మహర్షి (2019 సినిమా)

మహర్షి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 2019 లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పివిపి సినిమా సంయుక్తంగా నిర్మించాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహించాడు.[5][6][7]

మహర్షి
సినిమా పోస్టర్
దర్శకత్వంవంశీ పైడిపల్లి[1]
రచనవంశీ పైడిపల్లి
హరి
అహిషోర్‌ సాల్మన్‌
నిర్మాతదిల్ రాజు
అశ్వనీ దత్
ప్రసాద్ వి. పొట్లూరి[1]
తారాగణంమహేష్ బాబు
అల్లరి నరేష్
పూజ హెగ్డే
ఛాయాగ్రహణంకె.యు. మోహనన్
కూర్పుకె.ఎల్. ప్రవీణ్
సంగీతందేవి శ్రీ ప్రసాద్
నిర్మాణ
సంస్థలు
శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్
వైజయంతీ మూవీస్
పివిపి సినిమా[1]
పంపిణీదార్లుగ్రేట్ ఇండియా ఫిల్మ్స్ (అమెరికా)
విడుదల తేదీ
9 మే 2019 (2019-05-09)
సినిమా నిడివి
176 ని[2]
దేశంభారత్
భాషతెలుగు
బడ్జెట్₹100 కోట్లు[3]
బాక్సాఫీసుest. 206 crore[4]

ప్రపంచంలో పేరెన్నికగన్న కంపెనీ యైన ఆరిజిన్ అనే సంస్థకు తెలుగు వాడైన ఋషి కుమార్ సి. ఇ. ఓ (ముఖ్య కార్యనిర్వహణాధికారి) గా నియమితుడవ్వడంతో కథ ప్రారంభమవుతుంది. ఋషిది హైదరాబాద్ లో కూకట్ పల్లి లో నివసించే ఒక మధ్య తరగతి కుటుంబం. తండ్రి ఒక ప్రైవేటు సంస్థలో గుమాస్తాగా పనిచేస్తూ చాలీచాలని జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తుంటాడు. అప్పుల వాళ్ళు ఇంటిమీదకు వచ్చినప్పుడల్లా ఋషికి కోపం వస్తుంటుంది. రాను రాను ఋషికి తండ్రి జీవితంలో విఫలమైన వ్యక్తి అనే అభిప్రాయం ఏర్పడిపోతుంది.

ఋషి తన పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం విశాఖపట్నంలోని ఓ కళాశాలలో చేరతాడు. అక్కడ అతనికి రవి శంకర్, పూజ లతో స్నేహం ఏర్పడుతుంది. ఋషి సహవిద్యార్థి అయిన అజయ్ అనే వ్యక్తికి, తనకన్నా బాగా చదువుతున్నాడని, ఋషి మీద ఈర్ష్య ఏర్పడుతుంది. రాజకీయ నాయకుడైన అజయ్ తండ్రి ఋషికి లంచం ఇచ్చి తన కుమారుడికన్నా అతని మార్కులు మించకూడదని కోరతాడు. కానీ ఋషి అందుకు అంగీకరించకపోగా, అడ్డు వచ్చిన అతని ముఠాని చితకబాదుతాడు.

చదువు పూర్తవుతుండగా పెళ్ళి చేసుకుందామన్న పూజ ప్రతిపాదనను తిరస్కరిస్తాడు ఋషి. పెళ్ళి తన కెరీర్ కి ఆటంకం అని అతని ఉద్దేశ్యం. పూజకి అతనిమీద మనసు విరిగిపోతుంది. ఇద్దరూ విడిపోతారు. వారిద్దరి మధ్య సయోధ్య కుదర్చబోయి రవి ఋషిల మధ్య దూరం పెరుగుతుంది. అజయ్ కు కళాశాలలో అందరికన్నా ఎక్కువ జీతంతో ఓ సంస్థలో ఉద్యోగం వస్తుంది. ఋషి మాత్రం కృత్రిమ మేధ మీద ఆధారపడ్డ ఒక ఆపరేటింగ్ సిస్టం ను అభివృద్ధి చేసి ఆరిజిన్ కంపెనీ వాళ్ళకే ఆఫర్ ఇస్తాడు.

తారాగణం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

పురస్కారాలు

మార్చు

సైమా అవార్డ్స్

మార్చు

2021లో హైదరాబాద్ లో జరిగిన 'సైమా' అవార్డుల ప్రధానోత్సవంలో 2019 సంవత్సరానికి గాను మహర్షి సినిమా 10 విభాగాల్లో నామినేట్ అవ్వగా 5 అవార్డులను అందుకుంది.[10]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 "Mahesh Babu makes a dashing entry as Rishi". The Indian Express. 9 August 2018.
  2. "MAHARSHI (2019)| British Board of Film Classification". Bbfc.co.uk. 7 May 2019.
  3. Maharshi Movie Review: Mahesh Babu gets his own underwhelming Kaththi - Movies News - https://www.indiatoday.in/movies/regional-cinema/story/maharshi-movie-review-mahesh-babu-gets-his-own-underwhelming-version-of-kaththi-1520830-2019-05-09
  4. H Hooli. "Maharshi box office collection day 1: Mahesh Babu film turns biggest Tollywood opener of 2019". Ibtimesfirst=Shekhar. Retrieved 10 May 2019.
  5. "MAHARSHI: CAST & CREW". Cinestaan. Archived from the original on 2019-01-01. Retrieved 2019-01-01.
  6. "Mahesh Babu and Chiranjeevi's films to clash at the box office in 2019?". India Todad. 11 August 2018.
  7. "Mahesh Babu's Maharshi to clash with Chiranjeevi's Sye Raa Narasimha Reddy?". Times Now. 12 August 2018.
  8. The Hindu, Entertainment (22 March 2021). "67th National Film Awards: Complete list of winners". Archived from the original on 22 March 2021. Retrieved 22 March 2021.
  9. India Today, Movies (22 March 2021). "67th National Film Awards Full Winners List". Divyanshi Sharma. Archived from the original on 22 March 2021. Retrieved 22 March 2021.
  10. TV9 Telugu (19 September 2021). "SIIMA Awards 2021: తరలివచ్చిన తారాలోకం.. మహేష్ బాబు సినిమాకు అవార్డుల పంట." Archived from the original on 24 సెప్టెంబరు 2021. Retrieved 24 September 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)

బాహ్య లంకెలు

మార్చు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా|ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమా|ఉత్తమ నటుడు|ఉత్తమ నటి|ఉత్తమ సహాయ నటుడు|ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు|ఉత్తమ బాల నటుడు|ఉత్తమ ఛాయా గ్రహకుడు|ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్|ఉత్తమ దర్శకుడు|ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు|ఉత్తమ గీత రచయిత|ఉత్తమ సంగీత దర్శకుడు|ఉత్తమ నేపథ్య గాయకుడు|ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం|ఉత్తమ కూర్పు|ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్|ఉత్తమ బాలల సినిమా|ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం|ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా|ఉత్తమ బెంగాలీ సినిమా|ఉత్తమ ఆంగ్ల సినిమా|ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా|ఉత్తమ మళయాల సినిమా|ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా|ఉత్తమ పంజాబీ సినిమా|ఉత్తమ కొంకణి సినిమా|ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా|ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినీ విమర్శకుడు
ఉత్తమ సినీ విమర్శకుడు