నవరత్నాలు

(నవరత్నములు నుండి దారిమార్పు చెందింది)

నవరత్నములు అనగా తొమ్మిది రత్నములు అని అర్థం. ప్రాచీనకాలములో రాళ్ళలో తొమ్మిది పేరు గాంచిన రత్నాలని నవరత్నాలుగా వర్గీకరించారు.కాలక్రమములో, నవరత్నములు అన్న పదాన్ని తొమ్మిది సంఖ్యతో కూడిన విశేషమయిన సమూహాలకు లేదా వ్యక్తులకు గౌరవపూర్వకంగా వాడటం మొదలుపెట్టారు.

నవరత్నాలు పేర్లుసవరించు

నవరత్నాలు
ముత్యము
కెంపు
రత్నము
గోమేధికం
వజ్రం
పగడాలు
పుష్యరాగం
పచ్చ
నీలమణి

వీటిని కిరీటాలు, భుజకీర్తుల్లో ఎక్కువగా వాడినట్లు చరిత్ర చెపుతోంది.

వీటిన్నింటిని కలిపి నవరత్నాలు అని వ్యవహరిస్తారు.


విక్రమాదిత్యుని నవరత్నాలుసవరించు

ప్రాచీన భారతదేశ చరిత్రలో నవరత్నములు అనగానే గుర్తుకు వచ్చేది, చంద్రగుప్త విక్రమాదిత్యుని ఆస్థానములోని తొమ్మండుగురు కవులు. వీరు నవరత్నములుగా కీర్తింపబడ్డారు. వీరు,

అక్బరు నవరత్నాలుసవరించు

ఆధునిక నవరత్నములుసవరించు

భారత ప్రభుత్వం ప్రభుత్వరంగములో అత్యధిక ఉత్పాదన, పనితనంగల తొమ్మిది సంస్థలను నవరత్నములుగా వ్యవహరించినా, కాలక్రమములో వాటి సంఖ్యను తొమ్మిదిని మించి పెంచటం వల్ల ఇక వాటిని నవరత్నములు అని వ్యవహరించటంలో అర్థము లేదని వాడుకలో తగ్గింది..

రత్నాల పురాణ గాథసవరించు

విలువైన రాళ్ళు అనేవి అసలు ఎలా తయారయ్యాయో ఒక పురాణ గాథ ఉంది. ఒకనాడు బాల అనే రాక్షసి సంహారం జరిగింది. ఆ సంహారం దేవతా ప్రీతి కోసం చేశారు. బాలను సంహరిచగా విడివడిన అతని శరీర ముక్కలు వేర్వేరు రంగుల్లో మెరుస్తూ వెళ్ళీ అక్కడి దేవతా మూర్తులమీద పడ్డాయి. ఫలితంగా ఆ రాయి రంగు ఆ దేవతలకు వచ్చింది. మన వాళ్ళ దృష్టిలో ఆ రంగు పొందిన దేవతలే నవగ్రహాలు. ఆ రంగు రాయితో బంధం యేర్పడింది. ఆ విలువైన రాళ్లనే నవరత్నాలు అంటారు.

కాశ్మిక్ రంగుసవరించు

నవరత్నాలలో నిగూఢ కాంతి శక్తి ఉంటుంది. ఆయా గ్రహాల శక్తి ఈ రత్నాలకు అందించబడింది. ఈ గ్రహాల నుండి వెలువడుతున్న విద్యుత్ అయస్కాంత కాంతి తరంగాలను ఎప్పటికప్పుడు గ్రహిస్తుంటాయి. అలా గ్రహించిన తరంగాలను తిరిగి వెదజల్లుతూ ఆ రత్నాల సమీపంలో ఉన్న వారిపైన ప్రభావం చూపుతాయి. అయితే ఆ నవరత్నాలు బయటికి కనిపించే రంగు అవి కనిపించకుండ వెదజల్లే కాంతి తరంగాల రంగు ఒకే విధానమైనవి కావు. అంతర్లీనంగా వెదజల్లే కాంతిని కాశ్మిక్ రంగు అంటారు. ఉదాహరణకు టోపాజ్ బయటికి కనిపించే రంగు పసుపు పచ్చ కానీ అది కాశ్మిక్ రంగు నీలం. సఫైర్ నీలం రంగులో కనిపించినా దాని కాశ్మిక్ రంగు వైలట్. పగడపు రంగు ఎర్రని కాషాయం మిళితంగా కనిపించినా దాని కాశ్మిక్ రంగు పసుపు. వజ్రం తెల్ల రంగులో మెరుస్తున్నా దాని కాశ్మిక్ రంగు ఊదా. ముత్యం పాలనురుగులా మెరుస్తూ కనిపించినా దాని కాశ్మిక్ రంగు నారింజ. జిర్కాన్ రెడ్ బ్రౌన్ రంగులో ఉన్నా దాని కాశ్మిక్ రంగు మనుష్యుల కంటికి కనిపించని అతి నీలలోహిత . కేట్స్ ఐ బూడిద రంగులో ఉంటుంది కానీ దీని కాశ్మిక్ రంగు ఇన్ఫ్రా రెడ్ . అయితే రూబీకి ఎమరాల్డ్ కి అసలు రంగు కాశ్మిక్ రంగు ఒక్కటే. రూబీ ఎరుపు రంగులో ఎమరాల్డ్ ఆకుపచ్చ రంగులో ఉంటాయి.

నవరత్నాల మేలుసవరించు

ఈ నవరత్నాలలో ఏది ధరించినా అందులో దాగి వున్న కాశ్మిక్ శాక్తి ఆ మనిషిని అందించబడుతుంది. నవరత్నాలన్నీ కలిగిన నగలు ధరిస్తే అన్ని గ్రహాల ప్రభావాల నుండి మేలు పొందగలుగుతాడు. బంగారు సూర్యగ్రహ లోహం. అందుకే బంగారంలో ఈ నవరత్నాలను ధరించడం ఒక ఆరోగ్యకర అమర్గమనే నమ్మకం పెరిగింది. నవరత్నాలతో కూడిన నగలు తయారుచేయడం ఒక ప్రత్యేకక కళగా రాజులు ప్రోత్సహించారు. నవరత్నాలు పొదిగిన నగలు చెవులకీ, చేతులకీ మెడలోనూ ధరించేదిగా తయారు చేసేవారు.వీటి అమరిక నవగ్రహాలు. ఆ గ్రహానికి చెందిన రత్నానికి తగినట్టుగా చేసేవారు. ఆ నవగ్రహాలను ధరించుటమంటే ఆ గ్రహదేవతలందరికీ శాంతి చేయించటమే. ఆ దేవతల కరునా కటాక్షాలు శాశ్వతంగా ధరించే వారి మీద ఉంటాయి. నవరత్నాలు ఉన్న నగలు ధరించిన వారికి జీవన విధానం కూడా నిర్దేశించారు. ఎంతో నిష్టాగరిష్ఠంగా ఉండాలిచెడు ఆలోచనలు రానివ్వకూడదని విధంగా చెడ్డ పనులు చేయకుండా జీవితం సాగించాలి. లేకుంటే ఆ నవరత్న ఫలితం వికటిస్తుందనే నమ్మకం ఉంది. దీని వలన మనిషి నడవడిక క్రమ పద్ధతిలో ఉంటుంది.

చదరపు పద్ధతిలోసవరించు

మెడలో వేసుకొనే నగలలో అయినా చేతికి ధరించేవి అయినా నవరత్నాలను పొదగడం ఒక చదరపు పద్ధతిలో ఉంటాయి. అయితే తప్పనిసరిగా మధ్యలో రూబీ ఉండాలి. రూబీ సూర్యగ్రహరత్నం. ఈ విశ్వానికి సూర్యుడు కేంద్రం కాబట్తి ఆ గ్రహానికి ప్రాతినిధ్యం వహించే రూబీని మధ్యలో పొదుగుతారు.

శుక్ర గ్రహ రత్నమైన వజ్రాన్ని రూబీకి తూర్పుగా, శని గ్రహరాయి సఫైర్ ని పశ్చిమాన, కేతు గ్రహ రత్నామైన కేట్స్ ఐని ఉత్తరం వైపున, అంగారకుని రత్నమైన పగడాన్ని ఈశాన్య భాగాన, చంద్రుని రత్నమైన ముత్యం ఆగ్నేయ భాగాన, రాగు గ్రహ రత్నమైన జిర్కాన్ ని నైరుతి మూలన, బృహస్పతి గ్రహ రాయి టోపాజ్ ని వాయువ్య మూలన పొదుగుతారు.

నలు చదరంగా, దీర్ఘ చతురస్రాకారంగా కాక ఇతర రూపాలలో కూడా నగలు తయారుచేస్తారు. అయితే సూర్య గ్రహ రత్నమైన రూబీ మాత్రం తప్పనిసరిగా అమధ్యలో ఉండాల్సిందే. బ్రాన్‌లైట్స్ లో నవరత్నాలు వరుసగా ఒకదానిపక్కన మరొకటి ఏర్పాటు చేసినప్పుడు కూడా రూబీ మధ్యలో ఉండేలా చూస్తారు.

ధరించండంలో జాగ్రత్తలుసవరించు

నవరత్నాల నగలు తయారీకి ఉపయోగించే అన్ని రాళ్ళు ఒకే సైజులో ఉండాలి. అవి కూడా స్వచ్ఛమైనవి కావాలి. నాసిరకం రత్నాలు వాడితే సత్ఫలితాలు రాకపోగా చెడు ఫలితాలను చవిచూడాల్సి ఉంటుంది. మగవారికోసం నవరత్నాలు పొదిగిన ఉంగరాలు తయారుచేస్తుంటారు. పన్నెండు వరుసలలో నవరత్నాలను వాడి 108 రత్నాల ఉంగరాలను తయారుచేసే పద్ధతి దక్షిణాది రాష్ట్రాలలో ఉంది.

నవరత్నాలలో మేలు ఉన్నప్పటికీ వాటిని ధరించటంలో కొన్ని నియమాలు, జాగ్రత్తలు వహించాలంటుంది శాస్త్రం. నవరత్న శాస్త్రాన్ని నమ్మితే ఆ పద్ధతులను పాటించాల్సిందే. నవరత్న ఎంపిక దగ్గర నిపుణులను సంప్రదించాలి. ఒక్కొక్క రత్నానికి ఒక్కొక్క పద్ధతిలో ధారణకు సిద్ధం చేస్తారు.

పూజ ముగించిన తరువాత ఖగోళ శాస్త్రాన్ని చదివిన పండితులు సూచించిన సమయంలో మాత్రమే నగల తయారీకి ఇవ్వాలి. ఒక్కొక్క తరహా రత్నానికి ఒక్కొక్క ముహూర్త సమయముంటుంది. అదే విధంగా తయారైన నగను తిరిగి ఒక శుభ ముహూర్త సమయంలో మాత్రమే తిరిగి వేసుకోవాలి. నవరత్నాల మీద నమ్మకం మహారాజులనుండి సామాన్యుల వరకు అన్ని వర్గాల వారికీ ఉంది.

చర్చలుసవరించు

నవరత్నాలు ఏవేమిటి? అన్న ప్రశ్న మీద చర్చలు జరిగేయి. విలువైన రత్నాలు తొమ్మిది కంటే ఎక్కువే ఉన్నాయి. తరువాత ఏ తెలుగు పేరుకి ఏ ఇంగ్లీషు పేరు సరి అయిన ఉజ్జీ అవుతుందో నిర్ణయించటానికి వీలు లేకుండా నిఘంటువులు వేర్వేరు అర్ధాలు ఇచ్చేయి.

ఐతే ఇది శాస్త్రమా లేదా అందరిచేత అంగీకరించబడిందా అనేది వివాదస్పదమే. దీనికి అనూకూలంగా ఎన్ని సక్ష్యాలున్నాయో అంతే బలమైన సాక్ష్యాలు వ్యతిరేకంగా ఉన్నాయి. నవరత్న ప్రభావాలను అంగీకరించడం, ఆ గ్రహానికి తగిన నగ చేయించుకోవడం, ధరించడం వ్యక్తిగత విశ్వాసానికి వదిలేయాల్సిందే.

మూలాలుసవరించు

ఇంకా చూడండిసవరించు

వెలుపలి లెంకెలుసవరించు