నెమురుగోమ్ముల సుధాకర్ రావు

నెమురుగోమ్ముల సుధాకర్ రావు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన రాజకీయనాయకుడు. ఆయన నెమురుగోమ్ముల యెతిరాజారావు,నెమురుగోమ్ముల విమలాదేవి గార్లు కుమారుడు.

నెమురుగోమ్ముల సుధాకర్ రావు

నియోజకవర్గము పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ టీఆర్ఎస్
నివాసము వడ్డెకొత్తపల్లి కొడకండ్ల వరంగల్ జిల్లా

సేవలుసవరించు

శ్రీ నెమురుగోమ్ముల డా: సుధాకర్ రావు గారు పాలకుర్తి నియోజకవర్గం తెలుగుదేశం శాసనసభ్యులుగా 1999 నుండి 2004 వరకు ఉన్నారు. 1969 విద్యార్థిగా తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసి జనగామలో అరెస్టు అయ్యారు. తెలంగాణ కోసం 2010 తర్వాత ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ లోకి వచ్చారు. డాక్టర్ గా 1975 నుండి సామాన్య జనానికి వైద్యసేవలందించారు. ఆయన ప్రముఖుల నుండి అతి సామాన్యుల వరకు నియోజకవర్గంలో వేలాదిమందికి వైద్యసేవలు, సహాయ సహకారాలందించారు. శాసనసభ్యునిగా సుమారు కోట్ల రూపాయలతో పనులు చేయించారు.

శాసనసభ్యునిగాసవరించు

శాసనసభ్యునిగా ఆయన తన నియోజకవర్గంలో అనేక గ్రామాలకు తారూ రోడ్లు వేయిచారు. చిన్న గ్రామాలకు మట్టి,మెటల్ రోడ్లను వేసి రవాణా వసతి కల్పించారు. ఆయన ముఖ్యమైన రోడ్లకు జన్మభూమి, జడ్.పి.టి.సి, ఎం.పి.టి.సి నిధులతో సి.సి. రోడ్లు వేయించారు. అనేక మంది నిరుపేదలకు గృహాలను అందించారు. నియోజకవర్గంలో 35 ఒవర్ హెడ్ ట్యాంకులు తెప్పించారు. నియోజకవర్గంలో చేసిన పనులలో ముఖ్యమైనది శ్రీరాంసాగర్ కాలువ మైలారం రిజ్వర్వాయర్ నుండి ఒక 1 km కు కోటి 50 లక్షలతో 35KMలు పాలకుర్తి నియోజకవర్గంలోతీసుకురావడం. దీనివలన (ఎడునూతుల) కొడకండ్ల రిజ్వర్వాయర్,మరి కొన్ని చెరువులు నింపడానికి ఉపయెగపడుచున్నది.

యం.యల్.ఎ గా ఓటమిసవరించు

2014 సుధాకర్ రావు గారు ఓటమిచెందారు. టీ.ఆర్.ఎస్ యం.యల్.ఎగా 2004లో శ్రీ దుగ్యాల శ్రీనివాసరావు గెలిచారు. 2014లో తెలంగాణగా రాష్ట్రం విడిపోయింది. యం.యల్.ఎగా 2014 పోటీలో శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు గెలిచారు. శ్రీనివాసరావు గారు, సుధాకర్ రావు గారు ఓటమిచెందారు. పోటీలో 3వ స్ధానం లోకి పడిపోయారు సుధాకర్ రావు గారు . కానీ తెలంగాణలో టీ.ఆర్‌.ఎస్ ప్రభుత్వం ఏర్పడింది.

మూలాలుసవరించు

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1999) 263.

ఇతర లింకులుసవరించు