వినోదిని (నటి)
వినోదిని భారతీయ నటి. ఆమె తమిళం, మలయాళం, కన్నడ చిత్రాలతో పాటు తమిళ టెలివిజన్ ధారావాహికలలో కూడా నటిస్తుంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటనా జీవితాన్ని ప్రారంభించిన ఆమె కన్నడ చిత్రాలలో శ్వేతగా గుర్తింపు పొందింది.[1]
వినోదిని | |
---|---|
జననం | లక్ష్మి కె. ఆర్. |
ఇతర పేర్లు | శ్వేత, బేబీ లక్ష్మి, మింటా |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1982 – ప్రస్తుతం |
కెరీర్
మార్చువినోదిని చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన నటనా జీవితాన్ని ప్రారంభించింది,[1] తమిళ చిత్రాలలో ప్రధాన పాత్రలు పోషించడానికి ముందు ఆమె మనల్ కయిరు, పుతియా సగప్తం, మన్నుక్కుల్ వైరం వంటి చిత్రాలలో సహాయపాత్రలలో నటించింది. 1992లో, ఆమె బాలు మహేంద్ర దర్శకత్వంలో వన్న వన్న పౌక్కల్‌లో నటించింది. ఈ చిత్రం విమర్శనాత్మకంగా, వాణిజ్యపరంగా విజయవంతమైంది. తమిళంలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.[2]
అదే సంవత్సరం, ఆమె సూర్య మానసంతో మలయాళ సినిమా, చైత్రద ప్రేమాంజలితో కన్నడ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది, అయితే అక్కడ ఆమె శ్వేతగా వచ్చింది.[3][4] ఈ రెండు సినిమాలూ విజయాలు సాధించాయి. బాలు మహేంద్ర మరుపదియుమ్, విసు పట్టుకోట్టై పెరియప్ప, రామ నారాయణన్ వంగ భాగస్వామి వంగా, రెండు కె. ఎస్. రవికుమార్ చిత్రాలైన సూర్యన్ చందిరన్, ముత్తుకులిక వారియలతో సహా పలు తమిళ చిత్రాలలో నటించింది.
1990ల మధ్య నాటికి, ఆమె ప్రధాన పాత్రలు పోషించడం కొనసాగించినా చివరిలో తమిళ చిత్రాలలో ఆమె చిన్న చిన్న సపోర్టింగ్ రోల్స్, అతిథి పాత్రలకే పరిమితమైంది. ఆమె చిత్రాలలో ప్రవీణ్ గాంధీ యాక్షన్ చిత్రం రచ్చగన్, సుందర్.సి కామెడీ చిత్రం ఉనక్కగా ఎల్లం ఉనక్కగా, ఎన్. మాతృభూతం పుతిర పునీతమా ఉన్నాయి.
ఆ తరువాత వినోదిని టెలివిజన్ ధారావాహికలలో నటించడం ప్రారంభించింది, అవి డ్రామా సిరీస్ చితి, అగల్ విలక్, కన్నడి కథవుగల్, క్రేజీ మోహన్ హాస్య ధారావాహిక విడత సిరిప్పు. అంతేకాకుండా, ఆమె ఎనిమిదేళ్లపాటు టెలివిజన్ షోను నిర్వహించింది.[5][6]
ఫిల్మోగ్రఫీ
మార్చుYear | Film | Role | Language | Notes |
1982 | మనల్ కయీరు | తమిళం | బేబీ లక్ష్మిగా | |
1985 | పుతియా సగప్తం | తమిళం | ||
1986 | మన్నుక్కుల్ వైరం | తమిళం | బేబీ లక్ష్మిగా | |
1987 | నాయకన్ | తమిళం | బేబీ లక్ష్మిగా / నాయకుడు గా తెలుగులో | |
1991 | చితిరై పూక్కల్ | తమిళం | ||
1991 | ఆత అన్ కోయిలీలే | తమిళం | ||
1991 | ఎన్ ఆసై రసతి | తమిళం | ||
1992 | వన్నా వన్నా పూక్కల్ | తమిళం | ||
1992 | అభిరామి | తమిళం | ||
1992 | అన్నై వాయల్ | తమిళం | ||
1992 | కిజక్కు వీధి | తమిళం | ||
1992 | సూర్య మానసం | మలయాళం | ||
1992 | చెవాలియర్ మైఖేల్ | మలయాళం | ||
1992 | చైత్రదా ప్రేమాంజలి | కన్నడ | ||
1993 | మరుపడియుం | తమిళం | ||
1993 | సూర్యన్ చంద్రన్ | తమిళం | ||
1993 | ఆత్మ | తమిళం | రత్నగిరి అమ్మోరు గా తెలుగులో | |
1993 | గెజ్జె నాడ | కన్నడ | ||
1993 | పొన్ను చామీ | మలయాళం | ||
1994 | వంగ భాగస్వామి వంగా | తమిళం | ||
1994 | ఎన్ రాజాంగం | తమిళం | ||
1994 | చిన్న మేడమ్ | తమిళం | ||
1994 | పట్టుకోట్టై పెరియప్ప | తమిళం | ||
1994 | జన్ కోడీశ్వరన్ | మలయాళం | ||
1995 | కల్యాణం | తమిళం | ||
1995 | ఇళవరసి | తమిళం | స్పెషల్ అప్పీయరెన్స్ | |
1995 | ముత్తుకులిక వారియాల | తమిళం | ||
1995 | తొండన్ | తమిళం | ||
1996 | వీట్టుకుల్లె తిరువిళ | తమిళం | ||
1996 | అజకియ రావణన్ | మలయాళం | ||
1996 | హెత్తవారు | కన్నడ | ||
1996 | కర్పూరద గొంబే | కన్నడ | ||
1996 | మినుగు తారే | కన్నడ | ||
1996 | ముద్దిన అలియా | కన్నడ | ||
1997 | నోడు బా నమ్మూరా | కన్నడ | ||
1997 | బడుకు జటకా బండి | కన్నడ | ||
1997 | లక్ష్మీ మహాలక్ష్మి | కన్నడ | ||
1997 | రచ్చగన్ | తమిళం | రక్షకుడు గా తెలుగులో | |
1997 | తాడయం | తమిళం | ||
1998 | అగ్ని సాక్షి | కన్నడ | ||
1999 | ఉనక్కగా ఎల్లం ఉనక్కగా | తమిళం | ||
2000 | పుతిర పునీతమ | తమిళం | ||
2001 | కోటిగొబ్బా | కన్నడ | ||
2001 | నమ్మ సంసారం ఆనంద సాగర | కన్నడ | ||
2004 | కుటుంబ | కన్నడ | ||
2005 | కస్తూరి మాన్ | తమిళం | ||
2008 | పిరివోం సంతిప్పోం | తమిళం | ||
2011 | సాధురంగం | తమిళం | ||
2017 | కొంజాం కొంజాం | తమిళం | ||
2021 | కాల్స్ | తమిళం |
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Comic interlude". The Hindu. 17 April 2004. Archived from the original on 7 November 2004.
- ↑ "Young and mature at once". The Hindu. 15 February 2002. Archived from the original on 25 March 2002.
- ↑ "Raghuveer passes away!". Sify. Archived from the original on 28 July 2021.
- ↑ "Chaitrada Premanjali actor Raghuveer no more". The Times of India.
- ↑ "Kannaadi Kadhavugal". The Hindu.
- ↑ "Crazy robot". The Hindu. 28 March 2004. Archived from the original on 16 October 2014.