బ్రదర్స్
బ్రదర్స్ అక్టోబరు 12, 2012 న విడుదలైన ఒక తెలుగు సినిమా. కే.వీ. ఆనంద్ దర్శకత్వంలో సూర్య, కాజల్ నటించిన తమిళ చిత్రం "మాట్రాన్" చిత్రానికి ఇది తెలుగు అనువాదం. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయబడ్డ ఈ చిత్రం ఓ మోస్తరు విజయాన్ని సాధించినప్పటికీ ముఖ్య తారాగణం యొక్క నటనకూ, హారిస్ జయరాజ్ స్వరపరిచిన పాటలకూ ప్రేక్షకులు మరియూ విమర్శకుల నుంచి మంచి స్పందన లభించింది.
బ్రదర్స్ (2012 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వంశీ పైడిపల్లి |
---|---|
నిర్మాణం | బెల్లంకొండ సురేష్ |
కథ | కే.వీ. ఆనంద్ |
చిత్రానువాదం | కే.వీ. ఆనంద్ |
తారాగణం | సూర్య కాజల్ |
సంగీతం | హారిస్ జయరాజ్ |
గీతరచన | వనమాలి చంద్రబోస్ |
సంభాషణలు | శశాంక్ వెన్నెలకంటి |
ఛాయాగ్రహణం | ఎస్.సౌందర్యరాజన్ |
కూర్పు | ఆంథోని |
నిర్మాణ సంస్థ | శ్రీ సాయి గణేష్ ప్రోడక్షన్స్ |
పంపిణీ | శ్రీ సాయి గణేష్ ప్రోడక్షన్స్ |
భాష | తెలుగు |
కథ
మార్చుమార్కెట్లో నెంబర్ వన్ ఎనర్జీ డ్రింక్ ఓనర్, జెనిటిక్ సైంటిస్ట్ (సచిన్ కేడెకర్)కి అవిభక్త కవలలైన విమల్& అఖిల్ (సూర్య) జన్మిస్తారు. కవలలులో ఒకరు కమ్యూనిస్టు భావాలు కలవాడయితే, మరొకరు పూర్తి జాలీ టైప్. కంపెనీ ఎదుగుతూంటే ఎంతో మంది శత్రువులు తయారవుతూంటారు. ఓ రైవల్ కంపెనీ రష్యన్ స్పై ని పంపి ఆ డ్రింక్ ఫార్ములా లేపాయాలనుకుంటారు. మరో ప్రక్క విమల్ కు తమ తండ్రి కంపెనీలో ఏదో మోసం జరుగుతున్నట్లు డౌట్ వస్తుంది. అందుకు ప్రతిఫలం మరణం రూపంలో అనుభవిస్తాడు. దాంతో ఒంటిరిగా మిగిలిన అఖిల్ తన సోదరుడు గుండెని తనలో ట్రాన్స్ ప్లెంట్ చేసుకుని అతని మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం తన గర్లప్రెండ్ అంజలి (కాజల్)తో కలిసి యుక్రెయన్ వెళ్లి ఇన్విస్టిగేషన్ మొదలెడతాడు. ఆ క్రమంలో ఏం జరగింది. పగ తీర్చుకున్నాడా... అసలు విలన్స్ ఎవరు అనేది మిగతా కథ.
తారాగణం
మార్చు- సూర్య - విమల్ & అఖిల్
- కాజల్ - అంజలి
- సచిన్ ఖెదెకర్ - రామచంద్ర
- అడుసుమిల్లి జనార్ధన వరప్రసాద్
- రాజీవ్ కనకాల
- సమీర్
- బ్రహ్మాజీ
- పరుచూరి వెంకటేశ్వరరావు
- తార - సుధ
- రవిప్రకాష్ - సతీష్
- ఇషా శర్వాని - "నీవే నీవే నీవేలే" పాటలో ప్రత్యేక ప్రదర్శన
సంగీతం
మార్చుహైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో సెప్టెంబరు 29 2012 న ఈ సినిమా పాటలు ఆదిత్య మ్యూజిక్ లేబెల్ ద్వారా విడుదలయ్యాయి.[1] సూర్య, కాజల్, కే.వీ. ఆనంద్, కార్తీ, బెల్లంకొండ సురేష్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.[2]
వనరులు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-11-01. Retrieved 2013-03-30.
- ↑ http://www.indiaglitz.com/channels/telugu/article/86626.html