నిరోద్ రంజన్ "పుటు" చౌదరి (1923 మే 23 - 1979 డిసెంబరు 14) భారతీయ క్రికెట్ ఆటగాడు. అతన్ని పుటు చౌదరి అని కూడా పిలుస్తారు.

నిరోద్ చౌదరి
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
నిరోద్ రంజన్ చౌదరి
పుట్టిన తేదీ(1923-05-23)1923 మే 23
జంషెడ్‌పూర్, బీహార్
మరణించిన తేదీ1979 డిసెంబరు 14(1979-12-14) (వయసు 56)
దుర్గాపూర్, పశ్చిమ బెంగాల్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుRight arm ఆఫ్ బ్రేక్,
కుడిచేతి మీడియం pace
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 50)1949 జనవరి 27 - వెస్టిండీస్ తో
చివరి టెస్టు1951 నవంబరు 2 - ఇంగ్లాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు First-class
మ్యాచ్‌లు 2 58
చేసిన పరుగులు 3 419
బ్యాటింగు సగటు 3.00 7.22
100లు/50లు 0/0 0/
అత్యధిక స్కోరు 3* 30*
వేసిన బంతులు 516 10,016
వికెట్లు 1 200
బౌలింగు సగటు 205.00 25.14
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు - 10
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు - 2
అత్యుత్తమ బౌలింగు 1/130 7/79
క్యాచ్‌లు/స్టంపింగులు 0/- 22/-
మూలం: CricketArchive

మీడియం పేస్ బౌలరైన పుటు చౌదరి, కెరీర్‌^ను అద్భుతంగా ప్రారంభించాడు. రంజీ ట్రోఫీలో బీహార్ తరపున ఆడిన అతను తన మొదటి మూడు మ్యాచ్‌లలో 11, 9, 10 వికెట్లు తీశాడు. 1944-45లో, అతను ఈడెన్ గార్డెన్స్‌లో బెంగాల్ గవర్నర్స్ XIపై వినూ మన్కడ్, ముస్తాక్ అలీ, లాలా అమర్‌నాథ్‌ల వికెట్లు తీసి హ్యాట్రిక్ సాధించాడు. అతను బీహార్‌ జట్టుతో తన కెరీర్ ప్రారంభించి, 1944లో బెంగాల్‌ జట్టుకు వెళ్లాడు. అక్కడే అతను తన క్రికెట్‌లో ఎక్కువ భాగం ఆడాడు. 1955 లో, తన కెరీర్ చివరిలో బీహార్‌కు తిరిగి వచ్చాడు.

అతను 1948/49లో తన తొలి మ్యాచ్‌ మద్రాస్‌లో, వెస్టిండీస్‌తో ఆడాడు. అందులో ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు. తన ఐదు మునుపటి ఇన్నింగ్స్‌లలో సెంచరీలు చేసి, ఈ మ్యాచ్‌లో 90కి చేరుకున్న ఎవర్టన్ వీక్స్‌ను అద్భుతంగా రనౌట్ చేశాడు. [1][permanent dead link]. వీక్స్ వినూ మన్కడ్‌ను గల్లీకి కట్ చేసి, పరుగెత్తడం ప్రారంభించాక, నాన్-స్ట్రైకరు అతన్ని వెనక్కి పంపేసాడు. చౌదరి బంతిని వికెట్ కీపర్ ప్రొబిర్ సేన్‌కి పంపగా అతడు వీక్స్‌ను రనౌట్ చేసాడు.


1951లో అతను, ఇంగ్లాండ్‌ లోని ఆల్ఫ్ గోవర్స్ క్రికెట్ స్కూల్‌లో కొంతకాలం గడిపాడు. అతను 1951-52లో స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఒక టెస్ట్ ఆడాడు. 1952లో టెస్టులో ఆడకుండానే ఇంగ్లాండ్‌లో పర్యటించాడు. అతని బౌలింగ్ యాక్షను కొన్నిసార్లు, ముఖ్యంగా అతను వేగంగా బౌలింగు చేస్తున్నప్పుడు, అనుమానాస్పదంగా పరిగణించబడింది. [1]

అతని కోసం ఒక బెనిఫిట్ మ్యాచ్‌ను కేటాయించినప్పటికీ, అది జరగలేదు. తర్వాతి సంవత్సరాల్లో దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్‌లో కోచ్‌గా పనిచేశాడు. అతని టెస్ట్ బౌలింగు సగటు 205.00. సునీల్ గవాస్కర్ సాధించిన 206.00 తర్వాత అతనిదే భారతదేశ బౌలర్లలో అత్యంత చెత్త సగటు.[2]

మూలాలు

మార్చు
  1. Exclusion of Chowdhury in Test Team", Indian Express, December 26, 1951
  2. Cricinfo profile