పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు - 2018

పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు ప్రముఖ రచయితలు, నటులైన పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ 1989లో ఏర్పాటు చేసిన నాటక పరిషత్తు. 2018 పరుచూరి రఘుబాబు స్మారక 28వ అఖిల భారత నాటకోత్సవాలు ఏప్రిల్ 27 నుంచి 30 వరకు గుంటూరు జిల్లా, పల్లెకోనలో జరుగగా,[1] మే 1నుండి 4వరకు ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో నిర్వహించారు. ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి మొత్తం 100 ఎంట్రీలు వచ్చాయి. అందులో 6 నాటకాలు, 16 నాటికలను తుదిపోటీలకు ఎంపికచేశారు. ఎంపికైన ప్రతి నాటకానికి 20వేలు, నాటికకు 15వేలు ప్రదర్శనా పారితోషికంగా ఇవ్వడంతోపాటుగా, రెండు విభాగాల్లో ప్రతిభ కనబర్చిన ఉత్తమ, ద్వితీయ ప్రదర్శనలకు అవార్డులతో పాటు వ్యక్తిగత బహుమతుల అందజేసారు.[2][3]


ముగింపు ఉత్సవం మార్చు

ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో జరిగిన ముగింపు కార్యక్రమానికి ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, సినీనటుడు సప్తగిరి విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు.[4]

పరిషత్తు వివరాలు - నాటక/నాటికలు మార్చు

తేది సమయం నాటకం/నాటిక పేరు సంస్థ పేరు రచయిత దర్శకుడు
27.04.2018 సా. గం 06.30 ని.లకు ఈ సూర్యుడు సామాన్యుడు (నాటకం) శ్రీ కృష్ణ తెలుగు థియేటర్ ఆర్ట్స్ అసోసియేషన్, న్యూ ఢిల్లీ స్నిగ్థ బాలాజీ నాయక్
27.04.2018 రా. గం 07.45 ని.లకు పచ్చ చందురుడు (నాటిక) గంగోత్రి, పెదకాకాని కీ.శే. జి.వి. కృష్ణారావు (మూలకథ)
డా. బొక్కా శ్రీనివాస్ (నాటకీకరణ)
నాయుడు గోపి
28.04.2018 సా. గం 06.30 ని.లకు ఇంటింటి భాగోతం (నాటకం) అరవింద ఆర్ట్స్, తాడేపల్లి పొత్తూరి విజయలక్ష్మీ (మూలకథ)
వల్లూరు శివప్రసాద్ (నాటకీకరణ)
గంగోత్రి సాయి
28.04.2018 రా. గం 08.45 ని.లకు గోవు మాలచ్చిమి (నాటిక) ఉషోదయా కళానికేతన్, కట్రపాడు శీలా సుభద్రాదేవి (మూలకథ)
చెరుకూరి సాంబశివరావు (నాటకీకరణ)
చెరుకూరి సాంబశివరావు
28.04.2018 రా. గం 10.00 లకు చేతిరాత (నాటిక) జనచైతన్య, ఒంగోలు వరికూటి శివప్రసాద్ ఎల్. శంకర్
29.04.2018 సా. గం 06.30 ని.లకు మనం మనుషులం కావాలి (నాటకం) బహురూప నట సమాఖ్య, విశాఖపట్టణం డా. చింతకింది శ్రీనివాసరావు ఎస్.కె. మిశ్రో
29.04.2018 రా. గం 08.45 ని.లకు మధుపర్కాలు (నాటకం) అరవింద ఆర్ట్స్, తాడేపల్లి రావూరు వెంకట సత్యనారాయణ (మూలకథ)
వల్లూరు శివప్రసాద్ (నాటకీకరణ)
గంగోత్రి సాయి
29.04.2018 రా. గం 10.00 లకు కృష్ణబిలం (నాటిక) కళాంజలి, ప్రగతి నగర్, హైదరాబాద్ భాస్కరచంద్ర కొల్లా రాధాకృష్ణ
30.04.2018 సా. గం 06.30 ని.లకు బంధాల బరువెంత (నాటిక) మణికంఠ ఆర్ట్స్, కొందెవరం జాస్తి రమాదేవి (మూలకథ)
చెలికాని వెంకటరమణ (నాటకీకరణ)
చెలికాని వెంకటరమణ
30.04.2018 రా. గం 07.45 ని.లకు కుక్కపిల్ల (నాటిక) తెలుగు కళా సమితి, విశాఖపట్టణం భారతుల రామకృష్ణ గోపరాజు విజయ్
30.04.2018 రా. గం 09.00 లకు కల్లందిబ్బ (నాటిక) సిరిమువ్వ కల్చరల్, హైదరాబాద్ రావినూతల ప్రేమకిషోర్ యం. భజరప్ప
01.05.2018 రా. గం 07.00 లకు ప్రస్థానం (నాటకం) రసవాహిని, అమలాపురం మార్గశీర్ష ఎం.జి. షహెన్ షా
01.05.2018 రా. గం 09.15 ని.లకు నాగూడు (నాటిక) హర్ష క్రియేషన్స్, విజయవాడ జె.యస్. లక్ష్మీ (మూలకథ)
లక్ష్మీ సౌజన్య (నాటకీకరణ)
కత్తి శ్యాంప్రసాద్
02.05.2018 సా. గం 04.00 లకు భారతావనిలో బలి పశువులు (నాటకం) న్యూస్టార్స్ మోడ్రన్ థియేటర్ ఆర్ట్స్ అసోసియేషన్, విజయవాడ ఎం.ఎస్. చౌదరి ఎం.ఎస్. చౌదరి
02.05.2018 సా. గం 06.15 ని.లకు అజ్ఞాతవాసం (నాటిక) చైతన్య కళా స్రవంతి, ఉక్కు నగరం, విశాఖపట్టణం స్నిగ్థ బాలాజీ నాయక్
02.05.2018 రా. గం 07.30 ని.లకు దిష్టిబొమ్మలు (నాటిక) డి.యల్. కాంతారావు పోస్టల్ ఉద్యోగుల కళా పరిషత్, తెనాలి తాళాబత్తుల వెంకటేశ్వరరావు పి.యస్.ఆర్. బ్రహ్మాచార్యులు
02.05.2018 రా. గం 08.45 ని.లకు దోబూచి (నాటిక) మురళీ కళా నిలయం, హైదరాబాద్ శంకరమంచి పార్థసారధి తల్లావజ్ఝుల సుందరం
03.05.2018 సా. గం 04.00 లకు గుప్పెడంత గుండె (నాటకం) అభినయ ఆర్ట్స్, గుంటూరు శిష్ట్లా చంద్రశేఖర్ యన్. రవీంద్రరెడ్డి
03.05.2018 సా. గం 06.15 ని.లకు చలిచీమలు (నాటిక) న్యూస్టార్స్ మోడ్రన్ థియేటర్ ఆర్ట్స్ అసోసియేషన్, విజయవాడ ఎం.ఎస్. చౌదరి ఎం.ఎస్. చౌదరి
03.05.2018 రా. గం 07.30 ని.లకు గుర్తు తెలియని శవం (నాటిక) జనశ్రేణి, విజయవాడ ఎ.ఎన్. జగన్నాథశర్మ (మూలకథ)
ఎల్లాప్రగడ భాస్కరరావు (నాటకీకరణ)
వై.యస్. కృష్ణేశ్వరరావు
03.05.2018 రా. గం 08.45 ని.లకు అక్క అలుగుడు - చెల్లెలు సణుగుడు (నాటిక) ది ఎమెచ్చూర్ డ్రమెటిక్ అసోసియేషన్, చిలకలూరిపేట అద్దేపల్లి భరత్ కుమార్ యస్.కె. షఫీ
04.05.2018 సా. గం 06.00 లకు చీకటి (నాటకం) అభినయ ఆర్ట్స్, గుంటూరు అల్లం శేషగిరిరావు (మూలకథ),
శిష్ట్లా చంద్రశేఖర్ (నాటకీకరణ)
యన్. రవీంద్రరెడ్డి

బహుమతుల వివరాలు మార్చు

నాటక విభాగం మార్చు

  • ఉత్తమ ప్రదర్శన - గుప్పెడంత గుండెలో
  • ద్వితీయ ఉత్తమ ప్రదర్శన - (ప్రస్థానం)
  • ఉత్తమ దర్శకత్వం - ఎన్. రవీంద్రరెడ్డి (గుప్పెడంత గుండెలో)
  • ఉత్తమ రచన - మార్గశీర్ష (ప్రస్థానం)
  • ఉత్తమ నటుడు - కె. వినయ్ (మనం మనుషులం కావాలి)
  • ద్వితీయ ఉత్తమ నటుడు - రాజర్షి (ప్రస్థానం)
  • ఉత్తమ నటి - మాధవీలత (మనం మనుషులం కావాలి)
  • ఉత్తమ హాస్య నటుడు - పి. రామారావు (ఈ సూర్యుడు సామాన్యుడు)
  • ఉత్తమ ప్రతినాయకుడు - చెలికాని వెంకటరావు (ప్రస్థానం)
  • ఉత్తమ క్యారెక్టర్ నటుడు - మహమ్మద్ షహన్ షా (ప్రస్థానం)
  • ఉత్తమ క్యారెక్టర్ నటి - ఉమామహేశ్వరి (ప్రస్థానం)
  • ఉత్తమ సహాయ నటుడు - వి.సి.హెచ్.కె. ప్రసాద్ (గుప్పెడంత గుండెలో)
  • ప్రత్యేక బహుమతులు - కట్టా ఆంథోని, సురభి లలిత (ఇంటింటి భాగోతం)
  • ఉత్తమ రంగాలంకరణ - శివ, లింగయ్య (గుప్పెడంత గుండెలో)
  • ఉత్తమ సంగీతం - ఇంటింటి భాగోతం
  • ఉత్తమ ఆహార్యం - పి. శ్రీధర్ (మనం మనుషులం కావాలి)

నాటిక విభాగం మార్చు

  • ఉత్తమ ప్రదర్శన - గుర్తు తెలియని శవం
  • ద్వితీయ ఉత్తమ ప్రదర్శన - కుక్కపిల్ల
  • తృతీయ ఉత్తమ ప్రదర్శన - పచ్చ చందురుడు
  • ఉత్తమ దర్శకత్వం - నాయుడు గోపి (పచ్చ చందురుడు)
  • ఉత్తమ రచన - భారతుల రామకృష్ణ (కుక్కపిల్ల)
  • ద్వితీయ ఉత్తమ రచన - వల్లూరు శివప్రసాద్ (మధుపర్కాలు)
  • ఉత్తమ నటుడు - వై.యస్. కృష్ణేశ్వరరావు (గుర్తుతెలియని శవం)
  • ద్వితీయ ఉత్తమ నటుడు - గోపరాజు రమణ (కుక్కపిల్ల)
  • ఉత్తమ నటి - లహరి గుడివాడ (గోవు మాలచ్చిమి)
  • ఉత్తమ హాస్య నటుడు - పోలుదాసు రంగనాయకులు (మధుపర్కాలు)
  • ఉత్తమ ప్రతినాయకుడు - పి. భద్రేశ్వరరావు (చేతిరాత)
  • ఉత్తమ క్యారెక్టర్ నటుడు - బి. బాబురావు (పచ్చ చందురుడు)
  • ఉత్తమ క్యారెక్టర్ నటి - జయశ్రీ (అక్క అలుగుడు చెల్లి సణుగుడు)
  • ఉత్తమ సహాయ నటుడు - పూర్ణ సత్యం (అజ్ఞాతవాసం)
  • ప్రత్యేక బహుమతులు - సురభి ప్రభావతి (కల్లందిబ్బ), ఎన్. రవీంద్రరెడ్డి (చీకటి), శ్రీజ సాధినేని (నాగూడు)
  • ఉత్తమ రంగాలంకరణ - పి. దివాకర్, ఫణీంద్ర (చలిచీమలు)
  • ఉత్తమ సంగీతం - పి. లీలామోహన్, బృందం (చలిచీమలు)
  • ఉత్తమ ఆహార్యం - యం. దినేశ్ బాబు (చలిచీమలు)

ఇవికూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. ఆంధ్రభూమి, గుంటూరు (1 May 2018). "ముగిసిన అఖిల భారత నాటకోత్సవాలు". Archived from the original on 5 May 2018. Retrieved 5 May 2018.
  2. ఆంధ్రభూమి, ఖమ్మం (4 March 2018). "తెలుగునాటక రంగానికి సేవలందించడం మా అదృష్టం". Retrieved 6 April 2018.
  3. నవతెలంగాణ (4 March 2018). "మే 1నుంచి రఘుబాబు స్మారక నాటకోత్సవాలు : పరుచూరి". Retrieved 6 April 2018.[permanent dead link]
  4. ఆంధ్రజ్యోతి, తెలంగాణా తాజావార్తలు (5 May 2018). "ముగిసిన అఖిలభారత నాటకోత్సవాలు". Archived from the original on 5 May 2018. Retrieved 5 May 2018.