బ్రహ్మ సేనాని
బ్రహ్మ సేనాని రేచర్ల వంశజులమూల పురుషుడు. అతను రేచర్ల బమ్మసేనానిగా సుపరిచితుడు. ఇతడినే బమ్మిరెడ్డి (1035-1055) అని కూడా పిలుస్తారు.
జీవిత విశేషాలు
మార్చురేచర్ల రెడ్డి వంశీయులు కాకతీయ సామ్రాజ్య సంరక్షణ భారం వహించి, కాకతీయుల శత్రువులకు సింహస్వప్నంగా మారారు. అనేక యుద్ధాల్లో విజయం సాధించిన రేచర్ల రెడ్డి వంశీయులు కాకతీయ రాజుల అభిమానాన్ని చూరగొన్నారు. ఇతడు కాకతీయ మొదటి (గరుడ) బేతరాజు వద్ద సేనాధిపతిగా పనిచేసి కాంచీపుర చోళులను జయించాడు. పాలంపేట, పిల్లలమర్రి, చిట్యాలంపాడు, మాచాపూర్ శాసనాలు ఇతడి గురించి తెలుపుతున్నాయి.[1]
ముఖ్యముగా ఇతను కంచి లోని చోళసైన్యముతో యుద్ధముచేసిన కాకతి సామంత వీరులలో ఒకడు. ఈ యుద్ధంలో విజయం సాధించారు. ఇతను సుమారుగా 1035 లో కాకతి బేతరాజు కొలువులో ప్రవేశించి, 1055 వరకూ ఉన్నట్టు భావించబడుతున్నది.
అతడి కుమారుడు లేదా మనువడి భావిస్తున్న ముచ్చ సేనాని మొదటి ప్రోలరాజు (1052-1076) వద్ద చమూపతిగా పనిచేశాడు. ముచ్చసేనాని కూడా కాకతీయ రాజ్య విస్తరణలో తోడ్పడ్డాడు.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "కాకతీయుల సామంతులు". www.notificationsadda.in. Archived from the original on 2020-07-17. Retrieved 2020-07-22.