ముస్లింలలో అపవిశ్వాసాలు

ముస్లింలలో అపవిశ్వాసాలు : ముస్లింలలో అపవిశ్వాసాలు లేదా విశ్వాసపరంగా "ఫిర్ఖా" (చీలికలు లేదా భాగాలు) లు ఏర్పడ్డాయి. ఇచ్చట గమనించవలసిన విషయాలు రెండు, అవి 1. మూలవిశ్వాసం. (అత్యంత ప్రధానమైనది), 2. ఉ (అ)పవిశ్వాసాలు (అంతగా ప్రాధాన్యతలు లేనివి), మూలవిశ్వాసం అన్ని ఫిర్ఖాలది ఒకటే అయినా, ప్రాధాన్యత లేని, ప్రాధాన్యత ఇవ్వకూడని అపవిశ్వాసాల విషయాల పట్ల తమ శక్తియుక్తులంతా ప్రదర్శించి విర్రవీగే సాధారణ ప్రజగూర్చి ప్రవక్త ఇలా అన్నారు: "ఇశ్రాయేలు ప్రజలు 72 తెగలుగా చీలిపోయారు. నా ప్రజలు 73 తెగలుగా చీలిపోతారు. అందులో ఒకటి (అత్యంత ప్రధానమైన మూలవిశ్వాసం) తప్ప మిగతా తెగలవారంతా (అంతగా ప్రాధాన్యంలేని విశ్వాసాలుంచి, చీలికలు తెచ్చినవారు) నరకానికి పోతారు . ఆ ఒక్క తెగ యొక్క మతం (మూల విశ్వాసం) ఏదంటే నేనూ, నా అనుచరులు చెప్పిందే " మిష్కాత్ ఎ షరీఫ్ గ్రంథం మొదటి విభాగం 4 వ అధ్యాయం 2 వ వచనంలో ఉంది.

కాబా చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న ముస్లిం సమూహం.

73 తెగలు తయారవుతాయని ప్రవక్తగారే చెప్పారు గనుక అలా జరుగవలసిందే. షేక్ అబ్దుల్ ఖాదిర్ గారు ఇస్లాంలో 150 పైగా తెగలున్నట్లు తన ప్రఖ్యాత గ్రంథం గియాసుల్ లుగత్లో తెలియజేశారు. అయితే షార్‌హుల్ మువాకిఫ్ గారు ఇస్లాంలో ప్రఖ్యాతిగాంచినవి 8 తెగలు మాత్రమేనని చెబుతున్నారు.ముస్లింలలో కులాలు గూడా చూడండి.

సంపూర్ణ విశ్వాసాలు

మార్చు

ఇక్కడ "తెగ" అంటే భిన్న విశ్వాసం కలవారు అని అర్థం. సున్నీ, షియా అనే తేడా అందరికీ కనపడేది. అయితే సున్నీలలోనే నాల్గు తెగ (పాఠశాల)ల వారున్నారు. వీరు అవలంబించేది ప్రవక్తగారు చూపిన మార్గాన్నే. కావున వీరు సంపూర్ణ విశ్వాసులుగా పరిగణింపబడుతారు.

  1. హనఫీయులు : సా.శ. 702 లో ఇరాక్ రాజధాని అల్‌కుఫాలో జన్మించిన అబూ హనీఫా అనే పండితుని పద్ధతులు అనుసరిస్తారు. ఈయన కాలంలో ప్రవక్త అనుచరులైన (సహాబా)లలో 4 గురు బ్రతికి ఉన్నారు.
  2. షాఫియాలు : ముహమద్ ఇబ్నె ఇద్రీస్ అన్‌ షఫీ అనే పండితుడు పాలస్తీనా లోని అంకలాన్ ‌లో జన్మించాడు. వీరంతా ఆయన పద్ధతులను తమ ఆరాధనల్లో అనుసరిస్తారు.
  3. మాలికీయులు : వీరి పద్ధతి స్థాపకుడైన మాలిక్ సా.శ. 714 లో మదీనాలో జన్మించాడు. ఈ తెగ వారు మొరాకోలో అధికంగా ఉన్నారు.
  4. హంబలీయులు : వీరి పద్ధతి స్థాపకుడు "హంబల్ ". ఈయన సా.శ.780 లో బాగ్దాద్లో జన్మించాడు. తూర్పు ఆఫ్రికాలో వీరు ఎక్కువ. కాని హంబలి తెగకు చెందినవారు సంఖ్యలో తక్కువ. మిగిలిన తెగలకు మక్కాలో ఒక ముఫ్తీ ఉంటాడు కాని వీరికి లేడు. వహాబీయులు వీరిలోంచే లేచారు.

పై నాల్గు తెగలవారికి ఆరాధనా పద్ధతుల్లో కొన్ని తేడాలు ఉన్నాయి. అయితే మౌలిక విశ్వాసాలలో తేడాలు లేవు. అయినా వీళ్ళు నలుగురూ ఒక్కటి కాలేరనీ, ఒకరి పద్ధతిని మరొకరు సహించరనీ, నలుగురూ ముహమ్మద్ ప్రవక్త సంప్రదాయాన్ని అతిక్రమించారనీ ఆరోపిస్తూ "ఆహలెహదీస్ " అనే హదీసు అనుచరవర్గం మరోటి తయారయ్యింది. అద్వితీయుడైన దైవాన్నీ, ఆయన భక్తుల గోరీలను ఏక కాలంలో ప్రార్థించే ముస్లిములు నేడు చాలా మంది మనకు కనిపిస్తారు. పీర్లు ఎత్తి, గంధాలు తీసి, గుండాలలో దూకే ముస్లిములు, ఉరుసులు తిరునాళ్ళు జరిపే ముస్లిములు లెక్కకు మిక్కుటంగా ఉన్నారు.

కల్పిత విశ్వాసాలు

మార్చు

ప్రవక్తగారు ప్రకటించిన విశ్వాసాలను పెడచెవినబెట్టి, తమకు తోచిన విశ్వాసాలను ప్రకటించి, అపసవ్యమార్గంలో పయనించేవారు సత్యమార్గమును విడనాడినవారని సంపూర్ణ విశ్వాసులు భావిస్తారు.

  • ఉదాహరణకు, ముస్లింల సంపూర్ణ విశ్వాసుల ప్రపంచం, ఖురాన్ లో ప్రవక్తలుగా పేర్కొనబడిన 25 మందిని గాక, తమకు తోచిన వారినీ ప్రవక్తలుగా ప్రకటించుకోవడం కూడా కల్పితవిశ్వాసాల జాబితాలోనే వస్తుంది.

ఇప్పుడు ప్రవక్త గారు చెప్పిన 73 తెగలవారు ఎవరో, వారి నమ్మకాలేమిటో తెలిసికుందాం. ఆయన చెప్పిన సంఖ్యనుబట్టి "గియాసుల్ లుగత్ " అనే గ్రంథం 72 తెగలవారిని 6 వర్గాలుగా విభజించింది. ఒక్కో వర్గంలో 12 తెగలవారు వస్తారు. 73 వ తెగ మాత్రం "రక్షించబడిన ముస్లిములు" అన్సారీలు అని పేర్కొనబడింది, ఇదీ ఒక అపవిశ్వాసమే. ప్రవక్తలు విశ్వాసాలు ప్రకటిస్తే, కొద్దిపాటి జ్ఞానమర్జించి తమకు తాము ముల్లాలు, ఇమాములు, మౌల్వీలు, పీర్లు అనబడేవారు, తమకు తోచినది ప్రకటించేసి, వాటిని పుస్తకరూపాలిచ్చి, ప్రజలలో వదిలేవారు. వీరివలనే అపవిశ్వాసాలు బయలు దేరాయి. నిజానికి అల్లాహ్ పై అతడి ప్రవక్తపై, అల్లాహ్ గ్రంథమైన ఖురాన్ పై విశ్వాసం వుంచేవాళ్ళందరూ రక్షింపబడినవారే. కానీ ఈ తెగలనాయకులంతా తామే రక్షింపబడిన వారని మిగతా వారంతా నరకాగ్నికి ఆహుతి అవుతారని తెల్పడం ఇంకా విడ్డూరం. గియాసుల్ లుగత్ అనే గ్రంథం ముస్లింలకు అధికారికమయిన గ్రంథం గాదు. ఇందులో వుటంకించబడిన విషయాలూ శాస్త్రీయాధారాలు కలిగినవీ కావు. తెగల గురించి వ్రాయబడిన పుస్తకం కావున, తెగలు తెగల నాయకులూ చెప్పుకుపోయే (అప)విశ్వాసాల పరంపరను ప్రజలముందు ఉంచడం వివేచనతో కూడినది కావున, ఇక్కడ విపులీకరించడం జరిగింది.ఇస్లాంలో దర్గాలు,ఉరుసులు,సంగీతం,కవిత్వం,నాట్యం,నటన,సారాయి,వ్యభిచారం,వడ్డీ,మాఫియా,రాచరికం,నియంతృత్వం,ఫోన్లో పెళ్ళిళ్ళు ...లాంటివన్నీ నిషిద్ధమని ఖురాన్,హదీసులు ఘోషిస్తున్నా ఈ నిషిద్ధ రంగాలన్నిటిలో లక్షలాది ముస్లిం నిపుణులున్నారు. ఖురాన్, హదీసులు ఈ నమ్మకాలగురించి ఏంచెబుతున్నాయో రెఫరెన్సులు వాటికెదురుగా పేర్కొంటే ఈ విశ్వాసాలు తప్పో ఒప్పో ఎవరికివారే నిర్ణయించుకుంటారు.

అసలీ తెగల పేర్లు, వాటి విశ్వాస ప్రకటనలు ఏ ఆధారంగా ఇవ్వబడ్డాయో విశదం కాలేదు. నమ్మకాలకు ఒక నిర్దిష్ఠమైన కొలమానాలున్నపుడే అవి నమ్మకాలుగా ఒక మౌలిక రూపాన్ని కలిగి వుంటాయి. మానవుడికి తోచిందే విశ్వాసం అని అనుకుంటే ప్రపంచ జనాభాకు సమానంగా మతాలు తయారవుతాయి. ఉదాహరణకు Anthropomorphism, Pantheism ప్రకారమైతే విశ్వంలోని ప్రతి వస్తువూ దేవుడే. ప్రకృతిలో వుండే ప్రతి రూపమూ ఆ దైవరూపమే.

ఒకటవ వర్గం : రాబ్‌జియాలు అంటే వేర్పాటువాదులు

మార్చు
#
తెగ పేరు
వాదన లేదా నమ్మకం
ఖండితాలు / లేఖనాలు / వివరణ
1 అలవియా "ఖలీఫా అలీ ఒక ప్రవక్త"
2 అబాదియా "ఆలీ దైవాంశ సంభూతుడు"
3 షువైబియా "ఖలీఫాలందరిలోకి ఆలీ ప్రధముడు శ్రేష్ఠుడు"
4 ఇషాకియా "ప్రవచించేకాలం ఇంకా ముగియలేదు" ముహమ్మద్ దౌత్యపరంపరను అంతమొందించిన అంతిమ దైవప్రవక్త (ఖురాన్:33:40). ఖురాన్ స్వయంగా ముహమ్మద్ ను అంతిమ దైవ ప్రవక్తగా ప్రకటిస్తున్నపుడు, ప్రవచించే కాలం ఇంకా ముగియలేదనడం అనౌచిత్యం.
5 జైదియా "ప్రార్ధనలు కేవలం ఆలీగారి వంశ్థునితోనే నడిపించబడాలి"
6 అబ్బాసియా "ప్రవక్తగారి పినతండ్రి అయిన అబ్బాస్ ఒక్కరే సరైన ఇమాం"
7 ఇమామీయ "ప్రార్థన చేయించటానికి బనూహాషిమ్ వంశస్థులు లేకుండా ఈ ప్రపంచం ఎప్పుడు విడువబడలేదు"
8 నారిసియా " నేను మరొకడికంటే గొప్పవాడినని చెప్పటం దైవ దూషణలాంటిదే"
9 తనాసుకియా "ఆత్మలు ఇతర దేహాల్లోకి తరలిపోవటం ఉంది"
10 లాయినియా "తల్వా, జుబైర్,అయెఫాల పేర్లను శపించాలి"
11 రాజియా "ఆలీ ప్రస్థుతం మేఘాలలో దాక్కున్నాడు ఎప్పుడో ఒకప్పుడు భూమికి తిరిగొస్తాడు"
12 ముర్తాజియా "ముస్లిములు ఇమాంతో పోట్లాడటం తప్పేమీ కాదు"

రెండవ వర్గం : ఖారిజియాలు అంటే ఒంటరివాళ్ళు (బహిష్కరింపబడినవారు)

మార్చు
#
తెగ పేరు
వాదన లేదా నమ్మకం
ఖండితాలు / లేఖనాలు / వివరణ
1 అజ్రాకియా దైవావేశం కలిగే రోజులు గతించిపోయాయి కాబట్టి ఈరోజుల్లో మనుషులకు దర్శనాలు కలుగవు.
2 రియాజియా మనిషి రక్షించబడేది మంచిపనుల వల్లనేగానీ విశ్వాసం వలన కాదు
3 సలాబియా మనుషులు చేసే పనుల్ని దేవుడు పట్టించుకోడు. నిద్రపోతున్నవాడిలాగాఉంటాడు.
4 జాజిమియా నిజమైన విశ్వాసం ఎక్కడా లేదు
5 ఖలిఫియా శత్రువులు రెట్టింపు ఉన్నాసరే పారిపోవటంపాపమే
6 కుజియా అభ్యంగన స్నానం చెయ్యనిదే శరీరం ప్రార్థనకు అర్హమైనది కాదు
7 కంజియా జకాత్ ఇవ్వటం అంత అవసరమైన పనేమీ కాదు
8 ముతజిలా చెడ్డపనులు దైవాజ్ఞ వలన జరుగవు. పాపి ప్రార్థనలు దేవుడు వినడు. విశ్వాసం మనిషి ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఖురాను గ్రంథం సృష్టించబడింది. మృతుల పేరిట చేసే దానదర్మాలు ప్రార్థనలు చనిపోయినవారికి మేలు చేయవు. తీర్పుదినాన తక్కెడగానీ లెక్కలపుస్తకం గాని ఉండవు.
9 మైమూనియా కానరానిదాన్ని నమ్మటం బుద్ధిహీనత
10 ముఖామియా దేవుడు తన చిత్తాన్ని మనుషులకు తెలియజేయలేదు
11 సిరాజియా ఋషులనూ పరిశుద్ధులనూ సన్యాసులను అనుకరించనవసరంలేదు.
12 అక్నోసియా పాపానికి శిక్ష లేదు

మూడవ వర్గం:జబారియాలు అంటే స్వేచ్చా చిత్తాన్ని తిరస్కరించేవారు

మార్చు
#
తెగ పేరు
వాదన లేదా నమ్మకం
ఖండితాలు / లేఖనాలు / వివరణ
1 ముజ్తారియా మంచీ చెడూ రెండూ దేవుడి వల్లనే కలుగుతున్నాయి. మనిషి తన పనులకు బాధ్యుడు కాడు.
2 అసాలియా పని చేసే శక్తి దేవుని వద్దనుండే వస్తుంది. అయినా మనిషి తను చేసే పనులకు తానే బాధ్యుడు.
3 మాయియా మనిషి పూర్తిగా స్వేచ్ఛా చిత్తాన్ని కలిగిఉన్నాడు.
4 తాలికియా క్రియలు లేని విశ్వాసంకూడా మనిషిని రక్షిస్తుంది
5 భక్తియా దేవుని ప్రత్యేక బహుమతిగా మనిషి ఏదో ఒకటి పొందుతున్నాడు. కాబట్టి ఒకరు మరొకరికి ఇవ్వటం ధర్మసమ్మతం కాదు.
6 ముతామన్నియా సుఖ సంతోషాలు పొందటానికి మంచిపనులే కారణం.
7 కస్లానియా శిక్షగానీ బహుమతిగానీ మనిషిచేసిన పనుల్ని బట్టే దేవుడు ఇస్తాడు
8 హబీబియా ఒకడు తన స్నేహితుణ్ణి గాయపరచలేనట్లే, కరుణామయుడైన దేవుడు తాను సృష్టించిన దానిని శిక్షించడు
9 ఫిక్రియా "ఆరాధనకంటే మంచిపనుల్లో తీవ్రకృషి దేవునికి ఇష్టమైనది"
10 కొఫియా "ఒకడు తన మిత్రుని భయపెట్టనట్లే, దేవుడు తన ప్రజలను తన తీర్పుల ద్వారా భయపెట్టడు "
11 హసావియా కర్మగాని విధివ్రాతగాని లేవు.
12 హుజ్జాఫియా సమస్తం దేవుడే చేశాడు. సమస్తం దేవునిదే. మనిషి తాను చేసిన పనులు చెడ్డవైనా మంచివైనా తాను బాధ్యుడు కాడు.

నాలుగవ వర్గం: కాదరియాలు అంటే "స్వేచ్చా చిత్రాన్ని సమర్ధించేవాళ్ళు"

మార్చు
#
తెగ పేరు
వాదన లేదా నమ్మకం
ఖండితాలు / లేఖనాలు / వివరణ
1 అహదియా "దేవుని ఆదేశాలను అంగీకరించాలిగాని ప్రవక్త ఆదేశాలను కాదు."
2 సనానియా "మంచి, చెడు అనే రెండే శాశ్వత సూత్రాలు మంచి యజ్దాను (అల్లాహ్) నుండి చెడు అహ్రామూను (షైతాన్) నుండి కలుగుతాయి"
3 కైసానియా "మనం చేసే పనులు దేవుడు కల్పించేవి కావచ్చు, కాక పోవచ్చు"
4 షైతానియా "సాతానుకు వ్యక్తిత్వం లేదు"
5 షరీకియా "విశ్వాసం సృష్టించబడేది కాదు"
6 వహ్మియా " మనిషి మంచి చేసినా చెడుచేసినా అతని క్రియలకు పర్యవసానం అంటూ ఏమీ ఉండదు."
7 రువైదియా " ప్రపంచం శాశ్వతంగా ఉంటుంది"
8 నాకిసియాలు "ఇమాంకు, ఖలీఫాకు ఎదురు తిరిగి పోరాడటం ధర్మ సమ్మతమే"
9 ముతాబర్రియా " పాపుల పశ్చాత్తాపం దేవునికి అంగీకార యోగ్యం కాదు"
10 కాసితియా "ఆస్తి, విద్య సంపాదించుకోవటం దేవుని ఆదేశాను సారమైన మతవిధి"
11 నజామియా "దేవుడు అంటే ఒక వస్తువులాగా చెప్పుకోవటం న్యాయమే"
12 ముతవల్లిఫియా "చెడు, దేవుని అనుజ్ఞ తోనే జరుగుతుందోలేదో తెలియదు"

అయిదవ వర్గం: జాహిమియాలు అంటే జాహిమ్ ఇబ్నెసఫ్వాన్ ను అనుసరించేవారు

మార్చు
#
తెగ పేరు
వాదన లేదా నమ్మకం
ఖండితాలు / లేఖనాలు / వివరణ
1 మూత్తవియా "దేవుని నామాలు గుణగణాలు అన్నీ కేవలం కల్పితం"
2 ముతరాబిసియా "దేవునిశక్తి, జ్ఞానము, ఉద్దేశ్యము అన్నీ కల్పితం"
3 ముతరాకిబియా "దేవుని కొకచోటు ఉంది"
4 వారిదియా " నరకంలో ప్రవేశించినవారు బయటికిరాలేరు విశ్వాసి నరకంలో ప్రవేశించలేడు"
5 హర్‌కియా "నరకనివాసులు కాల్చివేయబడి క్షణంలో సమూలంగా నాశనమైపోతారు"
6 ముక్‌లూకియా "కురాన్, తౌరాత్, సువార్తలు కీర్తనలు అన్నీ సృష్టించబడ్డాయి"
7 ఇబారియా ముహమ్మదు ఒక జ్ఞాని, తత్వవేత్త, అయితే ప్రవక్త మాత్రం కాడు
8 ఫానియా "స్వర్గం, నరకం రెండు నశిస్తాయి"
9 జనాదికియా "ప్రవక్త స్వర్గ ప్రయాణం (మేరాజ్ ) కేవలం ఆత్మలో జరిగింది. ప్రపంచం శాశ్వతమైనది. తీర్పు రోజూ అనేది లేదు"
10 లఫ్జియా "కురాను దైవ ఆవేశిత గ్రంథం కాదు. కాని దాని లోని ఆజ్ఞలు దేవునివే"
11 కబ్రియా " సమాధిలో శిక్ష లేదు"
12 వాకిఫియా "కురాను గ్రంథం సృష్టించబడిందా లేదా అనేది స్పష్టంగా తెలియదు"

ఆరవ వర్గం: మురిజియాలు అంటే " నిర్లక్షంగా ఉండే వాళ్ళు "

మార్చు
#
తెగ పేరు
వాదన లేదా నమ్మకం
ఖండితాలు / లేఖనాలు / వివరణ
1 తారికియా "విశ్వాసం ఒక్కటుంటే చాలు"
2 షాయియా "ఇస్లాం విశ్వాసాన్ని ఒక్కసారి చేపట్టిన మనిషి ఇక రక్షణ పొందినట్లే"
3 రాజియా "దేవుని ప్రసన్నత పొందటానికి ఆరాధన అవసరం లేదు. మంచి పనులు అవసరం లేదు"
4 షాక్కియా "విశ్వాసం అంటే ఆత్మ, అందువలన ఒకడు తనకు విశ్వాసం ఉందో లేదో నిశ్చయంగా చెప్పలేడు."
5 నాహియా "విశ్వాసం అంటేజ్ఞానం , దేవుని ఆజ్ఞలు తెలియని వానికి విశ్వాసం లేదు"
6 అమలియా "విశ్వాసం అంటే మంచి పనులే"
7 మంకూసియా "విశ్వాసం కొన్న్ని సార్లు హెచ్చుగాను మరికొన్ని సార్లు తక్కువగాను ఉంటుంది."
8 మస్తజ్‌నియా "భక్తి లో నిశ్చయత అనేదే లేదు. దేవుని చిత్తమైతే మనం విశ్వాసులం అని మాత్రం చెప్పవచ్చును"
9 అషారియా "విశ్వాస సంబంధమైన విషయాలలో విశ్లేషణాత్మకమైన విచారణ తగదు"
10 బైదియా " పరిపాలకుడు అన్యాయమైన ఆజ్ఞలిచ్చినప్పటికీ శిరసా వహించాల్సిందే"
11 ముషబ్బిహియా "దేవుడు ఆదమ్ ను తన స్వరూపం లోనే చేశాడు"
12 హసాలియా "ముస్లిం ధర్మ శాస్త్ర ప్రకారం వాజిబ్ , సున్నత్ , ముస్తహబ్ ల మథ్య ఎలాంటి తేడాలేదు"

ఏడవ వర్గం: నాజియాలు అంటే "రక్షించబడిన వాళ్ళు"

మార్చు

మరో వర్గీకరణ

మార్చు

అపవిశ్వాసుల గుంపు లేదా సమూహము (ఫిర్ఖా ) పేరు, వారికున్న అపవిశ్వాసం ఇలా ఉన్నాయి:

#
తెగ పేరు
వాదన లేదా నమ్మకం
ఖండితాలు / లేఖనాలు / వివరణ
1 జరూదియా అబుల్ జరూద్ అనుచరులు. మహాప్రవక్త, అలీని అతని గుణగణాలనుబట్టే ఇమాంగా నియమించాడుగాని అతని పేరునుబట్టికాదు.
2 సులేమానియా/జరీరియా సులేమాన్ ఇబ్నె జరీరుల్ జైదీ అనుచరులు. ఇమాం పదవి ఇద్దరు ఉత్తమ ముస్లిములచేత సమావేశంలో నిర్ణయించబడుతుంది.
3 బుత్రియా/హురారియా ఉస్మాన్ ఖిలాఫత్ ను విభేదించరు. ఆయన్ని విమర్శించరూ, పొగడరు.
4 యాకూబియా అబూబక్ర్, ఉమర్ ల ఖిలాఫత్ ను అంగీకరిస్తారు. అయితే వీరి పాలనను తిరస్కరించేవారిని తిరస్కరించరు. ముస్లిములుగా ఉండి పెద్ద పాపాలు చేసేవారు నరకాగ్నిలో నిరంతరం ఉంటారు.
5 హనఫియా ముహమ్మద్ ఇబ్నె హనీఫా ఇమామత్ అనుచరులు. అల్లాహ్కు ఒక ఆరంభం ఉండి ఉంటుంది.
6 కరీబియా ఇమామ్ ముహమ్మద్ ఇబ్నె హనీఫా చనిపోలేదు. అదౄశ్యరూపంలో ఉన్నాడు. అతనే రాబోయే మెహది.
7 కమిలియా అబూకామిల్ అనుచరులు. సహచరులు వారసులై ఉండాలి. అలీని విమర్శిస్తారు. పునరుత్థాన దినానికి ముందే మృతులు లేచి వస్తారు. షైతాన్ మట్టికి బదులు అగ్నిని కోరుకోవటం మంచి పనే.
8 ముహమ్మదియా/ముగారియా ముహమ్మద్ ఇబ్నె అబ్దుల్లా ఇబ్నె హసన్ అనుచరులు. ముహమ్మద్ ఇబ్నె అబ్దుల్లా చనిపోలేదు. అదృశ్యంగా ఉన్నాడు. అతనే రాబోయే మెహదీ.
9 బాకరియా ముహమ్మద్ ఇబ్నె అలీ బాఖర్ అదృశ్య ఇమామ్. రాబోయే మెహది.
10 నదిసియా పరులకంటే తమను గొప్పవారిగా ఎంచుకునే వారు కాఫిర్లు, అవిశ్వాసులు.
11 షాయియా అల్లాహ్ తప్ప వేరొక దేవుడు లేడని పఠించినవాడు ఏం చేసినా శిక్షించబడడు.
12 అమ్మాలియా విశ్వాసం అంటే ఆచరణే.
13 ఇస్మాయీలియా ఇస్మాయిల్ ఇబ్నె జాఫర్ వంశస్తులకే ఇమామత్ ఉండాలి.
14 ముసాలియా/మమ్‌తురా ముసా ఇబ్నె జాఫర్ అదృశ్య ఇమామ్ రాబోయే మెహది.
15 ముబారికియా ముహమ్మద్ ఇస్మాయిల్ ఇబ్నె జాఫర్ వంశస్తులకే ఇమామత్ ఉండాలి.
16 కతియా/ఇత్న్ అషారియా (పన్నెండు వాదులు) అలీ ఇబ్న్ అబీ తాలిబ్ వంశస్తుల్లో 12 వ ఇమామే మెహది.
17 హషామియా/తరకిబియా అల్లాహ్ దేహం ఉంది. ప్రవక్త అల్లాహ్కు అవిధేయుడు అయ్యాడు.
18 జరారియా తనకంటూ జీవాన్నీ,కొన్ని గుణగణాలను ఏర్పాటు చేసుకునే దాకా అల్లా జీవించి లేడు. ఆయనకు ఏ గుణాలూ లేవు.
19 యౌనాసియా అల్లాహ్ తన సింహాసనాన్ని మోసే వాళ్ళకంటే బలాఢ్యుడే.
20 షైతానియా/షిరీకియా అల్లాహ్ సేవకుల చర్యలు పదార్థాలు. అల్లాహ్ సేవకుడు పదార్థాన్ని పుట్టించగలడు.
21 అజ్రకియా కలలు, దర్శనాలు వట్టివే. భవిష్యవాణిని ప్రకటించే అన్ని పద్థతులూ అంతరించాయి.
22 నజాదత్ సారాయి త్రాగిన వాడిని శిక్షించకూడదు. ఈ తెగవాళ్ళలోని పాపులు నరకాగ్నిలో శుద్థి చేయబడరు. వేరొక చోట శిక్ష పొందే స్వర్గంలో ప్రవేశిస్తారు.
23 సుఫ్రియా వాస్తవానికి పాపులంటే బహు దేవతారాధకులే.
24 అజారిదా యుక్తవయసు వచ్చాకే పిల్లల్ని ఇస్లామ్ లోకి పిలవాలి. యజమాని చనిపోయిన తరువాత మాత్రమే యుద్ధంలో దోచుకోబడిన సంపద ధర్మబద్థం అవుతుంది.
25 కాజిమియా అల్లా అన్ని మతాలవారినీ ప్రేమిస్తాడు ఒకడు తన జీవితంలో అత్యధిక భాగం అవిశ్వాసిగా ఉన్నా సరే.
26 షువైబియా/హుజ్జతియా అల్లాహ్ అనుకున్నదే జరుగుతుంది. ఒక పని జరగలేదంటే అల్లాహ్ అనుకోలేదన్నమాట.
27 కలాఫియా ఇమామ్ నాయకత్వం లేకుండా యుద్ధం చేయకూడదు.
28 మాలూమియా/మజ్ హూలియా అల్లాహ్ పేర్లన్నిటితో ఆయన్ని గుర్తించని వారికి ఆయనగురించి ఏమీ తెలియదు. వారు అవిశ్వాసులు.
29 సల్తియా పెద్దల్ని మాత్రమే మార్చాలి. తండ్రి విశ్వాసి అయినా యుక్త వయసు వచ్చే వరకు అతని పిల్లలు అవిశ్వాసులే.
30 హంజియా బహుదేవతారాధకుల పిల్లలు నరకానికి వెళతారు.
31 తాలిబియా పిల్లలు మేము సత్యాన్నుండి తొలగిపోతున్నాము అని చెప్పేవరకు, వారు ఏ వయస్సులో ఉన్నా, వారికి తల్లిదండ్రులే సంరక్షకులు .
32 మాబాదియా బానిసలకు దానాలివ్వటం, పుచ్చుకోవటం ఒప్పుకాదు.
33 అక్నాసియా ప్రత్యర్థి స్వయంగా తెలిస్తే తప్ప, అదీ ఆత్మ రక్షణ కోసం తప్ప యుద్ధం చేయకూడదు.
34 షైబానియా/మష్బియా అల్లాహ్ తన సృష్టితాలనే పోలి ఉంటాడు.
35 రషీదియా ఊటలు, కాలువలు, నదుల ద్వారా నీటి సరఫరా ఉన్న భూములకు జకాత్లో సగం కట్టాలి. వర్షం ద్వారా మాత్రమే నీరు పొందే భూములకు పూర్తి జకాత్ చెల్లించాలి.
36 ముకర్రమియా/తెహ్మియా అజ్ఞానమే అవిశ్వాసం. అల్లాహ్ స్నేహంగాని, విరోధంగానీ మనిషి చనిపోయే క్షణంలో ఉన్న నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది.
37 ఇబాదియా/అషాలియా అల్లాహ్ను సంతోషపరచాలనే తలంపు లేకుండానే మంచి పనులు చెయ్యాలి.
38 హఫ్సియా అల్లాహ్ను తెలుసుకుంటేనే బహుదేవతారాధన నుండి మనిషి బయట పడతాడు.
39 హరితియా పనులకు ముందు సామర్థ్యం ఉంటుంది.
40 అషాబ్ తాహ్ తానొక ప్రవక్తనని ఋజువుపరుచుకోటానికి ఎటువంటి గుర్తు లేకుండా కూడా అల్లాహ్ ఒక ప్రవక్తను పంపిస్తాడు.
41 షబీబియా/సలీహియా గజాలా అనే స్త్రీ ఇమామత్ను నమ్ముతారు.
42 వసీలియా పెద్ద పాపాలు చేసిన వారు నరకాగ్నిలో మాడుతారు కానీ విశ్వాసులుగానే ఉంటారు.
43 అమ్రియా ఒంటెల యుద్ధంలో ఇరుపక్షాలసాక్ష్యాన్ని తిరస్కరించాలి.
44 హుదాలియా/ఫానియా అల్లాహ్ సర్వశక్తుడు కాని రోజున స్వర్గం, నరకం రెండూ అంతరిస్తాయి. విధివ్రాత కూడా ఆగిపోతుంది.
45 నజ్జామియా కురాన్ గ్రంథానికి అద్భుతాలు చేసే శక్తి లేదు. ముహమ్మద్ ప్రవక్త చంద్రుణ్ణి చీల్చడం లాంటి అధ్భుతాలను నమ్మకూడదు.
46 మువమ్మియా అల్లాహ్ జనన మరణాలను సృష్టించలేదు. అది జీవదేహంలో ప్రకృతి సిద్దమైన చర్య.
47 బషీరియా అల్లాహ్ ఒక మనిషి పాపాలను క్షమించి అతని మనసు మార్చవచ్చు. అతను మళ్ళీ అవిధేయుడైతే శిక్షించవచ్చు.
48 హిషామియా ముస్లిం సమాజం ఒక వ్యక్తిని ఇమామ్‌గా ఎన్నుకొంటే, కొంతమంది తిరగబడి ఆ ఇమామ్‌ను చంపేస్తే, అటువంటి తిరుగుబాటు కాలంలో ఎవర్నీ ఇమామ్ గా ఎంపిక చేయకూడదు.
49 ముర్దారియా సుల్తాన్‌కు అంటిపెట్టుకుని ఉండటం వల్ల అవిశ్వాసులౌతారు.
50 జాఫ్రియా ముడి ద్రాక్షారసం త్రాగటం శిక్షార్హం కాదు. నరక శిక్ష మానసికమైనది.
51 ఇస్కఫియా అల్లాహ్ పిల్లల్ని, పిచ్చివాళ్ళనీ అదుపులో ఉంచగలడు గానీ, పరిపూర్ణజ్ఞానంగల వారిని కాదు.
52 తమామియా అల్లాహ్ తనను తాను తెలుపుకున్న వాడికే తెలుస్తాడు. మిగతా వాళ్ళంతా జంతువుల్లాగా బాధ్యులుకారు.
53 జాహిజియా అల్లా ఒక వస్తువును సృష్టించగలడుగానీ నశింపచేయలేడు.
54 షాహమియా/ సిఫాతియా అన్నీ ఇద్దరిచేత ముందుగానే నిర్ణయించబడ్డాయి. ఒకరు సృష్టికర్త, మరొకరు స్వీకర్త.
55 కయాతియా/మక్లూకియా ఉనికిలో లేనిదంతా అది కనబడక ముందున్న రూపమే. మనిషి పుట్టక ముందు ఉనికిలో లేని దేహం అతనికి ఉన్నట్లే, ప్రతి లక్షణం దృశ్యరూపంలోకి వచ్చే పర్యంతం దానికి అదృశ్య ఉనికి ఉంటుంది.
56 కాబియా అల్లాహ్ తననుగానీ, ఇతరుల్ని గానీ చూడడు.
57 జుబ్బాయా తన భక్తుల కోరిక తీర్చేటప్పుడు అల్లా వారికి విధేయుడౌతాడు.
58 బాషామియా ఒక చెడ్డపని చెయ్యాలనుకన్నవాడు దాన్ని చెయ్యకపోయినా, ఆ తలంపును బట్టి శిక్షించబడతాడు.
59 ఇబ్రియా ముహమ్మదు ఒక జ్ఞాని. ప్రవక్త కాదు.
60 ముహ్ కామియా సృష్టితాల మీద దేవునికి అదుపు లేదు.
61 కబరియ్యా సమాధిలో శిక్షలుండవు.
62 హుజ్జతియా చేష్టల ఫలితంగా శిక్ష రాదు. ఎందుకంటే అన్ని చేష్టలూ అల్లా నిర్ణయాలే గనుక వాటికెవరూ బాధ్యులు కారు.
63 ఫిక్రియా అల్లాను ధ్యానించటం ఆరాధించటంకంటే ఉత్తమం.
64 అలివియా/అజారియా హజ్రత్ అలీ, ముహమ్మదు గారితో కలిసి ప్రవక్త పదవి పంచుకున్నారు.
65 తనాసికియా ఆత్మ పునర్జన్మ ఎత్తుతుంది.
66 రజీయా హజ్రత్ అలీ ఇబ్నె అబీ తాలిబ్ మళ్ళీ ఈ లోకానికి వస్తారు.
67 అహదియా విశ్వాసంలో ఫరజ్ (తప్పనిసరి) పనులు చాలు. సున్నత్ (ఐచ్ఛికం) అక్కరలేదు.
68 రథీదియా ఈ లోకం శాశ్వతంగా ఉంటుంది.
69 సత్ బిరియా పశ్చాత్తాపం అంగీకరించబడదు.
70 లఫ్ జియా ఖురాన్ దేవుని వాక్యం కాదు. దాని అర్ధం, సారాంశం మాత్రమే దేవుని వాక్యం. ఖురాన్ లోని మాటలు కేవలం వ్యాఖ్యాత మాటలే.
71 అషారియా ఊహించటం తప్పు. అది అవిశ్వాసానికి సూచన.
72 బదాయియా అమీర్ ఏం చెప్పినా చెయ్యాల్సిందే.

పై వన్నీ ఇస్లాం ప్రకారం అపవిశ్వాసాలు.అయితే కురాన్ హదీసులు చెప్పేది ఏమిటి? ఈ అపవిశ్వాసాలను ఖండించే లేఖనాలు వాటికి ఎదురుగా ఉదహరిస్తే బాగుంటుంది.

ఇవీ చూడండి

మార్చు

యూదులలో 72 తెగలు ఏర్పడిన మాట నిజం. హిందువు లలో శైవము, వైష్ణవము, శాక్తము, గాణాపత్యము, సౌరము, కపాలము అనే ఆరు తెగలున్నాయి. క్రైస్తవులలో ఈనాడు 3652 తెగలు డినామినేషన్లు ఉన్నట్లు వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చస్ వెల్లడించింది.. అయితే ఇస్లాంలో సున్నీ లు, షియా లు,అహమ్మదియ్యా/ఖాదియానీ లు అనే మూడు తెగలవారు మాత్రమే ఉన్నారని ఇక వేరే తెగలు అంటూ ఏవీలేవని ప్రజలు అనుకుంటూ ఉంటారు.

మూలాలు

మార్చు