పువ్వాడ అజయ్ కుమార్

భారతీయ రాజకీయ నాయకుడు
(పువ్వాడ అజయ్‌ కుమార్‌ నుండి దారిమార్పు చెందింది)

పువ్వాడ అజయ్‌ కుమార్‌ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, ఖమ్మం శాసనసభ నియోజకవర్గ శాసన సభ్యుడు.[1][2] 2019 సెప్టెంబరు 8 నుండి తెలంగాణ రవాణా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. మమత అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (హైదరాబాద్), ఖమ్మంలోని మమత మెడికల్, నర్సింగ్, డెంటల్ కళాశాలలకు ఛైర్మన్ కూడా ఉన్నాడు. 2016లో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాడు.[3]

పువ్వాడ అజయ్ కుమార్
పువ్వాడ అజయ్ కుమార్


శాసనసభ్యుడు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి
పదవీ కాలం
2014 - 2018, 2018 - ప్రస్తుతం
నియోజకవర్గం ఖమ్మం శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం ఏప్రిల్ 19, 1965
కునవరం గ్రామం, కునవరం మండలం, (ఖమ్మం) అల్లూరి సీతారామరాజు జిల్లా
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు పువ్వాడ నాగేశ్వరరావు, విజయ లక్ష్మి
జీవిత భాగస్వామి వసంత లక్ష్మీ
సంతానం నయన్ రాజ్
నివాసం ఖమ్మం

పువ్వాడ అజయ్ కుమార్ 1965 ఏప్రిల్ 19న పువ్వాడ నాగేశ్వరరావు, విజయ దంపతులకు కూనవరం గ్రామం, కూనవరంమండలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఖమ్మం జిల్లా, (తెలంగాణ విభజన తరువాత )ఇప్పటి ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా లో జన్మించాడు. ఆయన తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే & సీపీఐ జాతీయ నాయకుడు

విద్యాభాస్యం

మార్చు

పువ్వాడ అజయ్ కుమార్ ఇంటర్ వరకు ఆయన ఖమ్మంలోనే చదువుకున్నాడు. డిగ్రీ హైదరాబాద్‌లో పూర్తి చేశాడు. అయన బెంగుళూరులోని యూనివర్సిటీ అఫ్ అగ్రికల్చరల్ సైన్స్సెస్ నుండి ఎమ్మెస్సీ (అగ్రికల్చర్) పూర్తి చేసి, గోల్డ్ మెడల్ పొందాడు. విద్యాభ్యాసం పూర్తి చేసిన అనంతరం ఖమ్మంలోని మమత హాస్పిటల్, మమత మెడికల్ కాలేజీలకు ఛైర్మన్‌గా వ్యవహరించాడు.

వ్యక్తిగత జీవితం

మార్చు

అజయ్ కుమార్ కు వసంత లక్ష్మీతో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు (నయన్ రాజ్).

రాజకీయ విశేషాలు

మార్చు

పువ్వాడ అజయ్ కుమార్ 2012 లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేశాడు.[4] 2012 నుంచి 2013 ఏప్రిల్‌ వరకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాడు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా వ్యవహరించాడు.[5] 2013 లో కాంగ్రెస్ పార్టీలో చేరి, 2014లో ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేసి[6] టిడిపి అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుపై 5609 ఓట్ల తేడాతో గెలుపొంది, తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[7] 2016లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[8] 2018లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి రెండోసారి ఖమ్మం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు పై 10,991 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[9] 2019 సెప్టెంబరు 8న ముఖ్యమంత్రి కెసీఆర్ రెండవ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.[10][11][12]

మూలాలు

మార్చు
  1. https://www.andhrajyothy.com/elections/prajatantram_article?SID=636395[permanent dead link]
  2. Statistical Report on General Elections 2014 to Legislative Assembly of Andhra Pradesh (PDF). Election Commission of India. 2014. p. 10.
  3. "Khammam MLA quits Congress; to join TRS". The Hindu. 25 April 2016.
  4. "High post for Puvvada's son in YSR Congress". The Hindu. 25 March 2012.
  5. సాక్షి, పాలిటిక్స్ (9 September 2019). "రవాణాశాఖ మంత్రిగా ఖమ్మం ఎమ్మెల్యే". Sakshi. Archived from the original on 9 September 2019. Retrieved 9 September 2019.
  6. List of Contesting Candidates (Form 7A) - AC Phase - 1 (PDF). Chief Electoral Officer, Telangana. 2014. p. 5.
  7. Statistical Report on General Elections 2014 to Legislative Assembly of Andhra Pradesh (PDF). Election Commission of India. 2014. p. 10.
  8. "Khammam MLA quits Congress; to join TRS". The Hindu. 25 April 2016.
  9. "Ajay Kumar Puvvada(Indian National Congress(INC)):Constituency- KHAMMAM(KHAMMAM) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2021-08-19.
  10. "Ajay Kumar Puvvada MLA of Khammam Telangana contact address & email". nocorruption.in (in ఇంగ్లీష్). Retrieved 2021-08-19.
  11. నమస్తే తెలంగాణ, తాజా వార్తలు (8 September 2019). "ఆరుగురు మంత్రుల ప్రమాణస్వీకారం". ntnews.com. Archived from the original on 8 September 2019. Retrieved 8 September 2019.
  12. సాక్షి, తెలంగాణ (8 September 2019). "శాఖల కేటాయింపు: హరీష్‌కు ఆర్థిక శాఖ". Sakshi. Archived from the original on 8 September 2019. Retrieved 8 September 2019.