రామోజీరావు

ప్రముఖ వ్యాపారవేత్త, పత్రికా సంపాదకుడు
(రామోజీ రావు నుండి దారిమార్పు చెందింది)

చెరుకూరి రామోజీరావు, ఒక భారతీయ వ్యాపారవేత్త, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత. తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడు, ప్రధాన సంపాదకుడు, ప్రచురణ కర్త. మార్గదర్శి చిట్‌ఫండ్, ప్రియా ఫుడ్స్, కళాంజలి మొదలగు వ్యాపార సంస్థల అధినేత. రామోజీరావు స్థాపించిన రామోజీ గ్రూపు ఆధీనంలో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది. 2016లో భారత ప్రభుత్వం అతనిని దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ తో సత్కరించింది.

చెరుకూరి రామోజీరావు
ప్రముఖ తెలుగు పత్రిక ఈనాడు అధిపతి రామోజీరావు
జననంచెరుకూరి రామయ్య
(1936-11-16) 1936 నవంబరు 16 (వయసు 87)
గుడివాడ,కృష్ణా జిల్లా
నివాస ప్రాంతంహైదరాబాదు
ఇతర పేర్లురామోజీ
వృత్తిపత్రికా సంపాదకుడు
ప్రచురణకర్త
చిత్ర నిర్మాత
వ్యాపారవేత్త
ఈటీవీ అధినేత
ప్రసిద్ధిపత్రికాధిపతి
మతంహిందూ
భార్య / భర్తరమాదేవి[1]
పిల్లలుకిరణ్, సుమన్

జీవిత చరిత్ర మార్చు

కుటుంబ నేపథ్యం మార్చు

రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబరు 16న రైతుకుటుంబంలో జన్మించాడు. తల్లి వెంకటసుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. రామోజీరావు పూర్వీకులు పామర్రు మండలంలోని పెరిశేపల్లి గ్రామానికి చెందినవారు. అతని తాత రామయ్య కుటుంబంతో పెరిశేపల్లి నుంచి పెదపారుపూడికి వలస వచ్చాడు.[2] రామోజీరావు తాత మరణించిన 13 రోజులకు జన్మించాడు. దానితో అతని జ్ఞాపకార్థం తల్లిదండ్రులు రామయ్య అన్న పేరు పెట్టారు.[3] ఇతనికన్నా ముందు ఇద్దరు అక్కలు ఉన్నారు. పెద్దక్క పేరు రాజ్యలక్ష్మి, చిన్నక్క పేరు రంగనాయకమ్మ.[2]

బాల్యం, విద్యాభ్యాసం, వివాహం (1937 - 1961) మార్చు

ఇతని కుటుంబానిది శ్రీ వైష్ణవ నేపథ్యం. తల్లి చాలా భక్తిపరురాలు, ఆచారవంతురాలు కావడంతో చిన్నతనంలో ఇతనికీ భక్తి, శుచి అలవడింది. లేకలేక పుట్టిన మగసంతానం కావడంతో రామోజీని చాలా ముద్దుచేసేవారు. పెద్దక్క పెళ్ళిచేసుకుని వెళ్ళిపోయినా చిన్నక్క రంగనాయకమ్మతో సాన్నిహిత్యం ఉండేది. ఇంట్లో తల్లికి ఇంటిపనుల్లో, వంటలో సహాయం చేసే అలవాటూ ఉండేవి.[2]

రామయ్య అన్న తన పేరు నచ్చక ప్రాథమిక పాఠశాలలో చేరేప్పుడే స్వంతంగా "రామోజీ రావు" అన్న పేరును సృష్టించుకుని, తానే పెట్టుకున్నాడు. ఆ పేరే జీవితాంతమూ కొనసాగుతోంది. రామోజీరావు 1947లో గుడివాడలో పురపాలకోన్నత పాఠశాలలో 8వ తరగతిలో చేరాడు. 1957లో ఆరవ ఫారం అక్కడే పూర్తిచేసుకుని, గుడివాడ కళాశాలలో ఇంటర్, బీఎస్సీ చదివాడు.[2]

1961 ఆగస్టు 19న రామోజీరావుకు, పెనమలూరుకు చెందిన తాతినేని వెంకట సుబ్బయ్య, వాణీదేవిల రెండవ కుమార్తె రమాదేవితో వివాహం జరిగింది. రమాదేవి అసలు పేరు రమణమ్మ కాగా పెద్దలు పెట్టిన పేరు నచ్చక అలా మార్చుకుంది. రామోజీరావుతో భార్య వైపు బంధువుల్లో చిన్న బావమరిది తాతినేని వెంకట కృష్ణారావు మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థలో డైరెక్టరుగా, తోడల్లుడు ముసునూరు అప్పారావు ఈనాడు, డాల్ఫిన్స్ హోటల్స్ మాజీ ఎండీగా కలసి పనిచేశారు.

ఉద్యోగం, వ్యాపారాల ఆరంభం (1960 - 1970) మార్చు

రామోజీరావు తనకు పరిచయస్తుడు, అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పనిచేసేవాడైన తహశిల రామచంద్రరావు ప్రోత్సాహంతో అడ్వర్టైజింగ్ రంగంపై ఆసక్తితో ఆ రంగాన్ని గురించి నేర్చుకోవాలని ఆశించాడు. అందుకోసం చదువు పూర్తయ్యాకా ఢిల్లీలో ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఆర్టిస్టుగా ఉద్యోగంలో చేరాడు. మూడు సంవత్సరాల పాటు ఆ రంగంలో పనిచేసి 1962లో హైదరాబాద్ తిరిగివచ్చాడు.[4]

రామోజీరావు 1962 అక్టోబరులో హైదరాబాద్‌లో మార్గదర్శి చిట్ ఫండ్ ప్రారంభించాడు. ఇది అతని జీవితంలో తొలి వ్యాపారం. 1965లో కిరణ్ యాడ్స్ అన్న అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీ ప్రారంభించాడు. 1967 - 1969 మధ్యకాలంలో ఖమ్మం ప్రాంతంలో వసుంధర ఫెర్టిలైజర్స్ పేరిట ఎరువుల వ్యాపారాన్ని సాగించాడు. 1969లో రామోజీరావు ప్రారంభించిన మొట్టమొదటి పత్రికగా వ్యవసాయ సమాచారంతో సాగే అన్నదాత ప్రారంభించాడు.[5] 1970లో ఇమేజెస్ అవుట్‌డోర్ అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీ ప్రారంభించాడు. దీని బాధ్యతలు అతని భార్య రమాదేవి చూసుకోసాగింది.[6]

డాల్ఫిన్ హోటల్స్, ఈనాడు ప్రారంభం (1971-1974) మార్చు

విశాఖపట్నంలో డాల్ఫిన్ హోటల్స్ ప్రారంభించాలని రామోజీరావు 1970లో నిర్ణయించుకుని నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభించాడు.

రామోజీ గ్రూపు క్రింద ఉన్న సంస్థలలో మార్గదర్శి చిట్ ఫండ్స్, ఈనాడు వార్తాపత్రిక, ఈటీవి, ప్రియా ఫుడ్స్, ఉషాకిరణ్ మూవీస్, రామోజీ ఫిల్మ్ సిటీ, కళాంజలి షోరూములు ముఖ్యమైనవి.[7][8]

వ్యాపారాలలో ఒడిదుడుకులు మార్చు

రాజశేఖరరెడ్డి ప్రభుత్వ కాలంలో రామోజీరావు సంస్థ మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్బిఐ నిబంధనలు ఉల్లంఘించిందని అనే ఆరోపణలు ఎదుర్కొంది. వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొని బయటపడింది.[9]రామోజీరావు మార్గదర్శిలోని ఖాతాదారుల డబ్బుల్ని సొంత అవసరాలకు వాడుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ సిఐడి కేసు నమోదు చేసింది. మార్గదర్శి ఆస్తులను జప్తు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మార్గదర్శి కార్యాలయాల్లో సోదాలు చేపట్టింది. మార్గదర్శి కేసు విషయంపై రామోజీరావును విచారించింది.

వ్యాపారాలు మార్చు

 
రామోజీ ఫిల్మ్ సిటీ

మీడియా మార్చు

ఆర్థిక సేవలు మార్చు

ఇతరాలు మార్చు

  • కళాంజలి - సంప్రదాయ వస్త్రాలు, గృహాలంకరణ సామగ్రి (విజయవాడ, హైదరాబాద్)
  • బ్రిసా - ఆధునిక వస్త్రాలు
  • ప్రియా ఫుడ్స్ - పచ్చళ్ళు, మసాలా దినుసులు, ధాన్యం ఎగుమతి
  • డాల్ఫిన్ హోటల్ (విశాఖపట్నం, హైదరాబాద్)
  • కొలోరమ ప్రింటర్స్
  • ప్రియా పచ్చళ్లు

నిర్మించిన సినిమాలు మార్చు

పురస్కారాలు/గౌరవాలు మార్చు

రామోజీరావు పనికి, సేవలకు పలు పురస్కారాలు అందుకున్నాడు.

బయటి లింకులు మార్చు

మూలాలు మార్చు

  1. వెబ్ సైట్ లో జీవిత చరిత్ర జూన్ 18, 2008న సేకరించబడినది.
  2. 2.0 2.1 2.2 2.3 గోవిందరాజు చక్రధర్ 2020, p. 20.
  3. గోవిందరాజు చక్రధర్ 2020, p. 19.
  4. గోవిందరాజు చక్రధర్ 2020, p. 21.
  5. గోవిందరాజు చక్రధర్ 2020, p. 22.
  6. గోవిందరాజు చక్రధర్ 2020, p. 23.
  7. "తెలుగుకి వెలుగు రామోజీరావు". తెలుగువెలుగు. 2016-03-01. Archived from the original on 2020-07-06. Retrieved 2020-07-05.
  8. Praveen Donthi (2014-12-01). "Chairman Rao, How Ramoji Rao of Eenadu wrested control of power and politics in Andhra Pradesh". Archived from the original on 2014-12-31.
  9. "Dangerous intolerance". The Hindu. 2006-12-23.
  10. "సాహిత్యాభిమానులకు ధన్యవాదాలు". రామోజీ ఫౌండేషన్. 2021-03-01. Retrieved 2021-03-08.[permanent dead link]

ఆధార గ్రంథాలు మార్చు

  • గోవిందరాజు చక్రధర్ (2020). రామోజీరావు ఉన్నది ఉన్నట్టు. హైదరాబాద్: Media house publications.

వెలుపలి లంకెలు మార్చు