దివి వడ్త్యా
దివి వైద్య భారతదేశానికి చెందిన తెలుగు సినిమా నటి, మోడల్. ఆమె 2019లో వచ్చిన మహర్షి సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది. దివి బిగ్బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా పాల్గొంది.[1] ఆమెను హైదరాబాద్ టైమ్స్ 2020లో టీవీ పరిశ్రమకు చెందిన మోస్ట్ డిజైరబుల్ వుమెన్‌గా ప్రకటించింది.[2][3]
దివి వైద్య | |
---|---|
జననం | 15 మార్చ్ 1996 |
జాతీయత | భారతదేశం |
విద్య | ఎమ్‌టెక్, ఎంబీఏ |
వృత్తి | సినీ నటి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 2019 – ప్రస్తుతం |
తల్లిదండ్రులు | శశికాంత్ వైద్య, దేవకీ |
బంధువులు | డా. కిషోర్ (అన్నయ్య) |
జననం,విద్యాభాస్యం
మార్చుదివి వైద్య 1996 మార్చి 15లో హైదరాబాద్లో శశికాంత్ వైద్య, దేవకీ దంపతులకు జన్మించింది. ఆమె పదవ తరగతి వరకు జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ లో చదివింది. జీ నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ నుండి ఎంబీఏ పూర్తి చేసింది.
సినీ జీవితం
మార్చుదివి సినిమాల మీద మక్కువతో 2017లో మోడలింగ్‌తో తన కెరీర్ మొదలు పెట్టింది. ఆమె పలు ఫాషన్ సంస్థలకు మోడలింగ్ చేసింది. దివి 2018లో తొలిసారిగా "లెట్స్ గో" అనే లఘు చిత్రంలో నటించింది. ఆమె 2019లో వచ్చిన మహర్షి సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది. దివి 2019లో ఏ 1 ఎక్స్‌ప్రెస్, 2021లో క్యాబ్ స్టోరీస్ చిత్రాలలో నటించింది.ఆమె నటించిన 'సిలక ముక్కుదానా' అనే మ్యూజిక్ వీడియో 3 జూలై 2021న విడుదలైంది.[4]
బిగ్బాస్ నాల్గో సీజన్
మార్చుదివి వైద్య 2020 సెప్టెంబరు 6న ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 4లో పాల్గొంది. ఆమె 49 రోజులపాటు బిగ్‌బాస్ హౌస్‌లో ఉండి ఎలిమినేట్ అయ్యింది.[5][6]
నటించిన సినిమాలు
మార్చుసంవత్సరం | చిత్రం | పాత్ర పేరు | భాషా | ఇతర వివరాలు | మూలాలు |
---|---|---|---|---|---|
2019 | మహర్షి | కాలేజీ స్టూడెంట్ | తెలుగు | మొదటి సినిమా | |
2019 | ఏ 1 ఎక్స్‌ప్రెస్ | దివ్య | తెలుగు | రెండవ సినిమా | |
2021 | క్యాబ్ స్టోరీస్ | షాలిని | తెలుగు | మూడవ సినిమా | |
2021 | నయీమ్ డైరీస్ | తెలుగు | |||
2022 | జిన్నా | దివ్య | తెలుగు | ||
2022 | గాడ్ ఫాదర్ | రేణుక | తెలుగు | ||
2021 | సితార ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్ | - | తెలుగు | మూడవ సినిమా | [7] |
2023 | రుద్రంగి | - | తెలుగు | జాజిమొగులాలి పాటలో | [8] |
2024 | లంబసింగి | తెలుగు | [9] | ||
సింబా | తెలుగు |
మూలాలు
మార్చు- ↑ Sakshi (6 September 2020). "సెలబ్రిటీ అవుతా.. దివి వైద్య". Sakshi. Archived from the original on 1 జూన్ 2021. Retrieved 1 June 2021.
- ↑ The Times of India. "Hyderabad Times Most Desirable Woman on TV 2020: Divi Vadthya - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 1 జూన్ 2021. Retrieved 1 June 2021.
- ↑ Sakshi (31 May 2021). "Divi Vadthya: టాప్ యాంకర్లను వెనక్కు నెట్టిన దివి!". Sakshi. Archived from the original on 1 జూన్ 2021. Retrieved 1 June 2021.
- ↑ Sakshi (3 July 2021). "అదరగొడుతున్న దివి 'సిలక ముక్కుదానా' సాంగ్". Sakshi. Archived from the original on 12 జూలై 2021. Retrieved 12 July 2021.
- ↑ TV9 Telugu, TV9 (26 October 2020). "Bigg Boss 4: దివి ఔట్.. స్టేజ్‌పైనే సినిమా ఛాన్స్ ఇప్పించిన సమంత - Bigg Boss 4 Divi elimination". TV9 Telugu. Archived from the original on 1 జూన్ 2021. Retrieved 1 June 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Namasthe Telangana (2 June 2021). "అలాంటి వాడు మొగుడుగా రావాలి..దివి మనసులో మాట". Namasthe Telangana. Archived from the original on 2 జూన్ 2021. Retrieved 2 June 2021.
- ↑ Sakshi (5 January 2021). "పవన్ కల్యాణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన దివి?". Sakshi. Archived from the original on 1 జూన్ 2021. Retrieved 1 June 2021.
- ↑ V6 Velugu (6 February 2023). "రుద్రంగి ఫోక్ సాంగ్‌లో బిగ్బాస్ దివి". Archived from the original on 27 June 2023. Retrieved 27 June 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ A. B. P. Desam (7 March 2024). "హీరోయిన్‌గా 'బిగ్ బాస్' దివి - 'లంబసింగి' విడుదలకు రెడీ, ఎప్పుడంటే?". Archived from the original on 8 March 2024. Retrieved 8 March 2024.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో దివి వడ్త్యా పేజీ