బృందావనం (1992 సినిమా)

బృందావనం సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన హాస్యభరిత తెలుగు చిత్రం. 1992 నవంబర్ 28న విడుదలయ్యింది. తన అమ్మమ్మను మోసం చేసి ఆమె ఆస్తిని, ఇంటిని చేజిక్కించుకున్న వారినుంచి కథానాయకుడు తన ఆస్తిని తిరిగి సంపాదించుకోవడం ఈ చిత్ర కథాంశం.[1] చందమామ విజయ కంబైన్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కించింది.

బృందావనం
దర్శకత్వంసింగీతం శ్రీనివాసరావు
రచనసింగీతం శ్రీనివాసరావు
నిర్మాతబి. వెంకట్రామరెడ్డి
తారాగణంరాజేంద్ర ప్రసాద్,
రమ్యకృష్ణ
సంగీతంమాధవపెద్ది సురేష్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1992
సినిమా నిడివి
153 నిమిషాలు
భాషతెలుగు

సంక్షిప్త చిత్రకథ

మార్చు

రాజేంద్ర ప్రసాద్, రమ్య కృష్ణల జంట కొన్ని విచిత్రమైన పరిస్థితులలో, తమ మిత్రుల ప్రేమకు సహకరించేందుకు, ఒకరికొకరు పరిచయమై వారు కూడా ప్రేమలో పడుతారు. అయితే రమ్యకృష్ణ తండ్రి సత్యనారాయణ (పానకాలు) అంతకు పూర్వం అంజలీదేవి దంపతులను మోసం చేసి వారి ఇల్లు బృందావనాన్ని తన హస్తగతం చేసుకొన్నట్లు కథానాయకునికి తెలుస్తుంది. అంజలీదేవి ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ అమ్మమ్మ. అతడు తన మిత్రులతో కలిసి సత్యనారాయణ ఇంటిలో అద్దెకు చేరి, అతనిని నానా తిప్పలూ పెట్టి, చివరికి ఇల్లు తన అమ్మమ్మకు తిరిగి వచ్చేలా చేయడం, తన ప్రేమను సఫలం చేసుకోవడం ఈ చిత్రంలో కథ.

తారాగణం

మార్చు

పాటలు

మార్చు

ఈ సినిమాలో పాటలను మాధవపెద్ది సురేష్ స్వరపరిచాడు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి పాటలు పాడారు.

  • మామా మియా మామా మియా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కోరస్
  • ఆరోజు నారాజు చిరునవ్వు చూసి అనుకున్నానేదో - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఎస్.జానకి
  • మధురమే సుధాగానం - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
  • ఓహో ఓహో బుల్లి పావురమా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి,రచన: వెన్నెలకంటి రాజేశ్వర రావు
  • అబ్బో ఏమి వింత - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
  • ఘల్లు ఘల్లునా... గుండె జల్లునా - ఎస్. జానకి

మూలాలు

మార్చు
  1. Tfn, Team (2019-08-12). "Brindavanam Telugu Full Movie | Rajendra Prasad". Telugu Filmnagar (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-05-15.[permanent dead link]