పెనమకూరు

ఆంధ్ర రాష్ట్రం లోనందు ఒక మంచి పల్లెటూరు

పెనమకూరు (పెనమకుర్రు) , కృష్ణా జిల్లా, తోట్లవల్లూరు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 165., ఎస్.టి.డి.కోడ్ = 08676.

పెనమకూరు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం తోట్లవల్లూరు
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి నందేటి గంగాభవాని
జనాభా (2011)
 - మొత్తం 2,356
 - పురుషులు 1,178
 - స్త్రీలు 1,178
 - గృహాల సంఖ్య 693
పిన్ కోడ్ 521165
ఎస్.టి.డి కోడ్ 08676

గ్రామ చరిత్రసవరించు

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భౌగోళికంసవరించు

[1] సముద్రమట్టానికి 11 మీ.ఎత్తు

ఈ గ్రామం వుయ్యూరుకు ఏడు కీ.మీ. ల దూరములో ఉంటుంది. సుమారు 4000 జనాభా.

సమీప గ్రామాలుసవరించు

ఈ గ్రామానికి సమీపంలో కుమ్మమూరు, అమీనపురం, చాగంటిపాడు (తోట్లవల్లూరు), గరికపర్రు, యాకమూరు గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలుసవరించు

తోట్లవల్లూరు, కొల్లిపర, కంకిపాడు, పమిడిముక్కల

గ్రామానికి రవాణా సౌకర్యంసవరించు

వుయ్యూరు, మానికొండ, కంకిపాడు నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 31 కి.మీ

గ్రామంలోని విద్యా సౌకర్యాలుసవరించు

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల. మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల:- ఈ పాఠశాల వార్షికోత్సవం, 2016, ఏప్రిల్-5వ తేదీనాడు సందడిగా సాగినది. [5]

గ్రామంలోని మౌలిక సదుపాయాలుసవరించు

ఈ గ్రామానికి ఆసుపత్రి, ప్రయాణ వసతి, విద్యుత్తు మొదలగు వసతులన్నీ ఉన్నాయి.

బ్యాంకులుసవరించు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫోన్ నం. 0866/2805236., సెల్ = 9908524848.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యంసవరించు

గ్రామంలో రాజకీయాలుసవరించు

గ్రామ పంచాయతీసవరించు

  1. 2021 ఫిబ్రవరి 9 వ తేదీన, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో,శ్రీమతి నందేటి గంగాభవాని గారు సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీమతి చాగంటిపాటి సునీత గారు ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

శివాలయంసవరించు

మహా శివరాత్రికి శివాలయంలో, స్వామి వారికి ఐదు రోజులు కళ్యాణ వేడుకలు ఘనంగా చేస్తారు.

శ్రీ మరీదు మహిశమ్మ తల్లి ఆలయoసవరించు

ఊరిలో ప్రతి సంవత్సరం మే నెలలో మరీదు వారి ఇలవేలుపు అయిన మరీదు మహిశమ్మ తల్లి సంబరాలు జరుగుతాయి. ఈ సంబరాలు చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆనందంగా జరుగుతాయి. ఆ అమ్మవారు ఊరిని జాగ్రత్తగా కాపాడుతుంది.

శ్రీ షిర్డీ సాయిబాబా మందిరంసవరించు

గ్రామంలో 50 లక్షల రూపాయల వ్యయంతో, శ్రీ గురుదత్త సేవా సమితి, గ్రామస్థుల సహకారంతో నూతనంగా నిర్మించిన ఈ ఆలయానికి, గ్రామానికి చెందిన శ్రీ కనకమేడల సీతారామయ్య, వారి కుమారులు, 12 సెంట్ల స్థలాన్ని వితరణగా అందించారు. ఈ ఆలయంలో శ్రీ గణపతి, శ్రీ దత్తాత్రేయస్వామి, పాదుకా సహిత శ్రీ షిర్డీ సాయిబాబా వారల విగ్రహప్రతిష్ఠా కార్యక్రమం, 2016, ఫిబ్రవరి-26వ తేదీ మాఘబహుళ పంచమి, శుక్రవారం ఉదయం 7-39కి కన్నులపండువగా నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు ఆలయం వద్ద భారీగా అన్నసమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలంలోని అనేక గ్రామాల నుండి భక్తులు అధికసంఖ్యలో తరలి వచ్చారు. [4]

ఈ ఆలయ ప్రథమ వార్షికోత్సవం 2017,ఫిబ్రవరి-14వతేదీ మంగళవారంనాడు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబాకు ప్రత్యేకపూజలు అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. [6]

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

గ్రామ ప్రముఖులుసవరించు

గ్రామ విశేషాలుసవరించు

  1. అన్ని పండుగలు బాగా చేస్తారు. సంక్రాంతి పండుగకు భారత యువజన సంఘం ఆటలు, పాటలు, నృత్యాలును నిర్వహిస్తుంది. వాటిలో గెలిచిన వారికి ప్రముఖులచే బహుమతులను ప్రదానం చేస్తారు. మధసుధనరావు మరీదు, మొతి మరీదు, యొహన్ మరీదు, రాజ్ కుమార్ మరీదు, పామర్తి అషొక్, జన్ను సతీష్ నాయకత్యంలో జరుగుతాయి. ఈ సంవత్సరం 25 వసంతాలా పూర్తయిన సందర్భంగా, విజయవాడ పోలీసుకమీషనర్ ఎం.రవీంద్రనాద్ బాబు ప్రారంభం చేసారు.
  2. ఈ గ్రామం గురించిన కథ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ స్టేట్ కౌన్ సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ మరియూ ట్రైనింగ్ వారు రూపొందించిన ఆరవ తరగతి సాంఘిక శాస్త్రం పాఠాలలో నాల్గవ అధ్యాయంలో, 2012-13 సంవత్సరం నుండి, తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో ఉంది. దీనిలో ఈ గ్రామ పటంతో పాటు, 14 బొమ్మలతో, వివిధ వృత్తులవారి జీవన విధానం, వ్యవసాయం, పంటల మార్పిడి, గ్రామీణ ఆర్థిక విధానం వగైరాల గురించి వివరంగా పొందు పరచారు. [3]

గణాంకాలుసవరించు

జనాభా (2011) - మొత్తం 2,356 - పురుషుల సంఖ్య 1,178 - స్త్రీల సంఖ్య 1,178 - గృహాల సంఖ్య 693

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2440.[2] ఇందులో పురుషుల సంఖ్య 1233, స్త్రీల సంఖ్య 1207, గ్రామంలో నివాస గృహాలు 674 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 620 హెక్టారులు.

మూలాలుసవరించు

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Thotlavalluru/Penamakuru". Archived from the original on 30 జూలై 2015. Retrieved 18 June 2016. Check date values in: |archive-date= (help); External link in |title= (help)
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-03.

వెలుపలి లింకులుసవరించు

[2] ఈనాడు కృష్ణా; 2013, డిసెంబరు-2; 7వపేజీ. [3] ది హిందు, ఆంగ్ల దినపత్రిక; 2014, ఆగస్టు-22; 3వపేజీ. [4] ఈనాడు అమరావతి/పామర్రు; 2016, ఫిబ్రవరి-27; 1వపేజీ. [5] ఈనాడు అమరావతి/పామర్రు; 2016, ఏప్రిల్-6; 1వపేజీ. [6] ఈనాడు అమరావతి/పామర్రు; 2017, ఫిబ్రవరి-15; 1వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=పెనమకూరు&oldid=3148515" నుండి వెలికితీశారు