పెదకళ్ళేపల్లి (మోపిదేవి)

భారతదేశంలోని గ్రామం
(పెదకళ్ళేపల్లి నుండి దారిమార్పు చెందింది)

పెదకళ్ళేపల్లి, కృష్ణా జిల్లా, మోపిదేవి మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 130., యస్.టీ.డీ.కోడ్ = 08671.

పెదకళ్ళేపల్లి
—  రెవిన్యూ గ్రామం  —
పెదకళ్ళేపల్లి is located in Andhra Pradesh
పెదకళ్ళేపల్లి
పెదకళ్ళేపల్లి
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°04′54″N 80°59′11″E / 16.081738°N 80.986363°E / 16.081738; 80.986363
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం మోపిదేవి
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీ అరజా వెంకటసుబ్బారావు
జనాభా (2001)
 - మొత్తం 6,547
 - పురుషులు 3,623
 - స్త్రీలు 3,591
 - గృహాల సంఖ్య 1,962
పిన్ కోడ్ 521130
ఎస్.టి.డి కోడ్ 08671

గ్రామ చరిత్రసవరించు

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భౌగోళికంసవరించు

[1] సముద్రమట్టానికి 6 మీ.ఎత్తు

సమీప గ్రామాలుసవరించు

ఈ గ్రామానికి సమీపంలో మెరకనపల్లి, వెంకటాపురం, ఉత్తరం చిరువోలులంక గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలుసవరించు

అవనిగడ్డ, చల్లపల్లి, రేపల్లె, ఘంటసాల

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

మోపిదేవి, అవనిగడ్డ నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 64 కి.మీ.

గ్రామంలోని విద్యాసౌకర్యాలుసవరించు

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలసవరించు

పెదకళ్ళేపల్లి గ్రామ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో, 7వ తరగతి చదువుచున్న సనకా నీలిమ అను విద్యార్థిని, రాష్ట్రస్థాయి పరుగు పందేలకు ఎన్నికైనది. 2013,డిసెంబరు 10 న విజయవాడలో జరిగిన అండర్-14, బాలికల పాఠశాలల క్రీడాపోటీలలో, 200మీ. & 600మీ. లలో ప్రథమస్థానం కైవసం చెసుకున్నది. 2013,డిసెంబరు, 10 నుండి 12 వరకూ శ్రీకాకుళంలో జరుగు రాష్ట్రస్థాయి పోటీలలో ఈమె పాల్గొంటుంది. [3]

శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ నాగేశ్వరస్వామి సంస్కృత ఉన్నత పాఠశాలసవరించు

ఈ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాలిగా పనిచేయుచున్న శ్రీమతి విజయలక్ష్మి, 2015,సెప్టెంబర్-5న నిర్వహించు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికైనారు. [12] శ్రీ శారదావిద్యానికేతన్ ప్రాథమికోన్నత పాఠశాల,పెదకళ్ళేపల్లి.

గ్రామంలో మౌలిక వసతులుసవరించు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంసవరించు

దాత శ్రీ యర్రంశెట్టి వెంకటేశ్వరరావు, ఈ కేంద్ర నిర్మాణానికి 72 సెంట్ల స్థలాన్ని వితరణగా అందజేసినారు. ఈ స్థలంలో ఎంతో విశాలంగా ఒక శాశ్వతభవనం నిర్మించి వైద్యసేవలందించుచున్నారు. దాత అందజేసిన స్థలం సిబ్బందికి గృహాలు నిర్మించడానికి గూడా అనుకూలంగా ఉంది. [13]

బ్యాంకులుసవరించు

ఇండియన్ బ్యాంక్. ఫోన్ నం. 08671/275221., సెల్=9912223634.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యంసవరించు

అనుమకొండవారి చెరువు:- ఈ చెరువు గ్రామంలోని ఆరవ వార్డులో ఉంది.

గ్రామ పంచాయతీసవరించు

అడపావారిపాలెం గ్రామం, పెదకళ్ళేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

2013 జూలైలో పెదకళ్ళేపల్లి గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ అరజా వెంకటసుబ్బారావు, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ గండు సాంబశివరావు ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వరస్వామి వారి ఆలయంసవరించు

ఈ ఆలయంలో శివుడు స్వయంభూగా వెలసినాడని భక్తుల విశ్వాసం. దక్షిణకాశీగా పేరుగాంచిన ఈ ఆలయంలో, మహాశివరాత్రి సందర్భంగా, స్వామివారి వార్షిక నవరాత్రి బ్రహ్మోత్సవాలు 2015,ఫిబ్రవరి-14వ తేదీ నుండి 22వ తేదీ వరకు, వైభవంగా నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు అవిశ్రాంతంగా భక్తుల పూజలందుకున్న ఉభయ దేవతా సమేత నాగేశ్వరస్వామివారికి, ఆఖరిరోజైన 22వ తేదీ ఆదివారంనాడు, 12 విశిష్టలతో ద్వాదశ ప్రదక్షిణలు, మేళతాళాల మధ్య, వేడుకగా నిర్వహించారు. అనంతరం పవళింపుసేవ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముత్తైదువులకు పసుపు, కుంకుమ, దుస్తులు, అమ్మవారల కానుకగా అందజేసినారు. అలసి సొలసిన స్వామివారలకు శ్రావ్యంగా లాలి, జోలపాటలు పాడుచూ ఉత్సవాలకు ముగింపు పలికినారు. [4]&[7]

శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత మదనగోపాలస్వామివారి ఆలయంసవరించు

  1. ఈ ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా, 2015,మార్చ్-6వ తేదీ శుక్రవారం నాడు, ఉభయ దేవేరుల సమేతుడైన గోపాలస్వామివారికి వసంతోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. గులాములు జల్లి, రైతులకు కొత్తగా పంట చేతికి వచ్చిన ధాన్యాన్ని, రోకళ్ళతో దంచి స్వామివారికి నివేదించారు. అనంతరం ఉత్సవ మూర్తులను తలపై పెట్టుకొని చక్రస్నానం నిర్వహించారు. నిత్యహోమంతోపాతు బలిహరణ, మహాపూర్ణాహుతి, ధ్వజ అవరోహణ, పార్వేట ఉత్సవాలను వేడుకగా నిర్వహించారు. కార్య్క్రమంలో గ్రామపెద్దలు, భక్తులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. 7వ తేదీ శనివారం ఉదయం స్వామివారికి విశేష అర్చనలు, నవకుంభ ఆరోపణ, చోరసంవాదం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. రాత్రికి ద్వాదశస్వామివారల ఉత్సవ విగ్రహాలను ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. ఈ ఉత్సవాలు శనివారంతో ముగింపుకు చేరుకున్నవి. [8] & [9]
  2. ఈ ఆలయ అవరణలో, గ్రామస్థుల, భక్తుల విరాళాలతో చేపట్టిన, హనుమత్, సీతా, లక్ష్మణ, పరివారసమేతంగా శ్రీ కోదండరామస్వామి విగ్రహాలను, ఋత్విక్కులు వేదమంత్రోచ్ఛారణలమధ్య, ఉదయం 9-15 గంటలకు భక్తబృందం ప్రతిష్ఠించారు. అనంతరం పరివార విగ్రహాలను నిజరూపదర్శనం కల్పించి, భక్తులు కొలిచేందుకు అనుమతించారు. అంతకుముందు పుణ్యాహవచనం, ప్రాణప్రతిష్ఠల కార్యక్రమం నిర్వహించారు. నిజరూపదర్శనం అనంతరం శాంతికళ్యాణం నిర్వహించారు. [11]

శ్రీ నాంచారమ్మ అమ్మవారి ఆలయంసవరించు

పెదకళ్ళేపల్లి గ్రామంలో కొలువైయున్న శ్రీ నాంచారమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ప్రతి సంవత్సరం, చైత్ర శుద్ధ పౌర్ణమికి అత్యంత వైభవంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసెదరు. కుంకుమార్చనలు చేసెదరు. భక్తులు మ్రొక్కులు తీర్చుకొని అమ్మవారిని దర్శించుకొని తరించెదరు. [5]

శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయంసవరించు

గ్రామంలోని పాత బస్సుస్టాండు కూడలిలో నెలకొన్న ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం హనుమజ్జయంతి వేడుకలు (మే నెలలో) రెండు రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. రెండవరోజున భక్తులకు అన్నదానం నిర్వహించెదరు. [6]

ఇస్కాన్సవరించు

పెదకళ్ళేపల్లి గ్రామంలో ఇస్కాన్ శాఖ ఉంది.

తపోవనంసవరించు

గత సంవత్సరం ఏర్పాటుచేసిన ఈ తపోవనంలో, తొలి వార్షికోత్సవాన్ని, 2016,ఫిబ్రవరి-21వ తేదీ ఆదివారంనాడు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సామూహిక ధ్యానం, దీపప్రజ్వలన, మహావైదీప గురుపూజ, ప్రత్యేకంగా ఉచిత మహిళలకు ప్రత్యేక వైద్యశిబిరం, సత్సంగములు మొదలగు కార్యక్రమాలు ఏర్పాటు చేసారు. [14]

పెదకళ్ళేపల్లి గ్రామ సమీప దేవాలయాలుసవరించు

 
మరకత రాజేశ్వరి

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

ప్రముఖులుసవరించు

 
వేటూరి ఆనందమూర్తి

గ్రామ విశేషాలుసవరించు

రాజమండి పట్టణంలో, 2015,మే-27వ తేదీనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతికశాఖ, నందినాటకోత్సవ పురస్కార ప్రదానోత్సవాన్ని, రాజమండ్రి లోక్ సభ సభ్యులు శ్రీ ఎం.మురళీమోహన్ నేతృత్వంలో నిర్వహించి, రాష్ట్రంలో పేరెన్నికగన్న ఆరుగురు వృద్ధకళాకారులను సన్మానించారు. ఈ సందర్భంగా, పెదకళ్ళేపల్లి గ్రామానికి చెందిన శ్రీ తలుపుల వేంకటేశ్వరరావుని దుశ్శాలువతో సన్మానించి, ప్రశంసాపత్రం, ఐదువేల రూపాయల నగదు బహుమతిని అందజేసినారు. ఈ సందర్భంగా వీరు కాళిదాసు నాటకంలో పాత్ర వేయడం గుర్తుచేసారు. [10] జీవిత బీమా సంస్థ వారు, 2017,ఫిబ్రవరి-21న, ఈ గ్రామాన్ని, జీవిత బీమా గ్రామంగా గుర్తించి, యాభైవేల రూపాయలు పారితోషికంగా అందజేసినారు. [15]

గణాంకాలుసవరించు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7214. ఇందులో పురుషుల సంఖ్య 3623, స్త్రీల సంఖ్య 3591, గ్రామంలో నివాస గృహాలు 1962 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2257 హెక్టారులు.

జనాభా (2001) - మొత్తం 7,214 - పురుషుల సంఖ్య 3,623 - స్త్రీల సంఖ్య 3,591 - గృహాల సంఖ్య 1,962

<ref>భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు</r

మూలాలుసవరించు

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Mopidevi/Pedakallepalli". Archived from the original on 25 ఆగస్టు 2012. Retrieved 26 June 2016. Check date values in: |archive-date= (help); External link in |title= (help)

వెలుపలి లింకులుసవరించు

[2] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2013,ఆగస్టు-3; 1వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2013,డిసెంబరు-10; 11వపేజీ. [4] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,మార్చ్-5; 3వపేజీ. [5] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,ఏప్రిల్-16,2వపేజీ. [6] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014.మే-25; 2వ పేజీ. [7] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,ఫిబ్రవరి-23; 2వపేజీ. [8] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,మార్చ్-7; 2వపేజీ. [9] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,మార్చ్-8; 1వపేజీ. [10] ఈనాడు కృష్ణా; 2015,మే-29; 6వపేజీ. [11] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,జూన్-5; 3వపేజీ. [12] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,సెప్టెంబరు-5; 1వపేజీ. [13] ఈనాడు అమరావతి; 2015,అక్టోబరు-28; 39వపేజీ. [14] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2016,ఫిబ్రవరి-22; 3వపేజీ. [15] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2017,ఫిబ్రవరి-22; 1వపేజీ.