పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు - 2019

పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు తెలుగు రంగస్థల, సినిమా రచయితలు, నటులైన పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ 1989లో ఏర్పాటు చేసిన నాటక పరిషత్తు. 2019 పరుచూరి రఘుబాబు స్మారక 29వ అఖిల భారత నాటకోత్సవాలు ఏప్రిల్ 27 నుంచి 30 వరకు గుంటూరు జిల్లా, పల్లెకోనలో, మే 1నుండి 3వరకు హైదరాబాదులోని రవీంద్ర భారతిలో నిర్వహించారు.[1] ఈ నాటకోత్సవంలో 6 నాటకాలు, 15 నాటికలను తుదిపోటీలకు ఎంపికచేశారు.[2]

పల్లెకోనలో సవరించు

పల్లెకోనలోని ఎన్‌టిఆర్‌ కళాప్రాంగణంలో ఏప్రిల్ 27న సినీ నటులు జయప్రకాశ్ రెడ్డి, ఎంపిడిఒ గుమ్మడి సాంబశివరావు, విశ్రాంత ఎంఇఒ భూపతి ధర్మరావు, ఎస్‌ఐ అంబటి మన్మథరావు, మాజీ ఎంపిపి వేజళ్ల సతీష్‌ చేతులమీదుగా నాటకోత్సవం ప్రారంభమైంది.[3]

ఏప్రిల్ 29న జరిగిన ముగింపు సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ నాటక అకాడమీ ఛైర్మన్‌ గుమ్మడి గోపాలకృష్ణ పాల్గొని కళాకారులను సత్కరించాడు.[4]

హైదరాబాదులో సవరించు

హైదరాబాదులోని రవీంద్రభారతిలో మే 1న సినీ నటుడు తనీష్, తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, పరుచూరి గోపాలకృష్ణ, పరుచూరి వెంకటేశ్వరరావు చేతులమీదుగా నాటకోత్సవం ప్రారంభమైంది.[5]

ముగింపు ఉత్సవం సవరించు

హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరిగిన ముగింపు కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఛైర్మన్ బాదిమి శివకుమార్, రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్‌ పి.రామ్మోహన్‌రావు ముఖ్యఅతిథిగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు డా. కె.వి. రమణాచారి, సినీ రచయిత దర్శకులు పోసాని కృష్ణ మురళి, చిన్నికృష్ణ,రచయిత్రి బలభద్రపాత్రుని రమణి విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు.[6]

పరిషత్తు వివరాలు - నాటక/నాటికలు సవరించు

తేది సమయం నాటకం/నాటిక పేరు సంస్థ పేరు రచయిత దర్శకుడు
27.04.2019 సా. గం 06.30 ని.లకు జాగా (నాటకం) 'మీ కోళ్ళ సత్యం' మెమోరియల్‌ సంస్థ , జంగారెడ్డిగూడెం డా. బొక్కా శ్రీనివాసరావు డా. బొక్కా శ్రీనివాసరావు
27.04.2019 రా. గం 08.30 ని.లకు జరుగుతున్న కథ (నాటిక) అరవింద ఆర్ట్స్, తాడేపల్లి ఆకెళ్ళ గంగోత్రి సాయి
27.04.2019 రా. గం 09.45 ని.లకు తొక్కతీశారు (నాటిక) శ్రీ గణేష్ ఆర్ట్స్ ధియేటర్స్, గుంటూరు వరికూటి శివప్రసాద్ వరికూటి శివప్రసాద్
28.04.2019 సా. గం 06.30 ని.లకు రక్తసంబంధాలు (నాటకం) కళాంజలి, ప్రగతినగర్, హైదరాబాదు కంచర్ల సూర్యప్రకాష్ కొల్లా రాధాకృష్ణ
28.04.2019 రా. గం 08.30 లకు మబ్బుల్లో బొమ్మ (నాటిక) సి.ఎ.యం.యస్., సంస్కార భారతి, హైదరాబాదు డా. డి. విజయభాస్కర్ టి.వి. రంగయ్య
28.04.2019 రా. గం 09.45 ని.లకు అందిన ఆకాశం (నాటిక) డి.జి. క్రియేషన్స్, ఆచంట వేమవరం అనంత హృదయరాజ్ దేవబత్తుల జార్జి
29.04.2019 సా. గం 06.30 ని.లకు ఇంకెన్నాళ్ళు (నాటకం) ఉషోదయ కళానికేతన్, కట్రపాడు చెరుకూరి సాంబశివరావు చెరుకూరి సాంబశివరావు
29.04.2019 రా. గం 08.30 లకు సప్తపది (నాటిక) అంజనా రాథోడ్ థియేటర్స్, చిలకలూరిపేట తాళాబత్తుల వెంకటేశ్వరరావు కె.వి. మంగారావు
29.04.2019 రా. గం 09.45 ని.లకు కెరటాలు (నాటిక) సాయి రాఘవ మూవీ మేకర్స్, గుంటూరు భాగవతుల రమాదేవి (మూలకథ), విద్యాధ‌ర్ మునిప‌ల్లె (నాటకీకరణ) విద్యాధ‌ర్ మునిప‌ల్లె
01.05.2019 మ. గం 02.00 లకు భూమిదుఃఖం (నాటిక) స్నేహా ఆర్ట్స్, విజనంపాడు రామా చంద్రమౌళి (మూలకథ), బి.వి.ఆర్. శర్మ (నాటకీకరణ) వై. హరిబాబు
01.05.2019 మ. గం 03.00 ని.లకు తెగారం (నాటకం) జాబిల్లి కల్చరల్ సొసైటీ, నిజామాబాద్ పెద్దింటి అశోక్ కుమార్ డా. మల్లేశ్ బలష్టు
01.05.2019 సా. గం 05.00 లకు తలుపులు తెలిచే ఉన్నాయి (నాటిక) శ్రీసాయి ఆర్ట్స్, కొలకలూరు భారతుల రామకృష్ణ గోపరాజు విజయ్
01.05.2019 సా. గం 06.00 ని.లకు దాడి (నాటకం) అరవింద ఆర్ట్స్, తాడేపల్లి సింహప్రసాద్ గంగోత్రి సాయి
01.05.2019 రా. గం 08.00 ని.లకు నిర్జీవ నినాదం (నాటిక) శర్వాణీ గ్రామీణ గిరిజన సాంస్కృతిక సంఘం, బొరివంక ఎ. సూరిబాబు కె.కె.ఎల్. స్వామి
02.05.2019 సా. గం 04.00 ని.లకు ఆది గురువు అమ్మ (నాటకం) న్యూస్టార్ మోడ్రన్ థియేటర్ ఆర్ట్స్ అసోసియేషన్, విజయవాడ ఎం.ఎస్. చౌదరి ఎం.ఎస్. చౌదరి
02.05.2019 సా. గం 06.00 లకు దయ్యం (నాటిక) చైతన్య కళా స్రవంతి, విశాఖపట్టణం పి.వి. సుసీల్ కుమార్ (మూలకథ), శిష్టా చంద్రశేఖర్ (నాటకీకరణ) పి. బాలాజీ నాయక్
02.05.2019 రా. గం 07.15 ని.లకు అతీతం (నాటిక) అభినయ ఆర్ట్స్, గుంటూరు రామా చంద్రమౌళి (మూలకథ), శిష్టా చంద్రశేఖర్ (నాటకీకరణ) ఎన్. రవీంద్రరెడ్డి
02.05.2019 రా. గం 08.30 ని.లకు హర్ష ఋతువు (నాటిక) ది అమెచ్యూర్ డ్రమటిక్ అసోసియేషన్, చిలకలూరిపేట సింహప్రసాద్ (మూలకథ), అద్దేపల్లి భరత్ కుమార్ (నాటకీకరణ) షఫీ
03.05.2019 సా. గం 04.00 ని.లకు ఇది నా దేశం (నాటిక) న్యూస్టార్ మోడ్రన్ థియేటర్ ఆర్ట్స్ అసోసియేషన్, విజయవాడ ఎం.ఎస్. చౌదరి ఎం.ఎస్. చౌదరి
03.05.2019 సా. గం 05.15 లకు మనసు లోపలి మనిషి (నాటిక) వేముల ఆర్ట్స్ థియేటర్స్, గుంటూరు రిషి శ్రీనివస్ (మూలకథ), యల్లాప్రగడ భాస్కరరావు (నాటకీకరణ) వేముల మోహనరావు
03.05.2019 సా. గం 06.30 లకు రాజీనా (నాటిక) పండు క్రియేషన్స్ కల్చరల్ సొసైటీ, కొప్పోలు వల్లూరు శివప్రసాద్ పోలవరపు భుజంగరావు

బహుమతుల వివరాలు సవరించు

నాటక విభాగం సవరించు

 • ఉత్తమ ప్రదర్శన - తెగారం (జాబిల్లి కల్చరల్ సొసైటీ, నిజామాబాద్)
 • ద్వితీయ ఉత్తమ ప్రదర్శన - ఆది గురువు అమ్మ (న్యూస్టార్ మోడరన్ థియేటర్స్, విజయవాడ)
 • ఉత్తమ దర్శకత్వం - మల్లేశ్ బలష్టు (తెగారం)
 • ఉత్తమ రచన - ఎం.ఎస్. చౌదరి (ఆది గురువు అమ్మ)
 • ఉత్తమ నటుడు - మహ్మద్ జమా (రక్త సంబంధాలు)
 • ద్వితీయ ఉత్తమ నటుడు - పి. తేజ (ఆది గురువు అమ్మ)
 • ఉత్తమ నటి - జ్యోతిరాణి సాలూరి (తెగారం)
 • ఉత్తమ హాస్య నటుడు - కార్తిక్ (రక్తసంబంధాలు)
 • ఉత్తమ ప్రతినాయకుడు - వంగల రమణామార్తి (తెగారం)
 • ఉత్తమ క్యారెక్టర్ నటుడు - జానారామయ్య (ఇంకెన్నాళ్ళు)
 • ఉత్తమ క్యారెక్టర్ నటి - లక్ష్మీ. టి (ఆది గురువు అమ్మ)
 • ఉత్తమ సహాయ నటుడు - పోలుదాసు శ్రీనివాసు (దాడి)
 • ప్రత్యేక బహుమతులు - అమృతవర్షిణి (ఇంకెన్నాళ్ళు), సునయన (తెగారం)
 • ఉత్తమ రంగాలంకరణ - సురభి ఉమాశంకర్ (తెగారం)
 • ఉత్తమ సంగీతం - కె. సత్యనారాయణమూర్తి (దాడి)
 • ఉత్తమ ఆహార్యం - పచ్చల (దాడి)

నాటిక విభాగం సవరించు

 • ఉత్తమ ప్రదర్శన - అతీతం (అభినయ ఆర్ట్స్)
 • ద్వితీయ ఉత్తమ ప్రదర్శన - తలుపులు తెరిచే ఉన్నాయి (శ్రీసాయి ఆర్ట్స్, కొలకలూరు)
 • తృతీయ ఉత్తమ ప్రదర్శన - రాజీనా? (పండు క్రియేషన్స్, కొప్పోలు)
 • ఉత్తమ దర్శకత్వం - ఎన్. రవీంద్రరెడ్డి (అతీతం)
 • ఉత్తమ రచన - భారతుల రామకృష్ణ (తలుపులు తెరిచే ఉన్నాయి)
 • ద్వితీయ ఉత్తమ రచన - విద్యాధ‌ర్ మునిప‌ల్లె (కెరటాలు)
 • ఉత్తమ నటుడు - ఎన్. రవీంద్రరెడ్డి (అతీతం)
 • ద్వితీయ ఉత్తమ నటుడు - గోపరాజు రమణ (తలుపులు తెరిచే ఉన్నాయి)
 • ఉత్తమ నటి - జ్యోతిరాజ్ (అందిన ఆకాశం)
 • ఉత్తమ హాస్య నటుడు - వరికూటి శివప్రసాద్ (తొక్కతీశారు)
 • ఉత్తమ ప్రతినాయకుడు - వై. హరిబాబు (భూమిదుఃఖం)
 • ఉత్తమ క్యారెక్టర్ నటుడు - గంగోత్రి సాయి (జరుగుతున్న కథ)
 • ఉత్తమ క్యారెక్టర్ నటి - సురభి ప్రభావతి (భూమిదుఃఖం)
 • ఉత్తమ సహాయ నటుడు - పూర్ణ సత్యం (దయ్యం)
 • ప్రత్యేక బహుమతులు - అర్జున్ (రాజీనా?), ఎ. సునైనా (కెరటాలు)
 • ఉత్తమ రంగాలంకరణ - ఫణి బృందం (ఇదా నా దేశం)
 • ఉత్తమ సంగీతం - శర్మ (అతీతం)
 • ఉత్తమ ఆహార్యం - ఫణి బృందం (ఇదా నా దేశం)

ఇవికూడా చూడండి సవరించు

మూలాలు సవరించు

 1. ఆంధ్రజ్యోతి, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యాంశాలు (26 April 2019). "పరుచూరి రఘుబాబు స్మారక నాటకోత్సవాలు". Archived from the original on 4 May 2019. Retrieved 4 May 2019.
 2. ప్రజాశక్తి, ఫీచర్స్ (1 May 2019). "సమకాలీన సమస్యలకు దర్పణం". జయరావు, భట్టిప్రోలు. Archived from the original on 2 May 2019. Retrieved 4 May 2019.
 3. ప్రజాశక్తి, ఆంధ్ర ప్రదేశ్ (28 April 2019). "సమాజాభివృద్ధికి నాటక ప్రదర్శనలు". Archived from the original on 4 May 2019. Retrieved 4 May 2019.
 4. ఈనాడు, అమరావతి-ప్రధానాంశాలు (30 April 2019). "ప్రతి శనివారం నాటకవారంగా గుర్తిస్తాం". Archived from the original on 4 May 2019. Retrieved 4 May 2019.
 5. ఆంధ్రజ్యోతి, సాహిత్య వార్తలు (2 May 2019). "నాటక పోటీలు ప్రారంభం". Archived from the original on 4 May 2019. Retrieved 4 May 2019.
 6. ఆంధ్రజ్యోతి, సాహిత్య వార్తలు (4 May 2019). "ముగిసిన 'పరుచూరి రఘుబాబు' నాటకోత్సవం". Archived from the original on 4 May 2019. Retrieved 4 May 2019.