ప్రజా రాజ్యం (1983 సినిమా)
ప్రజారాజ్యం 1983 లో ఎం. మల్లికార్జునరావు దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో కృష్ణ, జయప్రద ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని కనకరత్న మూవీస్ పతాకంపై జి. నాగరత్నమ్మ పద్మాలయా స్టూడియోస్ సమర్పణలో నిర్మించింది. ఈ చిత్రానికి కథ, మాటలు పరుచూరి సోదరులు సమకూర్చారు. జె. వి. రాఘవులు సంగీత దర్శకత్వం వహించాడు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల పాటలు పాడారు. వేటూరి సుందరరామ్మూర్తి పాటలు రాశాడు.
ప్రజా రాజ్యం | |
---|---|
దర్శకత్వం | ఎం. మల్లికార్జునరావు |
రచన | పరుచూరి సోదరులు (కథ, మాటలు), జి. హనుమంతరావు (చిత్రానువాదం) |
నిర్మాత | జి. నాగరత్నమ్మ |
తారాగణం | కృష్ణ, జయప్రద |
ఛాయాగ్రహణం | పుష్పాల గోపీకృష్ణ |
కూర్పు | కోటగిరి గోపాలరావు |
సంగీతం | జె. వి. రాఘవులు |
నిర్మాణ సంస్థలు | రత్న మూవీస్, పద్మాలయా స్టూడియోస్ (సమర్పణ) |
విడుదల తేదీ | సెప్టెంబరు 29, 1983[1] |
భాష | తెలుగు |
కథ
మార్చుశివరామయ్య, రాఘవయ్య అన్నదమ్ములు. వీరి బావమరిది రాజారావు ఆలయ ధర్మకర్త అయిఉండీ గుళ్ళో నగలు దొంగిలిస్తాడు. ఈ విషయం తెలిసిన గ్రామ పెద్దలు శివరామయ్య, రాఘవయ్యలు అతన్ని ధర్మకర్త పదవి నుండి తొలగిస్తారు. దాంతో వాళ్ళతో బాంధవ్యం తెంచుకుంటాడు రాజారావు.
తారాగణం
మార్చు- కృష్ణ
- జయప్రద
- శివరామయ్యగా సత్యనారాయణ
- శ్రీధర్
- రాజారావుగా రావు గోపాలరావు
- రాఘవయ్యగా ప్రభాకర్ రెడ్డి
- అల్లు రామలింగయ్య
- గిరిబాబు
- నూతన్ ప్రసాద్
- ప్రతాప్ పోతన్
- రాజా
- కె. విజయ
- అన్నపూర్ణ
- శుభ
- కాకినాడ శ్యామల
- రాజ్యలక్ష్మి
- సత్యకళ
- విజయలలిత
- జయమాలిని
- రమణమూర్తి
- జగ్గారావు
- ఆనంద మోహన్
- చలపతి రావు
- జగదీష్ వంగల
- వల్లం నరసింహారావు
సాంకేతిక సిబ్బంది
మార్చు- దర్శకత్వం: ఎం. మల్లికార్జునరావు
- కథ, మాటలు: పరుచూరి సోదరులు
- చిత్రానువాదం: జి. హనుమంతరావు
- సంగీతం: జె. వి. రాఘవులు
- కళ: శ్రీనివాసరాజు
- నృత్యం: శ్రీనివాస్
- కూర్పు: కోటగిరి గోపాలరావు
- కెమెరా: పుష్పాల గోపీకృష్ణ
- థ్రిల్స్: రాజు
సంగీతం
మార్చుఈ చిత్రానికి జె. వి. రాఘవులు సంగీత దర్శకత్వం వహించాడు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల పాటలు పాడారు. వేటూరి సుందరరామ్మూర్తి పాటలు రాశాడు.[2]
- అమ్మాయి అమ్మాయి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- హేహే గుక్కేసి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- ఒంటరి తుంటరి కుర్రదానా, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- గోపాలుడవటే గోపెమ్మా, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం, పి సుశీల
- కదలండి కదలండి., గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం
మూలాలు
మార్చు- ↑ "Praja Rajyam (1983)". Indiancine.ma. Retrieved 2020-09-08.
- ↑ "Praja Rajyam(1983), Telugu Movie Songs - Listen Online - CineRadham.com". www.cineradham.com. Retrieved 2020-09-08.[permanent dead link]