న్యాయం కావాలి

న్యాయం కావాలి 1981 లో ఎ. కోదండరామి రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో చిరంజీవి, రాధిక ప్రధాన పాత్రలు పోషించారు.

న్యాయం కావాలి
(1981 తెలుగు సినిమా)
Nyayamkavali.jpg
దర్శకత్వం ఎ.కోదండరామిరెడ్డి
కథ డి. కామేశ్వరి నవల "కొత్తమలుపు"
తారాగణం శారద ,
చిరంజీవి,
రాధిక,
జగ్గయ్య
సంగీతం కె. చక్రవర్తి
సంభాషణలు సత్యానంద్
నిర్మాణ సంస్థ శ్రీక్రాంతి చిత్ర
భాష తెలుగు

కథసవరించు

బెంచి గుమాస్తా విశ్వనాథం కూతురు భారతి చూడముచ్చటగా ఉంటుంది. లాయర్ దయానిధి కొడుకు సురేష్ ఆ అమ్మాయిని చూసి, వెంటబడి, ప్రేమించినట్లు నటించి, ఆ అమ్మాయి చేత ప్రేమింపజేసుకుంటాడు. అతడిది నిజమైన ప్రేమ అని నమ్మిన భారతి అతడికి మనసుతో పాటు తనువు కూడా అర్పిస్తుంది. తల్లిదండ్రుల మాటలను కూడా లెక్కచేయదు. నెలతప్పుతుంది. తీరా పెళ్లిమాట ఎత్తితే సురేష్ నవ్వేస్తాడు. ప్రేమ వేరని, పెళ్లి వేరని అంటాడు. భారతి లాయర్ దయానిధి వద్దకు వెళ్ళి నిలదీస్తుంది. దయానిధి ఆమెను అవమానిస్తాడు. అబార్షన్ చేయించుకోమని తండ్రి ఇచ్చిన సలహాను భారతి త్రోసిపుచ్చుతుంది. తనను మోసం చేసిన సురేష్‌ను కోర్టుకు ఈడ్చి నవ్వులపాలు చేయాలని నిశ్చయించుకుని లాయర్ శకుంతల దగ్గరకు వెళుతుంది. లాయర్ శకుంతల భారతి తరఫున కోర్టులో వాదిస్తున్న సమయంలో ఒక కొత్త సంగతి బయటపడుతుంది[1].

నటీనటులుసవరించు

సాంకేతికవర్గంసవరించు

పాటలుసవరించు

  • అమ్మో నాకు భయం
  • ఈరోజే ఆదివారము
  • బుడి బుడి బిడియంగా
  • న్యాయం కావాలి స్త్రీలకు న్యాయం జరగాలి

మూలాలుసవరించు

  1. వి.ఆర్. (24 May 1981). "చిత్రసమీక్ష: న్యాయం కావాలి". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 68, సంచిక 50. Retrieved 11 February 2018.[permanent dead link]

బయటిలింకులుసవరించు