వైఎస్‌ఆర్ జిల్లా

ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా
(వైఎస్ఆర్ నుండి దారిమార్పు చెందింది)

కడపజిల్లా[1] ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతానికి చెందిన జిల్లా. సుప్రసిద్ధ వాగ్గేయకారుడు, సంకీర్తనాచార్యుడయిన అన్నమయ్య, ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన, తెలుగు జాతీయ కవి వేమన, తొలి తెలుగు కవయిత్రి తాళ్ళపాక తిమ్మక్క, మరో ప్రసిద్ధ కవయిత్రి మొల్ల, మహోన్నతమైన యోగి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, అయ్యలరాజు రామభద్రుడు ఈ జిల్లాకు చెందినవారే. ప్రపంచ ప్రఖ్యాత సురభి నాటక సమాజం ప్రస్థానం 1885లో కడప జిల్లా సురభి గ్రామంలో 'కీచక వధ' నాటక ప్రదర్శనతో మొదలయ్యింది. ఈ సమాజ వ్యవస్థాపకుడు వనారస గోవిందరావు. ఈ జిల్లా బెరైటీస్ (ముగ్గురాయి) గనులు, బండలకు ప్రసిద్ధి చెందింది.పూర్వం ఈ జిల్లాకు హిరణ్యదేశంని పేరు ఉంది. ఈ ప్రదేశం పల్లవులు, తెలుగు చోళులు, కాకతీయులు, విజయనగర రాజులు, గండికోట పెమ్మసాని నాయకులు, నిజాం నవాబులు, సిద్ధవటం నుంచి పరిపాలించిన మట్లి రాజులు, కడప నవాబులచే పరిపాలించ బడింది. Map

వైయస్ఆర్ కడప జిల్లా
.
.
India - Andhra Pradesh - YSR Kadapa.svg
Countryభారత దేశం
Stateఆంధ్ర ప్రదేశ్
Regionరాయలసీమ
Headquarterకడప
విస్తీర్ణం
 • మొత్తం15,359 కి.మీ2 (5,930 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం28,84,524
 • సాంద్రత188/కి.మీ2 (490/చ. మై.)
Languages
 • Officialతెలుగు
ప్రామాణిక కాలమానంUTC+5:30 (IST)
Telephone code+91 0( )
Literacy67.88 (2001)
Literacy Male78.41
Literacy Female57.26
జాలస్థలిkadapa.ap.nic.in

జనాభా లెక్కలుసవరించు

2011 భారత జన గణన ప్రకారం జిల్లా జనాభా 28,84,524 మగవారు 1454136, ఆడవారు 1430388. జనసాంద్రత 188/కి.మీ². 2001 జనగణన ప్రకారం అక్షరాస్యత 67.88% కాగా మగవారిలో 78.41% మరియు ఆడవారిలో 57.26%గా ఉంది.

1981 నాటి జనాభా లెక్కల ప్రకారం ఈ జిల్లా జనాభా... 19.33 లక్షలు, స్త్రీ పురుషుల నిష్పత్తి: 96:100, అక్షరాస్యత: 30.99

జిల్లా చరిత్రసవరించు

కడప జిల్లాచరిత్ర చాలా ప్రాచీనమైంది. క్రీ.పూ. 274-236 ప్రాంతంలో అశోక చక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించాడు. ఆ తరువాత శాతవాహనులు పాలించారు. శాతవాహనుల నాణేలు పెద్దముడియం, దానవులపాడు గ్రామాల్లో దొరికాయి. క్రీ.శ. 250-450 ప్రాంతంలో పల్లవరాజులు పాలించారు. ఇంకా రాష్ట్రకూటులు, చోళులు, కళ్యాణి చాళుక్యులు, వైదుంబులు, కాకతీయులు మొదలైన రాజవంశాలు ఈ ప్రాంతాన్ని పాలించాయి. క్రీ.శ. 1336-1565 కాలంలో విలసిల్లిన విజయనగర సామ్రాజ్యంలో వైఎస్ఆర్ కడప జిల్లా ఒక భాగం. గండికోటను పాలించిన పెమ్మసాని నాయకులు విజయనగర రాజులకు సామంతులుగా విధేయులై పేరుప్రఖ్యాతులు పొందారు. నంద్యాల రాజులు, మట్లి రాజులు కూడా ఈ ప్రాంతం మీద పెత్తనం సాగించారు. విజయనగర పతనం తర్వాత గోల్కొండ నవాబులు, బీజాపూరు సుల్తానులు, ఔరంగజేబు మొదలైన మహమ్మదీయ రాజులు పాలించారు. క్రీ.శ. 1710 ప్రాంతంలో అబ్దుల్ నబీ ఖాన్ కడపలో కోటను నిర్మించాడు. నవాబుల తర్వాత పాళెగాళ్ళు విజృంభించారు.ఆ తరువాత ఈస్టిండియా కంపెనీ ఈ ప్రాంతం మీద ఆధిపత్యం వహించింది. సర్ థామస్ మన్రో వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టరుగా పనిచేశాడు. పాలెగాళ్ళను అణచాడు. రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు.ఈ ప్రాంతపు అభివృద్ధికి బ్రిటీసు ప్రభుత్వంలో కొంతవరకు అభివృద్దికి కృషి జరిగినట్లు భావించవచ్చు.మన్రో ఈ ప్రాంతపు దేవాలయాల అభివృద్ధికి మడిమాన్యాలిచ్చాడు. సి.పి.బ్రౌన్ తెలుగు భాషను సముద్ధరించాడు. మనుచరిత్ర, వసుచరిత్ర వంటి తెలుగు కావ్యాలను ముద్రించాడు. మూడు వేలకు పైగా వేమన పద్యాలను సేకరించాడు. వాటిని ఇంగ్లీషులోకి అనువదించి అచ్చు వేయించాడు. ఇక కోలిన్ మెకంజీ గ్రామాల చరిత్రను సేకరించి కైఫీయతుల పేరుతో భద్రపరిచాడు.2010 జూలై 8 నుండి ఈ జిల్లా పేరును ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వై.ఎస్.ఆర్ కడప జిల్లాగా[2] మార్చింది.రాయలసీమలోని నాలుగు జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నడిబొడ్డైన కడపలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అనేక ప్రాంతీయ, కేంద్ర కార్యాలయాలు ఉన్నాయి.

భౌగోళికము స్వరూపంసవరించు

తూర్పున నెల్లూరు జిల్లా, పశ్చిమాన అనంతపురం జిల్లా, దక్షిణాన చిత్తూరు జిల్లా, ఉత్తరాన కర్నూలు జిల్లా,ప్రకాశం జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి.కొండప్రాంతం, నైసర్గికంగా పీఠభూమి, నల్లనేల భాగాలుగా చెప్పుకోవచ్చు. శేషాచలం కొండలు ఈ జిల్లాలో విస్తారంగా వ్యాపించి ఉన్నాయి. వాటిని పాలకొండలని, నల్లమల కొండలని, వెలికొండలని, ఎర్రమల కొండలని పిలుస్తారు. జిల్లాలో నల్లరేగడి, ఎర్రరేగడి, ఇసకపొర నేలలు ఉన్నాయి.

వాతావరణం

ఉష్ణోగ్రతలు వేసవికాలంలో 30°సె. - 44°సె, చలికాలంలో 21°సె. - 30°సెగా వుంటాయి. సగటు వర్షపాతము: 695 మి.మీ[3]

నదులు

పెన్న, చిత్రావతి, కుందేరు, పాపాఘ్ని, సగిలేరు మరియు చెయ్యేరు జిల్లాలో ప్రవహించే ప్రధాన నదులు[3].

అటవీ సంపద

అడవుల విస్తీర్ణం 4,96,672 హెక్టార్లు, జిల్లా విస్తీర్ణంలో 32.3 శాతం అన్నమాట.పులివెందుల మండలంలో తప్ప నల్లచేవ, ఎర్రచేవ,ఎపి మొదలైన కలప జాతులు, విదేశీమారకం తెచ్చిపెట్టే ఎర్రచందనము లభ్యమవుతుంది. ప్రపంచంలో మరెక్కడా కనిపించకుండా ఆంతరించి పోయిందనుకున్న కలివికోడి ఇక్కడి శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యంలో కనిపించింది. సింహాలు, చిరుతపులులు, మెదలయిన వన్యప్రాణులు ఈ అడవులలో నివసిస్తున్నాయి.

జలవనరులు

తుంగభద్ర నది మీద సుంకేశుల ఆనకట్ట వద్ద మొదలై "కర్నూలు కడప కాలువ" కడప, కర్నూలు జిల్లాల ద్వారా ప్రవహిస్తూ నాలుగు వేల హెక్టార్ల సాగుభూమికి నీటిని సమకూరుస్తుంది. సాగునీటి పారుదల కొరకు హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు, పులివెందల కాలువ నిర్మాణంలో ఉన్నాయి. బుగ్గవంక నది మీద ఇప్పపెంట గ్రామం వద్ద పుల్లల మడుగు జలాశ్రయం నిర్మించబడింది. గాలేరు-నగరి సుజల స్రవంతి కాలువ, జిల్లాలో త్రాగునీటికి ముఖ్య ఆధారము. మాధవరం చేనేత పరిశ్రమ జిల్లాకు ఆదాయం తెచ్చిపెట్టే ఒక ముఖ్య ఆధారం.

ఆర్ధిక స్థితిగతులుసవరించు

వ్యవసాయంసవరించు

వరి, సజ్జ, జొన్న, రాగి వంటి ఆహార ధాన్యాలు, మామిడి, చీనీ, బొప్పాయి వంటి పండ్ల తోటలు, చెఱకు, పసుపు వంటి వాణిజ్య పంటలు పండుతున్నాయి. చెన్నూరు తమలపాకులు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. మైదుకూరు ప్రాంతంలో పండే కె.పి.ఉల్లి విదేశాలకు ఎగుమతి అవుతుంది. కృష్ణాపురం గ్రామం పేరు మీదుగా ఆ వంగడానికి ఆ పేరు వచ్చింది.

జిల్లాలో పెన్నానది, కె.సి.కాలువ ప్రధానమైన నీటి వనరులు. జిల్లా మొత్తంలో కాలువల క్రింద 24 వేల హెక్టార్లు, చెరువుల క్రింద 22 వేల హెక్టార్లు, బావుల క్రింద 66 వేల హెక్టార్లు తక్కిన వనరుల క్రింద 11 వేల హెక్టార్లు సాగులో ఉన్నాయి.ఊటుకూరులో వ్యవసాయ పరిశోధనా కేంద్రము, కృషి విజ్ఞాన కేంద్రం, అనంత రాజపేటలో పండ్ల పరిశోధన కేంద్రం, మైదుకూరులో జాతీయ ఉద్యనవనాల పరిశోధనాభివృద్ధి సంస్థ ఉన్నాయి.

ఖనిజాలు-పరిశ్రమలుసవరించు

వైఎస్ఆర్ జిల్లాలో ప్రపంచంలో మరెక్కడా లభించనంత ముగ్గురాయి (బెరైటీస్) మంగంపేట గనుల్లో లభిస్తోంది.[4]పులివెందుల ప్రాంతంలో రాతినార తీస్తున్నారు.నాప రాళ్ళకు కడప పెట్టింది పేరు. పులివెందుల నియోజకవర్గంలో యురేనియం నిక్షేపాలను కనుగొన్నారు. వేముల మండలంలోని తుమ్మలపల్లె గ్రామంలో యురేనియం శుద్ధి కర్మాగారం ఉంది. యర్రగుంట్ల ప్రాంతంలో సిమెంటు పరిశ్రమ, విస్తరిస్తోంది. జమ్మలమడుగులో ఉక్కు కర్మాగారం నిర్మాణంలో ఉంది. ముద్దనూరు దగ్గర ఏర్పాటైన ఆర్.టి.పి.పి. రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు మెగాపవర్ ప్రాజెక్టు.కడప ప్రొద్దుటూరులో పారిశ్రామిక వాడలున్నాయి. రాయలసీమ అభివృద్ధి పథకం కింద కడపలో చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ నెలకొల్పడం జరిగింది.

డివిజన్లు లేదా మండలాలు, నియోజక వర్గాలుసవరించు

మొత్తం 896 గ్రామాలు 644 గ్రామ పంచాయితీల, 51 మండలాల, మూడు రెవిన్యూ డివిజన్ల పరిధిలో ఉన్నాయి. జిల్లాలో కడప నగరపాలకసంస్థ, ప్రొద్దుటూరు, పులివెందుల, జమ్మలమడుగు, రాజంపేట, రాయచోటి పురపాలక సంస్థలు.

  • మండలాలు (51)


 

1 కొండాపురం మండలం

2 మైలవరం మండలం

3 పెద్దముడియం మండలం

4 రాజుపాలెం మండలం

5 దువ్వూరు మండలం

6 మైదుకూరు మండలం

7 బ్రహ్మంగారిమఠం మండలం

8 బి.కోడూరు మండలం

9 కలసపాడు మండలం

10 పోరుమామిళ్ల మండలం

11 బద్వేలు మండలం

12 గోపవరం మండలం

13 ఖాజీపేట మండలం

14 చాపాడు మండలం

15 ప్రొద్దుటూరు మండలం

16 జమ్మలమడుగు మండలం

17 ముద్దనూరు మండలం

18 సింహాద్రిపురం మండలం

19 లింగాల మండలం

20 పులివెందల మండలం

21 వేముల మండలం

22 తొండూరు మండలం

23 వీరపునాయునిపల్లె మండలం

24 యర్రగుంట్ల మండలం

25 కమలాపురం మండలం

26 వల్లూరు మండలం

27 చెన్నూరు మండలం

28 అట్లూరు మండలం

29 ఒంటిమిట్ట మండలం

30 సిద్ధవటం మండలం

31 కడప మండలం

32 చింతకొమ్మదిన్నె మండలం

33 పెండ్లిమర్రి మండలం

34 వేంపల్లె మండలం

35 చక్రాయపేట మండలం

36 లక్కిరెడ్డిపల్లె మండలం

37 రామాపురం మండలం

38 వీరబల్లె మండలం

39 రాజంపేట మండలం

40 నందలూరు మండలం

41 పెనగలూరు మండలం

42 చిట్వేలు మండలం

43 కోడూరు మండలం

44 ఓబులవారిపల్లె మండలం

45 పుల్లంపేట మండలం

46 టి.సుండుపల్లె మండలం

47 సంబేపల్లి మండలం

48 చిన్నమండెం మండలం

49 రాయచోటి మండలం

50 గాలివీడు మండలం

51 కాశి నాయన మండలం

రవాణా సౌకర్యాలుసవరించు

బ్రిటిష్ కాలంలో ఏర్పాటైన కడప విమానాశ్రయం 1990 దశకంలో మూతపడింది. 2014 లో దీనిని ప్రారంభించారు. దేశంలోని అతి ప్రధానమైన రైలు మార్గాల్లో ఒకటిగా 1854-1866 మధ్య కాలంలో వేయబడిన ముంబై-చెన్నై రైలు మార్గం ఈ జిల్లాలో ఉన్న ఏకైక రైలు మార్గం. రైల్వే కొండాపురం, ముద్దనూరు, ఎర్రగుంట్ల, కమలాపురం, కడప, ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట, రైల్వే కోడూరు ఈ జిల్లాలో ఈ రైలు మార్గం కలిపే ముఖ్య పట్టణాలు. ముఖ్య వాణిజ్య పట్టణమైన ప్రొద్దుటూరు మీదుగా ఎర్రగుంట్ల-నంద్యాల రైలు మార్గం నిర్మాణ దశలో ఉంది. కడప-నెల్లూరు, కడప-బెంగుళూరు రైలు మార్గాలు వెయ్యాలనే ప్రతి పాదనలు ఉన్నాయి. కర్నూలు-కడప-చిత్తూరు పట్టణాలను కలిపే 18వ నంబరు జాతీయ రహదారి, కడప-చెన్నై, కడప-బెంగుళూరు రాష్ట్ర రహదారులు. నెల్లూరు-బళ్ళారిలను కలిపే మరో ముఖ్యమైన రహదారి మైదుకూరు మీదుగా వెళ్తుంది.

పశు పక్ష్యాదులుసవరించు

లంకమల్లేశ్వరములో శ్రీ లంకమల్లేశ్వర వన్యప్రాణి సంరక్షణాలయం, రాజంపేటలో శ్రీ వేంకటేశ్వర వన్యప్రాణి సంరక్షణాలయం ఉన్నాయి.

విద్యా సంస్థలుసవరించు

2001 గణాంకాల ప్రకారం అక్షరాస్యత 62.53% కాగా మగవారిలో 71.22%,ఆడవారిలో 53.74%గా ఉంది. విద్యశాలలకు సంబంధించిన గణాంకాలు క్రింది పట్టికలో చూడండి. ఇవేకాకబోధనా, సార్వత్రిక విద్య, కంప్యూటర్ విషయాలకు సంబంధించి శిక్షణా సంస్థలు కూడా ఉన్నాయి.

వైఎస్ఆర్ కడప జిల్లా విద్యాసంస్థల గణాంకాలు
విభాగం మొత్తం విద్యాశాలల సంఖ్య వ్యాఖ్య
పాఠశాల విద్య 4543 [6],2010నాటికి 3322 ప్రాథమిక పాఠశాలలు, 490 ప్రాథమికోన్నత పాఠశాలలు,725 ఉన్నత పాఠశాలలు
పారిశ్రామిక శిక్షణ (ఐటిఐ) 18 [7], ప్రభుత్వసంస్థలు 3
ఇంటర్మీడియట్ 181 [8], 41వృత్తి ఇంటర్మీడియట్ కళాశాలలు [9]
పాలిటెక్నిక్ 15 [10]
కళాశాల విద్య ( వృత్తేతర) (ఉన్నత విద్య) * [11] ప్రభుత్వ సంస్థలు:
వృత్తివిద్య (ఇంజనీరింగ్) * [12]
వృత్తి విద్య (ఎమ్.బి.ఎ.) * [13]
వృత్తి విద్య (ఫార్మసీ) * [14]
వృత్తి విద్య (ఎమ్.సి.ఎ.) * [15]
వైద్యవిద్య (సాధారణ వైద్యం) 1
వైద్యవిద్య (దంత వైద్యం) 1
వైద్యవిద్య (నర్సు) *
వైద్యవిద్య (వైద్య అనుబంధ) * [16]
‌విశ్వవిద్యాలయాలు లేక సమానస్థితిగలవి 1

గ్రంథాలయాలుసవరించు

కడపలో యోగి వేమన విశ్వవిద్యాలయం, రిమ్స్ (రాజీవ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) వైద్య కళాశాల ముఖ్యమైనవి. ఇవి కాక పులివెందులలో జే.ఎన్.టీ.యూ. (జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం) ఇంజినీరింగ్ కళాశాల, కడపలో క్రీడా పాఠశాల, ప్రభుత్వ హోమియో కళాశాల ఉన్నాయి. ఇక కడపలో సి.పి.బ్రౌన్ నివసించిన బంగళాలో ఆయన పేరిట నెలకొల్పిన బ్రౌన్ గ్రంథాలయం ప్రస్తుతం యోగి వేమన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా భాషా సాహిత్య పరిశోధనా కేంద్రంగా పనిచేస్తోంది.

ఆకర్షణలుసవరించు

 
అంధ్రప్రదేశ్ యొక్క ముఖ్య పుణ్యక్షేత్రాలు

ధార్మిక వ్యవస్థకు పునాదులైన ఎన్నో దేవాలయాలు, క్షేత్రాలు, తీర్థాలు ఈ జిల్లాలో ఉన్నాయి.[17] రాజులు, రాజ్యాలు అంతరించినా ఆనాటి చరిత్రకు గుర్తులుగా చాంద్ పీరా గుంబద్, గండికోట దుర్గం, గండికోట, సిద్ధవటం కోట, ఓంటిమిట్ట, తాళ్ళపాక ఉన్నాయి. భగవాన్ మహావీర్ ప్రభుత్వ సంగ్రహాలయం కడపలో ఉంది.

ఇవే కాక మస్జీద్-ఏ-ఆజమ్, కడప, అత్తిరాల, రాజంపేట, గండి ఆంజనేయస్వామి దేవాలయము, వేంపల్లె, నామాలగుండు, కనంపల్లెదేవరరాయి, సంబేపల్లి, వీరభద్ర స్వామి దేవాలయము, దేవళాలు (అల్లాడుపల్లె), చాపాడు మండలం, రాచవేటి వీరభద్ర స్వామి దేవాలయము, రాయచోటి, సంజీవరాయుడు దేవాలయము ప్రొద్దుటూరు మొదలగునవి ఉన్నాయి.

ప్రకృతి రమణీయాలైన కొండలు, కోనలు, చందన వృక్షాలు, వన్యమృగాలు ఈ జిల్లాలో ఉన్నాయి.

ప్రముఖ వ్యక్తులుసవరించు

వాగ్గేయ కారులుసవరించు

అన్నమయ్య

యోగి వేమన

రాజకీయనాయకులుసవరించు

వై.యస్. రాజశేఖరరెడ్డి
వై.ఎస్.వివేకానందరెడ్డి
వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి,

ప్రభుత్వ అధికారులుసవరించు

యాగా వేణుగోపాలరెడ్డి,

కార్టూనిస్టులుసవరించు

జయదేవ్,

సాహిత్యంలోసవరించు

దుర్భాక రాజశేఖర శతావధాని

నాటక రంగం, సినిమా రంగంసవరించు

కన్నాంబ
పద్మనాభం
ఎల్.యోగానంద రావ్

ప్రసార సాధనాలుసవరించు

1963 జూన్ 16న కడపలో ఆకాశవాణి కేంద్రం ఏర్పాటైంది. ఇక్కడి నుంచి ప్రసారాలు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, మహబూబ్ నగర్ జిల్లాలు, పొరుగు రాష్ట్రాల్లోని రాయచూరు, బళ్ళారి, బెంగుళూరు, కోలారు, చెన్నై తదితర ప్రాంతాల్లోనే కాక 900 కి.మీ. పరిధిలోని తెలుగు ప్రజలకు అందుతున్నాయి. ఇది కాక కడపలో దూరదర్శన్ రిలే కేంద్రం ఉంది.

బయటి లింకులుసవరించు

మూలాలుసవరించు

  1. "కడప జిల్లా ప్రభుత్వ జాలస్థలం". Archived from the original on 2018-06-19. Retrieved 2020-01-09.
  2. REVENUE (DA) DEPARTMENT G.O.Rt.Dated:05-10-2009
  3. 3.0 3.1 "Cuddapah - Introduction". indiatravelite.com. http://www.indiatravelite.com/hyderabad/cuddapahintroduction.htm. 
  4. "Industrial profile Kadapa District, Industries Dept 2001-02" (PDF). Archived from the original (PDF) on 2012-05-13. Retrieved 2012-05-25.
  5. ఎపి ఆన్లైన్ లో కడప వివరాలు[permanent dead link]
  6. "2010-11 సావంత్సరిక నివేదిక" (PDF). Archived from the original (PDF) on 2013-09-14. Retrieved 2012-05-14.
  7. జాతీయ వృత్తిపర శిక్షణ సమాచార వ్యవస్థ
  8. వైఎస్ఆర్లో సాధారణ ఇంటర్మీడియట్ కళాశాల వివరాలు[permanent dead link]
  9. వైఎస్ఆర్లో వృత్తి ఇంటర్మీడియట్ కళాశాల వివరాలు[permanent dead link]
  10. దొడ్ల నారపరెడ్డిw/SbtetinAP.aspx?districtid=5 వైఎస్ఆర్ పాలిటెక్నిక్ కళాశాలలు[permanent dead link]
  11. ఆంధ్ర ప్రదేశ్ కళాశాలలవివరాలు
  12. "యోగి వేమన విశ్వవిద్యాలయ పరిధిలో ఇంజనీరింగ్ కళాశాలలు". Archived from the original on 2012-05-12. Retrieved 2012-05-14.
  13. "యోగి వేమన విశ్వవిద్యాలయ పరిధిలో ఎమ్.బి.ఎ. కళాశాలలు". Archived from the original on 2012-05-12. Retrieved 2012-05-14.
  14. "యోగి వేమన విశ్వవిద్యాలయ పరిధిలో ఫార్మసీ కళాశాలలు". Archived from the original on 2012-05-12. Retrieved 2012-05-14.
  15. "యోగి వేమన విశ్వవిద్యాలయ పరిధిలో ఎమ్.సి.ఎ. కళాశాలలు". Archived from the original on 2012-05-12. Retrieved 2012-05-14.
  16. ఆంధ్ర ప్రదేశ్ లో పారామెడికల్ కళాశాలలు
  17. కడప జిల్లాలోని పర్యాటక ఆకర్షణలు