పాడుతా తీయగా (ధారావాహిక)

పాడుతా తీయగా ఈటీవీలో బహుళ ప్రజాదరణ పొందిన పాటల పోటీ కార్యక్రమం. ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం దీనికి వ్యాఖ్యాత. ఆంధ్రప్రదేశ్ నలుమూలలా ప్రతిభ ఉన్న గాయనీ గాయకులను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్యోద్దేశం. దీని దర్శకుడు ఎన్.బి. శాస్త్రి. 1996 మే 16న హైదరాబాదులోని సారధి స్టూడియోలో అతికొద్ది మంది సమక్షంలో [1] ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పటికీ కొనసాగటమే కాక అమెరికా కు కూడా విస్తరించింది. దక్షిణ భారతంలోనే మొట్టమొదటి సంగీత ఆధారిత రియాలిటీ షో ఇది.

మంగళంపల్లి బాలమురళీకృష్ణ, సాలూరి రాజేశ్వరరావు, కె.విశ్వనాధ్, కె.వి. మహదేవన్, ఎమ్మెస్ విశ్వనాథన్, ఇళయరాజా, కె.బాలచందర్, కీరవాణి, సుశీల, జానకి లాంటి ప్రముఖులెందరో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఎంతో మంది గాయకులను సినీ పరిశ్రమకు అందించింది. ప్రముఖ గాయని ఉష (గాయని), కౌసల్య (గాయని), గోపికా పూర్ణిమ, మల్లిఖార్జున్, సందీప్, హేమచంద్ర, కారుణ్య మొదలైన వారు. ఈ కార్యక్రమం ద్వారా వెలుగులోకి వచ్చారు.

మూలాలుసవరించు

  1. ఈనాడు ఆదివారం సంచిక, ఆగస్టు 11, 2013