స్లెడ్జింగ్
క్రికెట్ క్రీడలో, స్లెడ్జింగ్ అంటే ప్రత్యర్థి ఆటగాడిని ఉద్దేశపూర్వకంగా అవమానించడం లేదా మాటలతో భయపెట్టడం. దీని ఉద్దేశం, ప్రత్యర్థి ఏకాగ్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నించడం, తద్వారా వారి ఆటను దెబ్బతీయడం లేదా తప్పులు చేసేలా చేయడం. [4] క్రీజులో ఉన్న బ్యాట్స్‌మన్లు, బౌలరు, కొంతమంది సన్నిహిత ఫీల్డర్‌లూ ఒకరికొకరు వినబడేంత దగ్గరగా ఉంటారు కాబట్టి, ఈ దూషణలు వారిపై ప్రభావం చూపుతాయి. దూషణలు నేరుగా ఉండవచ్చు లేదా బ్యాట్స్‌మన్ వినేలా ఫీల్డర్‌ల మధ్య జరిగే సంభాషణల లాగానూ ఉండవచ్చు. ఈ స్లెడ్జింగ్ అనే పదాన్ని ఇతర క్రీడలలో కూడా ఉపయోగించారు. ఉదాహరణకు టెన్నిస్ ఆటగాడు నిక్ కిర్గియోస్ తన ప్రత్యర్థి స్టాన్ వావ్రింకాను అవమానించేందుకు అతని స్నేహితురాలికీ మరొక ఆటగాడికీ మధ్య జరిగిన ఒక సంఘటనను సూచిస్తూ మాట్లాడినపుడు ఈ మాటను ఉదహరించారు. [5]
స్లెడ్జింగు, క్రీడాస్ఫూర్తిని కించపరచేదా లేదా కేవలం హాస్య సంభాషణేనా అనే చర్చ క్రికెట్ ప్రపంచంలో ఉంది. [6] స్లెడ్జింగును, తిట్టడం అని కొందరంటారు. కొన్నిసార్లు ఇవి వ్యక్తిగత హద్దులను దాటిపోతాయని మాత్రం చాలామంది అంగీకరించే సంగతి.
స్లెడ్జింగ్ ఆటగాళ్ళ ధ్యాసను మళ్ళించేలా చెతురాడే ప్రయత్నంగా భావించవచ్చు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా ఈ అభ్యాసాన్ని "మానసిక విచ్ఛిన్నం" అని వర్ణించాడు.[7]
మూలం
మార్చుఆస్ట్రేలియన్ వార్తాపత్రికలు 1970ల మధ్యలో "స్లెడ్జింగ్"ని ఒక పదంగా గుర్తించాయి. [9] [10] సాపేక్షంగా ఇటీవల ఈ పదాన్ని ఉపయోగించినప్పటికీ, ఈ అభ్యాసం క్రికెట్ అంత పాతది. చారిత్రకంగా ఆటగాళ్ల మధ్య చమత్కారమైన పరిహాసానికి సంబంధించిన కథనాలు సర్వసాధారణంగా ఉండేవి. WG గ్రేస్, అతని సోదరుడు EM లు వారి కెరీర్‌లో మైదానంలో "గోల చేస్తూ, సందడిగా" ఉండేవారు. WG, ప్రత్యర్థులను ఆటపట్టించడం వంటివి చేసేవాణ్ణని అంగీకరించాడు. EM, WG ఇద్దరూ ఎప్పుడూ వివాదాస్పదంగా ఉండే గేమ్‌స్మాన్‌షిప్‌లో భాగంగా ఉండేది.[11]
1974-75 నాటి ఆస్ట్రేలియా జట్టు సభ్యులు వారి దురుసు ఆటకు, మాటల దూషణకు, హానికారక ఫాస్ట్ బౌలింగుకు గాను అగ్లీ ఆస్ట్రేలియన్లు అని బిరుదు పొందారు. "బ్యాట్స్‌మెన్‌ల వెనుక నిలబడి తిట్టడంలో, రాడ్ మార్ష్, కెప్టెన్ ఇయాన్ చాపెల్ ఒకరితో ఒకరు పోటీపడేవారు". [12] టామ్ గ్రేవీనీ ఇలా వ్రాశాడు "ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ల ఏకాగ్రతను దెబ్బతీసేందుకు వాళ్ళను తిట్టమని ఇయాన్ చాపెల్ తన ఆటగాళ్లను ప్రోత్సహించేవాడు." [13]
వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ వివ్ రిచర్డ్స్, తనను స్లెడ్జింగు చేయడానికి సాహసించిన బౌలర్లను శిక్షించడంలో ప్రఖ్యాతి పొందాడు. అతన్ని తిట్టవద్దని చాలా మంది ప్రత్యర్థి కెప్టెన్లు తమ ఆటగాళ్లను నిషేధించేవారు. అయితే, గ్లామోర్గాన్‌తో జరిగిన కౌంటీ గేమ్‌లో, గ్రెగ్ థామస్ బౌలింగులో రిచర్డ్స్ వరుసగా అనేక బంతులను మిస్సైన తర్వాత బౌలరు అతనిని స్లెడ్జింగు చేసాడు. అతను రిచర్డ్స్‌తో ఇలా ఎగతాళిగా "నీకు తెలుసో లేదో.. ఇది ఎర్రగా, గుండ్రంగా ఉంటుంది, ఐదు ఔన్సుల బరువుంటుంది," అన్నాడు. .రిచర్డ్స్ తదుపరి డెలివరీని క్రికెట్ మైదానం బయటకు, సమీపంలోని నదిలోకి పడేలా కొట్టాడు. బౌలర్ వైపు తిరిగి, అతను ఇలా అన్నాడు: "గ్రెగ్, అది ఎలా ఉంటుందో నీకు తెలుసుగా, పోయి వెతుక్కో పో." [14]
బంగ్లాదేశ్
మార్చుచారిత్రాత్మకంగా 'పిరికి' జట్టుగా వర్ణించబడిన బంగ్లాదేశ్, 2015 క్రికెట్ ప్రపంచ కప్ తర్వాత ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది. బంగ్లాదేశ్ క్రికెటర్ మష్రఫే మోర్తజా ప్రకారం, మొర్తజా తన ఆటగాళ్లను 'ప్రత్యర్థిని కళ్లలో కళ్ళుపెట్టి చూడమని' అయితే 'రేఖను దాటకుండా' ఉండాలనీ ప్రోత్సహిస్తున్నట్లు చెప్పాడు. మైదానంలో తన జట్టు 'సంభాషణ మొదలుపెట్టదు' అని కూడా అతను నొక్కి చెప్పాడు. బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత అథర్ అలీ ఖాన్ మాట్లాడుతూ బంగ్లాదేశ్ 'వెనక్కి తగ్గే సంస్కృతి' నుండి బయటపడిందని చెప్పాడు. [15]
ఇంగ్లండ్
మార్చుఇంగ్లండ్ కోచ్ ట్రెవర్ బేలిస్ స్లెడ్జింగును స్టంప్ మైకులు పట్టుకోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేశాడు, స్లెడ్జింగ్ అనేది 'ఇంట్లో చిన్నపిల్లలు చూసేంత గొప్పదేమీ కాదని' టెలివిజన్‌లో రాకుండా దాన్ని సెన్సార్ చేయాలనీ అతడు సూచించాడు. అయితే అందుకు భిన్నంగా ఇంగ్లండ్ క్రికెటర్ మొయిన్ అలీ, స్లెడ్జింగ్ చెయ్యకుండా ఆటగాళ్లను నిరోధించేందుకు స్టంప్ మైక్‌లను అమర్చాలని సూచించాడు..[16]
మాజీ ఇంగ్లీష్ క్రికెటర్ బాబ్ విల్లీస్ 2017-18 యాషెస్ సమయంలో ఇంగ్లీష్ ఆటగాళ్లను ఉద్దేశించి ఆస్ట్రేలియన్లు చేసిన స్లెడ్జింగ్ 'వ్యక్తిగతంగా' ఉందని మ్యాచ్ రిఫరీకి నివేదించాలని సూచించాడు. [17] 2018లో ఇంగ్లండ్ టూర్ ఆఫ్ న్యూజిలాండ్‌కు ముందు, మాజీ ఇంగ్లిష్ క్రికెటర్ జెఫ్రీ బాయ్‌కాట్ ఇంగ్లీష్ క్రికెటర్లు స్లెడ్జింగ్‌ను 'వదిలిపెట్టాలని' పిలుపునిచ్చాడు. [18] ఇంగ్లండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టో 'వ్యక్తిగతం'గా భావించే వాటికి సంబంధించి మరింత స్పష్టత అవసరమని, ఆ 'రేఖ' చుట్టూ చాలా మసక ప్రాంతం ఉందని అన్నాడు. [19]
భారతదేశం
మార్చువివ్ రిచర్డ్స్ ప్రకారం, భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ భారతదేశాన్ని స్లెడ్జింగ్‌లో పోటీజట్టుగా మార్చడానికి పునాది వేశాడు. [21] మైదానంలో స్లెడ్జింగ్‌ని ఉపయోగించిన భారత తొలి 'దూకుడు' కెప్టెన్‌గా సౌరవ్ గంగూలీ పేరు పొందాడు. [22] స్లెడ్జింగ్ లేకపోతే ఆటలో మజాయే ఉండదు' అని భారత బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. [23] భారత క్రికెటర్ గౌతమ్ గంభీర్ 'వ్యక్తిగతంగా పోనంత వరకు, ప్రత్యర్థులను కలవరపెట్టడానికి చేయగలిగినదంతా చేయవచ్చు' అని అన్నాడు. [24] [25] భారత వికెట్ కీపర్ MS ధోనీ, స్లెడ్జింగ్‌ను ఒక 'కళ'గా అభివర్ణిస్తూ, హద్దు దాటనంత వరకు ఇది న్యాయమేనని చెప్పాడు. [26] స్లెడ్జింగ్ అనేది ఆటలో భాగం అని భారత పేసర్ శ్రీశాంత్ అన్నాడు. [27] భారత బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ, స్లెడ్జింగ్‌లో 'ఏదో ఆకర్షణ' ఉందని, కానీ అది 'పరిమితులకు' లోబడి ఉండాలని చెప్పాడు. [28] భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన ఆత్మకథ ప్లేయింగ్ ఇట్ మై వేలో 'కొన్ని పరిమితులకు లోబడే 'స్లెడ్జింగ్' ఉండాలని పిలుపునిచ్చాడు. [29] 'క్రికెటర్ ఏకాగ్రతకు భంగం కలిగించేందుకే' స్లెడ్జింగ్ చేస్తారని భారత మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సునీల్ గవాస్కర్ వివరించాడు. [30] భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ స్లెడ్జింగ్ మంచిదేనని, అయితే మాటలను 'కుటుంబం' దాకా పోనీయకూడదని అన్నాడు. [31]
"మేము దానిని బాగానే తీసుకుంటాం, మరింత బాగా ఇచ్చి పడేస్తాం కూడా" అని భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. [32] కోహ్లీ దూకుడు తన దూకుడు కంటే రెండు రెట్లు ఎక్కువ అని గంగూలీ పేర్కొన్నాడు. [33] కోహ్లి కెప్టెన్సీలో, ఆటగాళ్లు 'అత్యున్నత ఫిట్‌నెస్, అధిక తీవ్రత, దూకుడు మనస్తత్వం' కలిగి ఉండాలి. [34] 2020 జనవరిలో ICC స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డును స్వీకరించిన తర్వాత, భారత కెప్టెన్ విరాట్ కోహ్లి స్లెడ్జింగ్‌కు, మైదానంలో పరిహాసం, బెదిరింపులకు మద్దతుగా మాట్లాడాడు. వ్యక్తులను 'భావోద్వేగంగా' లక్ష్యంగా చేసుకోరాదని అన్నాడు. [35] కోహ్లి నేతృత్వంలోని భారత జట్టుకు దూకుడు బలంగా మారిందని సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు. [36] తాను మైదానంలో చాలా సందడి చేస్తానని, స్లెడ్జింగ్ బౌలర్లకు సహాయపడుతుందని భారత టెస్టు క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా అన్నాడు. [37] భారత బ్యాట్స్‌మెన్ అజింక్య రహానే స్లెడ్జింగ్‌ను (క్రికెట్ మైదానంలో) 'కారు నడిపేటప్పుడు హారన్ కొట్టడం'తో పోల్చాడు. [38] 2018లో ఆస్ట్రేలియా టూర్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్‌లపై స్లెడ్జింగ్ చేస్తున్నారని అభ్యంతరాలు వచ్చినపుడు వాళ్ళను సమర్థిస్తూ భారత మాజీ బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్, “మీరు మీ దేశం కోసం ఆడుతున్నప్పుడు మీరు గర్వంగా ఆడాలి, అభిరుచితో ఆడాలి." అన్నాడు. [39]
నమోదైన స్లెడ్జింగ్ ఘటనలు
మార్చు1999 వరకు
మార్చుసంఘటన | పాల్గొన్న ఆటగాళ్ళు | తేదీ | మ్యాచ్ | భాగంగా | వివరణ |
---|---|---|---|---|---|
బాస్టర్డ్స్ | డగ్లస్ జార్డిన్, బిల్ వుడ్‌ఫుల్ | 1932-33 | vs | 1932-33 యాషెస్ | ఇంగ్లండ్ కెప్టెన్ డగ్లస్ జార్డిన్ ఆస్ట్రేలియా కెప్టెన్ బిల్ వుడ్‌ఫుల్‌కు ఆస్ట్రేలియన్ ఆటగాళ్ళు తనను తిడుతున్నట్లు చెప్పాడు. వుడ్‌ఫుల్ స్పందిస్తూ, "ఇప్పుడు మీలో ఏ బాస్టర్డ్ ఈ బాస్టర్డ్‌ని బాస్టర్డ్ అని పిలిచారు?" అని అడిగాడు. [40] |
టీ పార్టీ | అలన్ బోర్డర్, రాబిన్ స్మిత్ | 10–1989 ఆగస్టు 14 | vs | 1989 యాషెస్ | ఇంగ్లండ్ క్రికెటర్ రాబిన్ స్మిత్ డ్రింక్ అడిగినప్పుడు, ఆస్ట్రేలియా ఆటగాడు అలన్ బోర్డర్ ఇలా విరుచుకుపడ్డాడు: “ఏంటి ఇదేమైనా ఫకింగ్ టీ పార్టీయా? లేదు, నువ్వు ఒక గ్లాసు నీళ్ళు తాగడానిక్కూడా వీల్లేదు. మా లాగానే నువ్వు కూడా ఉండాల్సిందే." [41] [42] |
టికెట్ ప్లీజ్ | జావేద్ మియాందాద్, మెర్వ్ హ్యూస్ | 1990 జనవరి 22 | vs | 1989-90లో ఆస్ట్రేలియాలో పాకిస్థాన్ క్రికెట్ జట్టు | మెర్వ్ హ్యూస్ పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ జావేద్ మియాందాద్‌కి బౌలింగ్ చేస్తున్నప్పుడు జావేద్, "ఇంత లావుగా ఉన్నావు, నువ్వు క్రికెటేం ఆడతావు, బస్సులు నడుపుకోక పోయావా" అని ఎగతాళి చేసాడు. ఆ తరవాత హ్యూస్ జావేద్‌ను క్యాచ్ ఔట్ చేసాక, అతను తిరిగి పెవిలియన్‌కి వెళ్తుండగా అడ్డుకుని హ్యూస్, "టికెట్ ప్లీజ్" అన్నాడు. [43] |
ఎరుపు | స్టీవ్ వా, గ్రాహం థోర్ప్ | 1993 ఆగస్టు 8 | vs | 1993 యాషెస్ | ఇంగ్లండ్‌కు చెందిన గ్రాహం థోర్ప్ 60 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, స్లిప్ లో ఉన్న స్టీవ్ వా స్లెడ్జింగు చేసాడు. దాంతో రెచ్చిపోయిన థోర్ప్, క్రీజు నుండి బయటికొచ్చి షేన్ వార్న్ బంతిని కొట్టబోయి క్యాచ్ అవుట్ అయ్యాడు. [44] |
లావుగా ఉన్నంత మాత్రాన రన్నర్ కావాలంటే ఎలా | ఇయాన్ హీలీ, అర్జున రణతుంగ | 1996 జనవరి 20 | vs | 1995-96లో ఆస్ట్రేలియాలో శ్రీలంక క్రికెట్ జట్టు | శ్రీలంక కెప్టెన్ అర్జున రణతుంగ రన్నర్ కోసం అడిగినప్పుడు, ఆస్ట్రేలియా ఆటగాడు ఇయాన్ హీలీ, "నువ్వు లావుగా ఉన్నావు గదా అని రన్నర్ కావాలంటే కుదరదబ్బాయ్" అని ఎగతాళి చేసాడు. [45] |
పో | వెంకటేష్ ప్రసాద్, అమీర్ సోహైల్ | 1996 మార్చి 9 | vs | 1996 క్రికెట్ ప్రపంచ కప్ | పాకిస్థాన్ ఆటగాడు అమీర్ సోహైల్ భారత ఆటగాడు వెంకటేష్ ప్రసాద్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి, బంతిని తెచ్చుకొమ్మని చెయ్యి ఊపాడు. ఆ తరువాతి బంతికే ప్రసాద్ అతన్ని ఔట్ చేసి ఇకపో అన్నట్లుగా చెయ్యి ఊపాడు. [46] [47] |
- | గ్లెన్ మెక్‌గ్రాత్, అలాన్ ముల్లల్లి | 1998 డిసెంబరు 29 | vs | 1998-99లో ఆస్ట్రేలియాలో ఇంగ్లీష్ క్రికెట్ జట్టు | ఆస్ట్రేలియన్ క్రికెటర్ గ్లెన్ మెక్‌గ్రాత్ ఇంగ్లండ్ ఆటగాడు అలన్ ముల్లాలీని చేసిన స్లెడ్జింగ్‌పై అతను 'నవ్వుతూ' స్పందించాడు. [48] |
- | రికీ పాంటింగ్, ఇజాజ్ అహ్మద్ | 1999 నవంబరు 26 -28 | vs | 1999-2000లో ఆస్ట్రేలియాలో పాకిస్థాన్ క్రికెట్ జట్టు | ఆస్ట్రేలియా ఆటగాడు రికీ పాంటింగ్ పాక్ ఆటగాళ్లను దుర్భాషలాడాడు. ముఖ్యంగా పెర్త్ టెస్టులో ఇజాజ్ అహ్మద్‌ను ఆ స్లెడ్జింగ్‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు క్రికెట్ ఆస్ట్రేలియాకు అధికారికంగా ఫిర్యాదు చేసింది. [49] |
2000-2009
మార్చుసంఘటన | ఆటగాళ్ళు | తేదీ | మ్యాచ్ | సీరీస్ | వివరాలు |
---|---|---|---|---|---|
మ్యాచ్‌ను వదిలేసావ్ | స్టీవ్ వా, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ | 2001 మార్చి 15 | vs | 2000–01లో భారతదేశంలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు | భారత కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ వా వేసిన క్యాచ్‌ను జారవిడిచినప్పుడు, అతను ఇలా అన్నాడు: "క్యాచ్ కాదు తమ్ముడూ, నువ్వు వదిలేసింది టెస్టును" అన్నాడు. టీ తర్వాత కొద్ది సేపటికే, వా వికెట్‌ను భారత ఆటగాడు హర్భజన్ సింగ్ తీసుకున్నాడు. ఆ తర్వాత భారత ఫీల్డర్ రాహుల్ ద్రవిడ్ వాని ఇప్పుడు మ్యాచ్‌ని ఎవరు ఇచ్చారని అడిగాడు.[50] |
కుటుంబంలో బెస్టు | మార్క్ వా, జిమ్మీ ఒర్మాండ్ | 2001 ఆగస్టు 23-27 | vs | 2001 యాషెస్ | ఓవల్‌లో జరిగిన ఐదవ టెస్టులో, ఆస్ట్రేలియా ఆటగాడు మార్క్ వా, (అత్యంత విజయవంతమైన ఆటగాడు స్టీవ్ వాకు ఇతను సోదరుడు) ఇంగ్లండ్‌కు చెందిన జిమ్మీ ఓర్మాండ్, టెయిల్-ఎండ్ బ్యాట్స్‌మెన్‌తో, "నువ్వసలు ఇక్కడ ఏం చేస్తున్నావ్? ఇంగ్లండ్ తరపున ఆడటానికి నువ్వెలా పనికొస్తావ్?" అన్నాడు. ఓర్మాండ్ ఇలా సమాధానమిచ్చాడు: "కాకపోవచ్చు...కానీ కనీసం నా కుటుంబంలో నైనా నేను అత్యుత్తమ ఆటగాడిని."[51] |
- | మహేల జయవర్ధనే, సనత్ జయసూర్య, హెర్షెల్ గిబ్స్ | 15–2002 నవంబరు 19 | vs | 2002-03లో శ్రీలంక క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాలో | మొదటి టెస్టులో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు చేసిన 'ఆర్గనైజ్డ్' స్లెడ్జింగ్‌కు ప్రతిస్పందనగా, శ్రీలంక రెండో టెస్టులో దక్షిణాఫ్రికా జట్టులోని ఐదుగురు ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుంది. శ్రీలంక ఆటగాడు మహేళ జయవర్ధనే ఏం జరిగిందో ఇలా చెప్పాడు: దక్షిణాఫ్రికాకు చెందిన హెర్షెల్ గిబ్స్ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. స్లెడ్జింగ్‌ను ఆపమని శ్రీలంక ఆటగాడు సనత్ జయసూర్యను అభ్యర్థించాడు.[52] |
42 మిలియన్లు | కుమార్ సంగక్కర, షాన్ పొలాక్ | 2003 మార్చి 3 | vs | 2003 క్రికెట్ ప్రపంచ కప్ | ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా-శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక వికెట్‌కీపర్ కుమార సంగక్కర దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ షాన్ పొలాక్ ను చీకాకు పరచాడు. సంగక్కర పొలాక్‌కు పరిస్థితి తీవ్రత గురించి అవగాహన కల్పించడం ద్వారా అతనిపై ఒత్తిడి పెంచిన తర్వాత, "నలభై రెండు మిలియన్ల మంది మద్దతుదారులు ఇక్కడే ఉన్నారు, వీరంతా షాన్‌పై ఆధారపడి ఉన్నారు" అని అతని స్లెడ్జ్‌ను ముగించాడు.[53] |
నీ భార్యనడుగు | గ్లెన్ మెక్‌గ్రాత్, రామ్‌నరేష్ సర్వాన్ | 2003 మే 12 | vs | 2002-03లో వెస్టిండీస్‌లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు | గ్లెన్ మెక్‌గ్రాత్ 21 ఏళ్ల రూకీ వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ రామ్‌నరేష్ సర్వాన్‌ను "బ్రియాన్ లారా డిక్ రుచి ఎలా ఉంటుంది?" అని అడిగాడు. వెస్ట్ ఇండియన్ స్పందిస్తూ, "నాకు తెలియదు, నీ భార్యను అడుగు" అని చెప్పాడు.[54] ఆ సమయంలో అతని భార్య క్యాన్సర్‌తో బాధపడుతోంది. (సర్వాన్‌కు ఆ సంగతి తెలియదు). మెక్‌గ్రాత్, "నువ్వు నా భార్య గురించి మరోసారి ప్రస్తావిస్తే, నేను నీ గొంతు చీరేస్తాను" అని విరుచుకుపడ్డాడు.[55] ఈ ఓవర్ రియాక్షన్ సర్వాన్ ముఖంలో నవ్వు తెప్పించింది, మెక్‌గ్రాత్‌కు మరింత కోపం తెప్పించింది. ఆస్ట్రేలియన్‌ని అంపైర్ హెచ్చరించి, ఆ తరువాత జరిమానా విధించాడు. |
రెండు జట్లూ తిడుతున్నాయ్ | నాసర్ హుస్సేన్, ముత్తయ్య మురళీధరన్, కుమార్ సంగక్కర | 10–2003 డిసెంబరు 14 | vs | 2003-04లో శ్రీలంకలో ఇంగ్లీష్ క్రికెట్ జట్టు | శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ స్వస్థలమైన క్యాండీలో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లిష్ క్రికెటర్ నాసర్ హుస్సేన్ పలు మాటలు అన్నాడు. ఇంగ్లీషు ఆటగాడు బ్యాటింగ్ చేసే వంతు వచ్చినప్పుడు, అతన్ని శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర పలకరించాడు, అతను ఇలా అన్నాడు: "రెండు జట్లూ అసహ్యించుకుంటూంటే ఎలా ఉంది?" శ్రీలంకేయుల నుండే కాకుండా తన సొంత సహచరులు కూడా హుసేన్‌తో కూడా విభేదించడాన్ని ఇది ఎత్తిచూపింది.[56] |
కుక్క జాతి | మైకేల్ క్లార్క్, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ | 2003 డిసెంబరు 20 | Australia 'A' vs | బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2003-04 | ఆస్ట్రేలియన్ క్రికెటర్ మైఖేల్ క్లార్క్ భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ను 'వృద్ధుడు' అని పేర్కొన్న తర్వాత, సచిన్ బ్యాటింగ్ భాగస్వామి వీరేంద్ర సెహ్వాగ్ క్లార్క్‌ని నీది ఏ బ్రీడు అని అడిగాడు. క్లార్క్ మారుపేరు 'పప్' (కుక్కపిల్ల).[57] |
కిటికీలున్నాయ్ జాగ్రత్త | ఆండ్రూ ఫ్లింటాఫ్, టినో బెస్ట్ | 2004 జూలై 26 | vs | 2004లో ఇంగ్లండ్‌లో వెస్టిండీస్ క్రికెట్ జట్టు | వెస్టిండీస్ క్రికెటర్ టినో బెస్ట్, సిక్సర్లు కొట్టడంలో ఖ్యాతి గడించిన బ్యాట్స్‌మెన్. రాబోయే డెలివరీని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండగా, ఇంగ్లండ్ క్రికెటర్ ఆండ్రూ ఫ్లింటాఫ్, స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తూ, 'కిటికీలున్నాయి జాగ్రత్త' అని బెస్ట్‌కి చెప్పాడు. అది ఫ్లింటాఫ్‌కు పనికివచ్చింది, బంతిని పార్క్ బయటికి కొట్టే ప్రయత్నంలో బెస్ట్, స్టంపౌట్ అయ్యాడు. |
కోటలో దయ్యం | డారెన్ గోఫ్, షేన్ వాట్సన్ | 2005 జూన్ 23 | vs | 2005లో ఇంగ్లండ్‌లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు | ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్ వాట్సన్ దెయ్యం గురించి భయపడి సహచరుడు బ్రెట్ లీ గదిలో నేలపై పడుకున్నాడు. మరుసటి రోజు డారెన్ గోఫ్, క్రికెట్ మైదానంలో ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మన్‌ను ఎగతాళి చేశాడు. దెయ్యం లాగా నటించి, వాట్సన్‌తో "భయపడొద్దు, ఈ రాత్రికి నా పక్కలో పడుకుందువుగానిలే" అని ఎగతాళిగా అన్నాడు |
టార్జాన్ | షోయబ్ అక్తర్, ఆండ్రూ ఫ్లింటాఫ్ | 2005 నవంబరు 22 | vs | 2005-06లో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు పాకిస్థాన్‌లో | పాకిస్తాన్ ఆటగాడు షోయబ్ అక్తర్, తనిను 'లావు'గా ఉన్నావని పదే పదే అవహేళన చేయడంతో విసిగిన ఇంగ్లండ్ ఆల్ రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ అతనితో ఇలా అన్నాడు: "షోయబ్, పర్వాలేదులే, నువ్వు టార్జాన్ లాగా ఉన్నావు గానీ బౌలింగు మాత్రం జేన్ లాగా చేస్తున్నావు". ఫ్లింటాఫ్ బ్యాటింగ్‌కు వచ్చిన కొద్దిసేపటికే అక్తర్ అతన్ని అవుట్ చేశాడు. |
- | క్రిస్ గేల్, మైఖేల్ క్లార్క్ | 2006 అక్టోబరు 18 | vs | 2006 ICC ఛాంపియన్స్ ట్రోఫీ | వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ కోపానికి లోనై మైఖేల్ క్లార్క్‌తో భుజాలు తాకించాడు. దాంతో జట్టు పరుగులను కోల్పోయింది. క్రిస్ గేల్ కు మ్యాచ్ ఫీజులో 30% జరిమానా విధించారు. |
బాగా ఆడేవ్ | డానిష్ కనేరియా, బ్రియాన్ లారా | 2006 నవంబరు 21 | vs | 2006-07లో వెస్టిండీస్ క్రికెట్ జట్టు పాకిస్థాన్‌లో | వెస్టిండీస్ ఆటగాడు బ్రియాన్ లారా వద్ద పాకిస్థానీ లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా గూగ్లీ వేయగా, లారా దాన్ని వెనక్కి బౌలరు వద్దకే కొట్టాడు. కనేరియా 'బాగా ఆడావు బ్రియాన్' అని ఎగతాళి చేశాడు, దానికి లారా 'సరే, సార్' అని బదులిచ్చాడు. ఆ తర్వాత లారా వరసగా మూడు సిక్సర్లతో పాక్ బౌలర్ ను చిత్తు చేశాడు. లారా 216 పరుగులు చేయగా, కనేరియా 181 పరుగులకు 5 వికెట్లు పడగొట్టాడు. |
ఈఫిల్ టవరు | MS ధోని, ఆండ్రే నెల్ | 2006 డిసెంబరు 16 | vs | 2006-07లో దక్షిణాఫ్రికాలో భారత క్రికెట్ జట్టు | MS ధోని స్లెడ్జ్ చేసిన అనేక దక్షిణాఫ్రికా టెయిల్-ఎండర్‌లలో, బాగా పొడుగ్గా ఉండే ఆండ్రీ నెల్ (ఆరు అడుగుల నాలుగు అంగుళాల ఎత్తులో ఉన్నాడు) ఒకడు. అతను వినేలా భారత కీపర్ ఎగతాళిగా "రండ్రండి అబ్బాయిలూ ఈఫిల్ టవర్‌ను కిందకు తెద్దాం" అని అన్నాడు. |
దమ్ము | ఆండ్రే నెల్, S. శ్రీశాంత్ | 2006 డిసెంబరు 17 | vs | 2006-07లో దక్షిణాఫ్రికాలో భారత క్రికెట్ జట్టు | దక్షిణాఫ్రికా బౌలర్ ఆండ్రే నెల్ భారత టెయిల్-ఎండర్ శ్రీశాంత్‌పై విరుచుకుపడిన తర్వాత, "నాకు నెత్తురు వాసన వస్తోంది. నీకు దమ్ము లేదు" అని ఎగతాళి చేసాక, తరువాతి బంతిని శ్రీశాంత్ బౌలరు తల మీదుగా సిక్సర్ బాది ఉత్సాహంగా ఊగాడు |
చేతిలో బ్యాటుంది చూసావా | ఆండ్రూ ఫ్లింటాఫ్, యువరాజ్ సింగ్ | 2007 సెప్టెంబరు 19 | vs | 2007 వరల్డ్ ట్వంటీ20 | ఇంగ్లిష్ క్రికెటర్ ఆండ్రూ ఫ్లింటాఫ్, భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ ల మధ్య జరిగిన దుర్భాషలతో కోపించిన యువరాజ్, "నా చేతిలో ఈ బ్యాట్ ఉంది చూసావా.. ఈ దీంతో నేను నిన్ను ఎక్కడ కొట్టబోతున్నానో తెలుసా?" అని అన్నాడు. మరుసటి ఓవర్‌లో యువరాజ్ ఆరు సిక్సర్లు బాదాడు. |
తేరీ మా కీ | హర్భజన్ సింగ్, ఆండ్రూ సైమండ్స్ | 2007 డిసెంబరు - 2008 జనవరి | vs | 2007-08లో ఆస్ట్రేలియాలో భారత క్రికెట్ జట్టు | 2007–08 భారత ఆస్ట్రేలియా పర్యటనలో హర్భజన్ సింగ్ జమైకన్ మూలానికి చెందిన ఆండ్రూ సైమండ్స్‌పై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసాడని ఆరోపించబడినప్పుడు స్లెడ్జింగ్ మీడియా దృష్టిలో పడింది. . హర్భజన్ తన మాతృభాషలో "తేరి మా కి" (అభ్యంతరకరమైన హిందీ పదం) అని అన్నాడని ఆరోపణ వచ్చింది. కానీ అందులో "n" అనే అక్షరంతో సహా ఉచ్ఛరించినట్లు అన్నాడు. అది కరెక్టో కాదో సైమండ్స్ చెప్పలేకపోయాడు. ఆరోపణ రుజువు కాకపోవడంతో హర్భజన్‌పై విధించిన మూడు మ్యాచ్‌ల నిషేధాన్ని ఎత్తివేసారు.[58] |
దేవుడివేం కాదు | కెవిన్ పీటర్సన్, యువరాజ్ సింగ్ | 2008 డిసెంబరు 21 | vs | 2008-09లో భారత్‌లో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు | మొహాలీలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్, భారత క్రికెటర్ యువరాజ్ సింగ్‌తో మైదానంలో వాగ్వాదానికి దిగాడు. స్టంప్ మైకులో వినబడిన ఆ సంభాషణలో పీటర్సన్ యువరాజ్‌తో మాట్లాడుతూ: "నువ్వు దేవుడివేమీ కాదు, క్రికెటర్‌వి. నేను నీకంటే మంచి ఆటగాణ్ణి " అని అన్నాడు. |
2010-2019
మార్చుసంఘటన | ఆటగాళ్ళు | తేదీ | మ్యాచ్ | సీరీస్ | వివరాలు |
---|---|---|---|---|---|
- | మిచెల్ జాన్సన్, స్కాట్ స్టైరిస్ | 2010 మార్చి 3 | vs | 2009-10లో న్యూజిలాండ్‌లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు | న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ స్కాట్ స్టైరిస్‌ను ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ జాన్సన్ భుజాన్ని గుద్దుకుంటూ వెళ్ళాడు. స్కాట్ తర్వాతి బంతిని బౌండరీ కొట్టాడు. జాన్సన్ ఉద్దేశపూర్వకంగా స్టైరిస్ హెల్మెట్‌కు తన తలను తాటించడంతో మాటల యుద్ధం జరిగింది. జాన్సన్, స్టైరిస్‌లకు వారి మ్యాచ్ ఫీజులో వరుసగా 60%, 15% జరిమానా విధించబడింది. |
- | S. శ్రీశాంత్, మైఖేల్ లంబ్ | 2010 ఏప్రిల్ 7 | Rajasthan Royals vs Kings XI Punjab | IPL 2010 | రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ మైఖేల్ లంబ్, కింగ్స్ ఎలెవన్ పేసర్ ఎస్. శ్రీశాంత్ వేసిన ఫ్రీ హిట్ బంతిని బౌండరీకి కొట్టిన తర్వాత శ్రీశాంత్, ముందు బ్యాట్స్‌మన్‌కు, ఆపై అంపైర్ వద్ద (నో-బాల్ ఇచ్చినందుకు) వ్యంగ్యంగా చప్పట్లు కొట్టాడు. బౌలర్ ప్రవర్తనపై కింగ్స్ ఎలెవన్ కెప్టెన్ యువరాజ్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. |
- | కెమర్ రోచ్, జాక్వెస్ కల్లిస్ | 2010 జూన్ 29 | vs | 2010లో వెస్టిండీస్‌లో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు | దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ జాక్వెస్ కల్లిస్ కు పదే పదే బౌన్సర్లు వేసిన తర్వాత, వెస్టిండీస్ బౌలర్ కెమర్ రోచ్, కాలిస్ మాటామాటా అనుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో, అంపైర్లు జోక్యం చేసుకోవలసి వచ్చింది. రోచ్, లెవల్ 1 నేరం చేసినట్లు అంగీకరించాడు, అతని మ్యాచ్ ఫీజులో 50% వసూలు చేశారు.[59] |
వికెట్లు పడడం లేదా? | మిచెల్ జాన్సన్, జేమ్స్ ఆండర్సన్ | 2010 డిసెంబరు 16 | vs | 2010-11 యాషెస్ | ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ తన రన్-అప్ కోసం సిద్ధమవుతుండగా, ఆస్ట్రేలియన్ నాన్-స్ట్రైకర్ మిచెల్ జాన్సన్ "ఎందుకు కిచకిచమంటున్నావ్, వికెట్లు పడడం లేదనా?" అని ఎగతాళి చేసాడు. ఆ తరువాతి బంతికే జాన్సన్ భాగస్వామి ర్యాన్ హారిస్‌ను ఔట్ చేసి ఆండర్సన్, జాన్సన్‌ను 'నోరు ముయ్యమని' సైగ చేసాడు.[60] |
బైటికెళ్దాం రా | పీటర్ సిడిల్, రికీ పాంటింగ్, మాట్ ప్రియర్ | 2010 డిసెంబరు 17 | vs | 2010-11 యాషెస్ | ఇంగ్లండ్‌కు చెందిన మాట్ ప్రియర్‌ను ఆస్ట్రేలియన్ పేసర్ పీటర్ సిడిల్ అవుట్ చేసినప్పుడు, సిడిల్ అతణ్ణి దూషించాడు. ప్రియర్ జవాబిస్తూ, "పద నాతో రా... ఇప్పుడే తేల్చుకుందాం... బయటికి రా తేల్చేసుకుందాం" అన్నాడు, స్టాండ్ వెనుక వైపు చూపిస్తూ. ఇది ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్‌కు కోపం తెప్పించింది, అతను కూడా దుర్భాషలాడాడు.[61][62] |
లోసర్ | S. శ్రీశాంత్, రికీ పాంటింగ్ | 2011 ఫిబ్రవరి 13 | vs | 2011 క్రికెట్ ప్రపంచ కప్ | భారత పేసర్ S. శ్రీశాంత్, ఆస్ట్రేలియన్ కెప్టెన్ రికీ పాంటింగ్‌లు గొడవ పడ్డారు. బౌలర్ పాంటింగ్‌కు గాల్లో 'L' గుర్తు వేసి, అతను 'లోసర్' అన్నట్లు సూచించాడు.[63] |
- | ఉమర్ గుల్, అహ్మద్ షెహజాద్, బాలాజీ రావు | 2011 మార్చి 3 | vs | 2011 క్రికెట్ ప్రపంచ కప్ | పాకిస్థానీ బౌలర్ ఉమర్ గుల్, కెనడియన్ బ్యాట్స్‌మెన్ బాలాజీ రావు మధ్య గొడవ జరిగగా, పాకిస్థానీ ఫీల్డర్ అహ్మద్ షెహజాద్ బ్యాట్స్‌మన్‌ను రెచ్చగొట్టేలా కనిపించడంతో బాలాజీ హిందీలో తిడుతూ విరుచుకుపడ్డాడు. |
- | జోనాథన్ ట్రాట్, విరాట్ కోహ్లీ | 2011 అక్టోబరు 17 | vs | 2011లో భారత్‌లో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు | ఇంగ్లండ్ ఆటగాడు జోనాథన్ ట్రాట్ భారత బ్యాటర్ విరాట్ కోహ్లీని స్లెడ్జ్ చేసేందుకు ప్రయత్నించాడు. బ్యాటర్ 112 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి అతని జట్టుకు మ్యాచ్‌ను ముగించాడు. |
- | జాడే డెర్న్‌బాచ్, గౌతమ్ గంభీర్ | 2011 అక్టోబరు 17 | vs | 2011లో భారత్‌లో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు | ఇంగ్లండ్ ఆటగాడు జేడ్ డెర్న్‌బాచ్, భారత బ్యాటర్ గౌతమ్ గంభీర్ మధ్య చాలాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. |
- | విరాట్ కోహ్లీ, ఎడ్ కోవాన్ | 26-2011 డిసెంబరు 29 | vs | 2011-12లో ఆస్ట్రేలియాలో భారత క్రికెట్ జట్టు | తన తల్లి అనారోగ్యంతో ఉన్న విషయానికి సంబంధించి విరాట్ కోహ్లీ, 'అత్యంత అనుచితమైన స్లెడ్జ్'ని ఉపయోగించాడని ఆస్ట్రేలియాకు చెందిన ఎడ్ కోవన్ ఫిర్యాదు చేసాడు. 'స్టంప్‌తో అతనిని పొడిచివేయాలని' అనుకున్నానని కోవన్ చెప్పాడు. |
- | వీరేంద్ర సెహ్వాగ్, జేమ్స్ ప్యాటిన్సన్ | 2011 డిసెంబరు 27 | vs | 2011-12లో ఆస్ట్రేలియాలో భారత క్రికెట్ జట్టు | వికెట్ల మధ్య నడుస్తున్న సమయంలో బ్యాటర్‌కు భుజం అడ్డు రావడంతో భారత బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆస్ట్రేలియాకు చెందిన జేమ్స్ ప్యాటిన్సన్‌ను బ్యాట్‌తో బెదిరించాడు. |
- | కీరన్ పొలార్డ్, జాన్ హేస్టింగ్స్ | 2012 డిసెంబరు 27 | Adelaide Strikers vs Melbourne Stars | 2012-13 BBL | 4 బంతుల్లో 13 పరుగుల వద్ద మెల్‌బోర్న్ ఆటగాడు జాన్ హేస్టింగ్స్‌ను కొట్టిన తర్వాత, అడిలైడ్ ఆటగాడు కీరన్ పొలార్డ్ బౌలర్‌ని ఉద్దేశించి సైగ చేశాడు. కోపంతో ఉన్న హేస్టింగ్స్ , పొలార్డ్ ఓవర్ చివరిలో ముఖాముఖి ఘర్షణకు దిగారు. |
- | క్రిస్ గేల్, బ్రాడ్ హాడిన్ | 2012 డిసెంబరు 30 | Sydney Thunder vs Sydney Sixers | 2012-13 BBL | సిక్సర్స్ జట్టు బ్యాటర్ బ్రాడ్ హాడిన్ వికెట్ తీసుకున్న తర్వాత, థండర్ జట్టుకు చెందిన ఆల్ రౌండర్ క్రిస్ గేల్ డ్యాన్స్ చేస్తూ సంబరాలు చేసుకున్నాడు. పెవిలియన్‌కు తిరిగి వచ్చే సమయంలో గేల్‌కి తన బ్యాట్‌ను ఇస్తానని హాడిన్ సైగ చేసాడు. ఆ సమయంలో క్రిస్ గేల్ బ్యాటింగ్ ఫామ్ లో లేడని అలా వెక్కిరించాడు. (ఈ సీజన్‌లో గేల్ సగటు 14). |
ఇంకొంత మందిని తెచ్చుకుంటావా? | మార్లోన్ శామ్యూల్స్, డేవిడ్ హస్సీ, షేన్ వార్న్ | 2013 జనవరి 6 | Melbourne Renegades vs Melbourne Stars | 2012-13 BBL | రెనిగేడ్స్ ఆల్ రౌండర్ మార్లోన్ శామ్యూల్స్ స్టార్స్ బ్యాటర్ డేవిడ్ హస్సీ జెర్సీని స్వాధీనం చేసుకున్నాడు. రెనెగేడ్స్ ఇన్నింగ్స్ సమయంలో శామ్యూల్స్ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు, స్టార్స్ కెప్టెన్ షేన్ వార్న్ శామ్యూల్స్‌పై విరుచుకుపడ్డాడు. వార్న్, మైక్ ఆన్ చేసి, శామ్యూల్స్‌తో ఇలా అన్నాడు: "ఇంకొంత మందిని పట్టుకుంటావా? ఫక్ యూ మేట్" అన్నాడు. ఇంకా, వార్న్ శామ్యూల్స్ ఛాతీపై బంతిని విసిరాడు, శామ్యూల్స్ బ్యాట్‌ను గాలిలోకి విసిరాడు. |
- | విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ | 2013 ఏప్రిల్ 11 | Royal Challengers Bangalore vs Kolkata Knight Riders | IPL 2013 | కోహ్లి అవుట్ అయినప్పుడు మైదానంలో ఏదో మాట్లాడిన తర్వాత బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ, కోల్‌కతా కెప్టెన్ గౌతమ్ గంభీర్‌ల మధ్య తీవ్రమైన ఘర్షణ జరిగింది. కోల్‌కతా ఫీల్డర్ రజత్ భాటియా, వాగ్వాదం పెరగకుండా అడ్డుకున్నాడు. |
- | మిచెల్ జాన్సన్, రాహుల్ ద్రవిడ్ | 2013 మే 24 | Mumbai Indians vs Rajasthan Royals | IPL 2013 | రాజస్థాన్ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ఆఫ్ సైడ్ ద్వారా ముంబైకి చెందిన మిచెల్ జాన్సన్‌ను ఫోర్ కొట్టినప్పుడు, బౌలర్ ద్రవిడ్‌ను స్లెడ్జింగు చేసాడు. ఆ తర్వాత ద్రావిడ్ మరో ఫోర్ కొట్టి, చేతిని చెవికి ఆన్చుకుని 'ఏది మళ్ళీ చెప్పూ' అన్నట్టు పోజు పెట్టాడు. |
ఎప్పుడూ టెస్టు ఆడలేదు | కీరన్ పొలార్డ్, అహ్మద్ షెహజాద్ | 2013 జూలై 16 | vs | 2013లో వెస్టిండీస్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు | గయానాలో వెస్టిండీస్, పాకిస్తాన్ మధ్య జరిగిన రెండవ ODIలో, సందర్శకులు 6.4 ఓవర్లలో కేవలం 11 పరుగులు మాత్రమే చేసారు, వాటిలో 5 ఎక్స్‌ట్రాలు. పాకిస్తానీ బ్యాటర్ అహ్మద్ షెహజాద్‌ను వెక్కిరించే అవకాశాన్ని వెస్టిండీస్‌కు చెందిన కీరన్ పొలార్డ్ ఉపయోగించుకున్నాడు, "నేను ఎప్పుడూ టెస్టు ఆడలేదు, కానీ చూస్తుంటే ఇదేదో టెస్టులానే ఉందే" అని గేలి చేసాడు. |
మొహమ్మీద కొట్టు | జేమ్స్ ఆండర్సన్, జార్జ్ బెయిలీ | 2013 నవంబరు 21-24 | vs | 2013-14 యాషెస్ | ఇంగ్లండ్ ఆటగాడు జేమ్స్ ఆండర్సన్ ఆస్ట్రేలియాకు చెందిన యాషెస్ అరంగేట్రం ఆటగాడు జార్జ్ బెయిలీపై పంచ్ చేస్తానని బెదిరించాడని ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ పేర్కొన్నాడు. |
చెయ్యి విరిగింది | మైఖేల్ క్లార్క్, జేమ్స్ ఆండర్సన్ | 2013 నవంబరు 24 | vs | 2013-14 యాషెస్ | 2013-14 యాషెస్ సమయంలో, ది గబ్బాలో జరిగిన మొదటి టెస్టులో ఆస్ట్రేలియన్ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ఇంగ్లండ్‌కు చెందిన జేమ్స్ ఆండర్సన్‌తో "చెయ్యి విరగ్గొట్టుకోడానికి సిద్ధంగా ఉండమని" చెబుతున్నట్లు స్టంప్ మైక్రోఫోన్ పట్టుకుంది. క్లార్క్‌కు ఐసీసీ తన మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించింది. |
మంటలొస్తాయ్ సిద్ధంగా ఉండు | అహ్మద్ షెహజాద్, తిలకరత్నే దిల్షాన్ | 2014 ఆగస్టు 30 | vs | 2014లో శ్రీలంకలో పాకిస్థాన్ క్రికెట్ జట్టు | ఇస్లాం మతంలోకి మారిన ముస్లిమేతరుడు జీవితంలో ఏం చేసినా స్వర్గానికి వెళ్తాడని శ్రీలంక క్రికెటర్ తిలకరత్నే దిల్షాన్‌తో పాక్ బ్యాట్స్‌మెన్ అహ్మద్ షెహజాద్ కెమెరాకు చిక్కాడు. శ్రీలంక ఆటగాడి సమాధానం వినబడలేదు, దీని తర్వాత షెహజాద్ ఇలా అన్నాడు: "అయితే మంటలకు సిద్ధంగా ఉండు". పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ షహరాయార్ ఖాన్ తన క్రమశిక్షణా కమిటీకి ఈ సమస్యను నివేదించాడు. |
డబ్బులు అడుక్కో | డారెన్ బ్రావో, తమీమ్ ఇక్బాల్ | 2014 సెప్టెంబరు 16 | vs | 2014లో వెస్టిండీస్‌లో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు | డారెన్ బ్రావో బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ తమీమ్ ఇక్బాల్‌ను "మీరు క్రికెటర్లకు ఎందుకు డబ్బులివ్వరు?" అని ప్రశ్నించాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొన్న పలువురు వెస్టిండీస్ ఆటగాళ్లకు జీతాలు చెల్లించనందుకు ఆ విధంగా ఎగతాళి చేశాడు. "మా దేశానికి వచ్చి డబ్బు కోసం అడుక్కోవద్దు" అని బంగ్లాదేశీ బదులివ్వడంతో అంపైర్ జోక్యం చేసుకున్నాడు. |
అడ్డు లే | బ్రాడ్ హాడిన్, అహ్మద్ షెహజాద్ | 2014 అక్టోబరు 5 | vs | 2014–15లో UAEలో పాకిస్థాన్‌తో జరిగిన ఆస్ట్రేలియన్ క్రికెట్ జట్టు | దుబాయ్‌లో ఆస్ట్రేలియన్ ఫీల్డర్ నుండి ఒక త్రో పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ అహ్మద్ షెహజాద్ చేతిలో పడినప్పుడు, ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్రాడ్ హాడిన్ కోపంగా, "హే! ఇక్కడ ఏమి చేస్తున్నావు?" అని అరుస్తూ, "అడ్డులే పక్కకు తప్పుకో" అన్నాడు. పాకిస్థానీ బ్యాట్స్‌మన్ ఆ ఘటనను స్క్వేర్ లెగ్ అంపైర్‌కు నివేదించాడు. |
నీ చేతిలో ఉన్నది బ్యాటేనా? | షేన్ వాట్సన్, వాహబ్ రియాజ్ | 2015 మార్చి 20 | vs | 2015 క్రికెట్ ప్రపంచ కప్ | పాకిస్థాన్ బౌలర్ వహాబ్ రియాజ్ మొదటి ఇన్నింగ్స్ చివర్లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ పాకిస్థానీని చూసి ఇలా: "నువ్వు పట్టుకున్నది అసలు బ్యాటేనా?" అన్నాడు. పాకిస్తాన్ పేస్‌మెన్ వాట్సన్‌తో రెండో ఇన్నింగ్స్‌లో భయంకరమైన ఫాస్ట్ బౌలింగుతో పగతీర్చుకున్నాడు. అతని స్పెల్ సమయంలో, బౌలర్ వాట్సన్‌పై విరుచుకుపడ్డాడు. వాట్సన్, రియాజ్‌లకు వారి మ్యాచ్ ఫీజులో వరుసగా 15%, 50% జరిమానా విధించబడింది. |
- | బ్రాడ్ హాడిన్, మార్టిన్ గప్టిల్ , గ్రాంట్ ఇలియట్ | 2015 మార్చి 29 | vs | 2015 క్రికెట్ ప్రపంచ కప్ | 2015 ప్రపంచ కప్ ఫైనల్ సమయంలో, ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్ బ్రాడ్ హాడిన్ న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ మార్టిన్ గప్టిల్, గ్రాంట్ ఇలియట్‌లను స్లెడ్జింగు చేసాడు. తర్వాత ఒక ఇంటర్వ్యూలో హాడిన్ ఇలా అన్నాడు, "మీకో సంగతి తెలుసా.., వారు దానికి అర్హులే." న్యూజిలాండ్‌లో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా, కివీ ఆటగాళ్లు ఆస్ట్రేలియన్లతో చాలా మంచిగా ప్రవర్తించారని, అది తనకు 'అసౌకర్యం' కలిగించిందనీ హాడిన్ చెప్పాడు. |
శాల్యూట్ | బెన్ స్టోక్స్, మార్లోన్ శామ్యూల్స్ | 21-2015 ఏప్రిల్ 23 | vs | 2015లో వెస్టిండీస్‌లో ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు | శామ్యూల్స్ సెంచరీ చేసిన విండీస్ ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ క్రికెటర్ మార్లోన్ శామ్యూల్స్ ఇంగ్లండ్‌కు చెందిన బెన్ స్టోక్స్ నుండి నిరంతరం స్లెడ్జింగ్‌కు గురయ్యాడు. స్లెడ్జింగ్‌కు ప్రతిస్పందనగా, ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో ఔట్ అయి తిరిగి పెవిలియన్‌కు వెళ్లే క్రమంలో స్టోక్స్‌కు శామ్యూల్స్ సెల్యూట్ కొట్టాడు. |
- | షకీబ్ అల్ హసన్, వాహబ్ రియాజ్ | 2015 మే 2 | vs | 2015లో బంగ్లాదేశ్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు | పాకిస్థాన్ క్రికెటర్ వాహబ్ రియాజ్‌పై బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ మాటలతో చేసిన దాడిని చదివిన లిప్‌రీడర్లు ఆశ్చర్యపోయారు. ఇద్దరి మధ్య వేలు చూపెట్టుకునే ఘర్షణ జరిగింది. ఇద్దరు ఆటగాళ్లకు వారి మ్యాచ్ ఫీజులో 30% జరిమానా విధించబడింది. |
- | క్వింటన్ డి కాక్, తమీమ్ ఇక్బాల్ | 2015 జూలై 22 | vs | 2015లో బంగ్లాదేశ్‌లో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు | బుధవారం లంచ్‌కు ముందు ఓవర్‌లో, దక్షిణాఫ్రికాకు చెందిన క్వింటన్ డి కాక్ బంగ్లాదేశ్ బ్యాటర్ తమీమ్ ఇక్బాల్ వద్దకు వెళ్ళి అతని భుజాలను, పక్కటెముకలను తట్టాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. డి కాక్‌కి అతని మ్యాచ్ ఫీజులో 75% జరిమానా విధించబడింది. |
నెర్వస్‌గా ఉందా? | నాథన్ లియోన్, మిచెల్ సాంట్నర్ | 2015 నవంబరు 27 | vs | 2015లో ఆస్ట్రేలియాలో న్యూజిలాండ్ క్రికెట్ జట్టు | ఆస్ట్రేలియా ఆటగాడు నాథన్ లియోన్ న్యూజిలాండ్ ఆటగాడు మిచెల్ సాంట్నర్‌తో ఇలా అన్నాడు: "మీరు భయపడుతున్నారా?" దానికి న్యూజిలాండ్ ఆటగాడు నిజాయితీగా, ఆస్ట్రేలియన్ స్లెడ్జింగ్‌ను నిలిపివేస్తూ, "అవును" అని సమాధానమిచ్చాడు. |
నిన్ను చితగ్గొట్టాను | జేమ్స్ ఫాల్క్‌నర్, విరాట్ కోహ్లీ | 2016 జనవరి 17 | vs | 2015–16లో ఆస్ట్రేలియాలో భారత క్రికెట్ జట్టు | ఆస్ట్రేలియా ఆటగాడు జేమ్స్ ఫాల్క్‌నర్ భారత వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లిపై విరుచుకుపడిన తర్వాత, భారత బ్యాట్స్‌మెన్, "నువ్వు నీ శక్తిని వృధా చేసుకుంటున్నావు. ఏం లాభం లేదు. నేను నిన్ను తగినంతగా చితక్కొట్టాను. వెళ్లి బౌలింగ్ చేయి" అని రిప్లై ఇచ్చాడు. కోహ్లీ 117 పరుగులతో తన 24వ వన్డే సెంచరీని నమోదు చేశాడు. |
పిరికోడా | మాథ్యూ వేడ్, గ్రాంట్ ఇలియట్ | 2016 ఫిబ్రవరి 8 | vs | 2015-16లో న్యూజిలాండ్‌లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు | ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ వేడ్, కివీ ఆటగాడు గ్రాంట్ ఇలియట్‌తో ఇలా అన్నాడు, "ఒక పిరికివాడు మాత్రమే అవతలి వ్యక్తి వెళ్ళేటప్పుడు స్లెడ్జ్ చేస్తాడు." మీ పనిని ప్రేమించండి’ అని ఇలియట్ చెప్పాక, అంపైర్ జోక్యం చేసుకున్నాడు. |
- | కెవిన్ ఓ'బ్రియన్, దవ్లత్ జద్రాన్ | 2016 జూలై 19 | vs | 2016లో ఐర్లాండ్‌లో ఆఫ్ఘన్ క్రికెట్ జట్టు | ఐర్లాండ్ ఆటగాడు కెవిన్ ఓబ్రెయిన్‌తో తలపడిన ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు దవ్లత్ జద్రాన్ 49వ ఓవర్లో బౌలర్ వేసిన ఐదో బంతికి క్రీజు నుంచి బయటికి వెళ్ళడంతో బంతి స్టంపుల్లోకి దూసుకెళ్లింది. ఆ డెలివరీని డెడ్ బాల్‌గా ప్రకటించడంతో ఓబ్రెయిన్ బ్యాట్స్‌మెన్‌పై తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. మరుసటి బంతికి, జద్రాన్ ఐరిష్ బౌలర్‌ను సిక్సర్ కొట్టాడు. బంతి ఎక్కడికి వెళ్లిందో వెతుక్కోమని అతనికి సంకేతాలు ఇచ్చాడు. |
- | ఇషాంత్ శర్మ, సబ్బీర్ రెహమాన్ | 2017 ఫిబ్రవరి 13 | vs | 2016–17లో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు భారతదేశంలో | 69వ ఓవర్‌లో భారత బౌలర్ ఇషాంత్ శర్మ, బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ సబ్బీర్ రెహ్మాన్ మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన పోటీలో శర్మ 'బంతిని చూడు, నోరు మూసుకుని క్రికెట్ ఆడు' అని సైగ చేశాడు. 71వ ఓవర్‌లో, భారత పేసర్ రెహ్మాన్‌ను లెగ్ బిఫోర్ వికెట్‌గా అవుట్ చేసాడు. సెండ్-ఆఫ్ సమయంలో బ్యాట్స్‌మన్‌ను తిట్టాడు. |
- | కగిసో రబడా, నిక్ మాడిన్సన్ | 2016 నవంబరు 25 | vs | 2016లో ఆస్ట్రేలియాలో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు | దక్షిణాఫ్రికా ఆటగాడు కగిసో రబడా ఆస్ట్రేలియన్ కొత్త ఆటగాడు నిక్ మాడిన్సన్‌ను అవుట్ చేసిన తర్వాత అతనిపై, బహుశా ఆఫ్రికాన్స్‌లో, విరుచుకుపడ్డాడు. దక్షిణాఫ్రికా పేసర్ కైల్ అబాట్ ఆ డెలివరీలో మాడిన్సన్ వికెట్ ప్రణాళిక చేయబడిందని వెల్లడించాడు, ఇది రబాడా ఆనందాన్ని పెంచింది. |
తొలి బంతికే పెద్ద షాటు | మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్ , శ్రేయాస్ అయ్యర్ | 2017 ఫిబ్రవరి 18 | India 'A' vs | 2016-17లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు భారతదేశంలో | భారత బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ చేయడానికి నిష్క్రమించినప్పుడు, ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్ అతనిని స్లెడ్జ్ చేయడానికి ప్రయత్నించారు. వేడ్ చిలిపిగా, "ఇతను మొదటి బంతి నుండే బాడే ప్రయత్నం చేస్తాడనుకుంటాను" అన్నాడు. అయ్యర్ తన మొదటి బంతికే నాథన్ లియాన్‌ను సిక్సర్ బాదాడు. అయ్యర్ ఇది తనకు లభించిన 'అత్యుత్తమ స్లెడ్జింగ్ అనుభవం'గా అభివర్ణించాడు. |
టాయిలెట్‌కు పో | విరాట్ కోహ్లీ, మాట్ రెన్షా | 2017 మార్చి 5 | vs | 2016-17లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు భారతదేశంలో | భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్ మాట్ రెన్‌షాతో 'తొందరగా టాయిలెట్‌కి వెళ్ళు' అని అన్నాడు. ఇది మునుపటి టెస్ట్ మ్యాచ్‌లో రెన్‌షా తీసుకున్న టాయిలెట్ బ్రేక్‌ను ఉద్దేశించినది. |
నన్ను మాదర్చోద్ అన్నావ్ | రవీంద్ర జడేజా, మాథ్యూ వేడ్ | 2017 మార్చి 27 | vs | 2016-17లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు భారతదేశంలో | భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తనను 'మాదార్చోద్' ('మదర్‌ఫకర్') అన్నాడని ఆస్ట్రేలియా వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ మాథ్యూ వేడ్ ఆరోపించారు. ఈ పదాన్ని ఆంగ్లంలోకి అనువదించమని వేడ్ డిమాండ్ చేసాడు. అయితే రవిచంద్రన్ అశ్విన్ పరిస్థితిని చల్లబరచాడు. |
మిగతావాళ్ళు పడిపోతారు | విరాట్ కోహ్లీ, అజర్ అలీ, ఫఖర్ జమాన్ | 2017 జూన్ 18 | vs | 2017 ఛాంపియన్స్ ట్రోఫీ | భారత ఆటగాడు విరాట్ కోహ్లి నిరంతరం పాక్ బ్యాట్స్‌మెన్ ఫఖర్ జమాన్, అజర్ అలీలను స్లెడ్జింగ్ చేస్తూ ఇలా అన్నాడు: "అరే, ఏక్ వికెట్ నికల్ జాయేగా తోయే సారే ఔట్ హో జాయేంగే (మనం ఒక వికెట్ సాధిస్తే, మిగిలినవన్నీ అవే కూలిపోతాయి)." |
- | జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, స్టీవ్ స్మిత్ | 2017 డిసెంబరు 5 | vs | 2017–18లో ఆస్ట్రేలియాలో ఇంగ్లీష్ క్రికెట్ జట్టు | ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌పై స్లెడ్జింగ్ చేయడం వల్ల అతడిని 'చౌకగా' అవుట్ చేశామని ఇంగ్లాండ్ ఆటగాడు జేమ్స్ ఆండర్సన్ వెల్లడించాడు. అతను ఆస్ట్రేలియన్ తన పనిమీద దృష్టి పెట్టడం కంటే నాతో, స్టూవర్ట్ (బ్రాడ్)తో చాట్ చేయడంపైనే ఎక్కువ ఆసక్తి చూపాడని చెప్పాడు. |
సీనియర్ బ్యాట్స్‌మన్ | విరాట్ కోహ్లీ, డీన్ ఎల్గర్ | 2018 జనవరి 7 | vs | 2017–18లో దక్షిణాఫ్రికాలో భారత క్రికెట్ జట్టు | బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడుతున్న దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ డీన్ ఎల్గర్‌ను భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ స్లెడ్జ్ చేశాడు. మాజీ ఆటగాళ్ళలో 'సీనియర్ బ్యాట్స్‌మెనా?' 'చూడండతన్ని'. |
- | శుభమాన్ గిల్, పాకిస్తానీ ఫీల్డర్లు | 2018 జనవరి 30 | మూస:Cr19vs మూస:Cr19 | 2018 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ | అండర్-19 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించిన భారత్, పాకిస్థాన్‌తో ఆడుతోంది. కొంతమంది పాకిస్థానీ ఫీల్డర్లు భారత బ్యాట్స్‌మెన్ శుభ్‌మాన్ గిల్‌పై విరుచుకుపడ్డారు, 'యే బంగ్లాదేశ్ కే బౌలర్ నహీ హై (వీరు బంగ్లాదేశ్ బౌలర్లు కాదు)' అని అరుస్తూ, దానికి గిల్ ఇలా స్పందించాడు: 'హమ్ భీ పాకిస్థాన్ కే బ్యాట్స్‌మెన్ నహీ హై (మేమూ పాకిస్థానీ బ్యాట్స్‌మెన్లం కాదు)' అని అన్నాడు. గిల్ అజేయంగా 102 పరుగులు చేయడంతో భారత్ 203 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. |
- | డేవిడ్ వార్నర్, క్వింటన్ డి కాక్ | 2018 మార్చి 4 | vs | 2017-18లో దక్షిణాఫ్రికాలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు | సౌతాఫ్రికా వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ క్వింటన్ డి కాక్, ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మధ్య మైదానంలో మాటలు జారాయి. ఆ ఘర్షణ డ్రెస్సింగ్ రూమ్‌కు కూడా పాకింది. దక్షిణాఫ్రికా శిబిరం వార్నర్ స్లెడ్జింగ్ 'వ్యక్తిగతంగా' ఉంది అని అంది. అయితే వార్నర్, తన 'కుటుంబం' కోసం నిలబడి ఉన్నానని నొక్కి చెప్పాడు. డి కాక్ స్లెడ్జ్ (వార్నర్ భార్యను ఉద్దేశించి) 'అసహ్యకరమైనది' అని కూడా అన్నాడు. అదే సిరీస్‌లో 2018లో బాల్ ట్యాంపరింగ్ కుంభకోణం వెలుగులోకి రావడంతో వార్నర్‌పై ఏడాది నిషేధం విధించారు. |
- | కగిసో రబడా, స్టీవ్ స్మిత్ | 2018 మార్చి 9 | vs | 2017-18లో దక్షిణాఫ్రికాలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు | ఆస్ట్రేలియన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఔటై వెళ్తున్నపుడు దక్షిణాఫ్రికా ఆటగాడు కగిసో రబాడా అతని ముఖంలో ముఖం పెట్టి అరుస్తూ భుజంపై తట్టాడు. అప్పటికే ఇతర స్లెడ్జింగ్ ఘటనలతో స్ఫూర్తి దెబ్బతిన్న సిరీస్‌కు ఈ ఘటన 'చెడ్డ రూపాన్ని' ఇచ్చిందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ అలన్ బోర్డర్ పేర్కొన్నాడు. |
- | జాసన్ హ్యూస్, డేవిడ్ వార్నర్ | 2018 అక్టోబరు 27 | Western Suburbs vs Randwick-Petersham | NSW ప్రీమియర్ క్రికెట్ | పీటర్‌షామ్‌కి చెందిన డేవిడ్ వార్నర్‌పై సబర్బ్స్‌కు చెందిన జేసన్ హ్యూస్ స్లెడ్జింగ్ చేసినప్పుడు, అతను మైదానం నుండి బయటికి వెళ్లిపోయాడు. |
బేబీ సిట్టర్/తాత్కాలిక కెప్టెన్ | రిషబ్ పంత్, టిమ్ పైన్ | 2018 డిసెంబరు 13 | vs | 2018-19లో ఆస్ట్రేలియాలో భారత క్రికెట్ జట్టు | ఆస్ట్రేలియన్ కెప్టెన్ టిమ్ పైన్ భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను స్లెడ్జ్ చేస్తూ "నీకు తెలుసా.. వన్‌డే జట్టులోకి MS తిరిగి వచ్చాడు. ఇక నీ పని సరి. వాళ్ళకు బ్యాటర్ కావాలి. నీ సెలవులు పొడిగించుకో, హోబార్ట్ అందమైన పట్టణం కూడా... అతనికి వాటర్ ఫ్రంట్ అపార్ట్‌మెంట్ ఒకటి ఇవ్వండ్రా”. అన్నాడు. అతను ఇంకా ఇలా అడిగాడు, “అవునూ నీకు బేబీ సిటింగు వచ్చా? నేను నా భార్య సినిమాకెళ్తాం, నువ్వు పిల్లల్ని చూసుకుంటావా?". ఆస్ట్రేలియన్ ఇన్నింగ్స్‌లో పైన్ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు పంత్ ప్రతీకారం తీర్చుకున్నాడు, "మీరు ఎప్పుడైనా 'తాత్కాలిక కెప్టెన్' అనే పదాన్ని విన్నారా? ఇదిగో ఇక్కడ ప్రత్యేక అతిథి ఉన్నాడు. తాత్కాలిక కెప్టెన్ అనే పదాన్ని ఎప్పుడైనా విన్నారా? అతన్ని ఔట్తీ చెయ్యడానికి ఏం చెయ్యనక్కర్లేదు" అని దెప్పి పొడిచాడు. రెగ్యులర్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లు నిషేధం కారణంగా, కొన్ని నెలల ముందే కెప్టెన్సీని తీసుకున్న ఆసీస్ కెప్టెన్‌పై ఇది చెతురు. |
అంత వేడిగా ఏమీ లేదే | అలిస్సా హీలీ, బెత్ మూనీ | 2019 జనవరి 25 | Sydney Sixers vs Brisbane Heat | WBBL 2018-19 | హీట్ జట్టుకు చెందిన వికెట్ కీపర్ బెత్ మూనీ తన మ్యాచ్-విన్నింగ్ 65 (46) పరుగుల సమయంలో ఎండతీవ్రతతో బాధపడటం ప్రారంభించింది. అయితే, సిక్సర్ జట్టు లోని అలిస్సా హీలీ, మూనీని ఎగతాళి చేస్తూ "అసలు ఇక్కడ అంత హాట్‌గా లేదు" అంది. హీట్ జట్టు మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది, అలాగే తదుపరి సీజన్‌లో టైటిల్‌ను గెలుచుకుంది |
ఒరే నల్లోడా.. మీ అమ్మ ఎక్కడ కూచుంది? | సర్ఫరాజ్ అహ్మద్, ఆండిలే ఫెహ్లుక్వాయో | 2019 జనవరి 25 | vs | 2018–19లో దక్షిణాఫ్రికాలో పాకిస్థాన్ క్రికెట్ జట్టు | పాకిస్థాన్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో వన్డేలో పాక్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ దక్షిణాఫ్రికా క్రికెటర్ ఆండిలే ఫెహ్లుక్వాయోపై జాత్యహంకార వ్యాఖ్య చేస్తూ పట్టుబడ్డాడు. సర్ఫరాజ్ ఉర్దూలో ఇలా అన్నాడు: "అబే కాలే, తేరీ అమ్మీ ఆజ్ కహాన్ బైఠీ హై? క్యా పర్వా కే ఆయే హై ఆజ్?" దానర్థం, "ఒరే నల్లోడా, మీ అమ్మ ఎక్కడికి పోయింది? ఆమె నీ కోసం ఏం ప్రార్థన చేసింది?". ICC అహ్మద్‌పై తదుపరి నాలుగు మ్యాచ్‌లకు నిషేధం విధించింది. తర్వాత అహ్మద్, దక్షిణాఫ్రికా క్రికెటర్‌కి క్షమాపణలు చెప్పాడు. |
నాకంటే చెత్త బ్యాటింగు సగటు | నాథన్ లియోన్, ధనంజయ డి సిల్వా | 2019 ఫిబ్రవరి 3 | vs | 2019లో ఆస్ట్రేలియాలో శ్రీలంక క్రికెట్ జట్టు | శ్రీలంక బ్యాటర్ ధనంజయ డి సిల్వా క్రీజులో ఔట్ కావడంతో, ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్ అతనితో “ఎహ్? ఈ వేసవిలో నేను చేసిన దానికంటే నీ బ్యాటింగ్ అధ్వాన్నంగా ఉంది...నువ్వూ ఒక బ్యాటర్‌వేనా” అన్నాడు. దీనికి డి సిల్వా స్పందిస్తూ, "ఏం మీరు శ్రీలంకకు రారా ఏంటి?" అన్నాడు. అప్పుడు లియోన్ "కనీసం నేను అక్కడ ఒక సిరీస్ గెలిచాను" అన్నాడు. డిసిల్వా చివరికి 25 పరుగుల వద్ద ఔటయ్యాడు, పేసర్ మిచెల్ స్టార్క్ వేసిన బంతికి హిట్ వికెట్ అయ్యాడు. |
- | రషీద్ ఖాన్, షేన్ వాట్సన్ | 2019 ఏప్రిల్ 23 | Chennai Super Kings vs Sunrisers Hyderabad | IPL 2019 | హైదరాబాద్ బౌలర్ రషీద్ ఖాన్ చెన్నై ఆటగాడు షేన్ వాట్సన్‌ను ఫోర్ కొట్టిన తర్వాత అతనిని చూస్తూ ఉండిపోయాడు. ఈ పోటీ చివరకు మాటల తూటాలుగా మారింది. ఖాన్ తన 4 ఓవర్లలో ఒక వికెట్‌తో 44 పరుగులు ఇచ్చాడు, వాట్సన్ 96 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో సూపర్ కింగ్స్ మరో బంతి మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. |
- | షాహీన్ ఆఫ్రిది, హజ్రతుల్లా జజాయ్ | 2019 మే 24 | vs | 2019 క్రికెట్ ప్రపంచ కప్ | ఆఫ్ఘన్ బ్యాటర్ హజ్రతుల్లా జజాయ్ పాక్ బౌలర్ షాహీన్ అఫ్రిది వేసిన బంతులను వరుసగా మూడు బౌండరీలు కొట్టాడు. తర్వాతి డెలివరీలో జజాయ్ మిస్సవడంతో ఆఫ్రిది, బ్యాటర్‌పై మాటలతో దాడి చేశాడు. జజాయ్ తన కుడి చేతిని పైకెత్తి మణికట్టును విసురుతూ, క్రీజ్‌కి తిరిగి వెళ్లి బౌలింగు చేయమని సూచించాడు. జజాయ్ అఫ్రిదిని మరో ఫోర్ కొట్టి మళ్ళీ అదే సైగ చేసాడు. హోరాహోరీగా సాగిన ఆ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ విజయం సాధించింది. |
ఆణ్ణి హెల్మెట్ మీద కొట్టు | మాథ్యూ వేడ్, జోఫ్రా ఆర్చర్ | 2019 సెప్టెంబరు 7 | vs | ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ | అంతకు ముందు ఇంగ్లండ్‌కు చెందిన జోఫ్రా ఆర్చర్ వేసిన బంతి హెల్మెట్‌పై తగిలిన వేడ్, ఆర్చర్ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు స్లెడ్జింగ్‌ను మళ్లీ ప్రారంభించాడు: “అతన్ని ఇక్కడ హెల్మెట్‌పై కొట్టు హాఫీ (జోష్ హాజిల్‌వుడ్)...అది లెగ్‌బైసా కాదా లేక పరుగులేనా అని (అంపైర్‌ని) అడగు. మీ లెక్కలోకి వెళ్లకుండా చూసుకో. |
అతడైతే ఫోర్ కొట్టేవాడు | టిమ్ పైన్, మహ్మద్ రిజ్వాన్ | 2019 నవంబరు 21 | vs | ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ | పాకిస్థానీ బ్యాటర్ మొహమ్మద్ రిజ్వాన్, నాథన్ లియోన్ వేసిన బంతిని డిఫెన్సు ఆడడంతో, ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్, కెప్టెన్ టిమ్ పైన్, మార్నస్ లాబుస్‌చాగ్నేతో మాట్లాడుతూ, "సర్ఫరాజ్ అయితే ఈపాటికి ఫోర్ కొట్టి ఉండేవాడు, కదూ గజ్జా" అని అన్నాడు. పైన్ స్లెడ్జింగ్‌ను కొనసాగిస్తూ: "అయితే వాసన బానే ఉంది, చాలా బాగుంది." అన్నాడు. |
వెయ్‌రా వెయ్‌రా బండోడా | మాథ్యూ వేడ్, నీల్ వాగ్నర్ | 2019 డిసెంబరు 14 | vs | ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ | న్యూజిలాండ్‌కు చెందిన నీల్ వాగ్నర్‌ను ఆస్ట్రేలియా ఆటగాడు మాథ్యూ వేడ్ బౌన్సర్లతో కొట్టినపుడు, వాగ్నర్, "వెయ్‌రా వెయ్‌రా బండోడా" అని అన్నాడు. |
నీకిదే చివరి అవకాశం | మిచెల్ స్టార్క్, జీత్ రావల్ | 2019 డిసెంబరు 15 | vs | ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ | ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ స్టార్క్ 1వ టెస్టు చివరి రోజు బౌలింగ్ చేస్తున్నప్పుడు కివీస్ బ్యాట్స్‌మెన్ జీత్ రావల్‌తో మాటలు కలిపాడు. స్టార్క్ చేసిన ఎగతాళిలో 'చెడగొట్టుకోబాక', 'నీ కెరీర్‌లో ఇది చివరి అవకాశం' అన్నాడు. మెల్‌బోర్న్‌లో జరిగే బాక్సింగ్ డే టెస్ట్ నుండి రావల్‌ని తప్పిస్తానని సూచిస్తూ స్టార్క్, "నీకు క్రిస్మస్ చాలా బాగుంటుందిలే" అని అన్నాడు. |
2020-ప్రస్తుతం
మార్చుసంఘటన | ఆటగాళ్ళు | తేదీ | మ్యాచ్ | సీరీస్ | వివరాలు |
---|---|---|---|---|---|
- | అలిస్సా హీలీ , భారత క్రీడాకారులు | 2020 మార్చి 8 | vs | 2020 ICC మహిళల T20 ప్రపంచ కప్ | ఆస్ట్రేలియా క్రీడాకారిణి అలిస్సా హీలీ T20 ప్రపంచ కప్ ఫైనల్‌లో ఔట్ అయిన సమయంలో భారత జట్టు నుండి తిట్లు అందుకుంది |
- | బెన్ స్టోక్స్, జెర్మైన్ బ్లాక్‌వుడ్ | 2020 జూలై 12 | vs | 2020లో ఇంగ్లాండ్‌లో వెస్టిండీస్ క్రికెట్ జట్టు | వెస్టిండీస్ బ్యాటర్ జెర్మైన్ బ్లాక్‌వుడ్ తన రెండో బ్యాటింగ్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచి ఇంగ్లండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ స్లెడ్జింగ్‌ను ఎదుర్కొన్నాడు. తనను 'రాష్ షాట్' ఆడేలా చేయాలనే ఉద్దేశంతో స్టోక్స్, ఇతర ఇంగ్లీష్ ప్లేయర్‌లు స్లెడ్జింగు చేసారని బ్లాక్‌వుడ్ చెప్పాడు. కానీ బ్లాక్‌వుడ్ మాత్రం చెదరకుండా ఆడి 95 పరుగులు చేసాడు. వెస్టిండీస్ ఆ టెస్టును 4 వికెట్ల తేడాతో గెలిచింది |
25 కిలోలు ఎక్కువ బరువు | రిషబ్ పంత్, మాథ్యూ వేడ్ | 2020 డిసెంబరు 28 | vs | 2020-21లో ఆస్ట్రేలియాలో భారత క్రికెట్ జట్టు | స్టంప్స్ వెనుక నుండి భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ నిరంతరం స్లెడ్జింగ్ చేయడంపై ఆస్ట్రేలియా బ్యాటర్ మాథ్యూ వేడ్ స్పందిస్తూ, “మీరు 25 కిలోలు అధిక బరువుతో ఉన్నారు. మీరు 20 కిలోలు, 25 లేదా 30 కిలోలు అధిక బరువుతో ఉన్నారా?" |
గాబాలో | రవిచంద్రన్ అశ్విన్, టిమ్ పైన్ | 2021 జనవరి 11 | vs | 2020-21లో ఆస్ట్రేలియాలో భారత క్రికెట్ జట్టు | మూడవ టెస్ట్ తర్వాత పైన్, అశ్విన్‌తో గొడవపడిన కారణంగా తర్వాత విమర్శలను ఎదుర్కొన్నాడు. అతని మాటలను స్టంప్ మైకు పట్టుకుంది. అతను "నువు [అశ్విన్] గబ్బా ఎప్పుడొస్తావా అని చూస్తున్నా" అన్నాడు. (ఆస్ట్రేలియా అక్కడ 32 సంవత్సరాలుగా ఒక టెస్టులో కూడా ఓడిపోలేదు.). దీనిపై అశ్విన్ స్పందిస్తూ భారత్‌లో జరిగే రిటర్న్ సిరీస్ పైన్‌కు చివరిది అని చెప్పాడు. పైన్ మళ్ళీ, "కనీసం నా సహచరులైనా నన్ను ఇష్టపడతారు, బుర్ర తక్కువ యదవా" అన్నాడు. అశ్విన్‌ను తీసుకోడానికి ఏ IPL జట్లూ ఇష్టపడడం లేదని ఆవిధంగా వెక్కిరించాడు. తర్వాతి ఓవర్‌లో పైన్, అశ్విన్ ఇచ్చిన క్యాచ్‌ను వదిలేసాడు. దాంతో అశ్విన్ హనుమ విహారితో కలిసి దాదాపు ఓటమి ఖాయం అనుకున్న దశ నుండి అ మ్యాచ్‌ను డ్రా చేసాడు. ఆ తరువాత గబ్బాలో జరిగిన టెస్టులో కూడా భారత్ విజయం సాధించింది. |
డబ్బు కోసమే ఆడతావ్ | నిరోషన్ డిక్వెల్లా, జానీ బెయిర్‌స్టో | 2021 జనవరి 24 | vs | 2020-21లో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు శ్రీలంకలో | గాలేలో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 36వ ఓవర్‌లో, శ్రీలంక వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లా ఇంగ్లండ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టోను స్లెడ్జ్ చేశాడు. జాతీయ జట్టు నుండి తొలగించబడినప్పటికీ అతను ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడడానికి ఇండియా వెళ్తున్నాడనీ, 'డబ్బు కోసమే ఆడతాడ'నీ వ్యాఖ్యానించాడు. ఆ తరువాతి బంతికే బెయిర్‌స్టో అవుట్ అయ్యాడు. |
ని వికెట్‌ను ఇచ్చేయ్ | జో రూట్, దినేష్ చండిమాల్ | 2021 జనవరి 25 | vs | 2020-21లో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు శ్రీలంకలో | ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ శ్రీలంక కెప్టెన్ దినేష్ చండిమాల్‌ను స్లెడ్జింగ్ చేస్తూ స్టంప్ మైక్‌కు పట్టుబడ్డాడు. "కమ్ ఆన్ చండీ, త్రో యువర్ వికెట్ అవే". తర్వాతి డెలివరీలోనే జాక్ లీచ్‌కి చండిమాల్ అవుట్ కావడంతో స్లెడ్జ్ పని చేసింది. |
కొన్ని మాటలకు అర్థాలు మా అందరికీ తెలుసు | మహ్మద్ సిరాజ్, బెన్ స్టోక్స్ , విరాట్ కోహ్లీ | 2021 మార్చి 4 | vs | 2021లో భారత్‌లో ఇంగ్లీష్ క్రికెట్ జట్టు | భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ తన ఓవర్ చివరిలో బౌన్సర్ వేసిన తర్వాత, ఇంగ్లండ్ బ్యాటర్ బెన్ స్టోక్స్ బౌలర్‌తో ఏదో చెప్పాడు. ఈ సంఘటన తర్వాత, భారత కెప్టెన్ విరాట్ కోహ్లి స్టోక్స్‌ను ఎదుర్కొన్నాడు. ఇద్దరు ఆటగాళ్లను విడదీసేందుకు అంపైర్ జోక్యం చేసుకోవలసి వచ్చింది. సిరాజ్ ప్రకారం, స్టోక్స్ అనుచిత పదజాలం వాడుతున్నాడు. స్టోక్స్ వాదన భిన్నంగా ఉంది. అతను "మీకు కావలసిన పదాన్ని వాడొచ్చు... కొన్ని మాటలకు అర్థం ఏమిటో మా అందరికీ తెలుసు", అతను మొదట్లో స్లెడ్జింగు చేసినట్లు సూచించాడు. |
హ్యాపీ హుకర్ బాయ్ | జాసన్ హోల్డర్, ధనంజయ డి సిల్వా | 2021 మార్చి 30 | vs | 2020–21లో వెస్టిండీస్‌లో శ్రీలంక క్రికెట్ జట్టు | ఆంటిగ్వాలో శ్రీలంక, వెస్టిండీస్‌ల మధ్య జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్ రెండో రోజు సమయంలో నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో నిలబడి ఉన్న ధనంజయ డిసిల్వాను జాసన్ హోల్డర్ ఆటపట్టించడంతో స్నేహపూర్వక పరిహాసం జరిగింది. చివరిసారి వెస్టిండీస్‌లో పర్యటించినప్పుడు ధనంజయ చేయి విరిగిందని ఆల్‌రౌండర్ గుర్తు చేశాడు. హోల్డర్, “ధనంజయా...హ్యాపీ హుకర్ బాయ్, హ్యాపీ హుకర్. నువ్వు కిందటిసారి ఇక్కడకు వచ్చినప్పుడు నీ చేయి విరిగింది” అంటూ, "మీ కాళ్ళు జాగ్రత్త, కుర్రాళ్ళూ!" అని ముగించారు. |
నీకు చదువు రాదుగా | నాథన్ లియోన్, మార్నస్ లాబుస్చాగ్నే | 2021 ఏప్రిల్ 17 | Queensland vs New South Wales | 2020-21 షెఫీల్డ్ షీల్డ్ | న్యూ సౌత్ వేల్స్ స్పిన్నర్ నాథన్ లియాన్ క్వీన్స్‌లాండ్ బ్యాటర్ మార్నస్ లాబుస్‌చాగ్నేపై స్లెడ్జింగ్ ప్రారంభించాడు. అతను సాధారణంగా ప్రశాంతంగా ఉంటాడని, పేపర్ చదవడానికి కూర్చుంటానని లాబుస్‌చాగ్నే లియాన్‌తో చెప్పినప్పుడు, స్పిన్నర్ స్పందిస్తూ, "నీకు చదువు రాదుగా మార్న్." అన్నాడు. |
- | షోరిఫుల్ ఇస్లాం, కుసల్ మెండిస్ | 2021 మే 28 | vs | 2021లో బంగ్లాదేశ్‌లో శ్రీలంక క్రికెట్ జట్టు | బంగ్లాదేశ్ బౌలర్ షోరిఫుల్ ఇస్లామ్ విసిరిన తిట్లను శ్రీలంక బ్యాట్స్‌మెన్ కుశాల్ మెండిస్ తిప్పికొట్టాడు. ఆ తర్వాత బ్యాట్స్‌మన్ ఇస్లాంకు తగిన జవాబిచ్చాడు. |
ఏం చెయ్యాలో తెలీదు | విరాట్ కోహ్లీ, టామ్ లాథమ్ | 2021 జూన్ 20 | vs | ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ | ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ సమయంలో, భారత ఆటగాడు విరాట్ కోహ్లీ న్యూజిలాండ్ ఓపెనర్ టామ్ లాథమ్‌ను యానిమేషన్‌గా స్లెడ్జింగ్ చేస్తున్నాడు: “అతనికి ఏమీ తెలీడం లేదు జాస్..బ్యాట్‌పైకి బంతి రాడం లేదని అతనికి తెలుసు, అబ్బాయిలు" |
మీ ఇల్లు కాదు | విరాట్ కోహ్లీ, జేమ్స్ ఆండర్సన్ | 2021 ఆగస్టు 15 | vs | 2021లో ఇంగ్లండ్‌లో భారత క్రికెట్ జట్టు | రెండో టెస్టు నాలుగో రోజున, భారత ఆటగాడు విరాట్ కోహ్లీ ఇంగ్లిష్ పేసర్ అండర్సన్‌తో ఇలా అన్నాడు, “నువ్వు నన్ను మళ్లీ తిట్టావా? ఇది మీ ఇల్లు కాదు". కోహ్లి ఆండర్సన్‌పై స్లెడ్జ్‌ని కొనసాగిస్తూ, "చిర్ప్ చిర్ప్ చిర్ప్.. ముసలాడా ఇక నీ పని ఇదే.” అన్నాడు. |
మీ షీట్లను తెచ్చుకుంటారా? | విరాట్ కోహ్లీ, ఆలీ రాబిన్సన్ | 2021 ఆగస్టు 16 | vs | 2021లో ఇంగ్లండ్‌లో భారత క్రికెట్ జట్టు | రెండో టెస్టులో ఐదో రోజు ఇంగ్లండ్ ఆటగాడు ఓలీ రాబిన్‌సన్ క్రీజులోకి దిగిన వెంటనే భారత ఆటగాడు విరాట్ కోహ్లి మాటలతో దాడి చేశాడు. అతని స్లెడ్జింగ్ కొనసాగింది: "ఈ రోజు మీ షీట్లను తెచ్చుకుంటారా?" |
- | లాహిరు కుమార, లిటన్ దాస్, మహ్మద్ నయీమ్ | 2021 అక్టోబరు 24 | vs | 2021 ICC పురుషుల T20 ప్రపంచ కప్ | శ్రీలంక బౌలర్ లాహిరు కుమార, బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ లిటన్ దాస్ మధ్య తీవ్రమైన ఘర్షణ జరిగింది. ఇద్దరూ ముఖాముఖిగా వచ్చారు. బంగ్లాదేశ్ నాన్-స్ట్రైకర్ మొహమ్మద్ నయీమ్ కూడా ఈ గొడవలో పాల్గొన్నాడు. శ్రీలంక ఆటగాళ్ళు కుమారను దాస్ నుండి దూరం చేయడంతో గొడవ ఆగిపోయింది. |
- | మార్టిన్ గప్టిల్, దీపక్ చాహర్ | 2021 నవంబరు 17 | vs | 2021-22లో న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారతదేశంలో | న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్టిల్ భారత బౌలర్ దీపక్ చాహర్‌ను సిక్సర్ బాదిన తర్వాత అతడిని చూస్తూ నిలబడ్డాడు. గప్టిల్ వికెట్‌ను క్లెయిమ్ చేసిన వెంటనే బౌలర్ కూడా అలాగే, క్రూరంగా చూస్తూ ఉండిపోయాడు. |
- | హసన్ అలీ, నూరుల్ హసన్ | 2021 నవంబరు 19 | vs | 2021లో బంగ్లాదేశ్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు | సిరీస్‌లోని మొదటి ట్వంటీ 20 మ్యాచ్‌లో 17వ ఓవర్‌లో, పాక్ పేసర్ హసన్ అలీ, బంగ్లా బ్యాటర్ నూరుల్ హసన్ వికెట్‌ను తీసుకున్నాక, ఫీల్డ్ వదిలి పొమ్మని సైగ చేశాడు. అలీ ప్రొఫైల్‌కు డీమెరిట్ పాయింట్లను జోడించడంతో పాటు అతని మ్యాచ్ ఫీజుపై 50% వరకు జరిమానా విధించబడింది. |
- | షాహీన్ ఆఫ్రిది, అఫీఫ్ హొస్సేన్ | 2021 నవంబరు 20 | vs | 2021లో బంగ్లాదేశ్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు | బంగ్లాదేశ్ బ్యాటర్ అఫీఫ్ హొస్సేన్ పాక్ బౌలర్ షాహీన్ అఫ్రిదిని సిక్సర్‌తో చితక్కొట్టిన తర్వాత, బౌలర్ కోపంగా ఆ తర్వాతి డెలివరీలో బ్యాటర్‌పై బంతిని విసిరి, అతనిని నేలకూల్చాడు. |
- | జస్ప్రీత్ బుమ్రా, మార్కో జాన్సెన్ | 2022 జనవరి 5 | vs | 2021–22లో దక్షిణాఫ్రికాలో భారత క్రికెట్ జట్టు | జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన 2వ టెస్టు రెండో సెషన్‌లో జస్‌ప్రీత్ బుమ్రా, మార్కో జాన్సెన్ మధ్య జరిగిన ఘర్షణతో మైదానంలో ఉద్విగ్నత ఏర్పడింది. దక్షిణాఫ్రికా ద్వయం రబడా, జాన్సెన్‌లు భారతీయులపై బౌన్సర్లు వేస్తూంటే, భారతీయులు బ్యాట్‌తో పోరాడుతున్నారు. కొన్ని దెబ్బలు తగిలినా పట్టించుకోలేదు. భారత రెండో ఇన్నింగ్స్‌లో 54వ ఓవర్‌లో జాన్సెన్ షార్ట్‌ష్ డెలివరీతో బుమ్రా భుజంపై కొట్టినప్పుడు ఇదంతా ప్రారంభమైంది. రెండు బంతుల తర్వాత మరోసారి లెఫ్ట్ ఆర్మ్ సీమర్ ఒక షార్ట్ బంతి వేయగా అది బుమ్రా భుజంపై తగిలింది. కానీ భారత పేసర్ దానిని దుమ్ము దులిపినట్లు విదిలించి స్పందించాడు. నొప్పి సంకేతాలేమీ చూపించలేదు. అంపైర్ మరైస్ ఎరాస్మస్ జోక్యం చేసుకుని జస్ప్రీత్ బుమ్రా, మార్కో జాన్సెన్‌లను వేరు చేయాల్సి వచ్చింది. |
- | కైల్ జామీసన్, యాసిర్ అలీ | 2022 జనవరి 10 | vs | 2021–22లో న్యూజిలాండ్‌లో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు | క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన రెండో టెస్టు విజయంలో బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ యాసిర్ అలీని తిట్టినందుకు న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ కైల్ జేమీసన్‌కు జరిమానా డీమెరిట్ పాయింట్‌ను విధించారు. జామీసన్ పోటీతత్వం చెడ్డదారులు తొక్కుతూ చెడ్డపేరు తెచ్చుకుంటోంది- ఇది 24 నెలల వ్యవధిలో అతని మూడవ నేరం. |
- | బెన్ స్టోక్స్, జెర్మైన్ బ్లాక్‌వుడ్ | 2022 మార్చి 18 | vs | 2021–22లో వెస్టిండీస్‌లో ఇంగ్లీష్ క్రికెట్ జట్టు | రెండో టెస్టు మ్యాచ్‌లో 3వ రోజు 103వ ఓవర్ మూడో బంతికి, ఆల్-రౌండర్ బెన్ స్టోక్స్ 17వ ఓవర్‌ను బౌలింగ్ చేస్తూ అలసిపోయినట్లు కనిపించాడు. దీని ఫలితంగా అతను బంతిని వేసాక, బ్యాట్స్‌మన్ బ్లాక్‌వుడ్‌తో కొన్ని దురుసు మాటలు మాట్లాడాడు. బ్లాక్‌వుడ్ 95 పరుగుల వద్ద ఉండగా అతని దృష్టి మరల్చే ప్రయత్నం ఇది. అంపైర్, ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్‌తో ఆల్ రౌండర్‌తో చాలాసేపు మాట్లాడాడు.[64][65] |
- | విరాట్ కోహ్లీ, జానీ బెయిర్‌స్టో | 2-2022 జూలై 3 | vs | 2022లో ఇంగ్లండ్‌లో భారత క్రికెట్ జట్టు | 5వ టెస్ట్ మ్యాచ్ సమయంలో, 2వ రోజు సాయంత్రం సెషన్‌లో, విరాట్ కోహ్లీ బెయిర్‌స్టోతో "సౌతీ కంటే కొంచెం వేగంగా ఉందా?" అని అన్నాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి కోహ్లి బెయిర్‌స్టో భుజంపై చేతులు వేసుకుని వెళ్లిపోయాడు. 3వ రోజు కోహ్లి మళ్లీ స్లెడ్జింగు మొదలుపెట్టాడు. బెయిర్‌స్టో కూడా ప్రత్యుత్తరం ఇవ్వడం ప్రారంభించాడు. ఇద్దరూ ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుకున్నారు. బెయిర్‌స్టో తన వేళ్ళను మూసి తెరుస్తూ కోహ్లి ఎలా వాగుతున్నాడో సైగ చేసాడు. కోహ్లీ నోటిపై వేలు పెట్టి నోరు మూసుకుని బ్యాటింగ్ చేయమని సైగ చేశాడు. బెయిర్‌స్టో కొహ్లీని ఫీల్డింగు చేయమని సైగ చేశాడు. మరో ఎండ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ చిరునవ్వుతో నిల్చున్నాడు. తర్వాత, బెయిర్‌స్టో భారత్‌పై సెంచరీ సాధించాడు[66][67] |
- | ఆసిఫ్ అలీ, ఫరీద్ అహ్మద్ | 2022 సెప్టెంబరు 7 | vs | 2022 ఆసియా కప్ | పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ ల మధ్య సూపర్ ఫోర్ ఆసియా కప్ మ్యాచ్ సందర్భంగా, ఫరీద్ అహ్మద్, ఆసిఫ్ అలీని అవుట్ చేసిన తర్వాత, మైదానంలో వాగ్వాదానికి పాల్పడినందుకు గాను, పాకిస్థాన్‌కు చెందిన ఆసిఫ్ అలీ ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ ఫరీద్ అహ్మద్‌లకు వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించారు. ఆటగాళ్ళు తమ నేరాన్ని అంగీకరించి, మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ప్రతిపాదించిన ఆంక్షలను అంగీకరించారు. మ్యాచ్‌లో ఇరువురి మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో మ్యాచ్‌లో ఉత్కంఠ నెలకొంది. [68][69] |
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Chirp war: India also win escalating swearing contest with England". The Guardian (in ఇంగ్లీష్). 2021-08-16. Retrieved 2021-11-12.
- ↑ "10 epic sledges from Virat Kohli". CricTracker (in ఇంగ్లీష్). 2021-08-20. Retrieved 2021-11-12.
- ↑ "When Virat Kohli Made Justin Langer 'Feel Like a Punching Bag'". TheQuint (in ఇంగ్లీష్). 2020-03-18. Retrieved 2021-11-12.
- ↑ "The origins of cricket jargon". BBC Bitesize. Retrieved 17 November 2018.
- ↑ Ubha, Ravi (13 August 2015). "Nick Kyrgios said what?! Aussie slammed, then fined, for lewd sledge". CNN.
- ↑ BBC Sport: India board proposes sledging ban. Retrieved on 2 November 2008.
- ↑ Waugh, Steve (30 November 2013). "In this extract from his new book, Steve Waugh explains his strategy of mental disintegration". The Daily Telegraph. Retrieved 6 July 2018.
- ↑ Waugh, Steve (2013-11-30). "Waugh: you can't hide fear". Daily Telegraph. Retrieved 2021-11-12.
- ↑ "Our turn to be bounced!". The Age. 17 January 1977. Retrieved 10 February 2013.
- ↑ O'Reilly, Bill (16 February 1979). "Sportsmanship given a terrible hiding". The Sydney Morning Herald. Retrieved 10 February 2013.
- ↑ Rae, p.19.
- ↑ p119, Bob Willis and Patrick Murphy, Starting With Grace, A Pictorial Celebration of Cricket 1864–1986, Stanley Paul, 1986
- ↑ pp116-117, Tom Graveney and Norman Miller, The Ten Greatest Test Teams, Sidgewick and Jackson, 1988
- ↑ Lighter examples of sledging – BBC Sport
- ↑ "Sledged Bangladesh become the sledgers". ESPNcricinfo. Retrieved 2018-06-06.
- ↑ "Turn up stump mics to curb sledging, says Moeen". CNA (in ఇంగ్లీష్). Archived from the original on 2019-02-19. Retrieved 2019-12-02.
- ↑ "Aussies accused of 'particularly personal' sledging". NZ Herald (in New Zealand English). Retrieved 2021-11-13.
- ↑ "Calls for England to drop sledging". Otago Daily Times Online News (in ఇంగ్లీష్). 2018-03-21. Retrieved 2018-09-14.
- ↑ "Bairstow calls for clear sledging guidelines". Sport (in ఇంగ్లీష్). Retrieved 2018-08-20.
- ↑ "Harbhajan Singh Opens Up on Memorable Sledging Incidents Against Australia | Cricket News". NDTVSports.com (in ఇంగ్లీష్). Retrieved 2021-11-12.
- ↑ Venkat, Rahul (2018-06-03). "Viv Richards Talks About Virat Kohli and Kapil Dev". Essentially Sports (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2019-12-02.
- ↑ "India's most aggressive captain- Sourav Ganguly - QuirkyByte". QuirkyByte (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-07-11. Retrieved 2018-06-16.
- ↑ "Virender Sehwag backs Virat Kohli's aggressive captaincy, says sledging can be fun". Zee News (in ఇంగ్లీష్). 2017-08-30. Retrieved 2018-07-10.
- ↑ "Sledging Part of the Game, Getting Personal is Not: Gautam Gambhir". News18. 2017-03-22. Retrieved 2018-06-16.
- ↑ "Gautam Gambhir says sledge, but don't cross the boundary". Hindustan Times (in ఇంగ్లీష్). 2017-03-21. Retrieved 2018-06-16.
- ↑ Mahajan, Rohit (10 March 2008). "No slips in place". Outlook. Vol. 48, no. 10. p. 88.
- ↑ "'Sledging is part and parcel of game' - Sreesanth". ESPN.com. Retrieved 2018-06-16.
- ↑ "Sledging within limit fine with Irfan". News18. 2008-02-14. Retrieved 2018-07-10.
- ↑ "Sledging in Cricket: Drawing a fine line between aggression and argument". 2018-03-23. Retrieved 2018-07-12.
- ↑ "Bangladesh cricket team transform from cubs to tigers in art of sledging". Hindustan Times (in ఇంగ్లీష్). 2017-09-07. Retrieved 2018-06-18.
- ↑ Rebello, Maleeva (2018-03-13). "Mohammad Kaif: Sledging within limits is fine, but family should be kept out". The Economic Times. Retrieved 2018-08-16.
- ↑ "I wanted to pick up the stump and stab him" (in ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్). Retrieved 2018-06-16.
- ↑ "Why aggressive Virat Kohli 'two-times more' better than Sourav Ganguly". Hindustan Times (in ఇంగ్లీష్). 2016-12-14. Retrieved 2018-06-16.
- ↑ "Indian cricket team under Virat Kohli has a new 'culture'- fall in line or else". Hindustan Times (in ఇంగ్లీష్). 2018-03-01. Retrieved 2018-07-12.
- ↑ "Kohli's surprise at award for defending Smith from jeering fans". The Sydney Morning Herald (in ఇంగ్లీష్). 2020-01-15. Retrieved 2020-01-18.
- ↑ "Virat Kohli's aggression has become India's strength, says Sachin Tendulkar". Hindustan Times (in ఇంగ్లీష్). 2017-10-23. Retrieved 2018-07-12.
- ↑ "Pujara 'learning the tricks of sledging'". cricket.com.au (in ఇంగ్లీష్). Retrieved 2018-06-16.
- ↑ "India batsman Ajinkya Rahane says he's against on-field sledging; compares it to 'car honking'- Firstcricket News, Firstpost". FirstCricket (in అమెరికన్ ఇంగ్లీష్). 22 March 2018. Retrieved 2018-06-16.
- ↑ "Cricket: Indian test great Sourav Ganguly hits back at Australian team as sledging row erupts". The New Zealand Herald (in New Zealand English). 2018-12-11. ISSN 1170-0777. Retrieved 2019-12-02.
- ↑ "War of words: The Ashes sledges that became the stuff of legend". au.sports.yahoo.com (in ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్). Retrieved 2021-10-29.
- ↑ "Greatest sledges in Ashes history". NewsComAu. Retrieved 2018-06-18.
- ↑ "Getting tough - the 1989 Ashes". The Daily Telegraph.
- ↑ "That moment when Merv Hughes asked Javed Miandad for a bus ticket". The Indian Express. 7 April 2017.
- ↑ "England great Graham Thorpe reveals Ian Healy's cunning sledge during the 1993 Ashes". Fox Sports (in ఇంగ్లీష్). 2020-11-24. Retrieved 2021-10-31.
- ↑ "The best 10 sledges in cricket history". www.sportingnews.com (in ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్). Retrieved 2021-11-12.
- ↑ "Sohail starts, Prasad finishes". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-10-26.
- ↑ "'My Blood Was Really Boiling' - Venkatesh Prasad Recalls His World Cup Feud With Aamir Sohail". outlookindia.com/ (in ఇంగ్లీష్). Retrieved 2021-10-26.
- ↑ "McGrath given suspended fine for sledging in Test (29 December 1998)". Cricinfo (in ఇంగ్లీష్). Retrieved 2018-07-10.
- ↑ "Pakistan shows concern over Aussies sledging". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-10-29.
- ↑ "Sledging fired up India". The Tribune. Retrieved 2018-09-15.
- ↑ "Ten memorable cricket sledges". The Independent (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2018-06-07.
- ↑ "Ten memorable cricket sledges". The Independent (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2018-06-07.
- ↑ "Pollock gets payback on World Cup sledge". cricketnetwork.com (in ఇంగ్లీష్). Retrieved 2018-07-11.
- ↑ Decent, Tom (2013-11-25). "The nastiest sledges in cricket". The Sydney Morning Herald (in ఇంగ్లీష్). Retrieved 2018-07-02.
- ↑ "Rewind To 2003 - Glenn McGrath & Ramnaresh Sarwan Have An Altercation Which Quickly Turns Ugly". indiatimes.com (in ఇంగ్లీష్). Retrieved 2018-07-02.
- ↑ "Kumar Sangakkara, the dazzling, kind perfectionist Sri Lanka cricket will miss like mad - Paul Farbrace salutes the retiring hero in Wisden". The Telegraph (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2016-04-14. ISSN 0307-1235. Retrieved 2018-07-10.
- ↑ "7 instances when Australian sledging was met with a fitting response". 2016-01-18. Retrieved 2018-07-03.
- ↑ Praverman, Frank (29 January 2008). "Harbhajan Singh cleared of making racist comments to Andrew Symonds". Timesoline. London. Archived from the original on 27 జూలై 2008. Retrieved 2 November 2008.
- ↑ "Steyn and Roach fined for disciplinary run-ins". Cricinfo (in ఇంగ్లీష్). Retrieved 2018-07-04.
- ↑ "Ten memorable cricket sledges". The Independent (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2018-06-07.
- ↑ "'Let's go outside': Prior to Sid". www.theaustralian.com.au (in ఇంగ్లీష్). 2010-12-18. Retrieved 2021-10-24.
- ↑ "I'm a better bowler when I'm sledging, says Peter Siddle". Reuters (in ఇంగ్లీష్). 2010-12-22. Retrieved 2021-10-24.
- ↑ Buckle, Greg (2011-02-14). "Loose cannon Sreesanth riles Ponting with loser gesture". The Sydney Morning Herald (in ఇంగ్లీష్). Retrieved 2021-10-23.
- ↑ "West Indies' Jermaine Blackwood says fresh focus helped blot out Ben Stokes". TheGuardian.com. 14 July 2020.
- ↑ "Ben Stokes vs Jermaine Blackwood : Blackwood opens up on the heated argument". 19 March 2022.
- ↑ "'Shut up. Just stand and bat': Kohli involved in heated exchange with Bairstow, then delivers friendly punch - Watch". 3 July 2022.
- ↑ "Blame Virat Kohli for Jonny Bairstow acceleration, now that's just too easy".
- ↑ "Asif Ali, Fareed Ahmad fined for on-field altercation". 8 September 2022.
- ↑ "Asif Ali and Fareed Ahmad punished for breaching ICC Code of Conduct".