బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం
బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం (అరబ్బీ بسم الله الرحمن الرحيم ), అరబ్బీ భాష పదజాలం, దీని అర్థం : అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను, అతను కృపాశీలుడు, కరుణామయుడు. ఈ బిస్మిల్లాహ్ తోనే ఖురాన్ ప్రారంభమౌతుంది.


ఖురాన్, బిస్మిల్లా సవరించు
ఖురాన్ "బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం" అనే వచనంతోనే ప్రారంభమవుతుంది. ఖురాన్ లోని అన్ని సూరాలు (అధ్యాయాలు) బిస్మిల్లా తోనే ప్రారంభమౌతాయి (ఒక అధ్యాయం "సూరా తౌబా" మినహాయించి).
సంఖ్యా శాస్త్రం సవరించు
అరబ్బీ భాష లోని అక్షరాలకు (అబ్‌జద్) సంఖ్యలు ఇవ్వబడ్డాయి. బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం, అనే వాక్యంలో గల అక్షరాల సంఖ్యలను కూడితే '786' అనే సంఖ్య వస్తుంది. అందుకే ముస్లింలు తరచూ ఈ 786 అనే సంఖ్యను వాడుతూ ఉంటారు. కాని దీనికి ఎలాంటి అందరం ఖుర్ఆన్ మరియు హదీసులో లేదు.
ఆచారాలలో బిస్మిల్లా సవరించు
బిస్మిల్లా ఖ్వాని సవరించు
ముస్లిం ఆచారాలలో బిస్మిల్లా ఖ్వాని ఒకటి. పిల్లలు విద్యాభ్యాస వయస్సుకు చేరుకున్నప్పుడు, విద్యాభ్యాసం "బిస్మిల్లా ఖ్వానీ"తో ప్రారంభం ఔతుంది. అనగా, విద్యాభ్యాసం బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీంతో ప్రారంభిస్తారు.
కార్యక్రమాలు - బిస్మిల్లా సవరించు
ముస్లింలు ఏ కార్యక్రమమైనా ప్రారంభించేటపుడు "బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం" తోనే ప్రారంభిస్తారు. భోజనం మొదలు పెట్టేటపుడు కూడా బిస్మిల్లా చదువుతారు.
ఇవీ చూడండి సవరించు
బయటి లింకులు సవరించు
- Saying Bismillah - Virtues and Ocassions - Collection of Sayings from Authentic Hadiths
- Bismallah as in Tadabbur-i-Qur'an
- Meaning of Bismillah