మహ్మద్ బాఖా ఖాన్ జిలానీ pronunciation </img> pronunciation (20 జూలై 1911 - 2 జూలై 1941) టెస్ట్ క్రికెట్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన బౌలర్ .

బాకా జిలానీ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మొహమ్మద్ బాకా ఖాన్ జిలానీ
పుట్టిన తేదీ(1911-07-20)1911 జూలై 20
జలంధర్, పంజాబ్, బ్రిటిషు భారతదేశం
మరణించిన తేదీ1941 జూలై 2(1941-07-02) (వయసు 29)
జలంధర్, పంజాబ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 26)1936 ఆగస్టు 15 - ఇంగ్లాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు First-class
మ్యాచ్‌లు 1 31
చేసిన పరుగులు 16 928
బ్యాటింగు సగటు 8.00 18.56
100లు/50లు 0/0 1/5
అత్యధిక స్కోరు 12 113
వేసిన బంతులు 90 3,603
వికెట్లు 0 83
బౌలింగు సగటు 19.93
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 3
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 1
అత్యుత్తమ బౌలింగు 7/37
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 12/–
మూలం: CricketArchive, 2022 సెప్టెంబరు 3

ప్రారంభ జీవితం

మార్చు

జిలానీ 1911 జూలై 20న పంజాబ్‌లోని జలంధర్‌లో జన్మించారు. అతను మాజిద్ ఖాన్, జావేద్ బుర్కీ, పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి అయిన ఇమ్రాన్ ఖాన్‌ల కుటుంబానికి పెళ్ళి ద్వారా బంధువయ్యాడు. [1]

కెరీర్

మార్చు

రైట్ ఆర్మ్ మీడియం-పేస్డ్ బౌలర్‌గా, మంచి దిగువ వరుస బ్యాట్స్‌మన్‌గా, అతను తొలి ఫస్ట్-క్లాస్ అటలోనే పన్నెండు వికెట్లతో తన కెరీర్‌ను ప్రారంభించాడు. అతను 1934-35లో జరిగిన మొదటి టోర్నమెంట్ సెమీఫైనల్‌లో దక్షిణ పంజాబ్‌పై ఉత్తర భారతదేశం తరపున రంజీ ట్రోఫీలో మొదటి హ్యాట్రిక్ సాధించాడు. [2] సదరన్ పంజాబ్ 22 పరుగులకే ఆలౌటైంది. ఇది 76 ఏళ్లుగా పోటీలో అత్యల్ప స్కోరు. [3] [4]

కెప్టెన్ విజ్జీ, మాజీ కెప్టెన్ CK నాయుడు ల నేతృత్వంలో రెండు వర్గాలుగా భారత జట్టు చీలిపోయి వారిమధ్య జరిగిన అంతర్గత పోరుతో నాశనమైపోయిన 1936 ఇంగ్లాండ్‌ పర్యటనలో జిలానీ, తన ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడాడు. జిలానీ విజ్జీ వర్గానికి చెందినవాడు. ఓవల్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌కు కొన్ని రోజుల ముందు, అల్పాహారానికి వెళ్తూ జిలానీ, నాయుడును బహిరంగంగా అవమానించాడు. ఆ తరువాత అతనికి దక్కిన తొలి టెస్టు అవకాశం ఈ సంఘటన వల్లనే అని అంటారు. ఆ టెస్టులో అతను పదహారు పరుగులు చేసి, వైకెట్లేమీ లేకుండా పదిహేను ఓవర్లు వేసాడు. కోటా రామస్వామి ప్రకారం, పర్యటన సమయంలో జిలానీకి అధిక రక్తపోటు, నిద్రలేమి, నిద్రలో నడవడం, హింసాత్మకమైన కోపం ఉండేవి. “అతను ఎప్పుడు మామూలుగా ఉంటాడో, ఎప్పుడు అదుపు చేసుకోలేని కోపానికి లోనౌతాడో ఎవరూ చెప్పలేని పరిస్థితి ఉండేది. పర్యటనలో అతను నిరంతరం చికిత్స పొందుతూ ఉండేవాడు". [5]

జలంధర్‌లో అదనపు అసిస్టెంట్ కమీషనరుగా పనిచేస్తూ జిలానీ, తన ముప్పైవ పుట్టినరోజుకు కొన్ని రోజుల ముందు మరణించాడు. తద్వారా అమర్ సింగ్ తర్వాత తక్కువ వయసులో మరణించిన రెండవ భారతీయ టెస్టు క్రికెటరతడు. అతనికి మూర్ఛ వచ్చి, జులంధర్‌లోని తన ఇంటి బాల్కనీ నుండి పడిపోయి, అక్కడికక్కడే మరణించాడు. [6]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Cricketing Dynasties: The twenty two families of Pakistan Test cricket – Part 1". The News International. Pakistan.
  2. "Hat-Tricks in Ranji Trophy". Cricket Archive. Retrieved 21 October 2016.
  3. "The Home of CricketArchive". CricketArchive.
  4. "Lowest teams totals in first class cricket". Archived from the original on 19 November 2011.
  5. C. Ramaswami, Personalities of the 1936 tour of England (My reminiscences – IV), Indian Express, 9 August 1964 (accessed 9 September 2013)
  6. Indian Express, 5 July 1941