నవరాత్రి (సినిమా)
నవరాత్రి ఏప్రిల్ 22, 1966లో విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] తాతినేని రామారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి ప్రధానపాత్రల్లో నటించగా, తాతినేని చలపతిరావు సంగీతం అందించారు. తమిళంలో సంచలన విజయం సాధించిన నవరాత్రి (நவராத்திரி, 1964) దీనికి మాతృక. తమిళచిత్రంలో హీరోగా వేసిన శివాజీ గణేశన్ ఈ ఒకే చిత్రంలో 9 పాత్రలు పోషించి సంచలనం సృష్టించారు.
నవరాత్రి (1966 తెలుగు సినిమా) | |
చందమామ లో చలనచిత్ర ప్రకటన | |
---|---|
దర్శకత్వం | తాతినేని రామారావు |
నిర్మాణం | అనుమోలు వెంకట సుబ్బారావు |
రచన | ముళ్ళపూడి వెంకటరమణ |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, నల్లా రామమూర్తి, సీతారాం, నిర్మల, చలం, జగ్గయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు, రేలంగి, రమణారెడ్డి, రాజబాబు, చదలవాడ, హేమలత, ప్రభాకరరెడ్డి, కుట్టి పద్మిని, ఋష్యేంద్రమణి, గిరిజ, ఛాయాదేవి, జె.జయలలిత, కాంచన, సూర్యకాంతం |
సంగీతం | తాతినేని చలపతిరావు |
నేపథ్య గానం | ఘంటసాల, పి. సుశీల, జమునారాణి |
ఛాయాగ్రహణం | పి.ఎన్. సెల్వరాజ్ |
నిర్మాణ సంస్థ | ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
నటవర్గం
మార్చుసాంకేతికవర్గం
మార్చుదర్శకత్వం: తాతినేని రామారావు నిర్మాణం: అనుమోలు వెంకట సుబ్బారావు రచన: ముళ్ళపూడి వెంకటరమణ సంగీతం: తాతినేని చలపతిరావు నేపథ్య గానం: ఘంటసాల, పి. సుశీల, జమునారాణి ఛాయాగ్రహణం: పి.ఎన్. సెల్వరాజ్ నిర్మాణ సంస్థ: ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్
పాటలు
మార్చు- అద్దాల మేడఉంది ( పిచ్చి ఆసుపత్రి పాట) - పి. సుశీల, బి. వసంత, కె. జమునారాణి బృందం , రచన: శ్రీ. శ్రీ
- ఏం పిల్లో ఎక్కడికి పోతావు ఏం పిల్లా ఏటి అలా చూస్తావు - ఘంటసాల, సుశీల బృందం - రచన: కొసరాజు
- చెప్పనా కథ చెప్పనా నిన్న కథ చెప్పనా కన్న కథ చెప్పనా - సుశీల, రచన: దాశరథి
- నవరాత్రి శుభరాత్రి నెలరాజు చిగురించే కలలన్నీ ఫలియించే - సుశీల బృందం, రచన: దాశరథి
- నిషాలేని నాడు హుషారేమి లేదు ఖుషీ లేని నాడు మజాలేనే లేదు - ఘంటసాల - రచన: దాశరథి కృష్ణమాచార్య
- రాజు వెడలే సభకూ (వీధి భాగవతం) - ఘంటసాల, జయదేవ్, సావిత్రి, ఎస్. ఎస్. కృష్ణన్, నల్ల రామమూర్తి, సీతారాం, రచన:కొసరాజు.
మూలాలు
మార్చు- ↑ మద్రాసు ఫిలిం డైరీ. 1966లో విడుదలైనచిత్రాలు. గోటేటి బుక్స్. p. 18.
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుంచి.
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.