బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఇది వారణాసి సమీపంలో ఉంది.[1] ఇది ఆసియా లోనే అతిపెద్ద రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయం.[2]
స్థాపితం | 1916 |
---|---|
వైస్ ఛాన్సలర్ | పంజాబ్ సింగ్ |
స్థానం | వారణాసి, భారతదేశం |
జాలగూడు | http://www.bhu.ac.in/ |
విశ్వవిద్యాలయ స్థాపన
మార్చుబెనారెస్ హిందూ విశ్వవిద్యాలయంను మదన్ మోహన్ మాలవ్యా 1916లో. అనీ బెసెంట్ సహాయంతో ప్రారంభించారు. ఈ విశ్వవిద్యాలయానికి స్థలం కాశీ నరేష్ కేటాయించాడు, అలాగే మొదటి ఉపకులపతిగా కాశీ నరేష్ నియుక్తుడయ్యాడు.[3]
ఒక "హిందూ" విశ్వవిద్యాలయం"
మార్చుఈ విశ్వవిద్యాలయపు పేరులో "హిందూ" అని పేర్కొన్ననూ, ఇందులో అన్ని మతస్తులవారికి ప్రవేశమున్నది. విద్యార్థులు, బోధన బోధనేతర సిబ్బందిలో వివిధ మతస్తుల వారున్నారు. దీని అధికారిక వెబ్సైటులో ఈ సందేశం చూడవచ్చు:
"భారత్ కేవలం హిందువులది మాత్రమేగాదు[4] ఇది, ముస్లిములదీ, క్రైస్తవులదీ, పారశీకులది కూడాను. భారత్ పరిపుష్టి కావాలంటే, అన్ని మతాలవారు కులాలవారు పరస్పర సహాయసహకారాలతో శాంతియుతంగా జీవించాలి. ఈ విజ్ఞాన కేంద్రం జ్ఞానవంతులను తయారు చేస్తుందని, వీరు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల మేధావులకు ఏమాత్రం తీసిపోరని నా ఆశ, ప్రార్థన. ఇచ్చటి విద్యార్థులు ఓ ఉన్నతమైన జీవితాన్ని పొందుతారని, జీవిస్తారని, తమ దేశాన్ని ప్రేమిస్తారని, అలాగే ఆ పరమేశ్వరుడికి లోబడి వుంటారని ఆశిస్తున్నాను.[5]
విభాగాలు
మార్చు- మానవీయ శాస్త్రాల విభాగాలు
- తెలుగు శాఖ
ఈ విశ్వవిద్యాలయపు ప్రముఖ పూర్వపు విద్యార్థులు
మార్చు- అయ్యగారి సాంబశివరావు, భారతదేశ అణు శాస్త్రవేత్త, హైదరాబాదులోని ఈ.సి.ఐ.ఎల్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇండియా లిమిటెడ్) సంస్థ వ్యవస్థాపకుడు, పద్మ భూషణ్ పురస్కార గ్రహీత.
- ఎల్.కె.ఝా - లక్ష్మీకాంత్ ఝా, భారతదేశపు ఆర్థిక వేత్త, భారతీయ రిజర్వ్ బాంక్ 8వ గవర్నర్.
- జస్టిస్ కాన్ సింగ్ పరిహార్ (రిటైర్డ్ జడ్జి. రాజస్థాన్ హైకోర్టు & మాజీ వైస్ ఛాన్సెలర్ జోధ్పూర్ విశ్వవిద్యాలయం)
- పండిట్ యదునందన్ శర్మ
- శాంతి స్వరూప్ భట్నాగర్, సి.ఎస్.ఐ.ఆర్ మొదటి డైరెక్టర్ జనరల్
- హరివంశ్ రాయ్ బచ్చన్ (అమితాబ్ బచ్చన్ తండ్రి.)
- ఆచార్య సీతారాం చతుర్వేది, హిందీ, సంస్కృత పండితుడు, డ్రామా రచయిత.
- ఏ.డి. బోహ్రా, (ఇంజనీరు)
- అహ్మద్ హసన్ దాని, పాకిస్తానీ పురాతత్వ శాస్త్రవేత్త, చరిత్ర కారుడు
- చంద్రధర్ శర్మ గులేరి
- భూపేన్ హజారికా, గాయకుడు, సంగీతకారుడు
- లాల్మణి మిశ్రా, సంగీతకారుడు
- రాబర్ట్ ఎమ్.పిర్సిగ్, అమెరికన్ తత్వవేత్త
- డా.బి.జే.చౌబే, జంతుశాస్త్రవేత్త
- బీర్బల్ సహాని, (పాలియో-బాటనిస్టు)
- ప్రకాశ్ వీర్ శాస్త్రి, పార్లమెంటు సభ్యుడు, ఆర్యసమాజం సభ్యుడు
- ఆచార్య రాంచంద్ర శుక్లా, హిందీ రచయిత, చరిత్రకారుడు
- రాంచంద్ర శుక్లా, పెయింటర్
- సి.ఎన్.ఆర్. రావు, శాస్త్రవేత్త
- జయంత్ విష్ణు నర్లికార్, విశ్వ-భౌతిక శాస్త్రవేత్త
- నార్ల తాతారావు, భారత విద్యుత్తు రంగ నిపుణుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్తు బోర్డు మాజీ ఛైర్మన్
- డా. రమా శంకర్ త్రిపాఠి, చరిత్రకారుడు-ప్రాచీన భారత చరిత్ర
- పండిట్ ఓంకార్ నాథ్ ఠాకుర్, హిందుస్తానీ శాస్త్రీయ సంగీతకారుడు-గాయకుడు
- డా.ఎన్.రామ్, హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం, వయోలనిస్టు
- డా. వి.కే. శర్మ (శాస్త్రవేత్త)
- డా. ఎ.బి. పాండే, మెటీరియల్ ఇంజనీరు
- డా.వి.వి.ఎల్.ఎన్.శాస్త్రి (ఆర్థికవేత్త)
- డా. రామినేని అయ్యన్న చౌదరి, రామినేని ఫౌండేషన్ స్థాపకులు.
- మహేశ్వర్ మొహంతి, ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు
- డా. లక్ష్మీకాంత్ ఝా, భారతదేశపు ఆర్థిక వేత్త, భారతీయ రిజర్వ్ బాంక్ గవర్నర్
- మహామహోపాధ్యాయ శ్రీభాష్యం అప్పలాచార్యులు, వేద పండితులు
- ఐనంపూడి చక్రధర్ రాజ్యసభ సభ్యులు
- బాలి రామ్ లోక్సభ సభ్యుడు.
- శ్రీవైష్ణవ వేణుగోపాల్ కవి పరిశోధకులు
- నిమిషా వేదాంతి, భూగర్భ చమురు నిల్వలపై పరిశోధన చేసిన శాస్త్రజ్ఞురాలు.
- కలానాథ శాస్త్రి, సుప్రసిద్ధ సంస్కృత పండితుడు, భాషావేత్త.
మూలాలు
మార్చు- ↑ Rediff news
- ↑ "BANARAS HINDU UNIVERSITY" (PDF). Indian Academy of Sciences. 2005-07-26. Retrieved 2007-04-19.
- ↑ [1] Short biography of Pandit Madan Mohan Malaviya. Look under the heading Important Dates.
- ↑ http://internet.bhu.ac.in/NEWSPAPER/may08/bhunews2/pages/BHU%20News%20Combined%20Issue_02.html
- ↑ "Official home page of BHU". Retrieved 2006-08-28.