పూల సుబ్బయ్య
పూల సుబ్బయ్య మార్కాపురం మాజీ ఎమ్మెల్యే, సీపీఐ నాయకుడు. అతను మార్కాపురం నియోజకవర్గం నుండి 1978 శాసనసభ ఎన్నికలలో శాసనసభ్యునిగా ఎంపికయ్యాడు.[1] ఈయన సేవలకు గుర్తింపుగా వెలిగొండ ప్రొజెక్టుకు పూలసుబ్బయ్య పేరు పెట్టారు.
పూల సుబ్బయ్య | |
---|---|
ఆంధ్రప్రదేశ్ శాసనసభ | |
In office 1962–1967 | |
అంతకు ముందు వారు | జె.ఆర్.రెడ్డి |
తరువాత వారు | పూల సుబ్బయ్య |
నియోజకవర్గం | ఎర్రగొండపాలెం |
మెజారిటీ | 25304 |
In office 1967–1972 | |
అంతకు ముందు వారు | పూల సుబ్బయ్య |
తరువాత వారు | కందుల ఓబుల్ రెడ్డి |
నియోజకవర్గం | ఎర్రగొండపాలెం |
మెజారిటీ | 26451 |
In office 1978–1983 | |
అంతకు ముందు వారు | ఎం.నాసర్ బేగ్ |
తరువాత వారు | వెన్న వెంకటనారాయణరెడ్డి |
నియోజకవర్గం | మార్కాపురం |
మెజారిటీ | 28030 |
వ్యక్తిగత వివరాలు | |
జననం | పూల సుబ్బయ్య 1929 జూన్ 29 కంభం |
మరణం | 1988 జూన్ 23 | (వయసు 58)
రాజకీయ పార్టీ | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సి.పి.ఐ) |
తల్లిదండ్రులు | వెంకటపతి, సుబ్బమ్మ |
నివాసం | మార్కాపురం |
కళాశాల | ఆంధ్ర క్రైస్తవ కళాశాల, గుంటూరు |
వృత్తి | న్యాయవాది, రాజకీయ నాయకుడు |
నిరంతరం కరువు కాటకాలతో సతమతమవుతున్న పశ్చిమ ప్రకాశానికి వెలిగొండ ప్రాజెక్ట్ నీరు మినహా మరో ప్రత్యామ్నాయం లేదని, ఈ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను మళ్లిస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అతను పెద్దఎత్తున ఉద్యమాలు చేశాడు.[2]
జీవిత విశేషాలు
మార్చుబాల్యం, విద్యాభ్యాసం
మార్చుపూల సుబ్బయ్య 1929, జూన్ 29వ తేదీన ప్రకాశం జిల్లా, కంభంలో వెంకటపతి, సుబ్బమ్మ దంపతులకు జన్మించాడు.[3] బాల్యంలోనే తండ్రిని కోల్పోవడంతో తల్లి ఇతడిని కష్టపడి చదివించింది. ఇతడు 1946-49లో ఆంధ్ర క్రైస్తవ కళాశాల, గుంటూరు నుండి డిగ్రీ పూర్తి చేశాడు. 1950లో తురిమెళ్ళలోని ఒక ఎయిడెడ్ ఉన్నత పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశాడు. 1952-53లో బెల్గాంలో న్యాయవిద్యను అభ్యసించాడు. తరువాత మార్కాపురంలో న్యాయవాదిగా స్థిరపడ్డాడు.
రాజకీయ జీవితం
మార్చువిద్యార్థి దశలో 1949లో ఇతడు అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఎ.ఐ.ఎస్.ఎఫ్)లో సభ్యుడిగా ఉన్నాడు. తురిమెళ్ళలో ఉన్నప్పుడు ఇతనికి కమ్యూనిస్ట్ సాహిత్యంతో పరిచయం ఏర్పడింది. అప్పట్లో రహస్య జీవితం గడుపుతున్న కమ్యూనిస్టు నాయకులతో ఇతడు చర్చలు జరిపేవాడు. లా కళాశాల విద్యార్థి యూనియన్ జనరల్ సెక్రటరీగా ఉంటూ విద్యార్థులలో అభ్యుదయ భావాలు పెంపొందించడంలో కృషి చేశాడు. ఆ సమయంలోనే కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం స్వీకరించాడు. మార్కాపురంలో న్యాయవాదిగా ఉంటూ తాలూకాలో ఉన్న అతివాద యువకులను పార్టీలోనికి సమీకరించాడు. 1956 నుండి మార్కాపురం తాలూకా పార్టీ కార్యదర్శిగా, తరువాత జిల్లా పార్టీలోను, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కార్యదర్శిగా పనిచేశాడు. 1960లో మార్కాపురం పలకల కార్మికుల సంఘానికి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించాడు. మార్కాపురం పట్టణంలో తాలూకా పార్టీ ప్రథమ మహాసభలను సమర్థవంతంగా నిర్వహించాడు.
1962, 1967లలో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుండి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అభ్యర్థిగా నిలబడి ఆ ఎన్నికలలో గెలుపొందాడు. 1978 శాసనసభ ఎన్నికలలో తిరిగి మార్కాపురం నుండి నిలబడి మూడవసారి శాసనసభ సభ్యునిగా ఎన్నికైనాడు.[3]
సాగు, తాగు నీటి సౌకర్యాలు లేక కరువు తాండవిస్తున్న ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతానికి కృష్ణానది జలాలను తరలించాలని ఇతడు పెద్ద ఎత్తున ఉద్యమాలను నడిపాడు. ఇతని కృషి ఫలితంగానే ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభమయ్యింది. ఈ ప్రాజెక్టు కోసం అహర్నిశలు పాటుపడిన పూల సుబ్బయ్య పేరును దానికి పెట్టాలనే ప్రజల డిమాండును అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి అంగీకరించి పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు అని నామకరణం చేశాడు.
మరణం
మార్చుప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజల అభివృద్ధికి పాటుపడిన పూల సుబ్బయ్య 1988, జూన్ 23న అనారోగ్యంతో మరణించాడు.[3]
మూలాలు
మార్చు- ↑ "IndiaVotes AC: Andhra Pradesh 1978". IndiaVotes. Retrieved 2024-04-17.[permanent dead link]
- ↑ ABN (2023-06-24). "వెలిగొండ పూర్తయితేనే పూలసుబ్బయ్యకు నిజమైన నివాళి". Andhrajyothy Telugu News. Retrieved 2024-04-17.
- ↑ 3.0 3.1 3.2 సంపాదకుడు (16 April 2024). "పేదల ఎర్రదొర పూల సుబ్బయ్య". విశాలాంధ్ర దినపత్రిక. Retrieved 18 April 2024.