దాసరి మనోహర్ రెడ్డి

దాసరి మనోహర్ రెడ్డి, తెలంగాణ ఉద్యమకారుడు, రాజకీయ నాయకుడు. ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున పెద్దపల్లి శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[1] ట్రినిటి విద్యాసంస్థలను కూడా స్థాపించాడు.[2]

దాసరి మనోహర్ రెడ్డి
దాసరి మనోహర్ రెడ్డి

నియోజకవర్గం పెద్దపల్లి శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1954-02-25) 1954 ఫిబ్రవరి 25 (వయసు 70)
కాసులపల్లి, పెద్దపల్లి మండలం, పెద్దపల్లి జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు రాంరెడ్డి - మధురవ్వ
జీవిత భాగస్వామి పుష్పలత
సంతానం ప్రశాంత్ రెడ్డి

విద్యాభ్యాసం

మార్చు

మనోహర్ రెడ్డి 1954, ఫిబ్రవరి 25న రాంరెడ్డి - మధురమ్మ[3] దంపతులకు తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లా, పెద్దపల్లి మండలంలోని కాసులపల్లి గ్రామంలో జన్మించాడు.[4] ఇతనిది వ్యవసాయ నేపథ్యం కలిగిన కుటుంబం.సుల్తానాబాద్ మండలం, గర్రెపల్లిలో పాఠశాల విద్యను, సుల్తానాబాద్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్, మంచిర్యాలలో డిగ్రీ, 1978లో నాగార్జున యూనివర్సిటీలో బీఈడీ, 1980లో మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో ఎంఏ (ఎకనామిక్స్) పూర్తి చేశాడు.

వ్యక్తిగత జీవితం

మార్చు

మనోహర్ రెడ్డికి పుష్పలతతో వివాహం జరిగింది.[5] వారికి ఒక కుమారుడు (ప్రశాంత్ రెడ్డి).

రాజకీయ విశేషాలు

మార్చు

2010లో టీఆర్ఎస్ పార్టీలో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. 2012 నుంచి టీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గ ఇంచార్జిగా వ్యవహరించాడు. 2014 శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పెద్దపల్లి నుంచి బరిలోకి దిగి 62686 వేల భారీ మెజారిటీతో గెలుపొందాడు.[6][7][8] తిరిగి 2018 ఎన్నికల్లో రెండవసారి బరిలోకి దిగి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించాడు.[9][10] ఆయన 2018లో శాసనసభలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) సభ్యుడిగా ఉన్నాడు.[11]

ఇతర వివరాలు

మార్చు

చైనా, ఇజ్రాయెల్, మలేషియా, సింగపూర్, యునైటెడ్ కింగ్‌డమ్‌ మొదలైన దేశాలు సందర్శించాడు. కరీంనగర్ జిల్లాలోని తన అసెంబ్లీ సెగ్మెంట్‌లో పండ్ల మొక్కల పెంపకం, కాలుష్యం నుండి పర్యావరణాన్ని కాపాడినందుకు రాష్ట్ర స్థాయి తెలంగాణ హరిత మిత్ర అవార్డును అందుకున్నాడు.[12]

మూలాలు

మార్చు
  1. "Member's Profile - Telangana-Legislature". www.telanganalegislature.org.in. Archived from the original on 2021-05-27. Retrieved 2021-09-03. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  2. "Trinity DC". www.trinitydcpdpl.com. Retrieved 2021-09-03.[permanent dead link]
  3. "పెద్దపల్లి ఎమ్మెల్యే ఇంట్లో విషాదం.. ఈ ఏడాది ఆరంభం నాటి ఘటన మరువక ముందే." Samayam Telugu. Retrieved 2021-09-03.
  4. admin (2019-01-07). "Peddapalli MLA Dasari Manohar Reddy". Telangana data (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-09-03.
  5. Eenadu (21 November 2023). "ప్రచార భాగస్వాములు". Archived from the original on 21 November 2023. Retrieved 21 November 2023.
  6. Eenadu (25 November 2023). "ఓట్లు కొల్లగొట్టారు". Archived from the original on 25 November 2023. Retrieved 25 November 2023.
  7. Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  8. "IndiaVotes AC: Peddapalle 2014". IndiaVotes. Retrieved 2021-09-03.[permanent dead link]
  9. Sakshi (8 November 2018). "పెద్దపల్లి పెద్దన్నలు". Sakshi. Archived from the original on 7 జూన్ 2021. Retrieved 7 June 2021.
  10. "Peddapalle Assembly constituency (Telangana): Full details, live and past results". News18. Retrieved 2021-09-03.
  11. Sakshi (22 September 2019). "తెలంగాణ పీఏసీ చైర్మన్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ". Archived from the original on 15 జూలై 2021. Retrieved 15 July 2021.
  12. "Dasari Manohar Reddy | MLA | Peddapalli | Telangana | theLeadersPage". the Leaders Page (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-04-28. Retrieved 2021-09-03.