బుచ్చిరెడ్డిపాలెం

ఆంధ్రప్రదేశ్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పట్టణం

బుచ్చిరెడ్డిపాలెం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, బుచ్చిరెడ్డిపాలెం మండలం లోని పట్టణం, మండలకేంద్రం.

పట్టణం
పటం
నిర్దేశాంకాలు: 14°32′17″N 79°52′30″E / 14.538°N 79.875°E / 14.538; 79.875Coordinates: 14°32′17″N 79°52′30″E / 14.538°N 79.875°E / 14.538; 79.875
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండలంబుచ్చిరెడ్డిపాలెం మండలం
జనాభా వివరాలు
(2011)[1]
 • మొత్తం38,405
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( 08622 Edit this on Wikidata )
పిన్(PIN)524305 Edit this on Wikidata
జాలస్థలిEdit this at Wikidata
బుచ్చిరెడ్డిపాలెం కోదండ రామస్వామి ఆలయం

భౌగోళికంసవరించు

నెల్లూరు నుండి 15 కి.మీ.ల దూరంలో వాయవ్య దిశలో ఉన్నది.

పరిపాలనసవరించు

జమీందార్లు, రాజకీయ పెత్తందార్లకు నెలవైన ఈ పంచాయతీ సర్పంచి పదవిని, 72 సంవత్సరాల తరువాత 2013 జూలైలో జరిగిన పంచాయతీ ఎన్నికలలో ఎస్.సి.వర్గానికి లభించింది. 1940 లలో బుచ్చి రెడ్డిపాలెం పంచాయతీ ప్రెసిడెంటుగా ఎస్.సి.సామాజిక వర్గానికి చెందిన జూగుంట బోడెయ్య పనిచేసాడు. 1940 జూన్ 12 నుండి 1941 ఏప్రిల్-2 వరకు, కేవలం 10 నెలలు ప్రసిడెంటుగా పనిచేశాడు.[2] బుచ్చిరెడ్డిపాలెం నగరపంచాయతీ పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.

రవాణా సౌకర్యాలుసవరించు

ఇది నెల్లూరు - ముంబైని కలుపుతున్న రాష్ట్ర రహదారి మీద ఉంది. సమీప రైల్వే స్టేషను‌ నెల్లూరులో, ఓడరేవు కృష్ణపట్నం వద్ద, విమానాశ్రయం రేణిగుంటలో ఉన్నాయి.

ప్రధాన వృత్తులుసవరించు

ఇక్కడి ప్రజల ముఖ్య జీవనాధారం వ్యవసాయం, వ్యాపారము. వరి, చెరుకు పండిస్తారు. రొయ్యలు, చేపల పెంపకము (ఆక్వా కల్చర్‌) కూడా చేస్తారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలుసవరించు

  • కోదండ రామస్వామి ఆలయం - పల్లవుల నాటిది.

చిత్ర మాలికసవరించు

ఇతర విశేషాలుసవరించు

  • బుచ్చిరెడ్డిపాలెం విస్తారమైన ఆక్వా కల్చర్‌కు ప్రసిద్ధి చెందింది.
  • అతి దగ్గరలో కనిగిరి రిజర్వాయర్ ఉంది.

ప్రముఖులుసవరించు

ఇవీ చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. https://cdma.ap.gov.in/en/nagarpanchayats; సేకరించబడిన సమయం: 4 జూలై 2022; ఆర్కైవ్ యుఅర్‌ఎల్: https://web.archive.org/web/20210422193328/https://cdma.ap.gov.in/en/nagarpanchayats.
  2. ఈనాడు నెల్లూరు; 2013, జూలై-13; 8వ పేజీ

వెలుపలి లింకులుసవరించు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.