నర్సాపూర్ పురపాలకసంఘం
రామాయంపేట పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] నర్సాపూర్ పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం మెదక్ లోక్‌సభ నియోజకవర్గం లోని నర్సాపూర్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]
నర్సాపూర్ పురపాలకసంఘం | |
— పురపాలకసంఘం — | |
Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided. |
|
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | సంగారెడ్డి జిల్లా |
మండలం | నర్సాపూర్ |
ప్రభుత్వం | |
- చైర్పర్సన్ | ఎర్రగొల్ల మురళీధర్ యాదవ్ |
- వైస్ చైర్పర్సన్ | ఎండీ నయీముద్దిన్ |
వైశాల్యము | |
- మొత్తం | 28.81 km² (11.1 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 18,816 |
- పురుషుల సంఖ్య | 9,627 |
- స్త్రీల సంఖ్య | 8,711 |
పిన్ కోడ్ - 502313 | |
Area code(s) | టెలిఫోన్ కోడ్ - 08458 |
వెబ్సైటు: అధికార వెబ్ సైట్ |
చరిత్ర
మార్చుమేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న నర్సాపూర్, తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా ఏర్పడింది.[3]
భౌగోళికం
మార్చునర్సాపూర్ 28.81 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 17°44′10″N 78°16′52″E / 17.736°N 78.281°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 56 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రం మెదక్ నుండి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది.
జనాభా గణాంకాలు
మార్చు2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 18816 మంది కాగా, అందులో 9627 మంది పురుషులు, 8711 మంది మహిళలు ఉన్నారు. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 22 రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[4]
పౌర పరిపాలన
మార్చుపురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 15 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం ఎర్రగొల్ల మురళీధర్ యాదవ్ చైర్‌పర్సన్‌గా, ఎండీ నయీముద్దిన్ వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[5][6][7] వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.
వార్డు కౌన్సిలర్లు
మార్చు- దుర్గప్పగారి అశోక్ గౌడ్
- ఎర్రగోల్ల లత
- ఇస్రత్ సిద్దికా
- ఎరుకల యాదగిరి
- సంగసాని సురేష్
- ఎండి. నయీముద్దీన్ (వైస్ చైర్పర్సన్)
- గొల్ల రుక్కమ్మ
- పంబల్ల రామ్‌చందర్
- వంతేడు సునీత
- వనముల బుచేష్ యాదవ్
- గోద రాజేందర్
- చెలిమేటి లక్ష్మి
- ఎర్రగొల్ల మురళీధర్ యాదవ్ (చైర్పర్సన్)
- తంగేడిపల్లి సరిత
- పంబల్లా లలిత
మూలాలు
మార్చు- ↑ "Narsapur Municipality". narsapurmunicipality.telangana.gov.in. Archived from the original on 20 ఏప్రిల్ 2021. Retrieved 20 April 2021.
- ↑ Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 20 April 2021.
- ↑ నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 20 April 2021.
- ↑ "Basic Information of Municipality, Narsapur Municipality". narsapurmunicipality.telangana.gov.in. Archived from the original on 6 డిసెంబరు 2022. Retrieved 20 April 2021.
- ↑ "Council, Narsapur Municipality". narsapurmunicipality.telangana.gov.in. Retrieved 20 April 2021.[permanent dead link]
- ↑ సాక్షి, తెలంగాణ (27 January 2020). "తెలంగాణ: మున్సిపల్ చైర్మన్లు వీరే". Sakshi. Archived from the original on 27 January 2020. Retrieved 20 April 2021.
- ↑ నమస్తే తెలంగాణ, తెలంగాణ (27 January 2020). "ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల జాబితా." ntnews. Archived from the original on 3 March 2021. Retrieved 20 April 2021.
వెలుపలి లంకెలు
మార్చు- నర్సాపూర్ పురపాలక సంఘ అధికారిక వెబ్సైటు Archived 2021-04-20 at the Wayback Machine