పవిత్ర వృక్షాలు

తెలుగు అనువాద రచన

పవిత్ర వృక్షాలు ఒక తెలుగు అనువాద పుస్తకం.

పవిత్ర వృక్షాలు
కృతికర్త: ఎల్లప్పరెడ్డి
అనువాదకులు: పి.ఎస్.శంకరరెడ్డి, తమ్మన్న, గోపీకృష్ణ
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రచురణ: అటవీ శాఖ ‍‍, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి
విడుదల: 1992
పేజీలు: 150

దీనిని అటవీ శాఖ, తిరుమల తిరుపతి దేవస్థానములు సంయుక్తంగా ప్రచురించారు. కర్ణాటక రాష్ట్ర అటవీశాఖకు చెందిన శ్రీ ఎల్లప్పరెడ్డి గారు ఆంగ్లములో "Sacred Plants" అను గ్రంథాన్ని ప్రచురించారు. దీనిని పి.యస్. శంకరరెడ్డి, గోపీకృష్ణ, తమ్మన్న గార్లు తెలుగులో పవిత్ర వృక్షాలు అనే పేరుతో అనువదించారు.[1]

సమాచారంసవరించు

ఈ పుస్తకాన్ని మూడు ముఖ్యమైన భాగాలుగా చేశారు.

మొదటి భాగంలో వివిధ పూజలు, వ్రతాలలో జరిపే పుష్ప పూజ, పత్ర పూజల గురించి వివరించారు.

రెండవ భాగంలో వన దేవాలయాలు ఎలా పెంచాలి, ఏఏ చెట్లు ఎక్కడెక్కడ నాటాలి అని వివరించారు.

మూడవ భాగంలో పైన పేర్కొన్న పూజలలో ఉపయోగించే 124 రకాల మొక్కల యొక్క సంస్కృత నామం, తెలుగు పేర్లు, వాటికి సంబంధించిన సమాచారాన్ని క్లుప్తంగా వివరించారు.

వ్రతాలు-పూజలుసవరించు

 1. గణపతి వ్రతములు - సిద్ధి వినాయక వ్రత పత్రపూజ - సంకట చతుర్థీ వ్రత పత్రపూజ - పుష్పపూజ
 2. శ్రీ సత్యనారాయణ వ్రతము - పుష్పపూజ - పత్రపూజ
 3. శ్రీ వరలక్ష్మీ వ్రతము - పుష్పపూజ - పత్రపూజ
 4. మార్గశీర్ష శ్రీ మహాలక్ష్మీ వ్రతము - పుష్పపూజ
 5. శ్రీ అనంత పద్మనాభ వ్రతము - పుష్పపూజ - తులసీపూజ - పత్రపూజ
 6. శ్రీ స్వర్ణగౌరి వ్రతము - పుష్పపూజ - పత్రపూజ
 7. శ్రీ హరతాలికా గౌరీ వ్రతము - పత్రపూజ - పుష్పపూజ
 8. నిత్య సోమవార వ్రతము - పుష్పపూజ - పత్రపూజ
 9. వైకుంఠ చతుర్దశీ వ్రతము - పుష్పపూజ
 1. శ్రీ నరసింహ జయంతి వ్రతము - పత్రపూజ - పుష్పపూజ
 2. శ్రీ శని ప్రదోష వ్రతము - పుష్పపూజ - బిల్వపత్రపూజ - ద్రోణపుష్పపూజ - ధాత్రీపత్రపూజ - పత్రపూజ
 3. శ్రీ మహా సరస్వతీ వ్రతము - పుష్పపూజ
 4. శ్రీ ఉమా మహేశ్వర వ్రతము - పుష్పపూజ - పత్రపూజ
 5. సప్తర్షి వ్రతము - పత్రపూజ - పుష్పపూజ
 6. నిరశనార్క వ్రతము - పత్రపూజ - పుష్పపూజ
 7. నారాయణ పూజ - పత్రి - పుష్పాలు
 8. లక్ష్మీ పూజ - పత్రి

వన దేవాలయాలుసవరించు

 1. శివ పంచాయతన వనము
 2. అశోక వనము
 3. సప్తర్షి వనము
 4. నవగ్రహ వనము
 5. నందన వనము
 1. నక్షత్ర వనము
 2. రాశి వనము
 3. తులసీ వనము
 4. సంతాన వనము

వివరించిన మొక్కలుసవరించు

ముద్రణలుసవరించు

ఇది మొదటిసారి 1992 బ్రహ్మోత్సవాలలో ముద్రించి ఆవిష్కరించారు. ఆ తర్వాత 2002, 2003, 2006 సంవత్సరాలలో పునర్ముద్రణ జరిగింది.

మూలాలుసవరించు

 1. పవిత్ర వృక్షాలు. తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానములు. 1992. Retrieved 26 September 2020.