బెజవాడ పాపిరెడ్డి

రాజకీయ నాయకుడు

బెజవాడ పాపిరెడ్డి (జనవరి 5, 1927 - జనవరి 7, 2002) సోషలిస్టు నాయకుడు, లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్ అనుచరుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు, మాజీ శాసనసభ్యుడు. వీరు ప్రముఖ రాజకీయ నాయకులు బెజవాడ రామచంద్రారెడ్డి కుమారుడు.

బెజవాడ పాపిరెడ్డి
BejawadaPapiReddy
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడు
In office
1958–1962
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు
In office
1967–1972
నియోజకవర్గంఅల్లూరు
రాజ్యసభ సభ్యుడు
In office
1972–1978
8వ లోక్‌సభ సభ్యుడు
In office
1984–1989
నియోజకవర్గంఒంగోలు
వ్యక్తిగత వివరాలు
జననం(1927-01-05)1927 జనవరి 5
మరణం2002 జనవరి 7(2002-01-07) (వయసు 75)
జీవిత భాగస్వామిప్రమీల
సంతానంఇద్దరు కుమారులు, ఒక కుమార్తె
కళాశాలమద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల

పాపిరెడ్డి 1927, జనవరి 5[1] నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో జన్మించారు. ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి సభ్యుడిగా, శాసనసభ, లోక్‌సభ, రాజ్యసభ సభ్యుడిగా ఆయన పనిచేశారు. తెలుగుదేశం ఆవిర్భావంతో ఆయన 1983లో ఆ పార్టీలో చేరారు. ఆయన 1983 నుంచి 1985 వరకు తెలుగుదేశం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 1958 నుంచి 1962 వరకు శాసనమండలి సభ్యుడిగా, 1967 నుంచి 1972 వరకు అల్లూరు శాసనసభ్యుడిగా, 1972 నుంచి 1978 వరకు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఈ మూడింటిని కూడా ఆయన ఇండిపెండెంట్‌గానే దక్కించుకున్నారు. 1983లో తెలుగుదేశం పార్టీ తరఫున అల్లూరు నుంచి శాసనసభకు పోటీ చేసి గెలుపొందిన పాపిరెడ్డి పార్టీ ఆదేశానుసారం 1984లో ఒంగోలు లోక్‌సభ స్థానానికి పోటీ చేసి విజయం సాధించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె.

సంగం నుండి కావలికి నీటిని తీసుకొనిపోయె కాల్వకు బెజవాడ పాపిరెడ్డి కాలువ అని పేరు పెట్టారు .

పాపిరెడ్డి విలక్షణ రాజకీయవేత్త

మార్చు

శాసనమండలి, శాననసభ, రాజ్య సభ, లోక్‌సభలో సభ్యునిగా వ్యవహ రించిన విలక్షణ రాజకీయ వేత్త బెజవాడ పాపిరెడ్డి . భూస్వామ్య కుటుంబంలో 'పుట్టినా, తండ్రి జస్టిస్‌ పార్టీ నాయకుడైనా కడవరకు పోపిరెడ్డి సోషలిస్ట్‌ పంధాలోనే కొనసాగారు. రాజకీయాల్లో ఎన్నో ఏళ్ల నుంచి వున్నా ఏనాడూ అవినీతికి పాల్ప డలేదు. పదవులను ఆశించలేదు. ఏ విషయనైనా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పడం పాపిరెడ్డి మినహా మరెవరికీ చేతకాదు.

బెజవాడ పాపిరెడ్డి ఆయన తన 75 ఏట కొద్దికాలము పాటు అస్వస్థత గురై 2002, జనవరి 7హైదరాబాదులో కన్నుమూశారు.[2]

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-08-17. Retrieved 2008-07-24.
  2. http://pib.nic.in/archieve/lreleng/lyr2002/rjan2002/08012002/r0801200212.html