గోదావరి నదీతీరం పవిత్ర దేవాలయాలకు నిలయం. పంచారామాలు అందరికీ తెలిసినవే. అదేవిధంగా పంచ కేశవాలయాలు ఈ పరీవాహక ప్రాంతంలో ప్రసిద్ధిపొందాయి. ఇవి తణుకు, మండపాక, కొఠాలపర్రు, ర్యాలి, వాకతిప్ప లలో ఉన్నాయి.

తణుకు పెరవలి రోడ్డులో కల కేశవస్వామి దేవాలయం

సంక్షిప్తంగా ఆలయాల చరిత్ర

మార్చు

తణుకు

మార్చు

స్థల పురాణాల ప్రకారం ప్రస్తుత తణుకు ప్రాంతం అసురుల (రాక్షసులు) రాజైన తారకాసురుని రాజ్య రాజధానిగా చెప్పబడుతుంది. పరిసర ప్రాంతాలలో ఈ కథనానికి సంబంధించిన కొన్ని చారిత్రక ఆధారాలు లభ్యమైయ్యాయి. ఇక్కడ కల కేశవస్వామి వారి దేవాలయం బహుళ ప్రసిద్దం.

కొఠాలపర్రు

మార్చు
 
కేశవస్వామి వారి దేవాలయం

ఇక్కడ ఆలయంలోని మూర్తిని పరాసర మహర్షి ప్రతిష్ఠించినట్టుగా చెపుతారు. తదనంతరం కాలంలో వరదలు ఆ ప్రాంతాన్ని ముంచెత్తి ఆలయం కొట్టుకొనిపోయింది. ఆ ప్రాంతమంతా అడవిగా మారింది. ఇప్పటికి 2020 నాటికి పూర్వం 250 సంవత్సరాల క్రితం వంగపురి సీతారామాచార్యులు పాలకొల్లు ప్రాంతానికి తహసిల్దారుగా వచ్చాడు. ఇతని ధర్మపత్ని లక్ష్మీనర్సమ్మ కేశవుని భక్తురాలు. ఒకనాడు కేశవుడు ఆమెకి కలలో కనిపించి సమీపంలోని అడవిలో ఒకచోట భూమిలో తన విగ్రహం వుందని వెదికితీసి ప్రతిష్ఠించమని చెపుతాడు. ఆప్రాంతంలో తవ్వించినా విగ్రహం దొరకలేదు. కానీ అదే కల ఆమెకు పదే పదే రావడంతో ఆమె మాట కాదనలేక తిరిగి మరింత లోతుగా తవ్వించగా విగ్రహం దొరికింది. భర్త తహసీల్దారు దేవాలయం కట్టించి విగ్రహ ప్రతిష్ఠ చేయిస్తాడు. నిత్య పూజలకై లక్ష్మీనరసమ్మ తనకున్న ఆస్తి, బంగారం స్వామికి కైంకర్యం చేసింది. కేశవ భక్తులైన ఆచార్యులవారి కుమారుల్లో ఒకరు 70 ఎకరాల ఆస్తిని స్వామిపేర సమర్పించారు.

ర్యాలి

మార్చు

ఈ గ్రామములో ప్రసిద్ధి చెందిన జగన్మోహిని కేశవ స్వామి దేవాలయం ఉంది.[1] వసిష్ఠ, గౌతమి అనే గోదావరి ఉప పాయల మధ్య ఉంది. ఇక్కడి విశేషం శ్రీ జగన్మోహిని కేశవ స్వామి, శ్రీ ఉమా కమండలేశ్వర స్వామి వారు ర్యాలి ప్రధాన రహదారికి ఒకరికొకరు ఎదురెదురుగా ఉండడం. జగన్మోహిని అవతార సమయంలో మహేశ్వరుడు జగన్మోహినిని చూసి మోహితుడై ఆమె వెంట పడగా వారి సంభోగ ఫలితంగా అయ్యప్ప స్వామి జన్మిస్తాడు. మోహినీ స్వరూపుడైన శ్రీ మహావిష్ణువు కొప్పు నుంచి ఒక పుష్పం క్రింద పడుతుంది. ఈ పుష్పం క్రిందపడిన ప్రదేశమే ఇప్పటి ర్యాలి (ర్యాలి అంటే పడడం అని అర్థం) అని చెబుతారు.

11 వ శతాబ్దంలో ఈ ప్రాంతానికి అప్పటి చోళ రాజా విక్రమ దేవుడు వేటకై వచ్చి అలసి ఒక పెద్ద పొన్నచెట్టు క్రింద సేద తీరి నిద్రపోతాడు. మహావిష్ణువు కలలో కనిపించి రథం మేకు క్రింద పడిన ప్రదేశం లోని భూగర్భంలో తన క్షేత్రం ఉందని చేపుతాడు. ఆ మహారాజు మహావిష్ణువు చెప్పినట్లు ఆ ప్రదేశాన్ని త్రవ్వించగా జగన్మోహిని కేశవ స్వామి విగ్రహం బయట పడుతుంది. అక్కడ ఆ మహారాజు ఒక దేవాలయాన్ని నిర్మిస్తాడు. 1936 సంవత్సరంలో ఈ గుడికి ప్రాకారాలు నిర్మించబడ్డాయి.

వకతిప్ప

మార్చు

ఈ గ్రామం రామచంద్రాపురం, రావులపాలెం మధ్యలో వకతిప్ప ప్రదేశంలో వున్న క్షేత్రం. ఇక్కడ వెంకటేశ్వరస్వామి వారి దేవాలయ విశాల ప్రాంగణంలో కేశవుడు, జనార్ధనుడు కలసి వున్న దేవాలయ ద్వయం ఉంది. రావులపాలెం నుండి ఒకే ఒక బస్సు ఉంది. పసలపాడులో దిగి లోపలికి 18 కి.మీ. దూరంలో వున్న వాకతిప్ప గ్రామానికి ప్రైవేటు వాహనంలో వెళ్ళవచ్చును. ఇక్కడి ఆలయ విమాన శిఖరాలను 1963లో మహాసంప్రోక్షణ చేయడం జరిగింది. చుట్టూ గోదావరి, వరిపొలాలు, కొబ్బరిచెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణంలో కూడిన ప్రకృతిమాత ఒడిలో కోనసీమ కన్నులపండువగా పర్యాటకులను సేదతీర్చే ప్రదేశం. ఇక్కడి ప్రకృతికి పరవశించిన పరమేశ్వరుడు ఇక్కడ నారదునిచే ప్రతిష్ఠింపబడి కేశవస్వామిగా దేవేరులతో కలసి పూజలందుకుంటున్నాడు.

మండపాక

మార్చు

పవిత్ర శివ, కేశవ క్షేత్రాలను కలిగివున్న ఈ గ్రామమే శ్రీ మాండవ్య మహాముని తపమాచరింఛిన ప్రదేశముగా స్థల పురాణాలు చెప్పుచున్నవి. ఈ గ్రామాన్ని మాండవ్య క్షేత్రంగా పిలిచేవారు కాలక్రమంలో ఈ ప్రదేశాన్ని మండపాకగా వ్యవహరిస్తున్నారు.[2] ఈ గ్రామంలోని శివాలయాన్ని సోమేశ్వరాలయం గాను, కేశవాలయాన్ని చతుర్భుజ కేశవాలయం గాను వ్యవహరించేవారు.[3] ఈ కేశవాలయం పంచ కేశవ క్షేత్రాలలో ఒకటిగా పిలవబడుతుంది. సోమేశ్వరాలయం గ్రామం మధ్యలో ఉండుట ఇక్కడి ప్రత్యేకత.[2]

మూలాలు

మార్చు
  1. "SRI JAGANMOHINI KESAVA & GOPALA SWAMY TEMPLE, RYALI | Welcome to East Godavari District Web Portal | India" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-04-01.
  2. 2.0 2.1 "Temples Reference Center - MandirNet". web.archive.org. 2003-09-20. Archived from the original on 2003-09-20. Retrieved 2023-03-30.
  3. "Temples Reference Center - MandirNet". web.archive.org. 2003-09-20. Archived from the original on 2003-09-20. Retrieved 2023-03-30.

వెలుపలి లంకెలు

మార్చు