నువ్వు వస్తావని

నువ్వు వస్తావని 2000లో వి. ఆర్. ప్రతాప్ దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం. ఇందులో అక్కినేని నాగార్జున, సిమ్రాన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఎస్. ఎ. రాజ్ కుమార్ రూపొందించిన ఈ చిత్ర సంగీతం మంచి విజయాన్ని సాధించింది.

నువ్వు వస్తావని
దర్శకత్వంవి. ఆర్. ప్రతాప్
నిర్మాతఆర్. బి. చౌదరి
తారాగణంఅక్కినేని నాగార్జున ,
సిమ్రాన్
సంగీతంఎస్. ఎ. రాజ్‌కుమార్
నిర్మాణ
సంస్థ
సూపర్ గుడ్ ఫిల్మ్స్
విడుదల తేదీ
2000
భాషతెలుగు

చిన్ని (అక్కినేని నాగార్జున ) ఒక మెకానిక్. చిన్న షెడ్డులో స్నేహితులతోబాటు నివసిస్తుంటాడు. ఇతను మంచి గాయకుడు కూడా. స్వంత వాద్యబృందంతో ప్రదర్శనలు ఇస్తుంటాడు. ఇందు(సిమ్రాన్) విద్యార్ధిని. ప్రత్యక్షంగా చిన్నిని చూడలేకపోయినా అతని గాత్రాన్ని అభిమానిస్తుంటుంది. ఒక సారి చిన్ని వలన ఆమె అంధురాలౌతుంది. కానీ చిన్ని ఆమెను చేరదీసి ఉన్నత విద్యలు చదివించి కలెక్టరు చేస్తాడు. తన మూత్రపిండం అమ్మి ఆమె చూపును తిరిగి తెప్పిస్తాడు. కానీ చిన్నిని ప్రత్యక్షంగా చూడని ఇందుకు చిన్నిపై ద్వేషం ఉంటుంది. చివరికి చిన్నిని గుర్తుపట్టి అపార్థాలు దూరమై అందరూ దగ్గరౌతారు.

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

పాటలు

మార్చు
  • రైలుబండిని నడిపేది పచ్చ జెండాలే.. బ్రతుకు బండిని నడిపేది పచ్చనోటేలే (గానం: శంకర్ మహదేవన్)రచన: చంద్రబోస్.
  • పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి (గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం) రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
  • కలలోనైన అనుకోలేదే నువు వస్తావని (గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం) రచన: చంద్రబోస్.
  • కొమ్మా కొమ్మా విన్నావమ్మా కోయిల వచ్చింది (గానం: హరిహరన్) రచన: ఇ. ఎస్. మూర్తి.
  • నీవే దేవుడివి నల్లనయ్యా , సుజాత మోహన్, సుద్దాల అశోక్ తేజ.
  • మేఘమై , రాజేష్ కృష్ణన్, సుజాత మోహన్ , రచన: పోతుల రవికిరణ్.
  • పాటల పల్లకిలో ,( లేడీ వాయిస్) చిత్ర , రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి.

బయటిలంకెలు

మార్చు