డా. దాసోజు శ్రవణ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ విద్యార్థి నాయకుడు, సామాజిక కార్యకర్త, విద్యావేత్త, పరిశోధకుడు, కన్సల్టెంట్, కార్పోరేట్ ఎగ్జిక్యూటివ్, రాజకీయ నాయకుడు.[1] ఆయన ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితిలో సీనియర్ నాయకుడిగా ఉన్నాడు. గతంలో పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, బీఆర్ఎస్ పార్టీ అధికారిక ప్రతినిధిగా కూడా నియమితులయ్యాడు.

డా. దాసోజు శ్రవణ్
దాసోజు శ్రవణ్

నియోజకవర్గం ఖైరతాబాద్

వ్యక్తిగత వివరాలు

జననం (1966-09-07) 1966 సెప్టెంబరు 7 (వయసు 57)
నల్గొండ, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు కృష్ణమాచారి, జోగమ్మ
జీవిత భాగస్వామి శశికళ
నివాసం హైదరాబాద్
పూర్వ విద్యార్థి ఉస్మానియా విశ్వవిద్యాలయం

జననం మార్చు

శ్రవణ్ 1966, సెప్టెంబరు 7న కృష్ణమాచారి - జోగమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాలో జన్మించాడు.

విద్యాభాస్యం మార్చు

తరగతి పాఠశాల/కళాశాల ప్రాంతం సంవత్సరం
ఎల్.కే.జీ – 10వ తరగతి సెయింట్ అల్ఫోనుసు హైస్కూల్ నల్గొండ 1980
ఇంటర్మీడియట్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నల్గొండ 1982
బిఎస్సీ నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నల్గొండ 1985
ఏం.ఏ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ 1988
ఏంబిఎ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ 1990
పి.హెచ్.డి ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ 1996

విద్యార్థి ఉద్యమాలు మార్చు

1986లో ఆర్ట్స్ కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘానికి గేమ్స్ & స్పోర్ట్స్ సెక్రటరీగా, 1987లో జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యాడు. అనేక విద్యార్థి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాడు.

ఉద్యోగం మార్చు

టెక్ మహీంద్రా (సత్యం కంప్యూటర్స్ లిమిటెడ్) లో జనరల్ మేనేజర్, హెచ్‌ఆర్ హెడ్ గా, హిటాచీ కన్సల్టింగ్ లిమిటెడ్ (సియెర్రా అట్లాంటిక్ ఇంక్) లో హెచ్‌ఆర్ డైరెక్టర్ గా కొంతకాలంపాటు పనిచేశాడు.

విద్యా-పరిశోధనారంగం మార్చు

  • ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ లోని సీనియర్ హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్‌మెంట్ లో సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా వర్కింగ్ ఎగ్జిక్యూటివ్‌ల కోసం జనరల్ మేనేజ్‌మెంట్ నేర్పించాడు.
  • వివిధ ప్రభుత్వ & ప్రైవేట్ రంగ సీనియర్ స్థాయి మేనేజర్‌ల కోసం నాయకత్వ శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాడు. పబ్లిక్ పాలసీ, డెవలప్‌మెంట్‌కు సంబంధించిన అనేక ప్రాజెక్ట్‌లలో పనిచేశాడు.
  • ప్రపంచ బ్యాంక్, భారత ప్రభుత్వం, డిఎఫ్ఐడి, డిఓపిటి, ఎన్ఎండిసి, సింగరేణి కాలరీస్, హెచ్.జెడ్.ఎల్., ఇండో-స్విస్ ప్రాజెక్ట్, ఎఫ్ఈఎస్-జర్మనీ వంటి జాతీయ, అంతర్జాతీయ సంస్థలచే స్పాన్సర్ చేయబడిన అనేక పరిశోధన, అభివృద్ధి, కన్సల్టింగ్ ప్రాజెక్ట్‌లపై పనిచేశాడు.
  • అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ప్రాజెక్ట్ అసోసియేట్ ఫ్యాకల్టీగా ఎఫ్ఈఎస్-జర్మనీ, టిహెచ్డిసి, భారత ప్రభుత్వం, ఇండో-స్విస్ ప్రాజెక్ట్ మొదలైన జాతీయ, అంతర్జాతీయ సంస్థలచే స్పాన్సర్ చేయబడిన అనేక పరిశోధన, కన్సల్టింగ్ ప్రాజెక్ట్‌లలో పనిచేశాడు.

తెలంగాణ ఉద్యమం మార్చు

తెలంగాణ ఉద్యమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పిలుపుమేరకు తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించాడు. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీలో స్టీరింగ్ కమిటీ సభ్యుడు కూడా పనిచేశాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతకు సంబంధించి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి సమర్పించిన చారిత్రక నివేదికలను రాయడంలో కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్ లకు సహాయం చేసాడు. ఉద్యమ సమయంలో భారతదేశ సీఈఓ ఫోరమ్‌లో సమర్పించబడిన “తెలంగాణ పారిశ్రామికీకరణ కోసం విజన్” ముసాయిదా రూపకల్పనలో కల్వకుంట్ల తారక రామారావుకు సహాయం చేసాడు.

 
టీఆర్‌ఎస్‌లో చేరిన దాసోజు శ్రవణ్‌

రాజకీయ జీవితం మార్చు

సామాజిక న్యాయం - సామాజిక తెలంగాణ నినాదమే అంశంగా పవన్ కళ్యాణ్ సూచనతో 2008లో ప్రజా రాజ్యం పార్టీతో క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన శ్రవణ్, పొలిట్ బ్యూరో సభ్యుడిగా నియమించబడ్డాడు. 2009లో సికింద్రాబాద్ లోక్‌సభ నుంచి పీఆర్పీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ప్రజారాజ్యం పార్టీ వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడంతో ఆ పార్టీని వీడి తెలంగాణ ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌లో చేరాడు.[2]

తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీలో స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా తెలంగాణ ఉద్యమంలో అనేక టీవీ చర్చల్లో, వివిధ వేదికలపై తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం కొన్ని కారణాల వల్ల 2014 ఏప్రిల్ 12న టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాడు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శగా వివిధ హోదాల్లో పనిచేశాడు.[3] 2018లో కాంగ్రెస్ పార్టీ తరపున ఖైరతాబాదు అసెంబ్లీకి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయాడు. రాహుల్ గాంధీ, శ్రీమతి సోనియా గాంధీ బహిరంగ సభ ప్రసంగాలను అనువదించాడు. 2019 సార్వత్రిక ఎన్నికల పర్యవేక్షణ కోసం ఏఐసిసి ఎన్నికల వార్ రూమ్‌లో కూడా భాగమయ్యాడు, బీహార్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లకు ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు.[4]

కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ మరింతగా అభివృద్ధి జరుగుతందనే నమ్మకంతో 2022 అక్టోబర్ 21న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[5]

ఇతర వివరాలు మార్చు

  • 2009లో ప్రజారాజ్యం పార్టీ కోసం గ్రేటర్ హైదరాబాదు ఎన్నికల మేనిఫెస్టో; 2014 తెలంగాణ రాష్ట్ర సమితి కోసం అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో; 2016 & 2020లలో కాంగ్రెస్ పార్టీ కోసం గ్రేటర్ హైదరాబాదు ఎన్నికల మేనిఫెస్టో, 2018 కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో మేనిఫెస్టోలో సహకారం అందించాడు.
  • జాతీయ & ప్రాంతీయ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియా, డిబేట్‌లు, ప్రోగ్రామ్‌లలో క్రమం తప్పకుండా పాల్గొంటున్నాడు.
  • సెంట్రల్ యూనివర్శిటీలు, నేషనల్ లా స్కూల్స్, ఇఫ్లూ మొదలైన వాటిలో ఓబిసి రిజర్వేషన్ల సమస్యల కోసం పోరాడాడు, ఓబిసీల కోసం సుప్రీంకోర్టు, నేషనల్ కమిషన్‌లో కేసులు వేశాడు.
  • తెలుగు ఫీచర్ ఫిల్మ్‌లు, టెలివిజన్ సీరియల్స్ మొదలైన వాటిని నిర్మించాడు, వాటిల్లో నటించాడు.
  • దాసోజు ఫౌండేషన్ స్థాపించి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో నిర్వహిస్తున్నాడు.

పదవులు మార్చు

  • ప్రజారాజ్యం పార్టీలో వ్యవస్థాపక పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, అధికారిక ప్రతినిధిగా పనిచేశాడు.
  • తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుడిగా, టిఆర్ ఎస్ తరపున అపెక్స్ స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా పనిచేశాడు.
  • భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో జాతీయ అధికార ప్రతినిధిగా, ఏఐసిసి సభ్యుడిగా, టిపిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా, జనరల్ సెక్రటరీగా, మీడియా & కమ్యూనికేషన్స్ విభాగానికి ఇన్‌ఛార్జ్ గా, ముఖ్య అధికార ప్రతినిధిగా, ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (తెలంగాణ) అధ్యక్షుడిగా, 2018 ఎన్నికల ప్రచార కమిటీ కన్వీనర్ గా, 2019 మీడియా మేనేజ్‌మెంట్ కమిటీ కన్వీనర్ గా, ఏఐసిసి జాతీయ ఎన్నికల నియంత్రణ సభ్యుడిగా పనిచేశాడు.[6]
  • ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి పొలిట్‌బ్యూరో సభ్యుడు, అధికారిక ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

మూలాలు మార్చు

  1. "Dasoju Sravan Kumar(Indian National Congress(INC)):Constituency- KHAIRATABAD(HYDERABAD) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2023-04-12.
  2. Desk, HT Telugu (2022-10-21). "Pawan Kalyan Tweet: TRS లోకి దాసోజు శ్రవణ్… పవన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్". Hindustantimes Telugu. Archived from the original on 2022-10-21. Retrieved 2023-04-15.
  3. "ఏఐసీసీ అధికార ప్రతినిధిగా దాసోజు శ్రవణ్‌". Sakshi. 2019-01-01. Archived from the original on 2019-01-01. Retrieved 2023-04-15.
  4. Maheshwaram, Mahendra. "Dasoju Sravan: కాంగ్రెస్ కు మరో షాక్… పార్టీకి దాసోజు శ్రవణ్ గుడ్ బై". Hindustantimes Telugu. Archived from the original on 2023-04-15. Retrieved 2023-04-15.
  5. "టీఆర్‌ఎస్‌లో చేరిన స్వామిగౌడ్‌, దాసోజు శ్రవణ్‌". 21 October 2022. Archived from the original on 21 October 2022. Retrieved 21 October 2022.
  6. "Cannot be a slave anymore, fumes Telangana Congress spokesperson Dasoju Sravan". The New Indian Express. Retrieved 2023-04-12.