బొల్లిముంత నాగేశ్వరరావు

తెలుగు రచయిత

బొల్లిముంత నాగేశ్వరరావు నవలా రచయిత, కథా రచయిత. కొన్ని సినిమాలకు కథ, సంభాషణలు అందించాడు.

బొల్లిముంత నాగేశ్వరరావు
1985లో బొల్లిముంత నాగేశ్వరరావు
జననం
బొల్లిముంత నాగేశ్వరరావు

(1945-07-01) 1945 జూలై 1 (వయసు 78)[1]
విద్యబి.ఎ., బి.యిడి.
విద్యాసంస్థఆంధ్ర విశ్వవిద్యాలయం
వృత్తిఉపాధ్యాయుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
సినీ రచయిత
బంధువులుబొల్లిముంత శివరామకృష్ణ

జీవిత విశేషాలు

మార్చు

బొల్లిముంత నాగేశ్వరరావు 1945, జూలై 1న బాపట్ల జిల్లా, కాకర్లమూడి గ్రామంలో జన్మించాడు. ఇతడు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి బి.ఎ., బి.ఇడి చదివాడు. గుంటూరు జిల్లాలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలలో ఉపాధ్యాయునిగా పనిచేశాడు.[2]

రచనలు

మార్చు

ఇతడు 1969 నుండి రచనా వ్యాసంగాన్ని కొనసాగించాడు. ఇతని కథలు, గేయాలు, నాటికలు, నవలలు ఆంధ్రప్రభ, విశాలాంధ్ర, ప్రజాసాహితి, ఆంధ్రజ్యోతి, విజయ, స్వాతి, అంకితం, ప్రతిభ మొదలైన పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఇతని కొన్ని రచనలకు పోటీలలో బహుమతులు లభించాయి.

నవలలు

మార్చు
 • మరో మన్వంతరం
 • మిస్ ఐ.ఏ.యస్.
 • ప్రియే చారుశీలే
 • పవనాలు
 • సుఖీభవ
 • టర్నింగ్ పాయింట్
 • శోభ[3]
 • వల
 • ఆల్ ది బెస్ట్[4]
 • లేటెస్ట్ లవ్
 • కోడెనాగు

నాటకాలు/నాటికలు

మార్చు
 • జాగృతి
 • తెర
 • జనం తీర్పు[5]
 • అగ్నిబావుటా
 • అదోరకం ప్రేమకథ
 • అనుకొన్నదొకటి...
 • అప్పటికీ-ఇప్పటికీ...
 • అమ్మ ఒడి
 • అయిదో మనిషి
 • అవిఘ్నమస్తు
 • ఆనకట్ట
 • ఆలోచన
 • ఇంటా బయటా...
 • ఇది ఆత్మలకథ
 • ఇది చీకటిభూతం కథ
 • ఇది భస్మాసురుల కథ
 • ఇది సతీసహగమనం
 • ఈ పెళ్లికథ చదవండి!
 • ఉదయంలో కూకిన ప్రొద్దు
 • ఎవరికి భయం
 • ఒరులేయవి యొనరించిన
 • ఓ డాక్టరు కథ
 • ఓ ప్రేతాత్మ కథ
 • ఓ రుణం కథ
 • ఓ'రిజర్వు'పంచాయితీ కథ
 • కళ్ళు
 • కుక్కల్ని కరచిన కుందేళ్ల కథ
 • చలించిన వలయం
 • టిట్ ఫర్ టాట్
 • డార్క్ స్టోరీ
 • తండ్రులూ కొడుకులూ
 • తప్పిపోయిన నోటు
 • తాకట్టులో ఆయుధం!
 • ది బిగినింగ్ ఆప్ ద్ ఎండ్
 • దొంగలున్నారు జాగ్రత్త!
 • నక్కలు
 • నిధి
 • నిరుద్యోగి లేఖ
 • న్యాయపీఠం క్రింద...
 • న్యాయమా...
 • పతనమా! ఇది నీ పరాకాష్ఠ!
 • పల్లంవీధి ప్రజలు
 • పాటి దిబ్బలు
 • పిచ్చుకలు
 • పిన్ ప్లాగ్స్
 • పెద్దమ్మ
 • ప్రయోజనాలు
 • బంగారు కడియం
 • బదులు త్యాగాలు
 • బిక్షకాదు విక్రయం
 • మనీ ప్లస్ షి మైనస్ ఆత్మ
 • మరో తీర్పు కథ
 • మరో లింగరాజు కథ
 • మల్లెలు
 • ముళ్ళు...
 • మొగిలిరేకు
 • మోక్ష ప్రాప్తిరస్తు
 • మోసపోయిన మోసం కథ
 • రవి కమలం
 • రెండశ్రువులు
 • రొద
 • లయన్స్ షేర్
 • వడ్డించిన విస్తరి
 • విగత స్మృతి
 • విషాద భారతి
 • వీణావిలాపం
 • వ్యవహారమా? వక్రించకు
 • శోభ
 • శ్రమ నిష్ఫలమై...
 • సంజాయిషీ
 • సత్యం-శివాలు! సుందరపురం
 • సినిమా నెగెటివ్

సినిమా రంగం

మార్చు
విడుదల సం. సినిమా పేరు దర్శకుడు కథా రచయితగా సంభాషణల రచయితగా ఇతర వివరాలు
1995 గుంటూరు గుండమ్మ కథ జి.సి.శేఖర్  Y బి. అజయ్ రత్నంతో కలిసి
2005 దేవీఅభయం కె. విజయసారథి  Y
2007 నవ్వులే నవ్వులు డా.రావ్  Y  Y "కోడెనాగు" నవల ఆధారంగా
2009 నేరము - శిక్ష విజయ నిర్మల  Y "వల" నవల ఆధారంగా

మూలాలు

మార్చు
 1. వెబ్ మాస్టర్. "రచయిత: బొల్లిముంత నాగేశ్వరరావు". కథానిలయం. కథానిలయం. Retrieved 25 January 2024.
 2. సంపాదకుడు (4 September 1985). "బొల్లిముంత నాగశ్వరరావు". ఆంధ్రప్రభ (వారపత్రిక): 10. Retrieved 26 January 2024.
 3. కలకత్తా నేషనల్ లైబ్రరీలో పుస్తక వివరాలు
 4. కలకత్తా నేషనల్ లైబ్రరీలో పుస్తక వివరాలు
 5. కలకత్తా నేషనల్ లైబ్రరీలో పుస్తక వివరాలు