ప్రియాంక నల్కారి

తెలుగు - తమిళ టీవి, సినిమా నటి, యాంకర్

ప్రియాంక నల్కారి, తెలుగు - తమిళ టీవి, సినిమా నటి, యాంకర్.[1][2] 2010లో తెలుగులో వచ్చిన అందరి బంధువయ సినిమాతో సినిమారంగంలోకి అడుగుపెట్టింది.[3]

ప్రియాంక నల్కారి
జననం(1994-04-29)1994 ఏప్రిల్ 29
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2014–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
రాహుల్ వర్మ
(m. 2023)

జననం సవరించు

ప్రియాంక 1994, ఏప్రిల్ 29న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జన్మించింది.

నటనారంగం సవరించు

ప్రియాంక తెలుగులో బాలనటిగా పలు సీరియళ్ళలో నటించింది. తెలుగులో ‘జబర్దస్త్’ గెటప్ శ్రీనుతో కలిసి ‘ఈటీవీ ప్లస్’లో ప్రసారమైన ‘సినిమా చూపిస్తా మామ’లో యాంకర్‌గా మెప్పించింది.

2010లో చంద్ర సిద్ధార్థ దర్శకత్వం వహించిన అందరి బంధువయ అనే తెలుగు సినిమాతో తెరంగేట్రం చేసింది. 2015లో వచ్చిన కిక్ 2 సినిమాలో కూడా నటించింది. 2019లో వచ్చిన కాంచన 3 సినిమాతో తమిళ సినిమారంగంలోకి వెళ్ళింది. సమ్‌థింగ్ సమ్‌థింగ్ సినిమాలో కూడా నటించింది.[4]

2018లో రోజా అనే తమిళ సీరియల్ లో నటించి గుర్తింపు పొందింది. ఈటీవీ తెలుగులో ప్రసారమైన మేఘమాల అనే తెలుగు సీరియల్‌లో, అనుభవించు రాజా అనే కామెడీ రియాలిటీ షో కూడా నటించింది. 2012లో వచ్చిన శివ మనసులో శృతి సినిమాలో సుధీర్ బాబు సోదరి పాత్రను పోషించింది.

వ్యక్తిగత జీవితం సవరించు

సీరియల్ నటుడు, వ్యాపారవేత్త రాహుల్ వర్మతో 2023 మార్చి 23న మలేషియాలోని మురుగన్​ గుడిలో ప్రియాంక వివాహం జరిగింది. రాహుల్ వర్మ, ప్రియాంక ఇద్దరూ కలిసి ఒక తమిళ సీరియల్ లో నటించారు.[5]

నటించినవి సవరించు

సినిమాలు సవరించు

సంవత్సరం సినిమా పాత్ర ఇతర వివరాలు
2010 అందరి బంధువయ ప్రియాంక
2013 తీయ వేళై సెయ్యనుం కుమారు దివ్యశ్రీ తమిళ సినిమా
సమ్థింగ్ సమ్థింగ్ మడూ
నా సామి రంగ లత
2014 వెల్కమ్ టూ అమెరికా సమంత
2015 కిక్ 2 కమలా భాయ్ కూతురు
2016 హైపర్ ప్రియాంక
2017 నేనే రాజు నేనే మంత్రి సుస్మిత
2018 W/O రామ్ స్నేహ అతిధి పాత్ర
2019 కాంచన 3 మోషికా తమిళ సినిమా

టీవీ సీరియల్స్ సవరించు

సంవత్సరం పేరు పాత్ర భాష ఛానల్
2014 ఆహ్వానం తెలుగు జెమినీ టీవీ
2014–2016 మేఘమాల ఈటీవీ తెలుగు
2014 మంగమ్మ గారి మనవరాలు జీ తెలుగు
2015 శ్రావణ సమీరాలు ఇందు జెమినీ టీవీ
2018–2022 రోజా రోజా, జెస్సికా తమిళం సన్ టీవీ
2019 చంద్రలేఖ రోజా
లక్ష్మి స్టోర్స్
2020 పూవే ఉనక్కగా
2021 అభియుమ్ నానుమ్
కన్నన కన్నె
అన్బే వా
2022 అరువి
సెవ్వంతి
మగరాసి
2023-ప్రస్తుతం సీతా రామన్ సీత జీ తమిళం

టీవి కార్యక్రమాలు సవరించు

సంవత్సరం పేరు భాష ఛానల్
2017 సర్రైనోళ్ళు తెలుగు ఈటీవీ తెలుగు
స్టార్ మహిళ
2018 ఈటీవీ సరదా సంక్రాంతి ప్రత్యేక కార్యక్రమం
అనుభవించు రాజా ఈటివి ప్లస్
గోల్డ్ రష్ జీ తెలుగు
సవాలే సమాలి తమిళం సన్ టీవీ
2020 కమల్ తో కలై ఆదిత్య
వనక్కం తమిజా సన్ టీవీ
ప్రతి రోజు పండగే తెలుగు ఈటీవీ తెలుగు
2021 వాడ డ తమిళం సన్ మ్యూజిక్
వనక్కం తమిజా సన్ టీవీ
రౌడీ బేబీ
పూవ తాళయ
2022 అళగయ్య అమ్మ
రోజా రోజాదాన్
మతి యోసి
ఆనంద రాగం వరవేర్పు వేడుక
రోజా వెట్రి విజయ

అవార్డులు సవరించు

సంవత్సరం అవార్డు విభాగం సీరియల్
2018 సూర్య కుటుంబం విరుత్తుగల్ ఉత్తమ ఎమర్జింగ్ జంట

( సిబ్బు సూర్యన్‌తో )

రోజా
2019 సూర్య కుటుంబం విరుత్తుగల్ ఉత్తమ నటి రోజా
2019 సూర్య కుటుంబం విరుత్తుగల్ పాపులర్ కపుల్ అవార్డు

( సిబ్బు సూర్యన్‌తో )

రోజా

మూలాలు సవరించు

  1. "TV show Roja completes one year; actress Priyanka Nalkari thanks everyone". The Times of India. 30 April 2019. Retrieved 2023-03-26.
  2. "Telugu remake of 'Roja' to launch soon". The Times of India. 25 February 2019. Retrieved 2023-03-26.
  3. "సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న‌.. న‌టి ప్రియాంక న‌ల్కారి". Prabha News. 2023-03-24. Archived from the original on 2023-03-26. Retrieved 2023-03-26.
  4. "Tamil TV actress Priyanka Nalkari and Rahul Verma get married in a hush hush ceremony". The Times of India. 2023-03-24. ISSN 0971-8257. Archived from the original on 2023-03-24. Retrieved 2023-03-26.
  5. "Priyanka Nalkari: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న నటి.. తెలుగులో ఏయే సినిమాలు చేసిందంటే?". EENADU. 2023-03-25. Archived from the original on 2023-03-24. Retrieved 2023-03-26.

బయి లింకులు సవరించు