వంశీ పైడిపల్లి (జననం 27 జూలై 1978) తెలుగు సినిమా దర్శకుడు. మున్నా సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వంశీ బృందావనం (2010)[1], ఎవడు (2014) వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు.[2]

వంశీ పైడిపల్లి
జననం (1978-07-27) 1978 జూలై 27 (వయసు 45)
జాతీయతభారతీయుడు
వృత్తిస్క్రీన్ ప్లే రచయిత & దర్శకుడు

జీవిత విశేషాలు మార్చు

వంశీ తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా లోని కుటుంబంలో జన్మించాడు. తండ్రికి థియేటర్ ఉండడంవల్ల సినిమా వాతావరణంలో పెరిగిన వంశీ చిన్నప్పటినుండే సినిమాలవైపు ఆకర్షితుడయ్యాడు.

చదువు మార్చు

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తిచేసిన వంశీ, లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివాడు. బద్రుక ఎడ్యుకేషనల్ సొసైటీ నుండి డిగ్రీ (కామర్స్), మాస్టర్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ను చదివాడు.

సినీరంగ నేపథ్యం మార్చు

2002లో సాప్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలివేసి ఈశ్వర్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడు. వర్షం, మాస్ , భద్ర కోసం ఒక అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేశారు. 2007వ సంవత్సరంలో ప్రభాస్ నటించిన మున్నా సినిమా ద్వారా దర్శకుడిగా మారారు. 2010లో బృందావనం, 2013లో ఎవడు, 2016 మార్చిలో ఊపిరి సినిమాలు తీశాడు. మాలినిని వివాహం చేసుకున్న వంశీకి ఒక కుమార్తె వచ్చింది.

దర్శకత్వం వహించిన సినిమాలు మార్చు

సంవత్సరం సినిమా పేరు భాష ఇతర వివరాలు
2007 మున్నా తెలుగు దర్శకుడు
2010 బృందావనం తెలుగు కథ & దర్శకుడు
2014 ఎవడు తెలుగు కథ, స్క్రీన్ ప్లే, రచయిత & దర్శకుడు
2016 ఊపిరి తెలుగు / తమిళం ద్విభాషా చిత్రం, దర్శకుడు
2019 మహర్షి తెలుగు కథ, స్క్రీన్ ప్లే, రచయిత & దర్శకుడు
2023 వారసుడు తెలుగు / తమిళం ద్విభాషా చిత్రం, దర్శకుడు[3]

పురస్కారాలు మార్చు

  • వంశీ పైడిపల్లి 2021 సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌ హాలులో జరిగిన సాక్షి మీడియా 2019, 2020 ఎక్స్‌లెన్స్‌ అవార్డుల కార్యక్రమంలో 2019 సంవత్సరానికి గాను మహర్షి సినిమాకు గాను మోస్ట్‌ ఇన్‌స్పైరింగ్‌ మూవీ అవార్డును అందుకున్నాడు.[4]

మూలాలు మార్చు

  1. Y. S.C. (9 September 2012). "It's a challenge". The Hindu. Archived from the original on 7 January 2015. Retrieved 2015-01-14.
  2. Staff (26 October 2014). "Nagarjuna's multi-starrer to have one actress?". Times of India. Retrieved 2015-01-14.
  3. Namasthe Telangana (19 January 2023). "మా నమ్మకం నిజమైంది". Archived from the original on 19 January 2023. Retrieved 19 January 2023.
  4. Sakshi (25 September 2021). "Sakshi Excellence Award: వంశీకి జీవితాంతం రుణపడి ఉంటా: మహేశ్‌". Archived from the original on 27 సెప్టెంబరు 2021. Retrieved 27 September 2021.