పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు

ప్రముఖ రచయితలు, నటులైన పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ 1989లో ఏర్పాటు చేసిన నాటక పరిషత్తే పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు. పరుచూరి వేంకటేశ్వరరావు కుమారుడైన పరుచూరి రఘుబాబు బ్లడ్ కాన్సర్ తో చనిపోయాడు. పరుచూరి సోదరులు, రఘుబాబు పేరిట పరుచూరి రఘబాబు మెమోరియల్‌ ట్రస్టును ఏర్పాటు చేసి, ట్రస్టు ద్వారా వివిధ సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.[1]

పరుచూరి రఘుబాబు ప్రేమ ఖైదీ చిత్రానికి కథానాయకుడిగా చేయాల్సివుంది. అంతకుముందు నాటకాలపై ఉన్న ఇంట్రెస్ట్‌తో ఓ నాటకం వేసి, ఆ తర్వాత సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ నాటకం వేసే ప్రాంగణంలో బ్లడ్‌ కేన్సర్‌తో చనిపోయాడు. ఆయన కోరిక మేరకు ఈ నాటకోత్సవాలు జరుపుతున్నారు. అందులో భాగంగా పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు ద్వారా ప్రతి ఏటా నాటక పోటీలు నిర్వహించి, బహుమతులు అందజేస్తున్నారు.

పరిషత్తు వివరాలు

మార్చు
 1. పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు - 2011:- 2011 పరుచూరి రఘుబాబు స్మారక 21వ అఖిల భారత నాటకోత్సవాలు గుంటూరు జిల్లా, పల్లెకోన లో నిర్వహించారు. ఏప్రిల్ 27 నుంచి మే 1వ తేదీ వరకు జరిగాయి. భారతి సిమెంట్స్‌ వారు స్పాన్సర్‌గా వ్యవహరించారు.
 2. పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు - 2012:- 2012 పరుచూరి రఘుబాబు స్మారక 22వ అఖిల భారత నాటకోత్సవాలు గుంటూరు జిల్లా, పల్లెకోనలో ఏప్రిల్ 27 నుంచి మే 1వ తేదీ వరకు నిర్వహించారు.[2]
 3. పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు - 2013:-2013 పరుచూరి రఘుబాబు స్మారక 23వ అఖిల భారత నాటకోత్సవాలు గుంటూరు జిల్లా, పల్లెకోనలో ఏప్రిల్ 27 నుంచి మే 1వ తేదీ వరకు నిర్వహించారు.[3]
 4. పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు - 2014:- పరుచూరి రఘుబాబు మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో గత 23 ఏళ్ళుగా పరుచూరి రఘుబాబు స్మారక 24వ అఖిల భారత నాటకోత్సవాలు జూన్ 27 నుంచి మే 1 వరకు నిర్వహిస్తూ వస్తున్నారు. 2014లో రాష్ట్రంలో మే 7న ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న కారణాన నాటకోత్సవాల తేదీని మార్చడం జరిగింది. మే 21 నుంచి మే 25 వరకు నిర్వహించారు. ఈ నాటకోత్సవంలో ఆరు నాటకాలను,12 నాటికలను ఎంపిక చేశారు.[4] కొంతమంది సన్నిహితులు దాతల సహకారంతో పల్లెకోనలో కళా ప్రాంగణాన్ని, వసతి సౌకర్యాలను ఏర్పాటు చేశారు. చిరంజీవి, దాసరి వంటివారు పార్లమెంట్‌ నిధి నుంచి సహకారాన్ని అందించారు. ఈ నాటకాలను పరిశీలించి జ్యూరీ కమిటీ కొన్నింటిని ఎంపిక చేసారు. వారికి చివరి రోజు బహుమతి ప్రధానం జరిగింది.[5]
 5. పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు - 2015:- 2015 ఏప్రిల్‌ 27 నుంచి 30 వరకు హైదరాబాద్‌ లోని రవీంద్రభారతి లో, మే 1 నుంచి 5 వరకు వరకు గుంటూరు జిల్లా లోని పల్లెకోన గ్రామంలో అఖిల భారత రజతోత్సవ నాటక పోటీలు జరిగాయి.[6][7]
 6. పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు - 2016:- 2016 ఏప్రిల్‌ 27 నుంచి మే 3 వరకు వరకు గుంటూరు జిల్లా లోని పల్లెకోన గ్రామంలో 26వ అఖిల భారత నాటక పోటీలు జరిగాయి.[8][9][10] మే 3 రాత్రి గం. 8.30ని.లకు బహుమతి ప్రదానోత్సవ సభ జరిగింది.
 7. పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు - 2017:- 2017 పరుచూరి రఘుబాబు స్మారక 27వ అఖిల భారత నాటకోత్సవాలు గుంటూరు జిల్లా, పల్లెకోనలో ఏప్రిల్ 27 నుంచి మే 1వ తేదీ వరకు నిర్వహించారు.[11][12]
 8. పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు - 2018:- 2018 పరుచూరి రఘుబాబు స్మారక 28వ అఖిల భారత నాటకోత్సవాలు ఏప్రిల్ 27 నుంచి 30 వరకు గుంటూరు జిల్లా, పల్లెకోనలో, మే 1నుండి 4వరకు ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో నిర్వహించారు. ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి మొత్తం 100 ఎంట్రీలు వచ్చాయి. అందులో 7 నాటకాలు, 12 నాటికలను తుదిపోటీలకు ఎంపికచేశారు. ఎంపికైన ప్రతి నాటకానికి 20వేలు, నాటికకు 15వేలు ప్రదర్శనా పారితోషికంగా ఇవ్వడంతోపాటుగా, రెండు విభాగాల్లో ప్రతిభ కనబర్చిన ఉత్తమ, ద్వితీయ ప్రదర్శనలకు అవార్డులతో పాటు వ్యక్తిగత బహుమతుల అందజేశారు.[13][14]
 9. పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు - 2019:- 2019 పరుచూరి రఘుబాబు స్మారక 29వ అఖిల భారత నాటకోత్సవాలు ఏప్రిల్ 27 నుంచి 30 వరకు గుంటూరు జిల్లా, పల్లెకోనలో, మే 1నుండి 3వరకు హైదరాబాదులోని రవీంద్ర భారతిలో నిర్వహించారు. ఈ నాటకోత్సవంలో 5 నాటకాలు, 16 నాటికలను తుదిపోటీలకు ఎంపికచేశారు.[15]

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
 1. ఆంధ్రజ్యోతి (ఆర్కైవ్), సాహిత్య వార్తలు, ఖమ్మం సాంస్కృతికం (4 March 2018). "పరుచూరి రఘుబాబు స్మారక నాటక పోటీలు". Archived from the original on 13 మార్చి 2018. Retrieved 13 March 2018.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link) CS1 maint: multiple names: authors list (link)
 2. అభినయ (1 May 2012). పరిచూరి ఫలితాలు. p. 27.
 3. విశాలాంధ్ర (25 April 2013). "27 నుంచి పల్లెకోనలో అఖిల భారత నాటకోత్సవాలు". Archived from the original on 4 May 2019. Retrieved 4 May 2019.
 4. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-05-04. Retrieved 2019-05-04.
 5. సాక్షి (5 January 2014). "ఏప్రిల్‌లో పరుచూరి రఘుబాబు నాటకోత్సవాలు". Retrieved 5 March 2018.
 6. ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ (2 May 2015). "నాటకరంగాన్ని బతికించాలి:స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు". Retrieved 5 March 2018.[permanent dead link]
 7. నమస్తే తెలంగాణ (14 December 2014). "రఘుబాబు స్మారక నాటకోత్సవాలు: పరుచూరి". Retrieved 5 March 2018.
 8. నవతెలంగాణ (3 April 2016). "27 నుండి పరుచూరి రఘుబాబు స్మారక నాటక పోటీలు". Retrieved 5 March 2018.
 9. ప్రజాశక్తి, తాజా వార్తలు (30 April 2016). "ప్రజలను చైతన్య పరిచే ప్రదర్శనలు : పరుచూరి". Archived from the original on 1 మే 2016. Retrieved 5 March 2018.
 10. యూట్యూబ్. "గుంటూరు జిల్లా పల్లెకోనలో ఘనంగా పరుచూరి రఘుబాబు స్మారక నాటకోత్సవాలు ప్రారంభం". www.youtube.com. Retrieved 5 March 2018.
 11. ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు (26 April 2017). "27 నుంచి పరుచూరి రఘుబాబు నాటకోత్సవాలు". Archived from the original on 27 ఏప్రిల్ 2017. Retrieved 5 March 2018.
 12. ఈనాడు. "సమాజానికి మేల్కొలుపు, ముగిసిన అఖిల భారత నాటకపోటీలు". archives.eenadu.net. Retrieved 16 July 2017.[permanent dead link]
 13. ఆంధ్రభూమి, ఖమ్మం (4 March 2018). "తెలుగునాటక రంగానికి సేవలందించడం మా అదృష్టం". Retrieved 5 March 2018.
 14. నవతెలంగాణ (4 March 2018). "మే 1నుంచి రఘుబాబు స్మారక నాటకోత్సవాలు : పరుచూరి". Retrieved 5 March 2018.[permanent dead link]
 15. ప్రజాశక్తి, ఫీచర్స్ (1 May 2019). "సమకాలీన సమస్యలకు దర్పణం". జయరావు, భట్టిప్రోలు. Archived from the original on 2 May 2019. Retrieved 2 May 2019.

ఇతర లింకులు

మార్చు