బ్రహ్మంగారిమఠం

వైఎస్ఆర్ జిల్లా, బ్రహ్మంగారిమఠం మండలానికి చెందిన చారిత్రిక క్షేత్రం, గ్రామం
(బ్రహ్మం గారి మఠం నుండి దారిమార్పు చెందింది)

బ్రహ్మంగారిమఠం (కందిమల్లయ్యపల్లె), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లా, బ్రహ్మంగారిమఠం మండలం లోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠం వలన చారిత్రక, దర్శనీయ స్థలంగా పేరుపొందిన క్షేత్రం.ఇది రెవెన్యూయేతర గ్రామం.ఈ ప్రాంతాన్ని 17 వశతాబ్దంలో కందిమల్లయ్యపల్లె అని పిలిచేవారు.[1] [2] ఇక్కడ వున్న పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠం వలన ఇది చారిత్రక, దర్శనీయ స్థలం.

బ్రహ్మంగారిమఠం
గ్రామం
పటం
బ్రహ్మంగారిమఠం is located in ఆంధ్రప్రదేశ్
బ్రహ్మంగారిమఠం
బ్రహ్మంగారిమఠం
అక్షాంశ రేఖాంశాలు: 14°50′29″N 78°52′49″E / 14.84139°N 78.88028°E / 14.84139; 78.88028
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావైఎస్ఆర్
మండలంబ్రహ్మంగారిమఠం
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )

భౌగోళికం

మార్చు

ఈ గ్రామం కడప నగరం నుండి 70 కి.మీ, మైదుకూరు నుండి 25 కి.మీ దూరంలో వుంది. సమీప రైలు స్టేషన్ కడప. సమీప విమానాశ్రయం కడప విమానాశ్రయం

పర్యాటక ఆకర్షణలు

మార్చు
 
విజయదశమి సందర్భంగా వీరబ్రహ్మేంద్ర స్వామి, ఈశ్వరమ్మ వారల గ్రామోత్సవం చిత్రం.
 
బ్రహ్మంగారి మఠం ముంధుభాగం.
 
వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం. బ్రహ్మంగారి మఠం

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠం

మార్చు
 
వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ముందు భాగం. బ్రహ్మంగారి మఠం

ఇక్కడ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠం ఉంది. ఇది కాలజ్ఞానం రచించిన, జీవసమాధి గావించుకున్న మహాక్షేత్రం. కనులకు ఇంపుగా, పచ్చని కొండల నడుమ వెలసిన పుణ్యక్షేత్రం. బ్రహ్మం కులాలను రూపుమాపి సమసమాజ నిర్మాణానికి కృషిచేశాడు. ఇతని శిష్యులలో ముఖ్యుడైన దూదేకుల సిద్దయ్య దూదేకుల కులానికి చెందిన మరొక భక్తుడు.

కక్కయ్య మాదిగ అవడమే ఇందుకు తార్కాణం. ఈ చర్యలను నిరసించిన స్థానికులు బ్రహ్మంగారిని వెలివేశారు. నిప్పు, నీరూ ఇవ్వలేదు. నీటి అవసరాలు తీర్చుకోవడానికి రాత్రికి రాత్రే తన నివాసంలో జింక కొమ్ముతో బావిని త్రవ్వుకున్నాడు.

11 వ పీఠాధిపతిగా వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి

మార్చు

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 1693లో జీవసమాధి అయిన ప్రాంతంలో దేవాలయం నిర్మించి మఠమును ఏర్పాటు చేశారు. మఠంగా ఆవిర్భవించిన నాటి నుంచి వరుసగా మఠానికి మఠాధిపతులుగా వారి కుటుంబసభ్యులే ఉంటూ వస్తున్నారు.మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి మఠం ఏడవతరం 11వ పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి 2021 మే 8న పరమపదించారు.వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి చనిపోయేనాటికి 52 సంవత్సరాలు పీఠాధిపతిగా కొనసాగాడు.[3]

12 పీఠాధిపతి స్థానం వివాదం

మార్చు

వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి పరమపదించిన తరువాత మఠాధిపతి పీఠం కాలికావడంతో పీఠం దక్కించుకోవడానికి వారసుల మధ్య పోటీ నెలకొంది.వివాదం తలెత్తటానికి కారణం 11 వ పీఠాధిపతి. వెంకటేశ్వరస్వామికి ఇధ్దరు భార్యలు. మొదటి భార్య చంద్రావతికి ఎనిమది మంది సంతానం.వారిలో నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. ఆమె అనారోగ్య కారణాలతో మృతి చెందడంతో రెండవ వివాహం చేసుకున్నాడు. రెండవ భార్య మారుతీ మహాలక్షమ్మకు ఇద్దరు కుమారులు. ఈ నేపథ్యంలో తదుపరి పీఠాధిపతి స్థానం ఎవరికీ ఇవ్వాలనే అంశంపై వెంకటేశ్వరస్వామి రాసిన వీలునామా వివాదానికి కారణం అయింది.

అయితే వెంకటేశ్వరస్వామి రాసిన వీలునామాలో తన తరువాత పీఠాధిపతిగా మొదటి భార్య రెండవ కుమారుడు వీరభద్రస్వామి పేరును, రెండో భార్యకి చెందిన ఒక కొడుకు పేరును రాసాడు. ఇద్దరిపేర్లు రాయడంతో ఎవరు పీఠాధిపతి అనే విషయంలో వివాదం నెలకొంది.

చంద్రావతికి ఆరోగ్యం క్షీణించిన సమయంలో వైద్యుల పరీక్షల్లో కిడ్నీలు పూర్తిగా పాడైపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆ సమయంలో ఆమె ప్రాణం దక్కించుకోవాలనే ఉద్దేశ్యంతో కిడ్నీలు దానం చేసిన వారికే పీఠాధి పతి హోదా దక్కిందనే ఆశకల్పించాడు. అప్పట్లో రెండవ కుమారుడు వీరభద్రస్వామి ముందుకు వచ్చి....కిడ్నీలను దానం చేసాడు. [4]అయితే వెంకటేశ్వరస్వామి రాసిన వీలునామాలో తన తరువాత పీఠాధిపతిగా మొదటి భార్య రెండవ కుమారుడు వీరభద్రస్వామి పేరును, రెండో భార్యకి చెందిన ఒక కొడుకు పేరును రాసాడు. ఇద్దరిపేర్లు రాయడంతో ఎవరు పీఠాధిపతి అనే విషయంలో వివాదం నెలకొంది.

ఇక రెండవ భార్య మారుతీ మహాలక్షమ్మ తానే పీఠాధిపతిగా ఉంటానని అమె అభిప్రాయం వెల్లడించింది. తన కుమారుడికి కూడా పీఠాధిపతి ఇవ్వాలనే ప్రతిపాదన వీలునామాలో ఉందని, తన కుమారుడికి చిన్న వయస్సు అవటంతో, ఆ పీఠాన్ని తానే అధిరోహిస్తాని కోరికను బయటపెట్టటంతో అసలు వివాదానికి కారణమైంది.[5]

వెంకటాద్రిస్వామికి 12 వ పీఠాధిపతి అధిపత్యం

మార్చు

పెద్ద భార్య మొదటి కుమారుడు వెంకటాద్రిస్వామికి పీఠాధిపతిగా పట్టం కట్టాలని గ్రామస్థుల నుంచి బాగా ఎక్కువ వత్తిడి బలంగా వినిపించింది. ఇంటికి పెద్ద కుమారుడు కావడంతో ఈ వాదనకు బలం చేకూరింది.[6] ఎట్టకేలకు కందిమల్లయ్యపల్లి సంస్థానం ప్రజల ప్రయత్నాలతో ఈ వ్యవహారం అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో ముగిసింది. చివరికి 12 వ పీఠాధిపతి అధిపత్యం వెంకటాద్రిస్వామికి దక్కింది. ఉప పీఠాధిపతి స్థానం వీరభద్రస్వామికి దక్కింది.[7]

మఠంలో దర్శనీయ స్థలాలు

మార్చు
  • వీరబ్రహ్మేంద్రస్వామి నివాస గృహం
  • స్వామి తవ్వుకున్న బావి
  • కాలజ్ఞాన ప్రతులు
  • పోలేరమ్మతో నిప్పు తెప్పించిన రచ్చబండ
  • స్వామి మనవరాలు ఈశ్వరీదేవి మఠం[8]

దగ్గరలో గల దర్శనీయ స్థలాలు

మార్చు

9 కి.మీ. దూరంలో వున్నవి

  • సిద్దయ్య మఠం
  • కక్కయ్య గుడి
  • పోలేరమ్మ గుడి.[8]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Sanagala, Naveen (2016-05-01). "Brahmamgari Matham, Kandimallayapalli". HinduPad. Retrieved 2022-12-18.
  2. కన్నెగంటి రాజమల్లాచారి (1998-03-01). పోతులూరి వీరబ్రహ్మం గారి జీవితం, రచనలు పరిశీలన (డాక్టరేట్ డిగ్రీ పొందిన గ్రంథం). సరోజ పబ్లికేషన్స్. p. 58.
  3. Korsipati, Syam (2021-05-12). "వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి లేని లోటు పూడ్చలేనిది : ధర్మ జాగరణ ప్రముఖ్ శ్రీ తిరుపతయ్య". Vishwa Samvad Kendra Andhra Pradesh. Archived from the original on 2021-05-26. Retrieved 2022-12-19.
  4. "Andhra Pradesh: కాలజ్ఞానం చెప్పిన కుటుంబంలో ఆధిపత్య పోరు... పీఠాధిపతి ఎవరో బ్రహ్మయ్యకే ఎరుక". News18 Telugu. Retrieved 2022-12-19.
  5. Telugu, TV9 (2021-05-28). "Brahmangari Math : బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎవరు..? ఆలయ కుటుంబీకుల మధ్య గొడవలు.. రంగంలోకి దిగిన దేవాదాయ శాఖ". TV9 Telugu. Retrieved 2022-12-19.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  6. "Andhra Pradesh: కాలజ్ఞానం చెప్పిన కుటుంబంలో ఆధిపత్య పోరు... పీఠాధిపతి ఎవరో బ్రహ్మయ్యకే ఎరుక". News18 Telugu. Retrieved 2022-12-19.
  7. "బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిగా వెంకటాద్రి". Prajasakti. Archived from the original on 2022-12-19. Retrieved 2022-12-19.
  8. 8.0 8.1 "కాలజ్ఞాని నడయాడిన చోటు". సాక్షి. 2016-05-10. Retrieved 2022-06-20.

వెలుపలి లంకెలు

మార్చు