సికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం

తెలంగాణ రాష్ట్రంలోని లోక్సభ నియోజకవర్గం
(సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

తెలంగాణ లోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజకవర్గములు ఉన్నాయి.

సిద్దిపేత పార్లమెంటు సభ్యుడు కిషన్ రెడ్డి

దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గాలుసవరించు

  1. ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం
  2. అంబర్‌పేట్ శాసనసభ నియోజకవర్గం
  3. ఖైరతాబాదు అసెంబ్లీ నియోజకవర్గం
  4. బంజారా-జూబిలీహిల్స్ శాసనసభ నియోజకవర్గం
  5. సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం
  6. నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం
  7. సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం

నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థులుసవరించు

లోక్‌సభ కాలము గెలిచిన అభ్యర్థి పార్టీ
రెండవ 1957-62 అహ్మద్ మొహియుద్దీన్ భారత జాతీయ కాంగ్రెస్
మూడవ 1962-67 అహ్మద్ మొహియుద్దీన్ భారత జాతీయ కాంగ్రెస్
నాల్గవ 1967-71 బకర్ అలీ మీర్జా భారత జాతీయ కాంగ్రెస్
ఐదవ 1971-77 ఎం.ఎం.హషీమ్ తెలంగాణా ప్రజా సమితి
ఆరవ 1977-80 ఎం.ఎం.హషీమ్ భారత జాతీయ కాంగ్రెస్
ఏడవ 1980-84 పి.శివశంకర్ భారత జాతీయ కాంగ్రెస్
ఎనిమిదవ 1984-89 టంగుటూరి అంజయ్య భారత జాతీయ కాంగ్రెస్
తొమ్మిదవ 1989-91 టంగుటూరి మణెమ్మ భారత జాతీయ కాంగ్రెస్
పదవ 1991-96 బండారు దత్తాత్రేయ భారతీయ జనతా పార్టీ
పదకొండవ 1996-98 పి.వి. రాజేశ్వర్ రావు భారత జాతీయ కాంగ్రెస్
పన్నెండవ 1998-99 బండారు దత్తాత్రేయ భారతీయ జనతా పార్టీ
పదమూడవ 1999-04 బండారు దత్తాత్రేయ భారతీయ జనతా పార్టీ
పదునాల్గవ 2004-09 ఎం.అంజన్ కుమార్ యాదవ్ భారత జాతీయ కాంగ్రెస్
పదిహేనవ 2009-14 ఎం.అంజన్ కుమార్ యాదవ్ భారత జాతీయ కాంగ్రెస్
పదహారవ 2014-19 బండారు దత్తాత్రేయ భారతీయ జనతా పార్టీ
పదిహేడవ 2019-ప్రస్తుతం జి.కిషన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ

2004 ఎన్నికలుసవరించు

2004 ఎన్నికల ఫలితాలను చేపే చిత్రం

  అంజన్ కుమార్ యాదవ్ (45.90%)
  బండారు దత్తాత్రేయ (42.84%)
  హమీరా అజీజ్ (3.94%)
  ఇతరులు (7.32%)
భారత సాధారణ ఎన్నికలు,2004:సికింద్రాబాదు
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
కాంగ్రెస్ ఎం.అంజన్ కుమార్ యాదవ్ 4,55,710 45.90 +7.77
భాజపా బండారు దత్తాత్రేయ 4,44,952 42.84 -9.35
ఎ.ఐ.ఎం.ఐ.ఎం హమీరా అజీజ్ 35,394 3.94
బసపా ఎం.డి.పాల్ వేదాంత్ 7,816 0.80
స్వతంత్ర అభ్యర్ది హెచ్.కె.జైశ్వాల్ 4,788 0.49
స్వతంత్ర అభ్యర్ది సయ్యద్ నవాజ్ అహ్మద్ 3,830 0.39
ఎం.యు.ఎల్ అబ్టస్ సత్తార్ ముసహీద్ 3,530 0.36
స్వతంత్ర అభ్యర్ది సలీం నారాయణ 3,398 0.35
ఎం.సి.పి.ఐ (ఎస్) ఎన్.చంద్రశేఖర్ 2,978 0.31
స్వతంత్ర అభ్యర్ది అచంట బాపిరాజు 1,927 0.20
పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మేఘ మురళి 1,884 0.19 +0.01
స్వతంత్ర అభ్యర్ది పదం యాదగిరి 1,253 0.12
స్వతంత్ర అభ్యర్ది కైలాష్ చంద్ర 828 0.09
మెజారిటీ 68,758 7.06 +17.12
మొత్తం పోలైన ఓట్లు 973,288 52.29 -2.56
భాజపా పై కాంగ్రెస్ విజయం సాధించింది ఓట్ల తేడా +7.77

2009 ఎన్నికలుసవరించు

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున బండారు దత్తాత్రేయ పోటీ చేస్తున్నాడు.[1] మహాకూటమి తరఫున తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన సామాల వెంకట్ రెడ్డి పోటీలో ఉన్నాడు.[2] కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తన అభ్యర్థిగా 2004లో విజయం సాధించిన అంజన్ కుమార్ యాదవ్‌ను నిలబెట్టింది. [3] ప్రజారాజ్యం తరఫున దాసోజు శ్రవణ్ కుమార్ పోటీపడుతున్నాడు. [4]

2009 ఎన్నికలలో విజేత,ప్రత్యర్థి కి చెందిన ఓట్ల వివరాలు
అభ్యర్థి (పార్టీ) పొందిన ఓట్లు
అంజన కుమార్ యాదవ్ (కాంగ్రెస్)
3,40,549
బండారు దత్తాత్రేయ (బి.జె.పి)
1,70,382

2014 ఎన్నికలుసవరించు

2014 లో ఈ స్థానమునుండి పోటీచేసి బండారు దత్తాత్రేయ గారు సమీప కాంగ్రెస్ అభ్యర్థి అంజనకుమార్ యాదవ్ పై 2,54,735 పై చిలుకుఓట్ల భారీ తేడాతో గెలిచి కేంద్రం లోసహాయమంత్రి గా పని చేసారు

2019 ఎన్నికలుసవరించు

2019 లో ఈస్థానం నుండి గెలుపొందిన జి.కిషన్ రెడ్డి గారు సమీప టిఆర్ఎస్ అబ్యర్ది తలసాని సాయికిరణ్ పై 62000 తేడాతో గెలిచి మొదట నరేంద్రమోదీ హయాంలో కేంద్రహోంశాఖ సహాయమంత్రిగా తరువత కేంద్రమంత్రి గా పనిచేశారు

మూలాలుసవరించు

  1. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009
  2. ఈనాడు దినపత్రిక, తేది 28-03-2009
  3. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
  4. ఈనాడు దినపత్రిక, తేది 29-03-2009