పిచ్చోడి చేతిలో రాయి
పిచ్చోడి చేతిలో రాయి, 1999లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ఈ సినిమా కథ రాజకీయ రంగం నేపథ్యంలో నడుస్తుంది. వోటు హక్కును పిచ్చివాని చేతిలో రాయిలా కానీయకూడదనేది ఈ సినిమా సందేశం.
పిచ్చోడి చేతిలో రాయి (1999 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | దాసరి నారాయణరావు |
---|---|
చిత్రానువాదం | దాసరి నారాయణరావు |
తారాగణం | దాసరి నారాయణరావు, చరణ్ రాజ్, కెప్టెన్ రాజు, ఇంద్రజ చంద్రమోహన్, సుత్తివేలు, ఎ.వి.ఎస్., సుజాత, చరణ్ రాజ్, బ్రహ్మాజీ |
సంగీతం | వందేమాతరం శ్రీనివాస్ |
నిర్మాణ సంస్థ | దాసరి కమ్యూనికేషన్స్ |
భాష | తెలుగు |
మహారధి (కెప్టెన్ రాజు), "ప్రజాస్వామ్యం" అనే పత్రరిక ఎడిటర్. బ్రహ్మాజీ, ఇంద్రజలు అందులో నిబద్ధతతో పనిచేసే పాత్రికేయులు. చక్రధరరావు (చరణ్ రాజ్) రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆది శేషగిరిరావు (సుత్తి వేలు), అతని మిత్రులు స్వాతంత్ర్య సమర యోధులు, రాజకీయ, సామాజిక న్యాయానికి కట్టుబడి ప్రయత్నం చేస్తున్నవారు. చక్రధరరావు అధికారంలోకి రావడంలో మహారధి ఒక కీలకపాత్ర వహించి, ప్రభుత్వాన్ని తన చెప్పుచేతలలో ఉంచుకో గలిగాడు.
వీరారెడ్డి అనే వ్యక్తి మరొక పత్రికను నడుపుతున్నందువలన మహారధికి పోటీగా ఉంటాడు. వీరారెడ్డికి లిక్కర్ పర్మిట్ లభించినందువలన మహారధి పత్రిక మధ్యానికి వ్యతిరేకంగా అనేక కథనాలు ప్రచురించింది. దానితో ఆదిశేషగిరిరావు తదితరుల నేతృత్వంలో ఒక ఉద్యమం చెలరేగింది. ఫలితంగా మధ్య నిషేధం అమలయ్యింది. వెంటనే నాయకులందరూ మద్యం స్మగులింగ్ ద్వారాను, నకిలీ సారాయి తయారు ద్వారాను విపరీతంగా సొమ్ము చేసుకోవడం మొదలు పెడతారు. ఈ విషయాన్ని ప్రజాస్వామ్యం పార్టీ పెద్దయెత్తున ప్రచారం చేయడంతో మధ్యనిషేధానికి వ్యతిరేకంగా మరొక ఉద్యమం మొదలవుతుంది. ఇలా రాష్ట్రం అంతటా కల్లోల పరిస్థితులు నెలకొంటాయి.
ఈ గందరగోళంలో తమ పత్రికల సర్క్యులేషన్ పెంచుకోవడానికి ప్రజాస్వామ్యం పత్రిక మరొక అంశాన్ని తెరమీదికి తెచ్చింది. శ్రీకృష్ణ దేవరాయలు బ్రతికే ఉన్నాడని. ఇక ప్రొఫేసర్లు త్రవ్వకాలు మొదలు పెడడతారు. అప్పుడు జరిగిన త్రవ్వకాలలో నిజంగానే ఏవో మూలికలు సేవించిన శ్రీకృష్ణదేవరాయలు 500 సంవత్సరాల తరువాత తిరిగి బ్రతికాడని బయటపడుతుంది. శ్రీకృష్ణ దేవరఅయలు పాత్రను దాసరి పోషించాడు. అంతేకాదు. అలా బ్రతికివచ్చిన శ్రీకృష్ణదేవరాయలు ఎన్నికలలో నిలుచుని విజయం సాధిస్తాడు.
అసలీ శ్రీకృష్ణదేవరాయలు ఎవరు? తరువాత ఏంజరిగింది. వంటి విషయాలు ఈ సినిమా కథాంతంలో తెలుస్తాయి.
నటీనటులు
మార్చు- దాసరి నారాయణరావు
- చరణ్ రాజ్
- కెప్టెన్ రాజు
- ఇంద్రజ
- చంద్రమోహన్
- సుత్తివేలు
- ఎ.వి.ఎస్.
- సుజాత
- బ్రహ్మాజీ
- గోకిన రామారావు
- నర్రా వెంకటేశ్వరరావు
- ఆల్ఫోన్స్
- పింకీ
- ముక్కురాజు
- మాగంటి సుధాకర్
- మాడా వెంకటేశ్వరరావు
- సంజీవి
- చిట్టిబాబు
- ముక్కా నరసింహరావు
- గుండు హనుమంతరావు
- అశోక్ కుమార్
- శ్రీలక్ష్మి
- పూజిత
- మాధురి
- లక్ష్మీశోభ
- పద్మ జయంతి
- లలిత
- పావలా శ్యామల
- ఆలపాటి లక్ష్మి
- అంబికారాణి
- జ్యోతి
- గాదిరాజు సుబ్బారావు
- మిఠాయి చిట్టి
- జూ.రేలంగి
- గౌతంరాజు
- దువ్వాసి మోహన్
- చంద్రమౌళి
వనరులు
మార్చు- ఐడిల్ బ్రెయిన్.కమ్లో వ్యాసం