్యాయవాది.

రచనా వ్యాసంగము

మార్చు

1983లో అహింస కథతో వీరి రచనా వ్యాసంగం ప్రారంభమైంది. అన్నిభారతీయ భాషల్లో ఈ కథ అనువాదమై ఆయా భాషల పత్రికల్లో ప్రచురితమైంది. అప్పటినుండి వివిధ పత్రికలలో, కథా సంకలనాలలో పలు కవితలు, కథానికలు, కథలు, సాహిత్య వ్యాసాలు, సమీక్షలు ప్రచురితం అయ్యాయి.

ప్రచురణలు

మార్చు

అహింస, గుక్కెడు నీళ్ళు, మసీదు పావురం, మురళి వూదే పాపడు, ఎల్లువ, ఏ ఒడ్డు చేపలు, వారసత్వం లాంటి కథలు గుర్తింపు తెచ్చి పెట్టాయి. 'మసీదు పావురం' కథని సాహిత్య అకాడమీ ఎంపిక చేసి హిందీలోకి అనువదించి ప్రచురించగా, 'ఎల్లువ కథ' తెలుగులో వచ్చిన నూరు మంచి కథలలో ఒకటిగా 'విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్‌' ఎంపిక చేసి సంకలనంలో స్థానం కల్పించింది. ప్రచురితమైన కథలలో సుమారు 20 కథలు ఆంగ్లంలోకి అనువాదమయ్యాయి. తెలుగులో ఇతరులు రాసిన మంచి కథలను ఆయన ఆంగ్లంలోకి స్వయంగా అనువదించి వెలువరించారు. తెలుగు కథకు విశ్వవ్యాప్తంగా ఖ్యాతి రావాలన్న బలమైన ఆకాంక్షకు తగిన కృషి చేయడం ఆయన లక్ష్యం.

మూలాల జాబితా

మార్చు
  • సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ రచించిన అక్షర శిల్పులు అనేగ్రంథము అక్షరశిల్పులు గ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010, ప్రచురణకర్త-- ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌ .. చిరునామా వినుకొండ - 522647. పుట 57


అక్షర శిల్పులు
అజ్మతుల్లాచాంద్‌ బాషా పిబుడన్‌ సాహెబ్‌ షేక్‌బిందే అలీ సయ్యద్‌బషీరుద్దీన్‌ ముహమ్మద్‌షేక్‌ మహబూబ్ బాషబాషా షేక్‌బాషా ఎస్‌.ఎంషేక్ మహబూబ్‌ బాషా, నెల్లూరుషేక్ ఖాదర్‌బాషాసయ్యద్‌ హుసేన్‌ బాషాషేక్‌ బడే సాహెబ్‌, గుంటూరుషేక్‌ బడేసాహెబ్‌షేక్‌ బాబూజీ