ప్రేమంటే ఇదేరా
ప్రేమంటే ఇదేరా 1998 లో జయంత్ సి. పరాంజీ దర్శకత్వంలో విడుదలైన ప్రేమకథా చిత్రం. ఇందులో దగ్గుబాటి వెంకటేష్, ప్రీతి జింటా ముఖ్యపాత్రలు పోషించారు. రమణ గోగుల సంగీతాన్నందించాడు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ఆర్ట్ ఫిలిమ్స్ పతాకంపై బూరుగుపల్లి శివరామకృష్ణ, కె.అశోక్‌కుమార్ సంయుక్తంగా ఈ సినిమా నిర్మించారు. ఈ సినిమాను కన్నడంలో ఓ ప్రేమవే అనే పేరుతో పునర్నిర్మించారు.
ప్రేమంటే ఇదేరా | |
---|---|
![]() | |
దర్శకత్వం | జయంత్ సి. పరాంజీ |
రచన | దీనారాజ్ (కథ) పరుచూరి సోదరులు (మాటలు) |
నిర్మాత | బూరుగుపల్లి శివరామకృష్ణ, కొల్లా అశోక్ కుమార్ |
నటవర్గం | వెంకటేష్, ప్రీతి జింటా |
ఛాయాగ్రహణం | జయంత్ విన్సెంట్ |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
సంగీతం | రమణ గోగుల |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీలు | 1998 అక్టోబరు 30[1] |
నిడివి | 168 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథసవరించు
మురళి పట్నంలో వైద్య విద్యనభ్యసిస్తూ ఉంటాడు. తన స్నేహితుడు సత్యం పెళ్ళి కోసం మరో ఊరు వెళ్ళి అక్కడ శైలజ అమ్మాయితో పరిచయం అవుతుంది. శైలజ తాతకు ఉన్నట్టుండి వైద్య సహాయం కోసం పట్నం వెళ్ళవలసి వస్తుంది. సమయానికి వైద్యులు అందుబాటులో ఉండకపోవడంతో విద్యార్థిగా ఉన్న మురళినే శస్త్రచికిత్స చేసి ఆయన ప్రాణాలు కాపాడతాడు. మురళి, శైలజ ఒకరినొకరు ఇష్టపడతారు. ఈ లోపు శైలజ తండ్రి ఆమెకు తెలియకుండానే నిశ్చితార్థం ఏర్పాటు చేయిస్తాడు. అతని పేరు కూడా మురళినే. అతని తండ్రి శైలజ తండ్రిని కాపాడి ప్రాణాలు విడిస్తే ఆయన కృతజ్ఞతగా మురళిని పెంచి చదివించి పోలీసును చేస్తాడు. కుమార్తెనిచ్చి పెళ్ళి చేయడానికి నిశ్చయిస్తాడు. కానీ శైలజ మాత్రం డాక్టర్ మురళినే ప్రేమిస్తుంటుంది.
డాక్టర్ మురళి కూడా విషయం తెలుసుకుని బాధపడతాడు. కానీ ఎలాగైనా తన ప్రేమను దక్కించుకోవాలని శైలజ ఇంట్లోనే మకాం పెడతాడు.
తారాగణంసవరించు
- డాక్టర్ మురళిగా వెంకటేష్
- శైలజగా ప్రీతీ జింటా
- పోలీసు మురళిగా శ్రీహరి
- శైలజ తండ్రిగా రంగనాథ్
- శైలజ తాతగా సత్యనారాయణ
- మురళి తల్లిగా లక్ష్మి
- గిరిబాబు
- ప్రసాద్ బాబు
- చంద్రమోహన్
- రమాప్రభ
- రజిత
- బ్రహ్మానందం
- సత్యంగా శివాజీ రాజా
- ఆలీ
- శివాజీ
పాటలుసవరించు
ఈ సినిమాలో సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్ పాటలు రాయగా రమణ గోగుల సంగీత దర్శకత్వం వహించాడు. అన్ని పాటలు ప్రేక్షకాదరణ పొందాయి.
- ప్రేమంటే ఇదేరా
- నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా
- ఏమో ఎక్కడుందో
- నైజాం బాబులు
- బొంబాయి బొమ్మ సూడరో
- వయసా చూసుకో
- మనసే ఎదురు తిరిగి
- ఓ మేరీ బుల్ బుల్ తారా
మూలాలుసవరించు
- ↑ Editor, Prabhu- (2019-10-30). "Venkatesh Premante Idera Completes 21 Years | Telugu Filmnagar". Thetelugufilmnagar (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-04-17.
{{cite web}}
:|last=
has generic name (help)