పి.శ్రీదేవి (1929-1961) ప్రముఖ తెలుగు రచయిత్రి.

రచయిత్రి-డా-పి-శ్రీదేవి

వ్యక్తిగత జీవితం మార్చు

పి. శ్రీదేవి విశాఖపట్టణం జిల్లాలోని అనకాపల్లిలో 1929 సెప్టెంబరు 21న డాక్టర్ గుళ్ళపల్లి నారాయణమూర్తి దంపతులకు తొలి సంతానంగా జన్మించింది. ఆమె తండ్రి నారాయణమూర్తి నాటకకర్త, రచయిత, జాతీయవాది. అతను వృత్తిరీత్యా వైద్యుడు.[1]

శ్రీదేవి విద్యాభ్యాసం అనకాపల్లిలో ప్రారంభమైంది. తర్వాత కాకినాడలో కొనసాగించి ఇంటర్మీడియట్ వరకూ అక్కడే చదువుకుంది. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వైద్య విద్యను అభ్యసించి ఎంబీబీఎస్ పట్టా పొందింది. ఈ దశలోనే ఆమె తండ్రి చనిపోయాడు.[1]

ఎంబీబీఎస్ పూర్తయ్యాకా ఆమె గుడివాడలో ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టరుగా పనిచేయడం ప్రారంభించింది. 1956లో ఆమెకు పెమ్మరాజు కామరాజుతో వివాహం జరిగింది. అతను భారత వైమానిక దళంలో ఉద్యోగిగా పనిచేసేవాడు. దానితో ఆమె తన ప్రభుత్వోద్యోగాన్ని విడిచిపెట్టి భర్త పోస్టింగ్ ఉన్న సికిందరాబాద్ ప్రాంతానికి వెళ్ళింది. భర్త ఉద్యోగరీత్యా తిరిగిన ఆమె వెళ్ళినచోట్ల ప్రైవేటు ప్రాక్టీసు పెట్టి వైద్యం చేసేది.[1]

1960లో కామరాజు-శ్రీదేవి దంపతులకు మాళవిక అనే కుమార్తె జన్మించింది. శ్రీదేవి వెన్నెముకకు క్యాన్సర్ సోకడంతో 1961 జూన్ 29న 31 ఏళ్ళ వయసులో మరణించింది.[2]

సాహిత్యరంగం మార్చు

శ్రీదేవి తండ్రి నారాయణమూర్తికి సాహిత్యం పట్ల ఉన్న ఆసక్తి ఆమెకు సంక్రమించింది.

ఈమె కథ వాళ్ళు పాడిన భూపాలం ఆమెని ఉత్తమశ్రేణి రచయిత్రిగా నిలబెట్టింది. ఆమె రాసిన ఒకే ఒక నవల కాలాతీతవ్యక్తులు తెలుగు సాహిత్యచరిత్రలో మైలురాయిగా నిలిచింది. ప్రముఖ కవయిత్రి నాయని కృష్ణకుమారి, శ్రీదేవి స్మృతిచిహ్నంగా రాసిన కవిత "ఏం చెప్పను నేస్తం" బహుళ జనాదరణ పొందిన కవిత.

సాహిత్యకృషి మార్చు

కవితలు మార్చు

కథలు మార్చు

నవలలు మార్చు

1958లో పుస్తకరూపంలో వెలువడింది. 1962లో రెండవ ముద్రణ దాచేపల్లి కిష్టయ్య అండ్ సన్స్, సికిందరాబాదు. మార్చి 1981లో యం. శేషాచలం అండ్ కో మూడవ ముద్రణ ప్రచురించారు. అంతే కాక, ఈనవలను నాటికగా ఆకాశవాణిలో 1960లో ప్రసారం చేయబడింది. చదువుకున్న అమ్మాయిలు అన్నపేరుతో చలనచిత్రంగా కూడా రూపొందింది.

సమీక్షలు మార్చు

ప్రాచుర్యం మార్చు

కాలాతీత వ్యక్తులు నవల తెలుగు సాహిత్యరంగంలో గొప్పనవలల్లో ఒకటిగా ప్రసిద్ధికెక్కింది. సాహిత్యరంగంలోని ఐదు గొప్ప నవలల్లో ఒకటిగా ఈ నవలను సాహిత్య విమర్శకులు గుర్తించారు.

మూలాలు మార్చు

ఆధార గ్రంథాలు, వ్యాసాలు మార్చు

  • ఓరుగంటి పార్వతీదేవి. డా. పి. శ్రీదేవి కల్పనాసాహిత్య సమీక్ష. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఎం.ఫిల్. డిగ్రీకోసం సమర్పించిన సిద్ధాంతవ్యాసం. మే 1981.
  • పి. శ్రీదేవి కథలు, కవితలు
  • శీలా సుభద్రాదేవి (2015). పి. శ్రీదేవి. సాహిత్య అకాడెమీ. ISBN 978-81-260-4844-1.