పెర్లే మానే (ఆంగ్లం:Pearle Maaney; 1989 మే 28) భారతీయ నటి. ఆమె గీత రచయిత, యూట్యూబర్, టెలివిజన్ ప్రెజెంటర్ కూడా. ఆమె ప్రధానంగా మలయాళ టీవీ, చిత్రాలలో నటిస్తుంది. ఆమె మలయాళ డ్యాన్స్ రియాలిటీ షో డి-4 డ్యాన్స్ మూడు సీజన్‌లకు సహ-హోస్ట్‌గా ఆమె ప్రసిద్ధి చెందింది.[2] 2018లో, బిగ్ బాస్ మలయాళం సీజన్ 1లో ఆమె మొదటి రన్నరప్‌గా నిలిచింది.

పెర్లే మానే
జననం (1989-05-28) 1989 మే 28 (వయసు 35)[1]
అలువా, కొచ్చి, భారతదేశం
విద్యాసంస్థక్రైస్ట్ యూనివర్సిటీ, బెంగళూరు
వృత్తి
  • నటి
  • గీత రచయిత
  • గాయని
  • యూట్యూబర్
  • టెలివిజన్ ప్రెజెంటర్
క్రియాశీల సంవత్సరాలు2011 – ప్రస్తుతం
గుర్తించదగిన సేవలు
చెల్లకుట్టియే
జీవిత భాగస్వామి
శ్రీనిష్ అరవింద్
(m. 2019)
పిల్లలునీలా శ్రీనిష్

తెలుగు సినిమా కళ్యాణ వైభోగమే (2016)లో ఆమె పాల్ పాల్ పాట ఆలపించి మెప్పించింది. 2022లో బోనీ కపూర్ నిర్మించిన పాన్ ఇండియా సినిమా వలిమై ఆమె నటించి అందరిని ఆలరించింది.[3]

బాల్యం, విద్యాభ్యాసం

మార్చు

ఆమె కొచ్చిలో ఉన్న సైరో-మలబార్ సిరియన్ క్రైస్తవ ఉమ్మడి కుటుంబంలో చౌరా జన్మించింది.[4] ఆమె హోలీ ఏంజెల్స్ కాన్వెంట్ త్రివేండ్రం, రాజగిరి పబ్లిక్ స్కూల్, కలమస్సేరిలో పాఠశాల విద్యను అభ్యసించింది. బెంగుళూరులోని క్రైస్ట్ యూనివర్శిటీ నుండి మీడియా స్టడీస్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.[5][6][7]

కెరీర్

మార్చు

ఇండియావిజన్ అనుబంధ సంస్థ అయిన మలయాళ టెలివిజన్ ఛానెల్ యెస్ ఇండియావిజన్‌లో పెర్లే మానే యెస్ జూక్‌బాక్స్ అనే మ్యూజిక్ షో 250 ఎపిసోడ్‌లకు వ్యాఖ్యాతగా వ్యవహంచింది.[8] ఆమె టేస్ట్ ఆఫ్ కేరళ అనే ట్రావెల్-బేస్డ్ కుకరీ షోను సెరాహ్ పేరుతో అమృత టీవీలో హోస్ట్ చేసింది.[9][10]

అక్టోబర్ 2014లో, ఆమె హోస్ట్ జ్యువెల్ మేరీ స్థానంలో మజావిల్ మనోరమలో డ్యాన్స్ రియాలిటీ షో GumOn D2 హోస్ట్ చేసింది. ఆమె సహ-హోస్ట్ గోవింద్ పద్మసూర్య వ్యవహరించింది.[11] కౌముది టీవీ ప్రోగ్రామ్ సినిమా కంపెనీ సీజన్ 2కి కూడా ఆమె హోస్ట్‌గా వ్యవహరించింది. 2018లో, ఆమె ఆసియానెట్‌లో రియాలిటీ షో బిగ్ బాస్ మొదటి సీజన్‌లో పోటీ చేసి రన్నరప్‌గా నిలిచింది. 100 రోజులు పూర్తి చేసుకున్న ఏకైక మహిళా పోటీదారు ఆమె.

వ్యక్తిగత జీవితం

మార్చు

2019 జనవరి 17న, శ్రీనిష్ అరవింద్‌తో ఆమె నిశ్చితార్థం జరిగింది.[12]2019 మే 5న ఈ జంట క్రైస్తవ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు. 2019 మే 8న హిందూ వివాహ వేడుక కూడా జరిగింది.[13] ఆమె 2021 మార్చి 20న కుమార్తె నీలా శ్రీనిష్‌కు జన్మనిచ్చింది.[14][15]

మూలాలు

మార్చు
  1. "Happy Birthday my 'ideal wife and friend', says Srinish as he shares a love-filled birthday wish for wife Pearle Maaney – Times of India". The Times of India. Retrieved 6 April 2021.
  2. "Pearle Maaney in Sameer Thahir's next film". The Times of India. 1 June 2013. Retrieved 26 February 2015.
  3. "Wayback Machine". web.archive.org. 2023-05-21. Archived from the original on 2023-05-21. Retrieved 2023-05-21.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "In pics: 'Bigg Boss' Malayalam stars Pearle Maaney and Srinish get married". The News Minute (in ఇంగ్లీష్). 6 May 2019. Retrieved 23 October 2021.
  5. "Catching up with Pearle Maaney". MalayaliMag.com. 7 October 2013. Archived from the original on 2 April 2015. Retrieved 26 February 2015.
  6. "Very Pearle – WtzUp Kochi". WtzUp Kochi. Retrieved 25 February 2015.
  7. "People think I'm of Arab origin: Pearle Maaney Movie Review". The Times of India. Retrieved 25 February 2015.
  8. "Pearle Maaney Biography". DROLLYDOLL. Archived from the original on 27 January 2015. Retrieved 25 February 2015.
  9. "Serah Profile on Amrita TV". Amrita TV. Archived from the original on 4 March 2016. Retrieved 22 August 2015.
  10. "Taste of Kerala – With SALT & PEPPER Team 1/3". Retrieved 22 August 2015 – via YouTube.
  11. "Pearle Maaney replaces Jewel in D for Dance". The Times of India. Retrieved 25 February 2015.
  12. "Bigg Boss Malayalam runner-up Pearle Maaney engaged to Srinish". Kerala Wedding Trends. Retrieved 18 January 2019.
  13. "Pearle and Srinish make it official; see wedding pics here". Mathrubhumi. Retrieved 24 January 2021.[permanent dead link]
  14. "It's A Baby Girl For Ludo Actress Pearle Maaney". NDTV. Retrieved 21 January 2021.
  15. "Its a baby girl for TV couple Pearle Maaney and Srinish Aravind; the latter says 'both big baby and small baby are adipoli'". The Times of India. Retrieved 21 January 2021.